![PhD mandatory for recruitment of university teachers from 2021-22 - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/14/prakash.jpg.webp?itok=Z060IBA8)
న్యూఢిల్లీ: విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ప్రత్యక్ష నియామకానికి పీహెచ్‌డీని తప్పనిసరి చేసినట్లు మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్ జవడేకర్ చెప్పారు. 2021–22 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని, జాతీయ అర్హత పరీక్ష(నెట్)లో ఉత్తీర్ణతను మాత్రమే ఇకపై ఏకైక అర్హతగా పరిగణించబోమని తెలిపారు. అయితే కళాశాలల్లో నియామకాలకు.. సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు నెట్ లేదా పీహెచ్‌డీ కనీస అర్హతగా కొనసాగుతుందని సీనియర్ అధికారి పేర్కొన్నారు.
ప్రస్తుతం పీజీ పట్టా కలిగి ఉండి నెట్‌లో అర్హత సాధించిన వారు లేదా పీహెచ్‌డీ పట్టా ఉన్న వారు యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేయవచ్చు. ఇటీవల సవరించిన యూజీసీ నిబంధనలను జవడేకర్ బుధవారం వెల్లడిస్తూ..తీవ్ర వ్యతిరేకత రావడంతో అకడమిక్ పెర్ఫామెన్స్ ఇండికేటర్స్(ఏపీఐ)ని రద్దుచేసినట్లు తెలిపారు. కళాశాల లెక్చరర్లకు పరిశోధనను తప్పనిసరి చేస్తూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2021 నుంచి యూనివర్సిటీల్లో ప్రారంభ స్థాయి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా కూడా పీహెచ్‌డీ చేసిన వారే ఉంటారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment