యూజీసీ నెట్, జూన్‌ 2021: ముఖ్య సమాచారం | UGC NET 2021: Notification, Exam Date, Eligibility, Exam Pattern | Sakshi
Sakshi News home page

యూజీసీ నెట్, జూన్‌ 2021: ముఖ్య సమాచారం

Published Mon, Aug 16 2021 1:46 PM | Last Updated on Mon, Aug 16 2021 1:46 PM

UGC NET 2021: Notification, Exam Date, Eligibility, Exam Pattern - Sakshi

యూజీసీ–నేషనల్‌ ఎలిజి బిలిటీ టెస్ట్‌(నెట్‌)–జూన్‌ 2021 నోటిఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా హ్యూమానిటీస్, సోషల్‌ సైన్సెస్, తత్సమాన సబ్జెక్టులకు సంబంధించి జేఆర్‌ఎఫ్, లెక్చర్‌షిప్‌(అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌) అర్హత కోసం నిర్వహించే యూజీసీ–నేషనల్‌ ఎలిజి బిలిటీ టెస్ట్‌(నెట్‌)–జూన్‌ 2021 నోటిఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) విడుదల చేసింది.

అర్హత: హ్యూమానిటీస్, సోషల్‌ సైన్సెస్‌ (లాంగ్వేజెస్‌ని కలుపుకొని), కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్, ఎలక్ట్రానిక్‌ సైన్స్‌ తదితర సబ్జెక్టుల్లో కనీసం 55శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి. ప్రస్తుతం మాస్టర్స్‌ డిగ్రీ చదువుతున్న వారు, మాస్టర్స్‌ డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: జేఆర్‌ఎఫ్‌నకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 01.10.2021 నాటికి 31ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. 

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఈ రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ తరహా మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో అడుగుతారు.పేపర్‌ 1– 50 ప్రశ్నలు–100 మార్కులకు, పేపర్‌ 2–100 ప్రశ్నలు–200 మార్కులకు జరుగుతుంది. పరీక్షా సమయం మూడు గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమంలో ఉంటుంది.

ముఖ్య సమాచారం: 
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 05.09.2021
► పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేది: 06.09.2021
► పరీక్ష తేదీలు: 2021 అక్టోబర్‌ 06 నుంచి 11 వరకు జరుగుతాయి
► వెబ్‌సైట్‌: https://ugcnet.nta.nic.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement