National Eligibility Test
-
ప్రశాంతంగా నీట్ పరీక్ష
సాక్షి, అమరావతి: వైద్య విద్య కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాల కోసం ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష (నీట్–2022) ప్రశాంతంగా ముగిసింది. ఏపీలో.. 29 కేంద్రాల్లో మ.2 గంటల నుంచి సా.5.20 వరకు నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 60వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, దేశవ్యాప్తంగా 95 శాతం మంది హాజరైనట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించింది. ఈసారి ప్రశ్నపత్రం గత రెండేళ్లతో పోలిస్తే కాస్త కఠినంగా ఉందని నిపుణులతోపాటు చాలామంది విద్యార్థులు తెలిపారు. ముఖ్యంగా బోటనీ, జువాలజీల్లో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు ఎక్కువ సమయం పట్టడంతో చాలావరకు సమయం అక్కడే వృథా అయిందన్న భావన విద్యార్థుల్లో నెలకొంది. ఆ 20నిమిషాలపై భిన్నాభిప్రాయాలు మరోవైపు.. 20 నిమిషాల అదనపు సమయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు తమకు అదనపు సమయం కలిసొచ్చిందని చెబితే.. మరికొందరు దానివల్ల ఎటువంటి లాభం చేకూరలేదన్నారు. కెమిస్ట్రీలో 4–5 ప్రశ్నలు తార్కికంగా ఆలోచించి సమాధానాలు రాసేవిగా ఉన్నాయని, ఫిజిక్స్‌లో ప్రశ్నలు కొంత సులువుగా ఉన్నాయని విద్యార్థులు తెలిపారు. ఈసారి కటాఫ్ తగ్గొచ్చు.. గతేడాది ఎక్కువ మంది విద్యార్థులు 700కు పైగా మార్కులు సాధించగా ఈసారి ఆ సంఖ్య తగ్గే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వారి అంచనా ప్రకారం ఈ సంవత్సరం ప్రశ్నపత్రంలో కొత్తగా మ్యాచింగ్ ప్రశ్నలు, స్టేట్మెంట్ ప్రశ్నలు, అసెర్షన్ అండ్ రీజన్ ప్రశ్నలు ఎక్కువగా ఇచ్చారు. ఇలాంటి ప్రశ్నలు 10–12 వరకు ఉన్నాయి. ఇలా ఇస్తారన్న సమాచారం కూడా విద్యార్థులకు లేకపోవడంతో వారు ఇబ్బందిపడ్డారు. ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు సరైన సమాధానమేలేదు. బోటనీలో ఒక ప్రశ్నకు మల్టిపుల్ ఆన్సర్స్ వచ్చే విధంగా ఉంది. ప్రశ్నలన్నీ కూడా ఎన్సీఈఆర్టీ సిలబస్ పరిధి నుంచే వచ్చాయి. అయితే, ఈసారి నీట్ ప్రశ్నపత్రం మధ్యస్థం నుంచి కఠినంగా ఉండటంతో గతం కంటే 10 మార్కుల వరకు కటాఫ్ మార్కులు తగ్గే అవకాశముంది. జనరల్ కటాఫ్ 130 మధ్య, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కటాఫ్ 100 వరకు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
యూజీసీ–నెట్ 2021: కంప్లీట్ ప్రిపరేషన్ గైడెన్స్
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ).. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్.. సంక్షిప్తంగా యూజీసీ నెట్! ఇది జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రతిష్టాత్మక పరీక్ష. పరిశోధనలు, అకడమిక్ కెరీర్, ఆర్థిక ప్రోత్సాహం పొందేందుకు చక్కటి మార్గం.. యూజీసీ నెట్! ఇందులో ప్రతిభ చూపి..మెరిట్ జాబితాలో నిలిస్తే.. ప్రముఖ యూనివర్సిటీలు, ప్రఖ్యాత రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో పరిశోధనలు చేసే అవకాశం లభిస్తుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్ఎఫ్) ద్వారా ఆర్థిక ప్రోత్సాహకాలు సొంతం చేసుకోవచ్చు! తాజాగా.. యూజీసీ–నెట్ జూన్–2021కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. యూజీసీ నెట్‌తో ప్రయోజనాలు, భవిష్యత్తు అవకాశాలు, పరీక్ష విధానం, పరీక్షలో విజయానికి సలహాలు, తదితర అంశాలపై విశ్లేషణ... పీజీ స్థాయిలో సంప్రదాయ, టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసుకొని.. పరిశోధనల దిశగా అడుగులు వేయాలనుకునే వారికి సరైన మార్గం.. యూజీసీ నెట్. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ), యూజీసీ సంయుక్తంగా ప్రతి ఏటా రెండుసార్లు నిర్వహిస్తున్నాయి. ఇటీవల జూన్–2021 సెషన్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. రెండు సెషన్లకు సంయుక్తంగా ఎన్టీఏ యూజీసీ నెట్లో ఈసారి కొన్ని మార్పులు ప్రకటించారు. డిసెంబర్–2020 సెషన్, జూన్–2021 సెషన్లు రెండింటినీ కలిపి సంయుక్తంగా నిర్వహించనున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. కరోనా కారణంగా.. డిసెంబర్–2020 సెషన్ వాయిదా పడింది. అలాగే జూన్–2021 సెషన్ నిర్వహణలో జాప్యం జరిగింది. దాంతో ఈ రెండు సెషన్లను కలిపేసి ఉమ్మడిగా నిర్వహించనున్నారు. అంటే.. డిసెంబర్–2020 సెషన్ అభ్యర్థులు కూడా జూన్–2021 సెషన్‌కు హాజరు కావొచ్చు. 81 సబ్జెక్ట్‌లలో పరీక్ష యూజీసీ నెట్ మొత్తం 81 సబ్జెక్ట్ విభాగాల్లో జరగనుంది. వీటిలో ఎకనామిక్స్, హిస్టరీ, హ్యూమన్ రైట్స్ అండ్ డ్యూటీస్, ఇండియన్ కల్చర్ తదితర ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్, లింగ్విస్టిక్ సబ్జెక్ట్‌లతోపాటు కంప్యూటర్ సైన్స్, క్రిమినాలజీ, మేనేజ్మెంట్ వంటి ప్రొఫెషనల్ సబ్జెక్ట్‌లు కూడా ఉన్నాయి. పీజీ స్థాయిలో చదివిన స్పెషలైజేషన్‌కు అనుగుణంగా ఆయా పేపర్లకు హాజరయ్యే అర్హత లభిస్తుంది. అర్హతలు ► అర్హత: సంబంధిత పీజీ(పోస్ట్ గ్రాడ్యుయేషన్) లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు అయిదు శాతం సడలింపు లభిస్తుంది. ► పీజీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► వయో పరిమితి: జేఆర్ఎఫ్ అభ్యర్థులకు అక్టోబర్ 1, 2021 నాటికి 31ఏళ్లు మించకూడదు. ఓబీసీ–ఎన్సీఎల్, ఇతర రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది. ► అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థులకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు. రెండు కేటగిరీల్లో యూజీసీ నెట్ యూజీసీ–నెట్‌ను రెండు కేటగిరీలుగా వర్గీకరించారు. అవి.. అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు తాము ఏ కేటగిరీ పరీక్షకు హాజరవ్వాలనుకుంటున్నారో స్పష్టం చేయాలి. ఉదాహరణకు.. పరిశోధన అభ్యర్థులు.. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రాథమ్యాన్ని ఎంపిక చేసుకోవాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీ మాత్రమే కోరుకుంటే.. అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రాథమ్యాన్ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ఇలా అభ్యర్థులు ఎంపిక చేసుకున్న ప్రాథమ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రశ్నలు అడుగుతారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ► యూజీసీ–నెట్ పరీక్ష ఆన్లైన్ విధానం (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)లో ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. ► మొత్తం మూడు వందల మార్కులకు జరిగే ఈ పరీక్షలో రెండు పేపర్లు.. పేపర్1, పేపర్ 2 ఉంటాయి. ► పేపర్–1కు అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థులందరూ తప్పనిసరిగా హాజరు కావాలి. ► పేపర్–1లో టీచింగ్/రీసెర్చ్ అప్టిట్యూడ్‌పై 50 ప్రశ్నలు–100 మార్కులు ఉంటాయి. అంటే.. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. ► పేపర్–2.. అభ్యర్థులు తమ పీజీ స్పెషలైజేషన్ ఆధారంగా ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించిన పరీక్ష. ► పేపర్–2లో సంబంధిత సబ్జెక్ట్ పేపర్ నుంచి 100 ప్రశ్నలు–200 మార్కులకు ఉంటాయి. ► పరీక్ష కాల వ్యవధి మూడు గంటలు. కనీస అర్హత మార్కులు ► యూజీసీ నెట్లో కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రెండు పేపర్లలో కలిపి 40 శాతం మార్కులు, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు 35శాతం మార్కు లు సాధించాలి. ► కేవలం ఆరు శాతం మందిని మాత్రమే తుది జాబితాకు ఎంపిక చేసే నెట్ జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీల్లో విజయం సాధించాలంటే.. అభ్యర్థులకు పరిశోధనలపై ఆసక్తితోపాటు సంబంధిత సబ్జెక్ట్‌పై గట్టి పట్టుండాలి. పేపర్1: ఆసక్తి, అవగాహన ► పేపర్–1లో అభ్యర్థుల్లోని టీచింగ్, రీసెర్చ్ ఆసక్తులను, అవగాహనను పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. మొత్తం పది విభాగాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ప్రధానంగా టీచింగ్, రీసెర్చ్ అప్టిట్యూడ్, రీడింగ్ కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, రీజనింగ్, లాజికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్–గవర్నెన్స్, పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పేపర్ 2: సబ్జెక్ట్ ప్రశ్నలు పేపర్–2లో ప్రశ్నలు పీజీ స్పెషలైజేషన్ సిలబస్ స్థాయిలో ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌కు సంబంధించి ఇంటర్మీడియెట్ నుంచి పీజీ వరకూ.. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఆయా అంశాలను అప్లికేషన్ ఓరియెంటేషన్, ప్రాక్టికల్ అప్రోచ్‌తో చదవాలి. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ.. ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు ప్రాక్టికల్ థింకింగ్, అప్లికేషన్ ఓరియెంటేషన్‌ను పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతున్నారు. అదేవిధంగా క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ అప్రోచ్ అలవరచుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. ఫలితంగా ప్రశ్నలు ఏవిధంగా అడిగినా సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. యూజీసీ నెట్ 2021–ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: సెప్టెంబర్ 5,2021 ► ఆన్లైన్లో ఫీజు చెల్లింపు చివరి తేదీ: సెప్టెంబర్ 6, 2021 ► ఆన్లైన్ దరఖాస్తుల సవరణ అవకాశం: సెప్టెంబర్ 7–సెప్టెంబర్ 12 ► పరీక్ష తేదీలు: అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 11 వరకు ► ప్రతి రోజు రెండు షిఫ్ట్‌ల్లో పరీక్ష (మొదటి షిప్ట్ ఉదయం 9–12 గంటలు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3–6 గంటలు) నిర్వహిస్తారు. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://ugcnet.nta.nic.in -
యూజీసీ నెట్, జూన్ 2021: ముఖ్య సమాచారం
దేశవ్యాప్తంగా హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్, తత్సమాన సబ్జెక్టులకు సంబంధించి జేఆర్ఎఫ్, లెక్చర్‌షిప్(అసిస్టెంట్ ప్రొఫెసర్) అర్హత కోసం నిర్వహించే యూజీసీ–నేషనల్ ఎలిజి బిలిటీ టెస్ట్(నెట్)–జూన్ 2021 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విడుదల చేసింది. ► అర్హత: హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్ (లాంగ్వేజెస్‌ని కలుపుకొని), కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, ఎలక్ట్రానిక్ సైన్స్ తదితర సబ్జెక్టుల్లో కనీసం 55శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి. ప్రస్తుతం మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న వారు, మాస్టర్స్ డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► వయసు: జేఆర్‌ఎఫ్‌నకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 01.10.2021 నాటికి 31ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. ► ఎంపిక విధానం: ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► పరీక్షా విధానం: ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఈ రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహా మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో అడుగుతారు.పేపర్ 1– 50 ప్రశ్నలు–100 మార్కులకు, పేపర్ 2–100 ప్రశ్నలు–200 మార్కులకు జరుగుతుంది. పరీక్షా సమయం మూడు గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమంలో ఉంటుంది. ముఖ్య సమాచారం: ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.09.2021 ► పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేది: 06.09.2021 ► పరీక్ష తేదీలు: 2021 అక్టోబర్ 06 నుంచి 11 వరకు జరుగుతాయి ► వెబ్సైట్: https://ugcnet.nta.nic.in -
యూజీసీ–నెట్ ఫలితాల విడుదల
న్యూఢిల్లీ: జూలై 8న దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజీసీ–నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) మంగళవారం విడుదలచేసింది. పరీక్ష రాసేందుకు దేశవ్యాప్తంగా 11,48,235 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా అందులో 8,59,498 మంది పరీక్ష రాశారు. వీరిలో 55,872 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుతోపాటు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకునేందుకు 3,929 మంది అర్హత సాధించారు. ఈసారి పరీక్షల విధానంలో మార్పులు తెచ్చారు. 84 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించారు. మూడు పేపర్ల విధానాన్ని వదిలేసి రెండు పేపర్లకు పరీక్ష చేపట్టారు. -
వర్సిటీ ప్రొఫెసర్లకు పీహెచ్డీ తప్పనిసరి
న్యూఢిల్లీ: విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ప్రత్యక్ష నియామకానికి పీహెచ్‌డీని తప్పనిసరి చేసినట్లు మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్ జవడేకర్ చెప్పారు. 2021–22 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని, జాతీయ అర్హత పరీక్ష(నెట్)లో ఉత్తీర్ణతను మాత్రమే ఇకపై ఏకైక అర్హతగా పరిగణించబోమని తెలిపారు. అయితే కళాశాలల్లో నియామకాలకు.. సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు నెట్ లేదా పీహెచ్డీ కనీస అర్హతగా కొనసాగుతుందని సీనియర్ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం పీజీ పట్టా కలిగి ఉండి నెట్లో అర్హత సాధించిన వారు లేదా పీహెచ్డీ పట్టా ఉన్న వారు యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేయవచ్చు. ఇటీవల సవరించిన యూజీసీ నిబంధనలను జవడేకర్ బుధవారం వెల్లడిస్తూ..తీవ్ర వ్యతిరేకత రావడంతో అకడమిక్ పెర్ఫామెన్స్ ఇండికేటర్స్(ఏపీఐ)ని రద్దుచేసినట్లు తెలిపారు. కళాశాల లెక్చరర్లకు పరిశోధనను తప్పనిసరి చేస్తూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2021 నుంచి యూనివర్సిటీల్లో ప్రారంభ స్థాయి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా కూడా పీహెచ్డీ చేసిన వారే ఉంటారని అన్నారు. -
విదేశాల్లో ఎంబీబీఎస్‌కూ నీట్ !
-
విదేశాల్లో ఎంబీబీఎస్‌కూ నీట్ !
న్యూఢిల్లీ: విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకునే విద్యార్థులకు జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)లో ఉత్తీర్ణత సాధించడాన్ని కేంద్రం త్వరలోనే తప్పనిసరి చేసే అవకాశముందని ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం చివరిదశ పరిశీలనలో ఉందన్నారు. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన అభ్యర్థులు దేశంలో వైద్య వృత్తిని చేపట్టేందుకు భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) ఫారిన్ మెడికల్గ్రాడ్యుయేట్ ఎగ్జామ్(ఎఫ్ఎంజీఈ)ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష రాసే మొత్తం విద్యార్థుల్లో కేవలం 12 నుంచి 15 శాతం మాత్రమే ఉత్తీర్ణులు అవుతున్నారని పేర్కొన్నారు. ఒకవేళ ఈ పరీక్షలో ఉత్తీర్ణులు కాకుంటే వైద్యవృత్తిని చేపట్టడం కుదరదన్నారు. దీంతో పలువురు చట్టవిరుద్ధంగా వైద్య వృత్తిని ప్రారంభిస్తున్నారని తెలిపారు. -
11 నుంచి నెట్‌కు దరఖాస్తులు: సీబీఎస్ఈ
సాక్షి, హైదరాబాద్: జాతీయ అర్హత పరీక్షకు (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు–నెట్) దరఖాస్తులను ఈ నెల 11 నుంచి స్వీకరించేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) చర్యలు చేపట్టింది. నెట్ అర్హత వివరాలను http:// cbsenet. nic. in వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చింది. సెప్టెంబర్ 11 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని సీబీఎస్ఈ పేర్కొంది. ఆన్లైన్లో జనరేట్ చేసుకున్న చలానాను సెప్టెంబర్ 12లోగా బ్యాంకులో (సిండికేట్/కెనరా /ఐసీఐసీఐ/ హెచ్డీఎఫ్సీ) చెల్లించాలని, సెప్టెంబర్ 19 నుంచి 25లోగా ఆన్లైన్ దరఖాస్తులో దొర్లిన పొరపాట్లను సవరించు కోవచ్చని సూచించింది. అక్టోబర్ మూడో వారంలో అడ్మిట్ కార్డు అందుబాటులో ఉంచుతామని, రాత పరీక్ష నవంబరు 5న నిర్వహిస్తామని తెలిపింది. పోస్టు గ్రాడ్యుయేషన్‌లో జనరల్ అభ్యర్థులు 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వికలాంగులైతే 50 శాతం మార్కులు సాధించి ఉండాలని స్పష్టంచేసింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకునే వారు 2017 జనవరి 1 నాటికి 28 ఏళ్లలోపు ఉండాలని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వికలాంగులకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు వర్తిస్తుందని తెలిపింది. నెట్ రాయాలకునే అభ్యర్థులు తమ ఆధార్ నంబర్‌ను తప్పనిసరిగా దరఖాస్తులో నింపాల్సిందే. జమ్మూ కశ్మీర్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల అభ్యర్థులకు మాత్రం ఆధార్ తప్పనిసరి నిబంధన వర్తించదు. వారు పాస్‌పోర్టు, రేషన్‌కార్డు, బ్యాంకు అకౌంట్ నంబర్లు లేదా ఏదేని ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు నంబర్ వేయవచ్చని సీబీఎస్ఈ వివరించింది. -
ఇకపై ‘నెట్’ ఏడాదికోసారే!
న్యూఢిల్లీ: కాలేజీలు, యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామకానికి సంబంధించిన జాతీయ అర్హత పరీక్ష (నెట్)ను ఇకపై ఏడాదికోసారే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి సీబీఎస్ఈ ప్రతిపాదించింది. ‘ఏడాదికోసారి నెట్ నిర్వహించటం ద్వారా అభ్యర్థులు మరింత పకడ్బందీగా పరీక్షకు సిద్ధమయ్యేలా చేయవచ్చు. సరైన విధంగా నిధులు, మౌలికవసతుల వినియోగం జరుగుతుంది. ప్రతి ఏటా రిజిస్టర్ చేసుకున్న వారిలో 17 శాతమే పరీక్షలకు హాజరవుతుండగా.. అందులో నాలుగు శాతం మాత్రమే అర్హత సాధిస్తున్నారు’ అని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా, జూలైలో నిర్వహించాల్సిన నెట్ పరీక్షకోసం ఇంతవరకు నోటిఫికేషన్ విడుదల కాకపోవటంపై అనిశ్చితిని కేంద్రం తొలగించింది. ఇకపై నెట్ పరీక్షను సీబీఎస్ఈ నిర్వహిస్తుందని యూజీసీ స్పష్టం చేసింది. నెట్ నోటిఫికేషన్ గురించి విద్యార్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని యూజీసీ ఈ నిర్ణయం తీసుకుంది. -
నెట్‌పై క్లారిటీ ఇచ్చిన యూజీసీ
న్యూఢిల్లీ: జాతీయ అర్హత పరీక్ష(నెట్) నిర్వహణపై ఉన్న అనిశ్చితి తొలిగింది. సీబీఎస్ఈనే ఈ పరీక్షను నిర్వహిస్తుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్స్, నీట్ వంటి ఇతర పరీక్షల నిర్వహణ వల్ల బోర్డుపై అధిక భారం పడుతోందని, అందువల్ల నెట్‌ను నిర్వహించలేమని సీబీఎస్ఈ గతేడాది కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ ఎదుట తన అశక్తతను వ్యక్తపరిచింది. అయితే, దీనికి సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖ ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు. మరోవైపు జూలై నిర్వహించాల్సిన నీట్‌కు ఏటా ఏప్రిల్ మొదటి వారంలోనే నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉండగా.. సీబీఎస్ఈ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో అనిశ్చితి నెలకొన్ని విషయం తెలిసిందే. దీంతో పరీక్ష నిర్వహణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని, వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ విద్యార్థులు యూజీసీ ముందు నిరసన వ్యక్తం చేశారు. దీంతో మానవవనరుల మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమైన యూజీసీ అధికారులు సీబీఎస్ఈనే జూలైలో పరీక్ష నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు. -
‘వారికి’ యూజీసీ ఫెలోషిప్ ఇవ్వరు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ ఎలిజబిలిటీ టెస్ట్ (నెట్)కు అర్హులు కాని విదేశీయులు, రిటైర్డ్ ప్రొఫెసర్లకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ (యూజీసీ) ఫెలోషిప్ ఇవ్వరు. యూజీసీ గురువారం ఈ మేరకు కొత్త నిబంధనలు జారీ చేసింది. నిధుల కొరత, విద్యార్థుల నుంచి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూజీసీ తెలిపింది. -
యూజీసీ నెట్
యూజీసీ, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)-2015 నోటిఫికేషన్ విడుదలైంది. సీబీఎస్ఈ నిర్వహించే నెట్లో ప్రతిభ చూపితే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) పొందవచ్చు. దీంతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా స్థిరపడేందుకు అర్హత లభిస్తుంది. ఏటా యువత పెద్ద సంఖ్యలో నెట్ అర్హతతో పరిశోధన, భోధన రంగంలో కెరీర్ దిశగా కదులుతున్నారు. నెట్ అర్హతలు, ఎంపిక, దరఖాస్తు పక్రియలకు సంబంధించిన పూర్తి సమాచారం... జేఆర్ఎఫ్ సీబీఎస్ఈ నిర్వహించే నెట్ పరీక్షలో ప్రతిభ చూపిన వారిని పరిశోధనల వైపు ప్రోత్సహించేందుకు యూజీసీ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అవార్డును అందిస్తోంది. జేఆర్ఎఫ్కు ఎంపికైన విద్యార్థులు వివిధ పథకాల కింద యూజీసీ ఆర్థిక సహాయాన్ని అందుకోవచ్చు. జేఆర్ఎఫ్ అర్హతతో వివిధ ఐఐటీ/ఎన్ఐటీ/యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్లలో పరిశోధనలు చేయవచ్చు. అర్హత: యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా ఇన్స్టిట్యూట్ నుంచి 55 శాతం ఉత్తీర్ణతతోమాస్టర్ డిగ్రీ. క్రీమిలేయర్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పీజీలో 50 శాతం ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. నాన్ క్రీమిలేయర్ ఓబీసీ అభ్యర్థులను జనరల్ కేటగిరీ కింద పరిగణిస్తారు. పీజీ చివరి ఏడాది పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు, ఫైనలియర్ పరీక్షలు రాయబోయే విద్యార్థులు కూడా నెట్ పరీక్షకు హాజరుకావొచ్చు. వయసు: జేఆర్ఎఫ్: డిసెంబరు 1, 2015 నాటికి 28 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, నాన్ క్రీమిలేయర్ ఓబీసీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం నెట్‌కు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి వయోపరిమితి లేదు. దరఖాస్తు విధానం ఠీఠీఠీ.ఛిఛట్ఛ్ఛ్ట.జీఛి.జీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు: దరఖాస్తు ఫీజు రూ.600, నాన్‌క్రీమిలేయర్ ఓబీసీలకు రూ.300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.150.ఫజు మొత్తాన్ని క్రెడిట్ కార్డ్/ డెబిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు లేదా సిండికేట్, కెనరా, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల ద్వారా చలాన్ రూపంలో చెల్లించొచ్చు. పరీక్ష విధానం నెట్ పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. తప్పు సమాధానాలకు ఎలాంటి నెగిటివ్ మార్కులు ఉండవు.పేపర్ 1: పేపర్ 1 ద్వారా అభ్యర్థుల్లోని టీచింగ్/రీసెర్చ్ ఆప్టిట్యూడ్‌లను పరీక్షిస్తారు. రీజనింగ్ ఎబిలిటీ, కాంప్రెహెన్షన్, జనరల్ ఎవేర్నెస్, విలక్షణ ఆలోచన శైలి తదితర అంశాల నుంచి 60 ప్రశ్నలు ఉంటాయి. కనీసం 50 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. 50 ప్రశ్నల కంటే ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాస్తే మొదటి 50 ప్రశ్నలను పరిగణలోకి తీసుకుంటారు. పేపర్ 1 పరీక్ష ఉదయం 9.30 నుంచి 10.45 నిమిషాల వరకు ఉంటుంది. పేపర్ 2: పేపర్ 2లో 50 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. పేపర్ 2 పరీక్ష ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. పేపర్ 3: పేపర్ 3లో 75 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలను అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. పేపర్ 3 పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటుంది. పీజీ సిలబస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఎంపిక ప్రక్రియ నెట్ కనీస అర్హత మార్కులు కేటగిరీ మార్కులు శాతాల్లో పేపర్-1 పేపర్-2 పేపర్-3 జనరల్ 40 40 75 ఎస్సీ, ఎస్టీ, నాన్ క్రీమిలేయర్ ఓబీసీ, పీడబ్ల్యూడీ 35 35 60 ఎంపిక విధానంలో మొత్తం నాలుగు దశలు ఉంటాయి. మొదటి దశ: మూడు పేపర్లలలో కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులను జేఆర్ఎఫ్ అవార్డు ఎంపిక లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతకు సంబంధించి పరిగణలోకి తీసుకుంటారు.రెండో దశ: మొదటి దశ జాబితాలోని అభ్యర్థులు సాధించిన మొత్తం మార్కులను పరిగణలోకి తీసుకుని సబ్జెక్టులు, కేటగిరీల వారీగా జాబితాను రూపొందిస్తారు.మూడో దశ: రెండో దశకు ఎంపికైన అభ్యర్థుల నుంచి టాప్ 15 శాతం (కేటగిరీ, సబ్జెక్టుల వారీ)లో నిలిచిన వారితో జాబితాను సిద్ధం చేస్తారు. వీరికి అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతకు సంబంధించి నెట్ క్వాలిఫికేషన్‌ను అందిస్తారు.నాలుగో దశ: మూడో దశకు ఎంపికైన అభ్యర్థులలో నుంచిప్రత్యేకంగా మరొక జాబితాను రూపొందిస్తారు. వీరందరికీ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అవార్డును అందిస్తారు. ముఖ్య సమాచారం: ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: నవంబరు 1, 2015 ఫీజు చెల్లించడానికి చివరితేదీ: నవంబరు 2, 2015, నెట్ పరీక్ష తేదీ: డిసెంబరు 27, 2015. పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం. ప్రిపరేషన్ టిప్స్ పేపర్ 1 పరీక్ష ద్వారా విద్యార్థికి ఉపయోగపడే విధంగా బోధనా పద్ధతులు, సాంకేతికతను ఏ స్థాయిలో ఉపయోగించగలరో పరీక్షిస్తారు. విద్యార్థి ఆలోచనా సామర్థ్యం, సమకాలీన సమాజ, పర్యావరణ సంబంధిత అంశాల్లో అభ్యర్థుల దృక్పథం తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పేపర్ 2లోని ప్రశ్నలు అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి వస్తాయి. ప్రశ్నలు పీజీ స్థాయిలో ఉంటాయి. ప్రాథమిక భావనలతో పాటు సిలబస్‌లోని అన్ని అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి అభ్యర్థులు ప్రతి టాపిక్‌ను సమగ్రంగా చదవాల్సి ఉంటుంది. పేపర్ 3లో కొంచెం క్లిష్టతరమైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు అన్ని అంశాలను లోతుగా చదవాల్సి ఉంటుంది. పేపర్ 3లో ప్రశ్నలు ఎక్కువగా ఎలెక్టివ్ల నుంచి వస్తున్నాయి. విద్యార్థులు దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్ సాగించాలి. గతంలో వచ్చిన ప్రశ్నలు పునరావృతం అవుతున్నాయి. కాబట్టి గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రిపరేషన్, స్టడీమెటీరియల్స్ విషయంలో ప్రొఫెసర్స్, సీనియర్ విద్యార్థుల సలహాలు తీసుకోవడం మంచిది. -
ప్రతిభావంతులను శోధించే..సీఎస్ఐఆర్-నెట్
పరిశోధనలు చే స్తూ ప్రతి నెల ఫెలోషిప్ పొందాలన్నా..యూనివర్సిటీల్లో లెక్చరర్‌షిప్‌నకు అర్హత సాధించాలన్నా రాయాల్సిన పరీక్ష.. జాయింట్ సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్). దీన్ని ఏటా రెండు సార్లు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ నిర్వహిస్తుంది..దీనికి సంబంధించి తాజాగా ప్రకటన వెలువడిన నేపథ్యంలో నోటిఫికేషన్ వివరాలు,ప్రిపరేషన్ ప్రణాళికపై ఫోకస్.. జాయింట్ సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ పరీక్ష ఆరు సబ్జెక్ట్‌లలో జరుగుతుంది. అవి.. కెమికల్ సెన్సైస్; ఎర్త్- అట్మాస్పియరిక్-ఓషియన్-ప్లానెటరీ సెన్సైస్; లైఫ్ సెన్సైస్; మ్యాథమెటికల్ సెన్సైస్; ఫిజికల్ సెన్సైస్; ఇంజనీరింగ్ సెన్సైస్. రాత పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 200 మార్కులకు ఉండే ప్రశ్నపత్రాన్ని మూడు విభాగాలుగా పార్ట్-ఎ, బి, సిగా విభజించారు. సమాధానాలను గుర్తించడానికి 3 గంటల సమయం కేటాయించారు. ఒకేరకంగా పార్ట్-ఎ: రాత పరీక్షలో మొదట ఉండే పార్ట్-ఎ అందరికీ ఒకే రకంగా ఉంటుంది. ఇందులో లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలిసిస్, అనలిటికల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిషన్, సిరీస్ ఫార్మేషన్, పజిల్స్ అంశాల నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 15 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఈ విభాగానికి మార్కులు 30. సబ్జెక్టివ్గా పార్ట్-బి: పార్ట్-బీలో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. ఇందులో అడిగే ప్రశ్నల సంఖ్య ఆయా సబ్జెక్ట్‌లను అనుసరించి భిన్నంగా ఉంటుంది. కెమికల్ సెన్సైస్, ఎర్త్ సెన్సైస్, లైఫ్ సెన్సైస్‌ల నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో 35 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం 70 మార్కులు కేటాయించారు. మ్యాథమెటికల్ సెన్సైస్‌లో 40 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 25 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి ప్రశ్నకు మూడు మార్కుల చొప్పున మొత్తం 75 మార్కులు ఉంటాయి. ఫిజికల్ సెన్సైస్‌లో 25 ప్రశ్నల్లో 20 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు 3.5 మార్కుల చొప్పున ఈ విభాగానికి మొత్తం 70 మార్కులు. నైపుణ్యాధారితం పార్ట్-సి: పార్ట్-సీలో ప్రధానంగా నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఈ క్రమంలో ఆయా సబ్జెక్ట్‌ల్లోని శాస్త్రీయ అనువర్తనాలకు అభ్యర్థి ఏమేరకు అన్వయించే నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడు? అనే అంశాన్ని పరీక్షిస్తారు. ఇందులో కూడా అడిగే ప్రశ్నల సంఖ్య ఆయా సబ్జెక్ట్‌లను అనుసరించి భిన్నంగా ఉంటుంది. కెమికల్ సెన్సైస్‌లో 75 ప్రశ్నల్లో 25 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలి. ఈ విభాగానికి 100 మార్కులు కేటాయించారు. ఎర్త్ సెన్సైస్‌లో 80 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 25 ప్రశ్నలకు సమాధానాలివ్వాలి. ఈ విభాగానికి 100 మార్కులు. లైఫ్ సెన్సైస్‌లో 75 ప్రశ్నలకుగాను 25 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున ఈ విభాగానికి 100 మార్కులు కేటాయించారు. మ్యాథమెటికల్ సెన్సైస్‌లో 60 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 20 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు 4.75 మార్కుల చొప్పున ఈ విభాగానికి 95 మార్కులు. ఫిజికల్ సెన్సైస్‌లో 30 ప్రశ్నలకుగాను 20 ప్రశ్నలకు సమాధానాలివ్వాలి. ప్రతి ప్రశ్నకు ఐదు మార్కుల చొప్పున ఈ విభాగానికి 100 మార్కులు. లైఫ్ సెన్సైస్:గత రెండేళ్ల సరళిని పరిశీలిస్తే.. అధిక శాతం ప్రశ్నలు బయోకెమిస్ట్రీ, సెల్ బయాలజీ, జెనెటిక్స్, ప్లాంట్ ఫిజియాలజీ, ఎకాలజీ నుంచి వచ్చాయి. బయోకెమిస్ట్రీ నుంచి 20-25 మార్కులకు; అమైనో ఆమ్లాలు, వాటి రసాయనిక నిర్మాణం, తత్వం, ప్యూరిఫికేషన్ నుంచి ఎనిమిది మార్కులకు ప్రశ్నలు అడిగారు. సెల్ బయాలజీ మెంబ్రాన్ నుంచి నాలుగు నుంచి ఎనిమిది, సెల్ సైకిల్ నుంచి నాలుగు నుంచి ఆరు, సెల్ సిగ్నలింగ్ నుంచి 16 మార్కులకు ప్రశ్నలు వచ్చాయి. జెనెటిక్స్‌లో కూడా 20-25 మార్కులకు ప్రశ్నలు ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించి మెండీలియన్ జెనెటిక్స్, పాపులేషన్ జెనెటిక్స్ మీద దృష్టి సారించాలి. ప్లాంట్ ఫిజియాలజీ నుంచి తప్పకుండా 20-25 మార్కులకు ప్రశ్నలు అడుగుతున్నారు. కిరణజన్య సంయోగక్రియ, ఫైటో హార్మోన్, ఫోటో ఫిజియాలజీ, నైట్రోజన్, మెటబాలిజమ్ నుంచి కనీసం 20 మార్కులకు ప్రశ్నలు వస్తున్నాయి. ఎకాలజీలో బిహేవిరియల్ ఎకాలజీ, పాపులేషన్ ఎకాలజీ, ఎకోసిస్టమ్ ఎకాలజీ నుంచి 25-30 మార్కులకు ప్రశ్నలు ఉంటున్నాయి. జెనెటిక్ ఇంజనీరింగ్, ఆర్డీఎన్ఏ టెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్స్ నుంచి 25 మార్కులకు ప్రశ్నలు ఇస్తున్నారు. ఇమ్యూనాలజీ నుంచి 12-16, పరిణామ క్రమ శాస్త్రం, డవలప్మెంట్ బయాలజీ నుంచి 25 మార్కులకు ప్రశ్నలు వస్తున్నాయి. గత రెండేళ్ల నుంచి పరిశీలిస్తే.. మౌలిక శాస్త్రాలైన బోటనీ, జువాలజీ నుంచి అడిగే ప్రశ్నల సంఖ్య పెరిగింది. బోటనీలో వృక్ష అంతర్నిర్మాణ శాస్త్రం నుంచి, జువాలజీ నుంచి ఫైలా క్యారెక్టరిస్టిక్స్ మీద ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి బోటనీ, జువాలజీ అభ్యర్థులకు ప్రిపరేషన్ సులభమేనని చెప్పొచ్చు. వీరు బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ, ఆర్డీఎన్ఏ టెక్నాలజీ అంశాల్లో కొంత కష్టపడితే విజయం సాధించవచ్చు. ఎంఎస్సీ (బయోటెక్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ) విద్యార్థులు జెనెటిక్స్, ప్లాంట్ ఫిజియాలజీ, ఎకాలజీ వంటి అంశాలపై దృష్టి సారించాలి. బయోకెమిస్ట్రీ, జెనెటిక్ ఇంజనీరింగ్, సెల్ బయాలజీకి సంబంధించి కాన్సెప్ట్ మ్యాప్‌లను, వివిధ అంశాల సారూప్యత, వైవిధ్యాలను తెలిపే టేబుల్స్‌ను రూపొందించుకోవాలి. ఎస్క్యూ3ఆర్ (సర్వే, క్వొశ్చన్, రీడ్, రీసైట్, రీకాల్) పద్ధతిని ప్రిపరేషన్లో ఉపయోగించాలి. ఈ విభాగానికి సంబంధించి 13 యూనిట్లలో కనీసం ఏడు యూనిట్లను సమగ్రంగా ప్రిపేర్ కావాలి. పరీక్షకు అందుబాటులో ఉన్న ఐదు నెలల్లో మొదటి నాలుగు నెలలు ఈ ఏడు యూనిట్ల ప్రిపరేషన్‌కు కేటాయించాలి. ఇందులో మూడు నెలలు క్లిష్టమైన, పీజీ సిలబస్‌లో లేని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నాలుగో నెలలో పీజీ సబ్జెక్ట్స్ చదవాలి. ఐదో నెలను పునశ్చరణకు, గత ప్రశ్నపత్రాల ప్రాక్టీస్‌కు కేటాయించాలి. కెమికల్ సెన్సైస్: ఇందులో మెరుగైన స్కోర్‌కు ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ అంశాలపై బీఎస్సీ (ఆనర్స్) స్థాయి ప్రిపరేషన్ సాగించాలి. పార్ట్-సి కోసం ఏదో ఒక స్పెషలైజేషన్‌లో మాత్రమే ప్రిపేర్ కావడం సముచితం కాదు. మిగతా విభాగాలపై కూడా దృష్టి సారించాలి. ఈ క్రమంలో ఫిజికల్ కెమిస్ట్రీలో క్వాంటమ్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్, కెమికల్ కైనటిక్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ.. ఇనార్గానిక్ విభాగంలో గ్రూప్ థియరీ, స్పెక్ట్రోస్కోపి, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, న్యూక్లియర్ కెమిస్ట్రీ అంశాలను బాగా ప్రిపేర్ కావాలి. గత రెండేళ్ల నుంచి ఈ విభాగంలో మన రాష్ట్ర విద్యార్థులు తక్కువ స్కోర్ చేస్తున్నారు. కారణం ఎక్కువ మంది విద్యార్థులు ఆర్గానిక్ కెమిస్ట్రీతో ఎంఎస్సీ చేయడమే. వీరు ఫిజికల్ కెమిస్ట్రీ మీద ఎక్కువ దృష్టి సారిస్తే మెరుగైన మార్కులు సాధించవచ్చు. ఫిజికల్ సెన్సైస్: ఈ విభాగంలో పార్ట్-బిలో క్లాసికల్ మెకానిక్స్, క్వాంటమ్ మెకానిక్స్, ఈఎమ్ థియరీ, మ్యాథమెటికల్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్ అంశాల నుంచి సమాన సంఖ్యలోనే ప్రశ్నలు ఇస్తున్నారు. ఒక్కోసారి క్వాంటమ్ మెకానిక్స్, ఈఎమ్ థియరీ నుంచి ఒకటి రెండు ప్రశ్నలు అధికంగా వస్తున్నాయి. పార్ట్-సి కొద్దిగా క్లిష్టంగా ఉంటుంది. ఇందులో రాణించాలంటే సమస్యా పరిష్కార సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అప్లికేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ మెథడ్స్ ఇన్ ఫిజిక్స్, అప్లికేషన్ ఆఫ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఇన్ ఫిజిక్స్ వంటి అంశాలపై దృష్టి సారించాలి. ఇంజనీరింగ్ సెన్సైస్:ఇందులోని పార్ట్-బీలో మ్యాథ్స్, ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ క్రమంలో లీనియర్ అల్జీబ్రా, కాలిక్యులస్, కాంప్లెక్స్ వేరియబుల్స్, వెక్టర్ కాలిక్యులస్, ఆర్డినరీ డిఫెరెన్షియల్ ఈక్వేషన్స్, ప్రోబబిలిటీ, సాలిడ్ బాడీ అండ్ ఫ్లూయిడ్ మిషన్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రోమాగ్నటిక్స్ వంటి అంశాల నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 20 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి ప్రశ్నకు 3.5 మార్కుల చొప్పున ఈ విభాగానికి కేటాయించిన మా ర్కులు 70. పార్ట్-సిలో సంబంధిత సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఎలక్ట్రికల్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మెటీరియల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫ్లూయిడ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్, సాలిడ్ మెకానిక్స్ సబ్జెక్ట్‌లు ఉంటాయి. వీటిలో ప్రతి అంశం నుంచి 10 ప్రశ్నల చొప్పున మొత్తం 70 ప్రశ్నలు వస్తాయి. వీటిలో 20 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఇందులో ప్రతి ప్రశ్నకు 5 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులు ఈ విభాగానికి కేటాయించారు. ఈ విభాగంలో అభ్యర్థి తన బ్రాంచ్ కాకుం డా అదనంగా మరో సబ్జెక్ట్‌ను ఎంచుకోవాలి. అవి.. ఈసీఈ: ఎలక్ట్రానిక్స్-సీఎస్ఈ, ఎలక్ట్రానిక్స్-ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్-మెటీరియల్ సైన్స్. సీఎస్ఈ: సీఎస్ఈ-ఎలక్ట్రానిక్స్, సీఎస్ఈ-థర్మోడైనమిక్స్. సివిల్: సాలిడ్ మెకానిక్స్-ఫ్ల్లూయిడ్ మెకానిక్స్, సాలిడ్ మెకానిక్స్-థర్మోడైనమిక్స్. మెకానికల్: ఫ్లూయిడ్ మెకానిక్స్-థర్మోడైనమిక్స్, థర్మోడైనమిక్స్-మెటీరియల్ సైన్స్. కెమికల్/ఎన్విరాన్మెంటల్: థర్మోడైనమిక్స్-మెటీరియల్ సైన్స్. ఏరోనాటికల్/ఆటోమొబైల్: థర్మోడైనమిక్స్-మెటీరియల్ సైన్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్-థర్మోడైనమిక్స్. ఈఈఈ:ఎలక్ట్రానిక్స్-ఎలక్ట్రికల్. జనరల్ టిప్స్: స గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం కూడా లాభిస్తుంది. స సిస్టర్ ఎగ్జామ్స్‌గా వ్యవహరించే డీ బీటీ-జేఆర్ఎఫ్, ఐసీఎంఆర్-జేఆర్ఎఫ్, ఐసీఏఆర్-జేఆర్ఎఫ్, జెస్ట్, బార్క్, డీఆర్డీఓ వంటి పరీక్షలు రాయడం ఉపయోగకరం. స పరీక్షలో మొదట పార్ట్-సితో ప్రారంభించండి. ఎందుకంటే ఇది స్కోర్ చేయగలిగిన విభాగం. తర్వాత పార్ట్-బి, చివరగా పార్ట్-ఎను సాధించండి. పార్ట్-బిలో ప్రతి ప్రశ్నకు ఒక నిమిషం కేటాయించాలి. పార్ట్-సిలో ప్రతి ప్రశ్నను మూడు/నాలుగు నిమిషాల్లో సాధించడానికి ప్రయత్నించండి. ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూ).. సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ స్కోర్ ఆధారంగా నియామకాలను చేపట్టడానికి యూజీసీ అనుమతినిచ్చింది. ఈ మేరకు గతేడాది యూజీసీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)కు లేఖ కూడా రాసింది. ఐఓసీఎల్ బాటలోనే ఇతర పీఎస్‌యూలు నడిచే అవకాశం ఉంది. సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ ద్వారా జేఆర్‌ఎఫ్‌నకు ఎంపికైన అభ్యర్థులకు సీఎస్ఐఆర్ పరిశోధనశాలలతోపాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక సంస్థల్లో పరిశోధన చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో రెండేళ్లపాటు నెలకు రూ. 16 వేల ఫెలోషిప్, ఏటా కాంటిన్జెన్సీ గ్రాంట్‌గా రూ. 20 వేలు చెల్లిస్తారు. ఈ క్రమంలో సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌నకు కూడా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మూడో ఏడాది నుంచి ప్రతి నెలా రూ. 18 వేల ఫెలోషిప్ అందుకోవచ్చు. జేఆర్ఎఫ్లో అత్యంత ప్రతిభావంతులకు శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ఫెలోషిప్ లభిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్లపాటు నెలకు రూ. 20 వేల ఫెలోషిప్, ఏటా కాంటిన్జెన్సీ గ్రాంట్‌గా రూ. 70 వేలు చెల్లిస్తారు. తర్వాత ప్రతిభ ఆధారంగా మూడేళ్లపాటు పొడిగింపు లభిస్తుంది. ఈ సమయంలో నెలకు రూ. 24 వేల ఫెలోషిప్ లభిస్తుంది.సీఎస్ఐఆర్-యూజీసీ నెట్లో అర్హత సాధించడం ద్వారా దేశంలోని అన్ని డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలలో/ తత్సమాన ఇన్స్టిట్యూట్లలో లెక్చరర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం రాత పరీక్షకు హాజరు కావాలంటే నెట్/సెట్లో అర్హత సాధించాలి.