విదేశాల్లో ఎంబీబీఎస్‌కూ నీట్‌ ! | Students Willing To Study MBBS Abroad May Have To Clear NEET | Sakshi
Sakshi News home page

విదేశాల్లో ఎంబీబీఎస్‌కూ నీట్‌ !

Published Mon, Feb 12 2018 2:07 AM | Last Updated on Mon, Feb 12 2018 7:43 AM

Students Willing To Study MBBS Abroad May Have To Clear NEET - Sakshi

న్యూఢిల్లీ: విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదవాలనుకునే విద్యార్థులకు జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్‌)లో ఉత్తీర్ణత సాధించడాన్ని కేంద్రం త్వరలోనే తప్పనిసరి చేసే అవకాశముందని ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం చివరిదశ పరిశీలనలో ఉందన్నారు.

విదేశాల్లో ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన అభ్యర్థులు దేశంలో వైద్య వృత్తిని చేపట్టేందుకు భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) ఫారిన్‌ మెడికల్‌గ్రాడ్యుయేట్‌ ఎగ్జామ్‌(ఎఫ్‌ఎంజీఈ)ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష రాసే మొత్తం విద్యార్థుల్లో కేవలం 12 నుంచి 15 శాతం మాత్రమే ఉత్తీర్ణులు అవుతున్నారని పేర్కొన్నారు. ఒకవేళ ఈ పరీక్షలో ఉత్తీర్ణులు కాకుంటే వైద్యవృత్తిని చేపట్టడం కుదరదన్నారు. దీంతో పలువురు చట్టవిరుద్ధంగా వైద్య వృత్తిని ప్రారంభిస్తున్నారని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement