Education policy
-
AP Education Reforms : నాణ్యమైన విద్యతోనే మార్పు, ప్రవాసాంధ్రుల ప్రశంసలు
ప్రపంచాన్ని మార్చడానికి విద్య చాలా ముఖ్యమైన ఆయుధం అని నెల్సన్ మండేలా అన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా అదే నమ్మకంతో రాష్ట్రంలో విద్యాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారు. అమ్మ ఒడి, విద్యా కానుక, ఫీజు రీయింబర్స్మెంట్, ఉన్నత విద్యలో సంస్కరణలు, కొత్త వైద్య కళాశాలలు మొదలైన అనేక సంక్షేమ పథకాలను ఆయన ప్రారంభించారు.ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుని ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు...విద్యకు పెద్ద పీట వేస్తే ఇలాంటివి ఎన్నయినా సాధిస్తారు... ఇదొక ఉదాహరణ మాత్రమే. రాష్ట్రంలో విద్యా సంస్కరణలు అనేకం... ఇంగ్లిష్ మీడియం చదువులు, ప్రభుత్వ బడుల్లో ఆధునిక టెక్నాలజీ ఉపయోగం.. బడులు/భవనాల ఆధునికరణ... నాడు నేడు కింద ఆధునీకీకరణ ఎలా జరిగింది. ప్రభుత్వ బడుల్లో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఏమేం సౌకర్యాలు వచ్చాయి.. మరుగు దొడ్లలో మార్పులు... ఇంకా మరెన్నో. విద్యలో చేపట్టిన సంస్కరణల గురించి చర్చించిన ఈ డిబేట్లో రానున్న రోజుల్లో విద్య వల్ల సమాజానికి ఎలాంటి పురోగతిని అనే వాటి గురించి సాక్షి ఒక చర్చ నిర్వహించింది. ఈ చర్చలో అమెరికాలోని పలువురు ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. డాక్టర్ కామేశ్వర బద్రి, PhD, మోర్హౌస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్, డైరెక్టర్, ప్రెసిడెంట్, అసోసియేషన్ ఆఫ్ సైంటిస్ట్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఇన్ అమెరికా, హ్యూస్టన్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సురేష్ రెడ్డి మైలం, ఫీనిక్స్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధీరజ్ పోలా, హార్ట్ఫోర్డ్ నుంచి చరణ్ పింగిళి, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అట్లాంటా నుంచి కమల్ కిరణ్ జనుమల, సీవోవో, రెడ్ యాంట్స్ గ్రూప్ (IT, ఫైనాన్స్ & మీడియా ఈ చర్చల్లో పాల్గొన్నారు. -
158 పారిశ్రామిక సంస్థలు వచ్చి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాయి
-
ఐన్‌స్టీన్‌ను మించిన తెలివున్నా.. ఆమెకు తీరని ఆవేదన?
ఆ అమ్మాయి.. ప్రముఖ శాస్త్రవేత్తలు ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్స్‌కు మించిన తెలివితేటలు కలిగినది. ఆమె ఐక్యూ 161 పాయింట్లు. ఇంతటి ప్రతిభావంతురాలైన ఆమెకు చదువు చెప్పలేక ఉపాధ్యాయులే సతమతమవుతున్నారట. ఇంగ్లండ్‌లోని స్లోఫ్‌కు చెందిన మహ్నూర్ చీమా(17)తన తొమ్మిదేళ్ల వయసులో పాకిస్తాన్ నుంచి కుటుంబంతోపాటు బ్రిటన్‌కు వచ్చింది. ఈ సమయంలో ఆ చిన్నారి తన ప్రతిభను చూపినప్పటికీ ఉపాధ్యాయులు పైతరగతికి ప్రమోట్ చేయలేదు. బెర్క్‌షైర్‌లోని కోల్న్బ్రూక్ చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు తాను క్లాస్ వర్క్‌ను అందరికన్నా త్వరగా పూర్తి చేసినప్పటికీ, పై క్లాస్‌కు వెళ్లేందుకు అనుమతించలేదని, పైగా అదనంగా గణితాన్ని అభ్యసించాలని ఆదేశించారని చీమా తెలిపింది. ఆమె లాంగ్లీ గ్రామర్ స్కూల్‌కి మారినప్పుడు, జీసీఎస్ఈ పరీక్షలకు కూర్చోకుండా నిరుత్సాహపరిచారని చీమా ఆరోపించింది. అయితే చీమాపై ఒత్తిడి అధికంగా ఉందని, దానికి గుర్తుగా ఆమె కళ్లకింద నల్లని వలయాలు ఏర్పడ్డాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అయితే ఆమె తల్లిదండ్రులు తమ చిన్నారి తెలివితేటలకు తగిన విద్యను అందించేందుకే యూకే వచ్చామని తెలిపారు. మహ్నూర్ చీమా మీడియాతో మాట్లాడుతూ తన మాదిరిగా ప్రతిభ కలిగిన చాలామంది విద్యార్థులు ఉన్నారని, అయితే వారి సామర్థ్యాన్ని ఎవరూ గుర్తించడం లేదని, ఫలితంగా వారి ప్రతిభ వృథా అవుతున్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను ప్రతిభావంతులైన పలువురు విద్యార్థులతో మాట్లాడానని, వారు కూడా తనలానే నిరాశతో ఉన్నారని అమె పేర్కొంది. ప్రతిభావంతులైన విద్యార్థులకు చేయూతనందించాల్సిన బాధ్యత విద్యాసంస్థలపై ఉందని, బ్రిటీష్ విద్యావ్యవస్థలో గణిత బోధన చాలా నెమ్మదిగా సాగుతున్నదని, బ్రిటన్‌లోని 11 ఏళ్ల విద్యార్థులకు నిర్వహించే పరీక్షలను పాకిస్తాన్లో మూడవ సంవత్సరం పిల్లలు పూర్తి చేయగలరని చీమా వ్యాఖ్యానించింది. చీమా తన జీసీఎస్‌ఈలో 33 నైన్లు సాధించింది. ఇది అత్యధిక స్కోర్. అలాగే తాను ఉంటున్న ప్రాంత పరిధిలోని పలు పాఠశాలల ప్రవేశ పరీక్షలకు హాజరై, మూడు కౌంటీలలో అగ్రస్థానంలో నిలిచింది. చీమా కుటుంబం పాకిస్తాన్‌లోని లాహోర్ నుండి 2006లో యూకేకి తరలివచ్చింది - ఆమె తండ్రి, ప్రముఖ న్యాయవాది. తల్లి ఆర్థికశాస్త్రంలో రెండు డిగ్రీలు సాధించారు. జాతీయ గణిత ఛాంపియన్‌గా నిలిచిన 14 ఏళ్ల సోదరి కూడా ఆమెకు ఉంది. ప్రస్తుతం చీమా..హెన్రిట్టా బార్నెట్ స్కూల్లో విద్యనభ్యసిస్తోంది. చీమాకు స్విమ్మింగ్‌తో పాటు గుర్రపు స్వారీ చేయడమంటే కూడా ఎంతో ఇష్టం. -
యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో నైపుణ్య విద్య
సాక్షి, విశాఖపట్నం: అందుబాటులో ఉన్న వనరులతో అత్యుత్తమ అవకాశాలు సృష్టిస్తూ.. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో నైపుణ్య విద్యను అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. విశాఖపట్నంలోని రుషికొండలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్వర్యంలో ఇండస్ట్రీ 4.0 పేరుతో నేషనల్ స్కిల్ కాంక్లేవ్–2024 శుక్రవారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యుత్తమ విధానాలు అమలు చేసేందుకు వియత్నాం, జర్మనీ, దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో పర్యటించామన్నారు. గత 30–40 ఏళ్లలో నైపుణ్య రంగంలో చాలా మార్పులు వచ్చాయని తెలిపారు. రాష్ట్ర యువతలో ఏయే విభాగాల్లో నైపుణ్య కొరత ఉందో.. ఎందులో ఎక్కువ శాతం ఉపాధి అవకాశాలు ఉన్నాయో తెలుసుకుని దానికనుగుణంగా కార్యాచరణ చేపట్టామని వివరించారు. స్థానిక పరిశ్రమల అవసరాలను బట్టి నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యతనిస్తున్నామని వెల్లడించారు. సన్‌షైన్ ఏపీ కోసం 26 నైపుణ్య అకాడమీలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో స్కిల్ సెంటర్లు కూడా ఉన్నాయన్నారు. శిక్షణ ఇచ్చిన తర్వాత వీరిలో 50 శాతం మందిని స్థానిక పరిశ్రమల అవసరాల కోసం ఉపయోగించుకోవాలని అన్ని సంస్థలకు దిశానిర్దేశం చేశామని చెప్పారు. రాష్ట్ర యువత.. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా.. నైపుణ్య శిక్షణ అందించాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష అన్నారు. ఇందుకు అనుగుణంగా ఏపీఎస్ఎస్డీసీ పనిచేస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. పలు సంస్థలతో ఏపీఎస్ఎస్డీసీ ఒప్పందాలు.. సదస్సులో భాగంగా.. ఏపీఎస్ఎస్డీసీతో వివిధ సంస్థలు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. నైపుణ్య శిక్షణకు సంబంధించి 100 మిలియన్ లెర్నర్స్ (అరిజోనా స్టేట్ యూనివర్సిటీ), ట్రస్టెడ్ జాబ్స్, తాత్విక్ బ్యూటీ–వెల్నెస్, ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(టీఎన్‌ఏఐ), ఎక్సెల్ఐఆర్, జీయూవీఐ, హెచ్ఈఆర్ఈ టెక్నాలజీస్, రబ్బర్, కెమికల్, పెట్రో కెమికల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మొదలైన సంస్థలతో 6 ఎంవోయూలను ఏపీఎస్ఎస్డీసీ కుదుర్చుకుంది. ఏపీలో నైపుణ్యాభివృద్ధి కోసం గత ఐదేళ్లలో నిర్వహించిన కార్యక్రమాలపై రూపొందించిన వీడియో ప్రదర్శనకు దేశ, విదేశాల ప్రతినిధుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏపీఎస్ఎస్డీసీ ‘న్యూస్కిల్’ న్యూస్ లెటర్‌ను మంత్రి బుగ్గన ఆవిష్కరించారు. ఏపీఎస్ఎస్డీసీకి సహకారం అందిస్తూ ఉపాధి అవకాశాల్ని మరింత మెరుగయ్యేలా చేస్తున్న బెస్ట్ ప్లేస్మెంట్, సీఎస్ఆర్ పార్టనర్లగా కియా మోటార్స్ ఇండియా లిమిటెడ్, లలితా జ్యుయెలర్స్ తదితర 13 సంస్థలకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కియా మోటార్స్ ఇండియా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కబ్ డాంగ్లీ, సెంట్రల్ ఎంఎస్ఎంఈ బోర్డు సీఈవో సేతు మాధవన్, సీడాప్ సీఈవో శ్రీనివాసులు, ఏపీఎస్ఎస్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.దినేశ్ కుమార్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ నవ్య, పలువురు పారిశ్రామికవేత్తలు, వివిధ రాష్ట్రాల స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఉపాధి అవకాశాల కల్పనలో 3వ స్థానంలో ఏపీ రాష్ట్రంలో ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం.. స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, హబ్‌లు ఏర్పాటు చేసి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందిస్తోంది. దేశంలో అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రాష్ట్రాల్లో మూడో స్థానంలో ఉంది. త్వరలోనే నంబర్‌వన్‌కి చేరుకునే అవకాశాలున్నాయి. – డా. వినోద్ కుమార్, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో ఏపీ విధానాలు భేష్ నైపుణ్య శిక్షణ కోసం ఏపీలోనూ అవలంబిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయి. ఏడాదిన్నర క్రితం మహారాష్ట్ర స్టేట్ స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఐదు ప్రధాన విభాగాల్లో నైపుణ్య శిక్షణ అందిస్తున్నాం. మా రాష్ట్రంలో 2.7 లక్షల మందికి ఏడాది కాలంలో ఉద్యోగాలు ఇవ్వగలిగాం. – డా. అపూర్వ పాల్కర్, మహారాష్ట్ర స్టేట్ స్కిల్స్ యూనివర్సిటీ వీసీ చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు.. వైఎస్సార్సీపీతో తప్ప అన్ని పార్టీలతోనూ పొత్తులు పెట్టుకున్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన బుగ్గన చంద్రబాబు వైఖరిని తూర్పారబట్టారు. టీడీపీకి ఒక అజెండా, విధానం అంటూ ఏమీ లేవని విమర్శించారు. సైద్ధాంతిక విభేదాలు ఉన్న పార్టీలతో సైతం పొత్తు పెట్టుకోవడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలకు వేర్వేరు సిద్ధాంతాలు ఉన్నాయన్నారు. వీటితో ఒక్కో పార్టీతో రెండేసి సార్లు పొత్తు పెట్టుకున్న ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. టీడీపీ తోక పార్టీ జనసేన సిద్ధాంతం ఏంటో ఆ పార్టీ శ్రేణులకు సైతం అర్థం కావడం లేదన్నారు. వైఎస్సార్ ఆశయాలు, పేదల సంక్షేమమే వైఎస్సార్సీపీ అజెండా అని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విభజన హామీల అమలు కోసమే సీఎం ఢిల్లీ వెళ్లారని వెల్లడించారు. బీజేపీ, టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు విభజన హామీలను చంద్రబాబు గాలికొదిలేశారని మండిపడ్డారు. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా వైఎస్సార్సీపీ నెరవేరుస్తోందన్నారు. -
ఏపీలో భవిష్యత్తు తరాలకు నాణ్యమైన విద్యే లక్ష్యంగా..: సీఎం జగన్
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా విధానంలో మరో విప్లవాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఐబీ’ విద్య అమలుకు శ్రీకారం చుట్టింది జగనన్న ప్రభుత్వం. ఈ క్రమంలో.. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో SCERT, IB మధ్య ఒప్పందం కుదిరింది. తద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేటు పాఠశాలల్లో శ్రీమంతుల పిల్లలు చదువుకునే ‘ఇంటర్నేషనల్ బాకలారియెట్’ (ఐబీ) సిలబస్ పేద పిల్లలకు చేరువ కానుంది. ఐబీ సిలబస్ అమలుపై బుధవారం సాయంత్రం ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) అధికారులతో ఐబీ ప్రతినిధులు సీఎం జగన్ సమక్షంలో ఏపీ విద్యాశాఖతో ఒప్పందం చేసుకున్నారు. ఏపీ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఐబీ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్(డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్) డాక్టర్ అంటోన్ బిగిన్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఇక ఈ కార్యక్రమానికి జెనీవా నుంచి వర్చువల్‌గా ఐబీ డైరెక్టర్ జనరల్ ఒల్లి పెక్కా హీనోనెన్ పాల్గొన్నారు. సీఎం జగన్ ఏమన్నారంటే.. ‘‘ఐబీని ప్రభుత్వ విద్యారంగంలో భాగస్వామ్యం చేయడం నాకు గొప్ప సంతృప్తి నిస్తోంది. ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలీ పెక్కాకు, ఆన్లైన్ ద్వారా హాజరైన వారితో పాటు ఇక్కడకు వచ్చిన ఐబీ ప్రతినిధులకు ధన్యవాదాలు. ఐబీతో భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైనది నేను భావిస్తున్నా. ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లను ఐబీతో ఏకీకృతం చేయడం ఇది గొప్ప సంతృప్తినిచ్చే కార్యక్రమం. నాణ్యమైన విద్యను భవిష్యత్తు తరాలకు అందించడం అన్నది చాలా ముఖ్యం. భవిష్యత్తు తరాలు.. మంచి ఉద్యోగాలు సాధించాలన్నా, భవిష్యత్ ప్రపంచంలో నెంబర్‌వన్‌గా నిలవాలన్నా భారత్ లాంటి దేశాల్లో నాణ్యమైన విద్య అవసరం. .. ఇప్పుడున్న విద్యావిధానాలను అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాశ్చాత్య ప్రపంచంతో పోల్చిచూస్తే సాంకేతికత, పాఠ్యప్రణాళిక తదితర అంశాల్లో అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంది. సమస్యా పూరణ సామర్ధ్యం, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ మోడల్లో ఎడ్యుకేషన్ నాలెడ్జ్‌ని వినియోగం వంటివి చాలా కీలకం. ఐబీ ద్వారా ఇది సాధ్యమని విశ్వసిస్తున్నాం. ఐబీకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఐబీతో భాగస్వామ్యం ద్వారా ఒక ప్రయాణం ప్రారంభమైంది. ముందు టీచర్లకు, సిబ్బందికి కెపాసిటీని పెంచేలా శిక్షణ కార్యక్రమాలు రానున్న విద్యాసంవత్సరంలో అమలవుతాయి. సంపన్నులకు మాత్రమే అందే ఐబీ విద్య అన్న పరిస్థితి ఇప్పుడు మారుతుంది. ప్రతి సంవత్సరం ఒక్కో తరగతిలో ఐబీ బోధన మొదలవుతుంది. పదేళ్లలో 2035నాటికి పదోతరగతి, 2037 నాటికి పన్నెండు తరగతిలో ఐబీ బోధన మొదలవుతుంది. పేదలకు, అణగారిన వర్గాలకూ ఐబీ బోధన అందుతుంది. ఎస్ఈఆర్టీలో ఐబీ భాగస్వామ్యం కావడం వల్ల విద్యా బోధన, అభ్యాసాలు పరిణామం చెందుతాయి. ఇది కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుంది అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. 2024 – 25 విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. వారిలో బోధన సామర్థ్యం, నైపుణ్యం పెంచేలా ఈ శిక్షణ ఉంటుంది. టీచర్లతో పాటు మండల, జిల్లా విద్యాధికారులు, ఎస్సీఈఆర్టీ, డైట్ సిబ్బంది, ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ బోర్డు సిబ్బందికి ‘ఐబీ’పై అవగాహన, సామర్థ్యం పెంచేలా శిక్షణనిస్తారు. దీంతో వారంతా ప్రతిష్టాత్మక ఐబీ గ్లోబల్ టీచర్ నెట్‌వర్క్‌లో భాగమవుతారు. 2025 జూన్ నుంచి ఒకటో తరగతిలో ఐబీ సిలబస్ బోధన ప్రారంభమవుతుంది. ఏటా ఒక్కో తరగతికి ఈ సిలబస్‌ను పెంచుతూ 2035 నాటికి 10వ తరగతి, 2037కి 12వ తరగతిలో అమలు చేస్తారు. పరీక్షల అనంతరం ఐబీ బోర్డు, ఏపీఎస్సీఈఆర్టీ ఉమ్మడిగా సర్టిఫికెట్‌ను ప్రదానం చేస్తాయి. ఈ సర్టిఫికెట్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు సైతం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఇంటర్ మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరవ్ గౌర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్(పాఠశాల మౌలిక సదుపాయాలు) కాటమనేని భాస్కర్, సర్వశిక్ష అభియాన్ ఎస్పీడీ బి శ్రీనివాసరావు, పాఠశాల విద్యాశాఖ(మిడ్ డే మీల్స్) డైరెక్టర్ ఎస్.ఎస్. శోభికా, ఐబీ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
AP: పేదల చెంతకు శ్రీమంతుల చదువులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా విధానంలో మరో విప్లవాత్మక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన సహా అనేక సంస్కరణలు తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేటు పాఠశాలల్లో శ్రీమంతుల పిల్లలు చదువుకునే ‘ఇంటర్నేషనల్ బాకలారియెట్’ (ఐబీ) సిలబస్‌ను కూడా పేద పిల్లలకు చేరువ చేస్తున్నారు. ఐబీ సిలబస్ అమలుపై బుధవారం సాయంత్రం ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) అధికారులతో ఐబీ ప్రతినిధులు ఒప్పందం చేసుకోనున్నారు. దీంతో మన ప్రభుత్వ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడి నెగ్గేలా తీర్చిదిద్దడంలో మరో కీలక అడుగు పడనుంది. 2024 – 25 విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. వారిలో బోధన సామర్థ్యం, నైపుణ్యం పెంచేలా ఈ శిక్షణ ఉంటుంది. టీచర్లతో పాటు మండల, జిల్లా విద్యాధికారులు, ఎస్సీఈఆర్టీ, డైట్ సిబ్బంది, ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ బోర్డు సిబ్బందికి ‘ఐబీ’పై అవగాహన, సామర్థ్యం పెంచేలా శిక్షణనిస్తారు. దీంతో వారంతా ప్రతిష్టాత్మక ఐబీ గ్లోబల్ టీచర్ నెట్‌వర్క్‌లో భాగమవుతారు. 2025 జూన్ నుంచి ఒకటో తరగతిలో ఐబీ సిలబస్ బోధన ప్రారంభమవుతుంది. ఏటా ఒక్కో తరగతికి ఈ సిలబస్‌ను పెంచుతూ 2035 నాటికి 10వ తరగతి, 2037కి 12వ తరగతిలో అమలు చేస్తారు. పరీక్షల అనంతరం ఐబీ బోర్డు, ఏపీఎస్సీఈఆర్టీ ఉమ్మడిగా సర్టిఫికెట్‌ను ప్రదానం చేస్తాయి. ఈ సర్టిఫికెట్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు సైతం ఉంటుంది. 2019 నుంచే గ్లోబల్ సిటిజన్స్ ప్రణాళిక ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను గ్లోబల్ విద్యార్థులుగా తీర్చిదిద్దే ప్రక్రియను వైఎస్ జగన్ ప్రభుత్వం 2019 నుంచే ప్రారంభించింది. ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులు ఉత్తమంగా ఎదిగేందుకు 56 నెలల్లో దాదాపు రూ.73 వేల కోట్లు విద్యా సంస్కరణల కోసం వెచ్చించింది. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకంటే మిన్నగా తీర్చి దిద్దుతోంది. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద తదితర విప్లవాత్మక కార్యక్రమాలను అమలు చేసి విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసింది. ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిష్ మీడియంలో బోధన ప్రారంభించింది. మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. పాఠశాలలను సీబీఎస్ఈ బోర్డుకు అనుసంధానించింది. విద్యార్థులకు బైలింగ్యువల్ టెక్టŠస్ బుక్స్ నుంచి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వరకు 9 వస్తువులతో కూడిన జగనన్న విద్యా కానుక కిట్‌ను అందిస్తోంది. పిల్లల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచడంతో పాటు సులభంగా ఇంగ్లిష్ అర్థమయ్యేలా మార్పులు చేసింది. నాలుగు నుంచి 12వ తరగతి వరకు ఉచిత బైజూస్ కంటెంట్, 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు బైజూస్ కంటెంట్‌తో ఉచిత ట్యాబ్స్ పంపిణీ చేసింది. హై స్కూల్ స్థాయిలో ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం 62 వేల ఐఎఫ్‌పీలు ఏర్పాటు చేస్తోంది. ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలు, ఇంగ్లిష్ ల్యాబ్స్ ఏర్పాటు చేసింది. ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లిష్‌లో నైపుణ్యం సాధించేందుకు మూడో తరగతి నుంచి టోఫెల్ శిక్షణనిస్తోంది. ఐబీ సిలబస్‌ను సులభంగా అర్థం చేసుకునేందుకు, అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునేందుకు ఈ మార్పులు దోహదం చేస్తాయి. ఐబీ విద్యా బోధనలో ఎన్నో ప్రత్యేకతలు ఐబీ విద్య ప్రపంచంలోనే అత్యుత్తమ బోధన పద్ధతిగా గుర్తింపు పొందింది. బట్టీ చదువులకు స్వస్తి చెబుతూ థియరీతో పాటు ప్రాక్టికల్ అప్లికేషన్ పద్ధతిలో బోధన సాగుతుంది. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది. ప్రస్తుత, భావితరాల అవసరాలకు అనుగుణంగా సిలబస్, బోధన, మూల్యాంకనం ఉంటుంది. చదువుతోపాటు ప్రాక్టికల్స్, విద్యార్థుల్లో నైపుణ్యాల (స్కిల్స్)కు ప్రాధాన్యతనిస్తారు. సంగీతం, నృత్యం, క్రీడలు వంటి ఇతర అంశాల్లోనూ తర్ఫీదు ఇస్తారు. ఇంటర్ డిసిప్టీనరీ కాన్సెప్ట్ (వాస్తవిక జీవిత అంశాలు) ఆధారంగా బోధన సాగుతుంది. ఈ సిలబస్‌ను అభ్యసించిన విద్యార్థులు ఇతరులతో పోలిస్తే ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో మూడు రెట్లు అధికంగా ప్రవేశాలు పొందుతున్నారు. ప్రపంచస్థాయి ఉద్యోగావకాశాలను సైతం వేగంగా అందుకుంటున్నారు. -
ప్రభుత్వానికీ మనసు ఉండాలని..
సాక్షి, అమరావతి : విశ్వసనీయతకు నిలువెత్తురూపం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆలోచనల్లో నిబద్ధత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆచరణలో ఎంతటి కష్టం, నష్టం ఉన్నా వెనక్కి తగ్గని గుణం ఆయన సొంతం. జీవనశైలి అత్యంత సాదాసీదాగా ఉంటుంది. మితాహారం ఆయనకు ఇష్టం. నిద్ర కూడా పరిమితమే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత నిరాడంబరంగా ఉన్నారో, అధికారంలో ఉన్నప్పుడూ అంతే నిరాడంబరత ఆయనలో కనిపిస్తుంది. మాట, భాష, వ్యవహార శైలే దీనికి నిదర్శనం. రోజురోజుకూ ఆయనలో ఓపిక, సహనం పెరుగుతూనే ఉన్నాయి. ఎంతమందితో మాట్లాడినా, ఎన్ని గంటలు చర్చించినా ముఖంలో చిరునవ్వు అలాగే కనిపిస్తుంది. మితాహారం మితాహారం తీసుకోవడం, అదే సమయంలో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడం జగన్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నేళ్లుగా ఆయన లేచిన తర్వాత రెండు కప్పుల టీ, తర్వాత గ్లాసుడు జ్యూస్ మాత్రమే ఉదయం తీసుకుంటారు. లంచ్‌కు ముందు కప్పు కాఫీ, లంచ్‌లో వెజిటబుల్ సలాడ్, పన్నీర్, తక్కువ మొత్తంలో ఫిష్ లేదా సంబంధిత ఆహారాన్ని మితంగా తీసుకుంటారు. సాయంత్రం కూడా ఒక కప్పు కాఫీ తాగుతారు. రాత్రికి పుల్కా లేదా, రోటీతో కూరగాయలు తీసుకుంటారు. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. పరిమితమైన ఆహారం, వ్యాయామం విషయంలో చాలా కచ్చితంగా ఉంటారు. స్వీట్లు లాంటి పదార్థాలకు దూరంగా ఉంటారు. ఎంత అవసరమో అంతే ఆహారాన్ని తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యమని అంటూ ఉంటారు. ఆపన్నులకు అండ వైఎస్ జగన్.. అనే పేరు వింటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది ఒక నమ్మకం. ఆయన ఉన్నాడు.. మనల్ని చూసుకుంటాడనే భరోసా కనిపిస్తుంది. ఇంతటి విశ్వాసం పొందడానికి ఆయన అనుసరిస్తున్న మార్గాలు కూడా స్ఫూర్తిదాయకం. ఒక నాయకుడిగా తాను నడవటమే కాదు పది మందినీ నడిపించే ప్రేరణతో కూడిన శక్తి ఆయన సొంతం. రుజువర్తన, ప్రజలకు మేలు చేయాలనే పట్టుదల, అవి నేరవేరే దాకా చెక్కుచెదరని సంకల్పం, అన్నింటికీ మించి క్రమశిక్షణ ఆయన వ్యక్తిత్వాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాయి. గొంతు విప్పలేని వర్గాలకు ఒక స్వరమై, ఆపన్నులకు ఆపద్భాంధవుడై ఆయన నిలవడం వెనుక ఈ వ్యక్తిత్వమే కారణం. దినచర్య ఇలా.. సమయాన్ని అత్యంత విలువైనదిగా జగన్ భావిస్తారు. అందుకనే రోజువారీ ప్రణాళిక విషయంలో షెడ్యూలు ప్రకారం ముందుకు సాగుతారు. తెల్లవారక ముందే నిద్రలేచే అలవాటును అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడూ వదులుకోలేదు. ఉదయం 4గంటలకు ఆయన దినచర్య ప్రారంభం అవుతుంది. ఆరోజు దినపత్రికలను ఒకసారి పరిశీలిస్తారు. స్పందించదగ్గ విషయాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడి ఆదేశాలు ఇస్తారు. గంటకు పైగా వ్యాయామం ఉంటుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు కూడా జాతీయంగా, అంతర్జాతీయంగా వస్తున్న పరిణామాలను తెలుసుకునేందుకు ఇంగ్లిషు ఛానల్స్, లేదా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక, సాంకేతిక, పాలనా రంగాల్లో వస్తున్న అంశాలపై నిపుణులు చేసిన పోడ్కాస్ట్ వింటారు. ఇందులో స్వీకరించదగ్గ అంశాలను గుర్తు పెట్టుకుని ఒక పేపర్‌పై రాసుకుంటారు. రాష్ట్రానికి అవసరమైన అంశాల విషయంలో అవి ఎంత వరకు మేలు చేస్తాయనే విషయాన్ని ఆలోచించి వాటిని అమలు చేస్తారు. వ్యాయామం ముగిసిన తర్వాత తన కార్యాలయానికి రెడీ అవుతారు. సాధారణంగా మధ్యాహ్నం రెండు గంటల వరకు కార్యాలయంలోనే ఉంటారు. అధికారులతో సమీక్షలు, పాలనా పరమైన వ్యవహారాలు, పార్టీ పనుల్లో నిమగ్నమై ఉంటారు. కార్యాలయానికి వచ్చిన తర్వాత మొదట సీఎంఓ అధికారులతో సీఎం ప్రతి రోజూ సమావేశం అవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిణామాలపై చర్చ ఉంటుంది. ఇందులో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు అమలు, అప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉన్నాయా? ఎవరినైనా ఆదుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయా? అన్నదానిపై ప్రధానంగా చర్చ ఉంటుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్ల నుంచే ఆయన అధికారులతో నిరంతరం ఒక మాట చెప్తూ ఉంటారు. ‘నేను అయినా, మీరు అయినా ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ అందరూ కలిసి మాట్లాడుకుంటున్నాం. దాపరికంతో ఉన్నా, మీ ముందు నేను మనసు విప్పి ఓపెన్‌గా మాట్లాడకపోయినా ఈ సమావేశానికి అర్థం ఉండదు. ఏ అంశంపైనైనా మీ అభిప్రాయాలను సంకోచం లేకుండా చెప్పొచ్చు. అప్పుడే మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం’ అని పలుమార్లు చెప్పారు. వ్యతిరేకులు చెప్పిన విషయాల్లో కూడా తీసుకోదగ్గవి ఉంటే మనస్ఫూర్తిగా స్వీకరించాలని, వాటిని పాజిటివ్‌గా తీసుకోవాలని అధికారులకు సూచించడం.. ఆయన వ్యవహార శైలిలో భాగం. విపత్తు సమయాల్లో అసహాయులైన వారికి ప్రభుత్వం నుంచి సహాయం అందించేలా సీఎం మెరుపు వేగంతో స్పందించడం గురించి పలుమార్లు అధికారులు గుర్తు చేస్తుంటారు. ఒంటరిగా భోజనం చేయడం అరుదు మధ్యాహ్నం లంచ్ సమయంలో కూడా ఆ సమయం వృథా కాకుండా సీనియర్ అధికారులతోనో లేదా పారీ్టకి చెందిన నాయకులతోనో కలిసి భోజనం చేస్తూ అనేక విషయాల మీద మాట్లాడతారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకల్లా కార్యాలయానికి వచ్చి.. పాలనా విధుల్లో నిమగ్నమవుతారు. సాయంత్రం దాదాపు 7 గంటల వరకూ కార్యాలయంలో ఉంటారు. తిరిగి ఇంటికి వెళ్లిన సందర్భంలో కూడా ఒకరిద్దరు కార్యదర్శులు, సీనియర్ అధికారులు వెంటవెళ్తారు. ఈ సమయంలో మరో గంటన్నరసేపు ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చలు ఉంటాయి. రోజు వారీ విధులు ముగించిన తర్వాత ఒక ఆలోచన వచ్చినా, లేక టీవీల్లో రాష్ట్రానికి సంబంధించి ఏదైనా వార్తను చూసినా, ఇంగ్లిషు ఛానళ్లలో కొత్త అంశాలు వచ్చినా.. అప్పటికప్పుడు స్పందించి ఆయన అధికారులకు, పార్టీ నాయకులకు మార్గనిర్దేశం చేస్తారు. తగిన ఆదేశాలు కూడా జారీ చేస్తారు. రాత్రి ఎంత లేటైనా, ఎంత అలసట ఉన్నా తిరిగి తెల్లవారుజామున 4 గంటలకు ఆయన దినచర్య ప్రారంభిస్తారు. ప్రభుత్వానికి మనసు ఉండాలి ప్రభుత్వానికి మనసు ఉండాలని అధికారులకు పదేపదే చెప్తారు ముఖ్యమంత్రి. అలాంటి మనసుతో ఆలోచించినప్పుడే పేదల కష్టాలను తీర్చగలమని తరచుగా అంటుంటారు. ఈ ప్రభుత్వ పాలనకు ప్రధానమైన పునాది ఉందంటే అది మానవత్వమేనంటూ అధికారుల్లో నిరంతరం స్ఫూర్తి నింపుతారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక బాలుడికి జీన్ థెరపీ అవసరం అని, దానికోసం కనీసంగా రూ.50 లక్షలు ఖర్చు చేయాలని అధికారులు ప్రతిపాదించినప్పుడు ఏం చేద్దామని ఆయన ప్రశ్నించినప్పుడు.. అంత ఇవ్వలేమని అధికారులు బదులిచ్చారు. ప్రజలచేత ఎన్నుకోబడ్డ మనం ప్రజలకు అంత కష్టం వచ్చినప్పుడు, ఆలోచిస్తూ నిబంధనల సాకు చూపించడం అత్యంత అమానవీయం అని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ప్రభుత్వంగా మనం తప్పక సహాయం చేయాలని నిర్దేశించారు. అటు విశాఖలో పాలిమర్స్ ఘటన అయినా, బోటు ప్రమాదాలు అయినా, ప్రమాదాలు సంభవించినా, చివరకు మొన్నటి తుపానులో కానిస్టేబుల్ విధి నిర్వహణలో మరణించినా.. వైఎస్ జగన్ అత్యంత మానవీయతను చూపిస్తూనే ఉన్నారు. పేదల బాగు కోసం ఉన్న వ్యవస్థలను మార్చడానికైనా, బడ్జెట్లు దాటడానికైనా, నిబంధనలను తిరిగి రాయడానికైనా వెనుకాడని తత్వం ఆయన సొంతం. నాన్చడం తెలియదు జగన్ పరిపాలనా వ్యవహారాలను దగ్గరగా చూస్తే కొన్ని అంశాల్లో వినూత్నత కనిపిస్తుంది. సాధారణ రాజకీయ నాయకుడు మాదిరిగా ప్రతి అంశాన్ని నాన్చి మూలన పడేసే తత్వానికి ఆయన చాలా దూరం. ఏ విషయం మీద కూర్చున్నా దాని మూలాల వరకూ వెళ్తారు. అవసరమైతే మరింత ఆలోచన కోసం మరి కొంత సమయం వెచ్చిస్తారు. తన ఆలోచన మీద సంబంధిత అధికారులు, నిపుణులతో లోతైన చర్చ చేస్తారు. పూర్తిగా అవగతమైన తర్వాత కార్యాచరణకు దిగుతారు. అమలులో ఇబ్బందులొస్తే వెనక్కి తగ్గడం, వాయిదా వేయడం చేయకుండా, మరింత పట్టుదలతో ముందడుగు వేయడం ఆయన నైజం. విద్య, వైద్యం ప్రజలకు నాణ్యంగా అందించాలని తపన విద్యలో నాణ్యత, ప్రజలకు అందించే వైద్య సేవల్లో నాణ్యత ఉండాలని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పడిన తపనను అధికారంలోకి రాగానే ఆచరణలోకి తీసుకొచ్చారు. ఈ రెండు రంగాల్లో నాడు–నేడు అలా పుట్టుకొచ్చిన కార్యక్రమాలే. అత్యంత భారంగా మారిన విద్య, వైద్యాన్ని విప్లవాత్మక సంస్కరణల ద్వారా ప్రజలకు ఒక హక్కుగా అందించడంతోపాటు, జనాభాలో మెజార్టీ ప్రజలు ఆధారపడే వ్యవసాయ అనుబంధ రంగాలతోపాటు, పారిశ్రామిక–ఉపాధి రంగాన్ని పటిష్టం చేయడానికి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో సీఎం ఒక యజ్ఞమే చేశారు. జిల్లాల్లో పర్యటనలు లేని సమయంలో ఎక్కువ సమయం ఈ అంశాలకు సంబంధించిన వ్యవస్థలను పరుగులెత్తించడంపైనే ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. క్రమం తప్పకుండా ఆయా శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడం, వారికి లక్ష్యాలు నిర్దేశించడం, మరుసటి సమీక్షా సమావేశాలకల్లా వాటిలో ప్రగతిని సమీక్షించడం సీఎం ప్రాధాన్యతగా పెట్టుకున్నారు. కాబట్టే ఈ నాలుగున్నరేళ్లు సాగిన సమీక్షల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయడం కూడా జరిగాయి. ప్రతి సమీక్ష ఒక సమస్యకు పరిష్కారాన్ని సాధించేలా సాగింది. తాను చేయాల్సిన పనులు, దృష్టి పెట్టాల్సిన అంశాలు కూడా తన జేబులో ఉన్న చిన్న పుస్తకంలో సీఎం ఇప్పటికీ రాసుకుంటారు. వాటిని తప్పనిసరిగా ఫాలో అప్‌చేసి ఫలితాలు సాధించే వరకూ ఆయన నిద్రపోరు. హడావిడి లేకుండా సాఫీగా, సజావుగా సత్వర ఫలితాలను సాధించాలనే శైలి ఆయనది. ఆదేశాల్లో స్పష్టత అధికారులకు స్థిరమైన బాధ్యతలు అప్పగించడం, అందులో కూడా స్పష్టత ఉండడం ముఖ్యమంత్రి జగన్ పాలనా తీరుకు అద్దం పడుతుంది. అధికారులు ఎవరైనా వారిలో పూర్తి సామర్థ్యాలను వెలికితీసి, లక్ష్యాల దిశగా అడుగులు వేయించడం సాధ్యమవుతుందని ఆయన బలంగా విశ్వసిస్తారు. నాయకుడిగా ఆయనకున్న వ్యక్తిత్వం అధికారుల నుంచి ఉత్తమ పనితీరును రాబట్టుకోగలిగింది. ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరించడం, వారి అభిప్రాయాలను పూర్తిగా వినడం, బాధ్యతలను పూర్తిగా అప్పగించడం, సమిష్టి తత్వాన్ని పెంపొందించడం.. ఇలా అధికారుల పట్ల ఆయన వ్యవహరించే తీరుకు ప్రశంసలు దక్కాయి. అందుకే విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన శాఖాధిపతులు చాలా వరకు సుదీర్ఘకాలంగా అదే స్థానాల్లో ఉండి సేవలు అందించారు. ఇప్పుడూ కొనసాగుతున్నారు. కీలక ఘటనలు 02.09.2009: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం 09.04.2010: పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఓదార్పుయాత్ర ప్రారంభించిన వైఎస్ జగన్ 29.11.2010: ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు, కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మలు రాజీనామా 12.03.2011: ఇడుపులపాయలో మహానేత వైఎస్ సమాధి వద్ద వైఎస్సార్సీపీ పతాకం ఆవిష్కరణ.. పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటన 13.05.2011: కడప లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వైఎస్ జగన్ 5,46,673 ఓట్ల రికార్డు మెజార్టీతో ఘన విజయం. పులివెందుల శాసనసభ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వైఎస్ విజయమ్మ 81,373 ఓట్ల రికార్డు మెజార్టీతో విజయభేరి. 27.05.2012: టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై పెట్టిన కేసుల్లో దర్యాప్తు కోసమని ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్ జగన్‌ను పిలిచి, అరెస్టు చేసిన సీబీఐ 14.06.2012: 19 శాసనసభ నియోజకవర్గాలకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో 17 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయభేరి, ఒక లోక్‌సభ స్థానంలో వైఎస్సార్సీపీ విజయం 24.09.2013: అక్రమ కేసుల్లో జైలు నుంచి బెయిల్‌పై వైఎస్ జగన్ విడుదల 05.10.2013: రాష్ట్ర విభజనను నిరసిస్తూ.. సమైక్య రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తూ లోటస్ పాండ్‌లో ఆమరణ దీక్ష 18.12.2013: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ లోక్‌సభలో వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం 16.5.2014: సాధారణ ఎన్నికల ఫలితాల ప్రకటన.. 67 శాసనసభ స్థానాల్లో.. 8 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం.. కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరం 20.06.2014: శాసనసభలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌కు గుర్తింపు 25.10.2017: అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైఎస్ జగన్ 06.11.2017: ఇడుపులపాయలో ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభం 09.01.2019: 3,648 కి.మీ.లు సాగిన పాదయాత్ర ఇచ్ఛాపురంలో ముగింపు 23.05.2019: రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం 30.05.2019: రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం -
ఇదీ.. జగన్ కమిట్మెంట్
ఒకపక్క.. రోజుకు వంద రూపాయల సంపాదన కూడా లేక.. కనీస అవసరాలని చెప్పే తిండి, ఇల్లు, దుస్తులకు కూడా నోచుకోని జనం లెక్కించలేనంత మంది. మరోపక్క.. రోజుకు లక్ష రూపాయలు సైతం గ్యాంబ్లింగ్‌లో పోగొట్టుకుని చింతలేకుండా గడిపేసే శ్రీమంతులూ లెక్క లేనంతమంది. ఇదీ.. మన సమాజంలో ఉన్న విభజన. నానాటికీ పెద్దదవుతున్న ఈ రేఖ చెరిగేంతవరకూ అభివృద్ధి చెందిన దేశంగానో, రాష్ట్రంగానో మారటం అసాధ్యం. కనీస అవసరాలు తీర్చుకోలేని కోట్లాది మందిని విడిచిపెట్టేస్తే ఆ అభివృద్ధికి అర్థం ఉండదు. ఆ అభివృద్ధిలో వాళ్లకూ వాటా ఉండాలి. ఆ స్థాయికి వాళ్లను తీసుకురావాలి. వాస్తవానికి సంక్షేమ పథకాల పరమార్థం ఇదే. ఇపుడు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తున్నది ఆ అభివృద్ధే. చదువుతోనే తలరాత మారుతుంది దీన్ని మనసావాచా నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కాబట్టే తన పిల్లలిద్దరినీ టాపర్లుగా నిలబెట్టగలిగారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకూ సరైన విద్యనందించాలన్న ఉద్దేశంతోనే మేనిఫెస్టోలో ‘అమ్మ ఒడి’ని ప్రతిపాదించారు. చేతిలో డబ్బుల్లేక చిన్న పిల్లల్ని సైతం కూలికి పంపే పరిస్థితిని మార్చాలన్నదే దీనివెనకున్న ఆలోచన. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దీన్ని ఆచరణలోకి తెచ్చారు. ఆశించినట్టే ‘అమ్మ ఒడి’ ఊతంతో పిల్లలు బడి బాట పట్టారు. మరి ఇది సరిపోతుందా? ఇదిగో.. ఈ ఆలోచనే విద్యారంగంలో పెను సంస్కరణలకు బీజం వేసింది. స్కూళ్లకొచ్చే పిల్లల కడుపు నిండితేనే చదువు ఒంట బడుతుందన్న ఆలోచన.. పౌష్టికాహారంతో కూడిన ‘గోరుముద్ద’కు ప్రాణం పోసింది. బళ్లు తెరిచిన ఆరు నెలలకు కూడా పుస్తకాలు అందకపోతే పిల్లలెలా చదువుతారు? ఎవరి స్థాయిని బట్టి వారు దుస్తులు, బ్యాగులతో వస్తే.. ఒకరు షూ వేసుకుని, మరొకరు చెప్పులు లేకుండా వస్తే అంతా ఒక్కటేనన్న భావన ఎందుకొస్తుంది? వీటన్నిటికీ సమాధానమే.. స్కూళ్లు తెరవటానికి ముందే ప్రతి విద్యార్థికీ అందుతున్న ‘విద్యా కానుక’. సరే! మరి స్కూళ్లో? తమ వారి ప్రయివేటు ప్రయోజనాల కోసం గత ప్రభుత్వాలు వాటిని చిత్రవధ చేసి చంపేశాయిగా? ఆడపిల్లలు టాయిలెట్ కోసం ఇంటికెళ్లాలి. సరైన గదుల్లేవు. బెంచీలు, బ్లాక్ బోర్డులు అన్నీ అంతంతే! ఎందుకెళ్లాలి?... అనిపించేలా ఉన్నాయి మన బడులు. వీటిని మార్చాలనుకున్నారు జగన్. అందుకే.. ‘నాడు–నేడు’ పేరిట ఓ యజ్ఞాన్ని ఆరంభించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ కార్పొరేట్ స్కూలుకు దీటుగా సౌకర్యాలతో తీర్చిదిద్దారు. వేల కోట్లు ఖర్చు చేయాల్సి రావటంతో.. దశల వారీగా ఈ యజ్ఞాన్ని పూర్తి చేస్తున్నారు. స్కూళ్లకు వస్తున్నారు. భోజనం, దుస్తులు ఓకే. స్కూళ్లూ మారాయి. మరి చదువో! మన పిల్లలు పోటీ పడాలంటే ఇంగ్లిష్ రావాలి. వస్తేనే రాణించగలరు. అంతర్జాతీయంగానూ పోటీ పడగలరు. అందుకే ప్రయివేటు స్కూళ్లకు మల్లే ప్రీప్రయిమరీ–1,2 తరగతులు వచ్చాయి. ఆది నుంచే ఇంగ్లిష్ మీడియంలో బోధన మొదలయింది. ఇలాగైతే ప్రయివేటు స్కూళ్లకు ఎవరూ రారు కనక.. మాతృభాషపై మమకారం లేదంటూ, ఇంగ్లీషు చదువులు వద్దంటూ మాఫియా గాళ్లంతా కలిసి మాయా యుద్ధానికి దిగారు. కేసులు వేశారు. అయినా సరే.. జగన్ సంకల్పం గట్టిది కావటంతో ఇంగ్లీషు మీడియం వచ్చింది. ఇప్పుడు చాలా మంది పిల్లలు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడుతుండటం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అక్కడితో ఆగలేదు జగన్.అగ్రశ్రేణి కార్పొరేట్ స్కూళ్లలోనే దొరికే ఎడ్యుటెక్ కంటెంట్‌ను దిగ్గజ సంస్థ ‘బైజూస్’ ద్వారా మన పిల్లలకూ అందుబాటులోకి తెచ్చారు. ఏటా 8వ తరగతి పిల్లలకు శాంసంగ్ ట్యాబ్‌లనూ అందజేస్తున్నారు. మిగిలిన తరగతుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్‌ను (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేస్తున్నారు. డిజిటల్ క్లాస్రూమ్లనూ అందుబాటులోకి తెస్తున్నారు. దీన్ని బట్టి తెలిసేది ఒక్కటే. పిల్లల చదువుపై సీఎం జగన్‌కు అంతులేని నిబద్ధత ఉంది. చదివించటం ద్వారా వారి రాతలను మార్చాలన్న తపనతో.. యావత్తు విద్యా రంగాన్ని సమూలంగా సంస్కరించటం మొదలెట్టారు. ఇదంతా చేసింది జస్ట్ నాలుగున్నరేళ్ల వ్యవధిలోనే! వైద్యం.. ప్రతి ఒక్కరి హక్కు.. చదువుకైనా.. సరైన వైద్యం చేయించుకోవటానికైనా పేదరికం అడ్డు కాకూడదని, వైద్యం కోసం అప్పులపాలు కాకూడదని జగన్ భావించారు. అందుకే.. వెయ్యి రూపాయలు దాటిన ఏ వైద్యానికైనా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తానని మేనిఫెస్టోలో చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక దాన్ని అమల్లోకి తెచ్చారు. ఆరోగ్య సేవలకు అదొక బీజం మాత్రమే. అక్కడి నుంచి మొదలుపెడితే.. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ అంచెలంచెలుగా విస్తరిస్తూ పోయింది. ఆసుపత్రులన్నీ స్కూళ్ల మాదిరే ‘నాడు–నేడు’ కింద కొత్త రూపాన్ని, కొత్త సౌకర్యాలను సంతరించుకున్నాయి. ఎక్కడా ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా వైద్యులు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు... ఇలా ప్రతి పోస్టూ భర్తీ చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యుల భర్తీతో పాటు.. అత్యాధునిక పరికరాలనూ తీసుకొచ్చారు.యావత్తు ప్రపంచంతో పాటు రాష్ట్రాన్ని కూడా కోవిడ్ వణికించినపుడు వీళ్లంతా కలిసి వలంటీర్ల సాయంతో ఎంత అద్భుతం చేశారన్నది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇతర రాష్ట్రాల్లో ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితుల్లో పొరుగు రాష్ట్రాల నుంచి సైతం ఇక్కడికి వచ్చి, సంరక్షణ కేంద్రాల్లో ఉచితంగా చికిత్స తీసుకుని వెళ్లారంటే.. అది రాష్ట్రంలో వైఎస్ జగన్ అమల్లోకి తెచ్చిన పక్కా వ్యవస్థ వల్లేనన్నది కాదనలేని నిజం. అంతేకాదు.. గ్రామ స్థాయి నుంచీ వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తూ వచ్చారు. ఏకంగా 1,405 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏర్పడ్డాయి. ప్రతి చోటా వైద్యులొచ్చారు. ఉచిత మందులు అందుబాటులోకి వచ్చాయి. వీటన్నిటికీ తోడు విదేశాల్లోనే కనిపించే ‘ఫ్యామిలీ డాక్టర్’... మన ఊళ్లలో ప్రతి ఇంటికీ అందుబాటులోకి వచ్చారు.రాష్ట్రంలో ఇపుడు నిరుపేదలందరికీ కావాలనుకున్న వెంటనే సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అపాయింట్మెంట్.. అదీ ఉచితంగా దొరుకుతోందంటే.. అదే వైఎస్ జగన్ విజన్. పరిస్థితులు మారి... కొన్ని చికిత్సలకు వ్యయం ఎక్కువవుతోందని గ్రహించటంతో ఇపుడు ఆరోగ్య శ్రీ చికిత్సకయ్యే ఖర్చును ఏకంగా రూ.25 లక్షల వరకూ ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రతి చికిత్సా ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చేలా చికిత్స ప్రకిరయలను సైతం 1,059 నుంచి 3,257కి పెంచారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించే నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్యను 820 నుంచి 2,513కి పెంచారు. నాలుగున్నరేళ్లలో ఇవన్నీ చేయాలంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి మరి! ఇదీ వ్యవ‘సాయం’ అంటే.. దేశానికి రైతే వెన్నెముక. వైఎస్సార్ వారసుడిగా దీన్ని బలంగా నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఏడాదికి రెండుసార్లు పంట వేసే ముందు రైతుకు పెట్టుబడిగా రూ.12,500 చొప్పున ఇస్తామని భరోసా ఇచ్చారు. దాన్ని మరో రూ.వెయ్యి పెంచి కోవిడ్ కష్టకాలంలోనూ ఆపకుండా మరీ అమల్లోకి తెచ్చారు. నిజానికి రైతుకు ఏం చేసినా తక్కువే. ఎంత చేసినా తక్కువే. అందుకే గ్రామ స్థాయిలోనే రైతులకు అన్ని సేవలూ అందించే ఓ బలమైన వ్యవస్థను సృష్టించాలని సంకల్పించారు. రైతు భరోసా కేంద్రాలకు ప్రాణం పోశారు. రైతు ఎదుర్కొంటున్న కష్టాలన్నిటికీ ఇది వన్‌స్టాప్ పరిష్కారంగా ఉండాలని భావించారు.నకిలీ విత్తనాల బారిన పడకుండా ఇక్కడే సర్టిఫైడ్ విత్తనాలు, పురుగు మందులు దొరుకుతాయి. భూసార పరీక్ష కేంద్రాల నుంచి పండిన పంటను నిల్వ చేసుకునే గిడ్డంగులు, ఆఖరికి ఖాతాలో పడ్డ నగదును డ్రా చేసుకునేందుకు ఏటీఎంలు కూడా కొన్నిచోట్ల ఆర్బీకేలలోనే అందుబాటులోకి వచ్చాయి. ఇపుడు ఆర్బీకే అనేది ఓ బలమైన ప్రభుత్వ వ్యవస్థ. రైతును విత్తు నుంచి పండిన పంటను విక్రయించుకునేదాకా చేయిపట్టి నడిపించే అమ్మ, నాన్న.. అన్నీ. మనసు మంచిదైతే ప్రకృతి కూడా సహకరిస్తుందనేది ఎంత నిజమో ఈ నాలుగున్నరేళ్ల వైఎస్ జగన్ పాలనలో ప్రస్ఫుటమైంది. సువిశాల కోస్తా తీరం కారణంగా కొన్నిసార్లు తుపాన్లు దెబ్బతీసినా.. తట్టుకుని రోజుల వ్యవధిలోనే బయటపడే వ్యవస్థను ఏర్పాటు చేశారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికీ అతివేగంగా సాయం అందించటంతో పాటు ప్రతి ఎకరాకూ ఉచితంగా ప్రభుత్వమే బీమా చేయించటం, ఒక సీజన్లో జరిగిన నష్టానికి మళ్లీ ఆ సీజన్ రాకముందే పరిహారాన్ని అందించటం.. ఏ సీజన్లో జరిగిన నష్టానికి ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీని అందించటం.. ఇలా ప్రతిదీ నెరవేర్చేలా ‘ఈ–క్రాప్’ ద్వారా ఆర్బీకేల చుట్టూ ఓ బలమైన వ్యవస్థను సృష్టించారు. ఇదీ విజన్ అంటే. వికేంద్రీకరణకు కొత్త అర్థం వృద్ధులకు, దివ్యాంగులకు ప్రభుత్వమిచ్చే పింఛన్లంటే ఇదివరకు ఓ మహా ప్రహసనం. పట్టణాల్లోనైతే బ్యాంకుల ముందు పడిగాపులు. పల్లెల్లోనైతే ఇచ్చే వ్యక్తి ఏ రోజున వస్తాడో తెలియని దైన్యం. అసలే వాళ్లు వృద్ధులు, దివ్యాంగులు. అలాంటి వారికిచ్చే సాయమేదైనా వారికి సాంత్వన కలిగించాలి తప్ప ఇబ్బంది పెట్టకూడదు కదా? ఇదిగో.. ఈ ఆలోచనతోనే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ వలంటీర్ల సైన్యాన్ని సృష్టించారు. ప్రతినెలా ఒకటవ తేదీన ఠంచనుగా ఇళ్లకు వెళ్లి సామాజిక పింఛన్లు అందజేయటం ఈ సైన్యం బాధ్యత. ఆ తరవాత..! ఆ వలంటీర్లు మరిన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగమయ్యారు.పథకాలను లబ్ధిదారులకు చేరువ చేశారు. ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీరు. ప్రభుత్వానికి – ఆ గడపలకు తనే సంధానకర్త. సూక్ష్మ స్థాయిలో వికేంద్రీకరణ ఫలితాలను కళ్లకు కట్టిన వలంటీర్ల మాదిరే... గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు చేరువ చేయడానికి వలంటీర్లయితే... ప్రభుత్వాన్ని గ్రామ స్థాయికి చేర్చేది గ్రామ సచివాలయాలు. అవసరమైన సర్టిఫికెట్ల నుంచి స్థానికంగా కావాల్సిన సేవలూ అక్కడే. ఈ వ్యవస్థ ఆలోచనతో ఏకంగా లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి. అవినీతికి, లంచాలకు ఆస్కారం లేకుండా యువత ఉన్న ఊళ్లోనే ఉద్యోగాలు తెచ్చుకుని కొలువుల్లో స్థిరపడింది. అక్కడితో ఆగకుండా గ్రామాల్లో రైతుల కోసం ఆర్బీకేలు, వైద్య సేవల కోసం పీహెచ్‌సీలు నిర్మించి, యావత్తు గ్రామ వ్యవస్థను బలోపేతం చేశారు జగన్. అందుకే ఇపుడు పల్లెల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి. పల్లెల నుంచి వలసలు తగ్గాయి. ఒక బలమైన ఆలోచన... దాని ద్వారా మరింత మంచి చేయాలన్న తపన... ఈ రెండూ ఉంటే ఎంతటి అద్భుతమైన వ్యవస్థలను నిర్మించవచ్చో చేసి చూపించారు జగన్. అందుకే ప్రతి రాష్ట్రం ఇప్పుడు మన రాష్ట్రం వైపు చూస్తోంది. ♦ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.2,43,958.04 కోట్లు♦ లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి రెండు మూడు పథకాల ద్వారా లబ్ధి) 8,29,81,601♦ డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.4,11,488.99 కోట్లు♦ నాన్ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.1,67,530.95 కోట్లు♦ లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి రెండు మూడు పథకాల ద్వారా లబ్ధి) 4,44,04,251♦ డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి 2, 3 పథకాల ద్వారా లబ్ధి) 12,73,85,852-రమణమూర్తి మంథా -
చదువుకోవడం కష్టమేనా.. విదేశీ విద్యార్ధులకు భారీ షాకిచ్చిన కెనడా!
జీవన వ్యయం పెరిగిపోతున్న తరుణంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇతర దేశాల నుంచి కెనడాలో చదువుకునేందుకు వచ్చే విద్యార్ధుల డిపాజిట్ మొత్తాన్ని భారీగా పెంచారు. ప్రస్తుతం ఆ మొత్తం 10వేల డాలర్లు (రూ.6.14లక్షలు) ఉండగా దాన్ని ట్రూడో ప్రభుత్వ 20,635 డాలర్లు (రూ.12.7లక్షల)కు పెంచింది. జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. తాజా కఠిన నిర్ణయంతో భవిష్యత్‌లో కెనడాలో చదుకోవాలనుకునే విద్యార్ధుల భవిష్యత్ మరింత ఆందోళన కరంగా మారింది. సాధారణంగా భారతీయ విద్యార్ధులు కెనడాకు వెళ్లాలంటే..వారి బ్యాంక్ బ్యాలెన్స్ కనీసం రూ.6.14 లక్షలు ఉండాలి. అలా ఉంటేనే కెనడాకు వచ్చిన తర్వాత ఉపాధి లేకపోయినా ఆర్ధిక ఇబ్బందులు ఉండవనే ఈ షరతు విధిస్తుంది. ఇలా కెనడాయే కాదు.. ఇతర దేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్ధులు ఆయా దేశాల్ని బట్టి డిపాజిట్ మొత్తాన్ని సంబంధిత వీసా అధికారులకు చూపించాల్సి ఉంటుంది. కెనడా రూ.6.14లక్షల డిపాజిట్ నిబంధనను 2000 నుంచి కొనసాగిస్తూ వచ్చింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ థ్రెషోల్డ్‌లో మార్పులు ఈ నేపథ్యంలో కెనడా కాస్ట్ ఆఫ్ లివింగ్ థ్రెషోల్డ్‌ను మారుస్తున్నామని, తద్వారా పెరిగిపోతున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇబ్బందుల నుంచి విద్యార్ధులకు ఉపశమనం కలుగుందని కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ అన్నారు. ఆర్ధిక ఇబ్బందులతో.. ఫుడ్ బ్యాంక్‌ల వైపు అద్దె చెల్లించలేక ఆర్ధిక సంక్షోభం పాటు ఆహారం కోసం ఫుడ్ బ్యాంక్‌ల వైపు మొగ్గు చూపుతున్నానే వార్తల నేపథ్యంలో కెనడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక్కడికి వచ్చే అంతర్జాతీయ విద్యార్థులకు తగిన వసతి కల్పించని విద్యాసంస్థలపై ఇమిగ్రేషన్, రెఫ్యూజెస్ అండ్ సిటిజన్ షిప్ కెనడా (ఐఆర్సీసీ) చర్యలు తీసుకోనుంది. విద్యా సంస్థలు ఎంతమందికి వసతి సౌకర్యం కల్పిస్తాయో.. ఆ మేరకే విద్యార్ధులకు అనుమతులు ఇస్తాయని తాము భావిస్తున్నట్లు మార్క్ మిల్లర్ పేర్కొన్నారు. ఓ రకంగా మంచికే వీటితోపాటు అంతర్జాతీయ విద్యార్థులు క్యాంపస్ బయట పని పరిమితిపై ఇచ్చిన మినహాయింపు (వారానికి 20 గంటల కంటే ఎక్కువ)ను వచ్చే ఏడాది ఏప్రిల్ 30వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కెనడాలో ఉన్నవారితోపాటు డిసెంబర్ 7నాటికి దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందన్నారు. -
ప్రణాళికతోనే కెరీర్ బంగారం
మనీష్ అరోరా (46) ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త. ఆయనకు 18 ఏళ్ల కుమార్తె ‘ఆద్య’ ఉంది. ఆమెను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించాలన్నది అరోరా కల. కుమార్తెకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. దీంతో ఆద్య రెండు నెలల క్రితమే యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్(చికాగో)లో సైకాలజీలో అండర్‌గ్రాడ్యుయేషన్ సీటు సంపాదించింది. అందుకు కావాల్సిన వ్యయాలను అరోరా ముందు చూపుతో సమకూర్చుకున్నారు. ఆద్య చదివే కోర్స్ వ్యయం భారీగా ఉన్న ప్పటికీ, ముందస్తు స్పష్టత అరోరాకు మార్గాన్ని చూపించింది. తమ పిల్లలకు వీలైనంతలో అత్యుత్తమ విద్యను అందించాలని అధిక శాతం మంది తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ, ఆచరణలో అంత సులభం కాదు. ప్రణాళికతోనే ఇది సాధ్యం. కెరీర్ ఆప్షన్లు, చేయాల్సిన కోర్స్‌లు, అయ్యే వ్యయం, కాల వ్యవధి ఇలా పలు అంశాలపై స్పష్టత, ప్రణాళికతోనే విజయం సాధించగలరు. దీనిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించే కథనమే ఇది. బోలెడు ఆప్షన్లు గతంతో పోలిస్తే ఉన్నత విద్యలో ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్ కోర్సులు చదవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు భిన్నమైన కోర్సులు ఎంపిక చేసుకుంటుంటే, విదేశీ విద్య కోసం వెళ్లే వారి సంఖ్య కూడా ఏటేటా పెరుగుతూ పోతోంది. ముఖ్యంగా నూతన తరం కోర్సులకు సంబంధించి కెరీర్ ఆప్షన్లు భారీగా అందుబాటులోకి వస్తున్నాయి. ఫైనాన్స్, డేటా అనలైటిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, కాగ్నిటివ్ సైన్స్, మెరైన్, సైకాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్ ఇవన్నీ ఆకర్షణీయమైన కెరీర్ ఆప్షన్లుగా మారుతున్నాయి. ‘‘గేమ్ డిజైనింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్)కు ఆదరణ పెరుగుతోంది. ఎక్కువ శాతం కెరీర్ ఆప్షన్లు సోషల్ మీడియా నుంచి ఉంటున్నాయి. వీడియో ఎడిటింగ్‌కు సైతం డిమాండ్ పెరుగుతోంది’’అని మ్నెమోనిక్ ఎడ్యుకేషన్ అండ్ ఓవర్సీస్ అడ్మిషన్స్ సంస్థ అధినేత శిరీష్ గుప్తా తెలిపారు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, డేటా సైన్స్, రెన్యువబుల్ ఎనర్జీ, కంటెంట్ తయారీ వంటివన్నీ బంగారం వంటి అవకాశాలను తెచ్చి పెడుతున్నాయి. ‘‘వచ్చే పదేళ్ల కాలానికి సంబంధించి 85 శాతం ఉద్యోగాలు ఇంకా ఆవిష్కృతం కావాల్సి ఉంది. సంప్రదాయ ఉద్యోగాల నుంచి నిరంతరం మారాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. టెక్నాలజీతో సంబంధం లేని ఉద్యోగం దాదాపు ఉండకపోవచ్చు. అది రిటైల్ అయినా లేక ఈ కామర్స్ అయినా కృత్రిమ మేథ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తుంది’’అని టీమ్‌లీజ్ ఎడ్యుటెక్ సహ వ్యవస్థాపకురాలు నీతి శర్మ తెలిపారు. అంటే సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగై పోతాయని అనుకోవద్దు. అస్థిరతలు వద్దనుకునే వారు ఇంజనీరింగ్, మెడిసిన్ వైపు వెళుతుండడాన్ని గమనించొచ్చు. ఇంజనీర్లు, డాక్టర్లు, పరిశోధకులు, చరిత్రకారుల అవసరం భవిష్యత్తులోనూ ఉంటుంది. కానీ, ఆటోమేషన్, ఏఐ కొన్ని రకాల ఉద్యోగాలకు ముప్పుగా మారడం ఖాయం. లోగో, గ్రాఫిక్ డిజైనింగ్ పనులు ఆటోమేషన్‌కు మారుతున్నాయి. ట్రాన్స్‌లేటర్లు, టెలీ మార్కెటర్ల ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తోంది. యంత్రాలు అంత సులభంగా చేయలేని నైపుణ్యాలు, కోర్సులను చేసే దిశగా పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని గుప్తా సూచించారు. విద్య, ఉపాధిలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడం, తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం సాయంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైతే మెరుగైన విద్యా అవకాశాల కోసం విదేశాలకు పంపించడాన్ని కూడా పరిశీలించాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొదటి పుట్టిన రోజు నుంచే.. పిల్లల ఉన్నత విద్యకు కావాల్సినంత సమకూర్చుకునేందుకు ఉన్న సులభ మార్గం వారి మొదటి పుట్టిన రోజు నుంచి ఆరంభించడమే. దీనివల్ల పెట్టుబడులు వృద్ధి చెందడానికి తగినంత సమయం మిగిలి ఉంటుంది. నెలవారీ పరిమిత మొత్తంతో పెద్ద నిధిని సమకూర్చుకోగలరు. ఇందుకు గాను ఫైనాన్షియల్ అడ్వైజర్, ఎడ్యుకేషన్ కన్సల్టెంట్‌ను ముందే సంప్రదించి తమకు అనుకూలమైన (తగిన) ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. కేవలం ఉన్నత విద్య అనే కాకుండా వారి వివాహాలకు సంబంధించి కూడా విడిగా ప్రణాళిక అవసరం. భారీ ఖర్చులకు సంబంధించి ముందు నుంచే ఇన్వెస్ట్ చేయడం వల్ల నెలవారీ బడ్జెట్‌పై పెద్ద భారం పడదు. పెట్టుబడుల్లో అధిక శాతాన్ని ఈక్విటీలకు కేటాయించుకోవాలి. 10–15 ఏళ్ల కాలంలో ఈక్విటీలు మెరుగైన రాబడులను ఇవ్వగలవు. కొంత మొత్తాన్ని హైబ్రిడ్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన (కుమార్తెలకు) వంటి సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవాలి. పిల్లల ఉన్నత విద్యకు మిగిలి ఉన్న కాల వ్యవధి, ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలి, ఎంత రాబడులు అనే అంశాల ఆధారంగా నిపుణులు వివిధ సాధనాలను సూచిస్తుంటారు. తమకు ఏదైనా జరగరానిది జరిగితే పిల్లల విద్య ఆగిపోకూడదు. అందుకని మెరుగైన కవరేజీతో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలాగే, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో పిల్లలను కూడా భాగం చేయడం, లేదంటే వారి పేరిట ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం ఎంతో అవసరం. స్కాలర్ షిప్/విద్యారుణం దేశ, విదేశీ యూనివర్సిటీలు చాలా వరకు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఆఫర్ చేస్తున్నాయి. యూనివర్సిటీ వెబ్సైట్లను సందర్శించి ఇందుకు సంబంధించి వివరాలు తెలుసుకోవచ్చు. విదేశాల్లోనూ చాలా యూనివర్సిటీలు స్కాలర్షిప్లు, ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. పేరొందిన ట్రస్ట్‌లు కూడా విద్యార్థులకు స్కాలర్షిప్లను ఆఫర్ చేస్తున్నాయి. ఒకవైపు తమ వంతు ఇన్వెస్ట్ చేస్తూనే, మరోవైపు స్కాలర్‌షిప్‌లకు సంబంధించి ఉన్న మార్గాలను తెలుసుకుని ఉండడం మంచిది. కొన్ని యూనివర్సిటీలు ప్రొఫెషనల్ డిగ్రీలకు అనుబంధంగా అప్రెంటిషిప్ అవకాశం కలి్పస్తున్నాయి. దీనివల్ల ప్రత్యక్ష అనుభవంతోపాటు కొంత ఆర్థిక మద్దతు లభించినట్టు అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు యూనివర్సిటీ కోర్సులకు అప్రెంటిషిప్ ప్రోగ్రామ్‌లు అనుబంధంగా ఉన్నాయి. ఉన్నత విద్యా కోర్సులకు సరిపడా సమకూర్చుకోలేని వారు విద్యా రుణాన్ని కూడా పరిశీలించొచ్చు. చిన్న మొత్తం అయితే ఎలాంటి ష్యూరిటీ అవసరం పడదు. పెద్ద మొత్తంలో రుణం తీసుకునేట్టు అయితే ఆస్తుల తనఖా, గ్యారంటీలను బ్యాంకులు కోరొచ్చు. ఇందుకు కూడా ముందుగానే సిద్ధమవ్వాలి. విద్యా రుణాలపై వడ్డీ రేటు 9–15 శాతం మధ్య ఉంది. పిల్లల విద్య పూర్తయి, ఉద్యోగంలో చేరిన తర్వాత చెల్లింపులు చేసే ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. చాలా బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు కోర్సు ఫీజులో 80–90 శాతం వరకు రుణంగా ఇస్తున్నాయి. పిల్లలు చదువుకుంటూనే పార్ట్‌టైమ్ అవకాశాలను వినియోగించుకోవడం మరొక మార్గం. పెరిగిపోతున్న వ్యయాలు అధిక ద్రవ్యోల్బణం, ప్రత్యేకమైన కోర్సులకు డిమాండ్, ఇందుకు మెరుగైన వసతుల కల్పన కారణంగా దేశ, విదేశాల్లో కోర్సుల వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు రూ.50వేలకే పూర్తయ్యే ఎంబీఏ కోర్స్ నేడు రూ.5 లక్షలకు చేరడం ఇందుకు ఓ నిదర్శనం. ఐఐఎంలలో ఫీజులు రూ.17 లక్షల నుంచి రూ.24 లక్షల మధ్య ఉన్నాయి. గతంలో ఇవి రూ.6 లక్షల స్థాయిలోనే ఉండేవి. ఐఐటీలోనూ కోర్సు ఫీజు రూ.6–10 లక్షలకు చేరింది. గతంతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐఎం, ఐఐటీల్లో ఫీజుల పెరుగుదల 100 శాతానికి పైనే ఉంటోంది. విదేశాల్లోనూ ఫీజుల పెరుగుదల ఇదే మాదిరిగా ఉంటోంది. మరీ ముఖ్యంగా డాలర్ మారకం రేటు అధికంగా ఉండడం ఈ భారాన్ని మరింత పెంచుతోంది. ‘‘దశాబ్దం క్రితం విదేశాల్లో ఏడాది విద్యా వ్యయాలు రూ.25–30 లక్షల మధ్య ఉండేవి. ఇప్పుడు రూ.50 లక్షలకు చేరాయి’’అని గుప్తా తెలిపారు. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఫీజు దశాబ్దం క్రితం రూ.కోటి స్థాయిలో ఉంటే, ఇప్పుడు అది రెట్టింపైంది. కేవలం ట్యూషన్ ఫీజుల వల్లే కాకుండా, జీవన వ్యయాలు కూడా పెరిగిపోవడం ఈ భారాన్ని మరింత పెంచుతోంది. కాకపోతే విదేశీ విద్యకు సంబంధించి నూరు శాతం స్కాలర్షిప్ పొందే అవకాశం కాస్త ఊరటనిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ అవకాశం సొంతం చేసుకోవాలంటే విదేశీ విద్యా ప్రవేశానికి మూడేళ్ల ముందు నుంచే తమ ప్రొఫైల్‌పై పని చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ‘‘నూతనతరం కోర్సులు అయితే సాధారణంగా ఏటా రూ.5–10 లక్షల మధ్య ఫీజు ఉంటుంది. ఢిల్లీలోని పెర్ల్ అకాడమీలో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ యూఐ/యూఎక్స్ (యూజర్ ఇంటర్ఫేజ్/యూజర్ ఎక్స్‌పీరియెన్స్) కు ఏటా రూ.7 లక్షల ఫీజు ఉంది’’అని గుప్తా వెల్లడించారు. కోర్సుకు సంబంధించి ట్యూషన్ ఫీజు కేవలం ఒక భాగమే. పిల్లల వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాల పెంపు కోసం తల్లిదండ్రులు అదనంగా ఖర్చు చేయక తప్పదు. కాలం చెల్లిన కరిక్యులమ్ నేపథ్యంలో, పిల్లలకు సమాంతరంగా నైపుణ్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాస అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉంటుందని గుప్తా అంటున్నారు. తల్లిదండ్రులు ఉంటున్న ప్రదేశానికి దూరంగా, ప్రముఖ విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తే అప్పుడు వారి జీవనం కోసం మరింత వ్యయం చేయాల్సి వస్తుంది. ఇక విదేశాలకు పంపించే వారిపై ఈ భారం మరింత పెరుగుతుంది. వసతి, ఆహారం, లాండ్రీ, ఇంటర్నెట్, మొబైల్, వస్త్రాలు వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. జీవనం, రవాణా వ్యయాలు, యుటిలిటీలు (విద్యుత్, టెలిఫోన్), ఆరోగ్య సంరక్షణ, ఇతర అవసరాల కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయాల్సి వస్తుందని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అరిజిత్ సేన్ పేర్కొన్నారు. భయపెట్టే అంచనాలు చారిత్రకంగా చూస్తే గడిచిన దశాబ్ద కాలంలో కోర్సుల ఫీజులు నూరు శాతానికి పైగా పెరిగాయి. భవిష్యత్తులోనూ ఇదే తరహా పెరుగుదల ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ‘‘కోర్సుల ఫీజుల పెరుగుదల వచ్చే దశాబ్దం పాటు ఇదే మాదిరిగా ఉంటుంది. జీడీపీ 6 శాతం చొప్పున వృద్ధి చెందుతూ వెళితే, దీనికి అనుగుణంగా సగటున పెరిగే కుటుంబాల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే, విద్యా వ్యయం 10 శాతం చొప్పున పెరుగుతూ వెళ్లినా.. ఫీజులు, విద్యా రుణాలు భారంగా మారతాయి’’అని నీతి శర్మ పేర్కొన్నారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ వంటి ప్రత్యామ్నాయాల రూపంలో రవాణా, జీవన వ్యయాల వంటివి ఆదా చేసుకునే అవకాశం ఉందని శర్మ వివరించారు. ‘‘ప్రతిష్టాత్మక కాలేజీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ చేసేందుకు ఇప్పుడు ఏటా రూ.12–15 లక్షల వరకు ఖర్చవుతోంది. విద్యా ద్రవ్యోల్బణం 10–12 శాతం ఉంటుందన్న అంచనా ఆధారంగా వచ్చే పదేళ్లలో ఇది రూ.40 లక్షలకు చేరొచ్చు. ప్రైవేటు కాలేజీలో ఎంబీబీఎస్ డిగ్రీకి నేడు రూ.కోటి అవుతుంటే పదేళ్ల తర్వాత రూ.3 కోట్లు వ్యయం చేయాల్సి రావచ్చు’’అని అరిజిత్ సేన్ తెలిపారు. అనుసరణీయ మార్గాలు.. ఖరీదుగా మారుతున్న ఉన్నత విద్య కోసం తల్లిదండ్రులు ముందు నుంచే ప్రణాళికాయుతంగా వ్యవహరించడం ఎంతో అవసరం. కాలేజీ ప్రవేశానికి రెండేళ్ల ముందు నుంచే పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయతి్నంచాలి. విదేశాలకు పంపించేట్టు అయితే అక్కడి జీవన పరిస్థితులు, సంస్కృతి, దరఖాస్తు ప్రక్రియ, ఎదురయ్యే సవాళ్లపై అవగాహన తెచ్చుకోవాలి. కనుక ఈ విషయంలో నిపుణుల సాయం తప్పనిసరి. ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ చదువులకు సంబంధించి ప్రస్తుత వ్యయాలు. తమ పిల్లల ఉన్నత విద్యకు ఇంకా ఎన్నేళ్ల కాల వ్యవధి మిగిలి ఉంది? ఎలాంటి విద్యా సంస్థల్లో ప్రవేశాలు తీసుకోవాలి, అక్కడి ప్రస్తుత ఫీజులు, తమ పిల్లలు కాలేజీ ప్రవేశం పొందే నాటికి ఎంత మేర పెరగొచ్చనే విషయాలపై స్పష్టత అవసరం. దీనికి సంబంధించి ఎన్నో సంస్థలు సేవలు అందిస్తున్నాయి. కోర్స్ వ్యయం, ట్యూషన్ ఫీజు, జీవన వ్యయాలు, రవాణా వ్యయాలు, స్కాలర్షిప్ ఉన్న అవకాశాలు, మెరుగైన విద్యా సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే వివరాలను వారి నుంచి తెలుసుకోవచ్చు. మరీ ముఖ్యంగా పిల్లలు కాలేజీకి వచ్చే నాటికి వారి ఆసక్తులు ఎలా ఉంటాయన్నది ముందే గుర్తించడం అసాధ్యం. కనుక భవిష్యత్‌లో వారు ఏ కోర్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తారన్నది ముందుగా తెలియదు. అందుకని ఖరీదైన కోర్స్‌కు సంబంధించి సన్నద్ధం కావడం మంచిది. -
అణకువ
‘‘ఆకులందున అణిగి మణిగి కవిత కోకిల పలుకవలెనోయ్’’ అంటారు గురజాడ. తన ఘనతని తాను ప్రకటించుకోవటం కాక, ప్రతిభని అవతలి వారు గుర్తించాలి. కోకిల కనపడ నవసరం లేదు. దాని గుర్తింపు మధురమైన కంఠస్వరం మాత్రమే. కావాల్సిన వారు దానిని వెతుక్కోవాలి. ఎందుకంటే – రత్నాన్ని అన్వేషించాలే కాని, అది తనని తాను ప్రకటించుకోదు. ‘‘అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది. ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది.’’ అనే సామెత తెలుసు కదా! నిండు కుండ లాగా తొణకకుండా బెణకకుండా ఉండటం సమృద్ధికి, సంపదకి సంకేతం. అది ఉత్తమ వ్యక్తిత్వ లక్షణం. ఎగిరెగిరి పడకుండా, తన గొప్పని, లేదా తానే గొప్ప అని ప్రకటించుకుంటూ, ప్రదర్శించుకుంటూ ఉండక పోవటమే అణకువ. ఎందుకంటే ఎవరైనా ఒక రంగంలో గొప్ప అనుకుంటే, అదే రంగంలో అంతకన్న ఘనులు అప్పుడే కాని, తరువాత కాని ఉండచ్చు. కనక అహంకరించకూడదు. తన స్థాయి ఏమిటో తెలుసుకుని ఉండాలి. నీలో గొప్పతనం ఉంటే అది నువ్వు ప్రకటించుకోకూడదు. ఇతరులు గుర్తించాలి. ఎట్లా? ప్రవర్తన ద్వారా, మాట ద్వారా. తన గొప్పతనం తానే చెప్పుకున్న వాడు హాస్యాస్పదుడు అవుతాడు. అంతకన్న ముందు ఆయుః క్షీణం అని పెద్దలు చెప్పిన మాట. పైగా తనని తాను పొగడుకోవటం ఆత్మహత్యా సదృశం. మహాపాతకం. అంటే నివృత్తి లేని పరిహారం, ప్రాయశ్చిత్తం లేని పెద్ద పాపం. నోటితో చెప్పక పోయినా తమ ప్రవర్తన ద్వారా తామే చాలా ఘనులు, ఇతరులు పనికిరానివారు అనే అభిప్రాయం కలిగేట్టు ప్రవర్తిస్తారు కొందరు. అది వారి విద్యావిహీనత ను సూచిస్తుంది. విద్య వల్ల మొదట వచ్చేది వినయం. (విద్య యొసగును వినయంబు, వినయంబు వలన పాత్రత, పాత్రత వలన ధనం, ధనం వల్ల ఐహికాముష్మిక సంపదలు బడయు నరుడు) అంటే వినయం అన్నది విద్యావంతుల లక్షణం. వినయ విధేయతలు లేని వారు డిగ్రీలు ఉన్నా విద్యావంతులుగా పరిగణింపబడరు. చదువు ‘‘కొన్నవారు’’ మాత్రమే అవుతారు. ‘‘వస్త్రేణ, వపుషా, వాచా, విద్యయా, వినయేన చ నరో యాతి గౌరవం’’ గౌరవార్హతలలో ప్రధానమైన ఐదింటిలో వినయం కూడా ఒకటి. అలా ఒదిగి ఉండటం మనిషి గొప్పతనాన్ని ఏ మాత్రం తగ్గించదు. ‘‘అనువు గాని చోట అధికుల మనరాదు/ కొంచెముండు / టన్న కొదువ గాదు / కొండ అద్దమందు కొంచెమై ఉండదా? విశ్వదాభిరామ వినుర వేమ.’’ పరిస్థితులు అనుకూలం గా లేనప్పుడు కొంచెం తగ్గి ఉండటం శ్రేయస్కరం. ఎవరో నన్ను గుర్తించి గౌరవించలేదు అనుకుని కుంగిపోవటం, గుర్తింపు కోసం పాకులాడటం దుఃఖానికి అవమానాలకి హేతువు లవుతాయి. కాస్త తల ఒగ్గి అనుకూల పరిస్థితులు వచ్చాక మళ్ళీ తల ఎత్తవచ్చు. సముద్రంలో అలలు ఎగసి ‘పడుతూ’ ఉంటాయి. ఎగిరితే ఆకాశంలో ఉండలేము కదా! కింద పడక తప్పదు. పడకుండా ఉండాలంటే ఎగరకూడదు. ఎదగాలి. ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే పైకి క్రమం గా ఎక్కాలి. పైగా ఎత్తుకి వెళ్ళిన కొద్ది మరింత జాగ్రత్తగా ఉండాలి. నేల మీద ఉన్నప్పుడు పడితే చిన్న దెబ్బ. ఎంత ఎత్తునుండి పడితే అంత పెద్ద దెబ్బ. అణకువ తో ఉన్న వారి మీద పెద్దలకి వాత్సల్యం ఉంటుంది. వారి ఆశీస్సులు, సహాయ సహకారాలు ఉంటాయి. ఎంత ఒదిగితే అంత ఎదుగుతారు. – డా‘‘ ఎన్.అనంతలక్ష్మి -
ఏపీలో గొప్ప చర్యలు: కొలంబియా వర్సిటీ ప్రొఫెసర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్లోబల్ విద్యా విధానాన్ని అనుసరించడం, పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం గొప్ప విషయమని కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్, సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ డైరెక్టర్ జెఫ్రీ సాచ్ అన్నారు. ఐక్యరాజ్య సమితి సదస్సుకు హాజరైన ఏపీ విద్యార్థులు కొలంబియా యూనివర్సిటీలోని ఎస్డీజీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సులో కూడా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి జెఫ్రీ సాచ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యూఎన్ఓ స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్‌కుమార్ ఏపీ విద్యార్థులను జెఫ్రీ సాచ్‌కు పరిచయం చేశారు. ఆయన విద్యార్థుల కోసం కొంత సమయాన్ని కేటాయించి వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ విద్యార్థులు తమ కుటుంబ నేపథ్యాలను.. రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, విద్యా సంక్షేమ పథకాలు.. అవి పేద విద్యార్థుల ప్రగతికి ఎలా దోహదం చేస్తున్నాయో వివరించారు. ఏపీలో గొప్ప చర్యలు అనంతరం జెఫ్రీ సాచ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని ప్రతి బిడ్డా చదువుకోవాలని, ఆయా దేశాల ప్రభుత్వాలు విద్యకోసం అధిక నిధులు కేటాయించాలని ఆయన కోరారు. ప్రపంచవ్యాప్తంగా విద్యా సంస్కరణల కోసం తాను 25 ఏళ్లుగా పోరాడుతున్నానని, ఏపీలో గొప్ప చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా అమ్మ ఒడి, డిజిటల్ విద్య, ట్యాబ్స్ పంపిణీ, ఇంగ్లిష్ ల్యాబ్స్ ఏర్పాటు, టోఫెల్ శిక్షణపై ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. పిల్లలు ప్రతి ఒక్కరూ బడికి వెళ్లేలా చూడాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉందన్నారు. తన ఆకాంక్షలకు అనుగుణంగా పిల్లలను బడికి పంపించే తల్లుల అకౌంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నగదు జమ (అమ్మ ఒడి) చేయడాన్ని ప్రొఫెసర్ జెఫ్రీ అభినందించారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా విదేశాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం నూరు శాతం ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్న విషయాన్ని విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకు రాగా.. ఇది ఎంతో గొప్ప చర్యగా ఏపీ ప్రభుత్వాన్ని అభినందించారు. ఇప్పుడు వర్సిటీ వేదికపై ప్రసంగించిన విద్యార్థులంతా ఈ పథకం ద్వారా కొలంబియా యూనివర్సిటీలో చదువుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ పాల్గొన్నారు. ప్రపంచం మెచ్చిన మేధావి ప్రొఫెసర్ జెఫ్రీ సాచ్ ప్రొఫెసర్ జెఫ్రీ సాచ్ కొలంబియా యూనివర్సిటీలో అత్యున్నత అకడమిక్ ర్యాంక్ గల ప్రొఫెసర్ హోదాలో ఉన్నారు. వివిధ పుస్తకాలు రచించిన ఆయన టైమ్ మ్యాగజైన్లో 100 మంది అత్యంత ప్రభావవంతమైన ప్రపంచ నాయకుల్లో రెండుసార్లు పేరు పొందటంతోపాటు 42 గౌరవ డాక్టరేట్లను సైతం అందుకున్నారు. గతంలో హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా సేవలందించిన ఈయన కొలంబియా వర్సిటీలోని సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా విద్యా సంస్కరణల కోసం కృషి చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్స్ కోఫీ అన్నన్, బాన్ కీ మూన్తో పాటు ప్రస్తుత సెక్రటరీ జనరల్ అన్టోనియో గుటెరస్‌కు ప్రత్యేక సలహాదారుగా కొనసాగుతున్నారు. ప్రపంచ దేశాల అధినేతలు, ప్రధానులు గౌరవించే ప్రొఫెసర్ జెఫ్రీ సాచ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా సంస్కరణలను అభినందించడం విశేషం. -
ట్రంకుపెట్టె పిల్లలు
‘ఒరే మోహన్ గా! మన అమ్మలకి మనం పుట్టుండంరా! నిజంగా మనల్ని కనే ఉంటే మనల్ని రోజూ కళ్లెదురుగా సూసుకోకుండా ఉండగలుగుతారా! మనల్నిలాగా ఈ నరకంలో వదిలేసి ఎళ్లిపోగలుగుతారా?’... ఆరు నుంచి పది వరకు హాస్టల్లో ఉండే ప్రతి పిల్లాడు ఇలా ఎప్పుడో ఒకప్పుడు అనుకోకుండా ఉండడు. ఎదిగీ ఎదగని వయసులో హాస్టల్లో ఏదెలా ఉన్నా అక్కడ పూడ్చలేని వెలితి– తల్లితండ్రులు లేకపోవడం. అమ్మ గోరుముద్దలు, నాన్న ప్రేమపూర్వక గదమాయింపులు, శుభ్రమైన పక్కబట్టలు, రేడియో పాట, సయించే భోజనం, అన్నింటికి మించి భద్రమైన ఇంట్లో ఒళ్లెరుగకపోయే నిద్ర. ఇవేవీ హాస్టల్లో ఉండవు! పిల్లలు చదువుకోవడానికే పుట్టి ఉండవచ్చు. చదువుకోవడానికి మాత్రమే పుట్టలేదు. కాని చదువుకుంటే తప్ప పుట్టగతులు ఉండవు. తొమ్మిది నెలల తర్వాతే పిల్లలందరూ భూమ్మీద పడ్డా ఆ భూమిని బట్టి వారి అదృష్టం ఆధారపడి ఉంటుంది. అగ్రహారం అయితే ఒకలాగా, రెడ్ల ఇలాకా అయితే ఒకలాగా, కామందుల వీధైతే ఒకటి, శెట్టిగారి బజారైతే ఒకటి. ఇవి గాకుండా వేరే వీధులు, వెలివాడలు ఉంటాయి. ఆ భూమ్మీద పుట్టిన పిల్లలు తిండికి, చదువుకు గతి లేకపోతే ఇదిగో ఇలా ప్రభుత్వ హాస్టళ్లలో ఉండి చదువుకోవాలి. అమ్మను తిట్టుకోవాలి. ఆక్రోశించాలి. హాస్టల్లో ఉన్న కన్నబిడ్డను ఆదివారం వచ్చి చూసుకునే వీలు తల్లికి ఉంటుంది. అదీ ఇదీ వండుకొని, బిడ్డ కడుపుకు ఇంత తినిపించుకుని, తల దువ్వి, పేన్లు చూసి, ఒళ్లో పరుండబెట్టుకుని కబుర్లు చెప్పి, వదల్లేక వదల్లేక ఆ తల్లి పోతూ ఉంటే అప్పటికే ఔట్బెల్లు టైమైపోయిందని తల్లి కళ్ల ముందే కన్నకొడుకును నాలుగు పీకుతాడు హాస్టల్ బాధ్యుడు. అప్పుడు తల్లేమైనా భద్రకాళి అవుతుందా? నా కొడుకును ఈ బందీఖానాలో ఉంచను అని తీసుకెళ్లి పోతుందా? ‘మీరు కొట్టి సంపేత్తాకి కనలేదు సారు మేము బిడ్డల్ని. మా గచ్చంతరం బాగోక ఇక్కడొదిలేసాం’ అంటా నడుసుకుంటా ఎలిపోతుంది. ‘ప్రపంచం మొత్తాన్ని తెచ్చి క్లాస్‌రూమ్‌లో కుదించలేము. క్లాస్రూమ్నే ప్రపంచంలోకి తీసు కెళ్లాలి’ అని 1912లో జర్మనీలో మొదటి హాస్టల్‌ను మొదలెట్టాడు రిచర్డ్ షిర్మన్ అనే స్కూల్ టీచరు. విహారాలకు వెళ్లే పిల్లలు తక్కువ ఖర్చులో బస చేయడానికి వీలుండటం లేదని తన స్కూల్లోనే తొలి హాస్టల్ కట్టాడు. అతని వల్ల ప్రపంచమంతా యూత్ హాస్టల్సు, దరిమిలా రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చాయి. విషాదమేమంటే ఏ ఉద్దేశంతో రిచర్డ్ షిర్మన్ హాస్టల్స్ మొదలెట్టాడో దానికి పూర్తి విరుద్ధంగా ఏ విహారమూ లేని బందీఖానాలుగా అవి మారాయి. ‘అందరికన్నా ముందు పరిగెత్తి కంచం పట్టుకుని లైన్లో నిలబడ్డా. అన్నం డేక్షాలొచ్చేసున్నాయ్. పొప్పుది, సాంబారుది, మజ్జిగిది గిన్నిలొత్తే వడ్డన మొదలెట్టేత్తారు. అన్నం డేక్షా మీద మూత లేదేమో ఈగలన్నీ ఆల్నియ్. అన్నియ్యా ఈగలోల్తనాయ్ అని పిలిత్తే ఆ ఈగల్ని తోలకుండానే దాని మీద మూత పడేసాడు వర్కరు. పారిపోయే దారిలేక ఆ ఈగలందులోనే సచ్చి అన్నంలో కలిసి పోనియ్. కంచంలో ఏత్తే హస్తానికో ఈగ పడింది నా కంచంలో’.... పాత భవనాలు, పెచ్చులూడిపోయే సీలింగులు, ఊరికి దూరంగా మనిషి అలికిడి లేని బీడు పరిసరాలు, సరిపోని నీళ్లు, కడుపులో దేవే పాయిఖానాలు, అపరిశుభ్ర ఆహారం, దుప్పట్లు ఇవ్వని చలికాలం, తప్పని తీట.. తామర, చీటికి మాటికి ఘోరంగా చావగొట్టే సిబ్బంది, ముళ్లతీగల ఫెన్సింగ్.... ఇవీ కొన్ని చోట్ల సంక్షేమ హాస్టళ్లు. తెలుగు సాహిత్యంలో హాస్టల్ లైఫ్ చెదురు మదురుగా కనిపిస్తుంది. నవీన్ ‘అంపశయ్య’, కేశవ రెడ్డి ‘సిటీ బ్యూటిఫుల్’, కొమ్మూరి వేణుగోపాలరావు ‘హౌస్ సర్జన్’, వడ్డెర చండీదాస్ ‘అనుక్షణికం’ హాస్టల్ జీవితాన్ని కొద్దో గొప్పో చూపుతాయి. అయితే అవన్నీ పోస్ట్ మెట్రిక్ విద్యార్థుల జీవితాలు. కాని రచయిత మోహన్ తలారి ‘హాస్టల్ లైఫ్’ కథలు ప్రీ మెట్రిక్ విద్యార్థుల భౌతిక మనోలోకాల్లో హాస్టల్ రేపగల కల్లోలాన్ని గట్టిగా పట్టి ఇస్తాయి. ఇరవై ఏళ్ల క్రితం తాడేపల్లిగూడెం సమీపంలోని ఆరుగొలను గురుకుల పాఠశాలలో తాను గడిపిన హాస్టల్ జీవితపు పచ్చి జ్ఞాపకాల ధార ఈ కథలు. కర్కశపు చారలు ఈ కథలు. ఇరవై ఏళ్ల తర్వాత, నేడు, ఇరు రాష్ట్రాల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, గురుకుల పాఠశాలల, హాస్టళ్ల అధికారులు ఈ పుస్తకాన్ని ఒక కొలతగా గనక తీసు కుంటే, అప్పటికీ ఇప్పటికీ ఏం మారిందో, ఎంత మారిందో చూసుకుంటే చేయవలసిన పని తెలు స్తుంది. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే లక్షలాది నిరుపేద బాలల పెదాలపై చిర్నవ్వు మొలుస్తుంది. నిజానికి ఇంటర్, కాలేజీ హాస్టళ్ల విద్యార్థులకు అంతో ఇంతో ఎరుక, ఎదురీదే సామర్థ్యం ఉంటాయి. కాని 15 లోపు పసివయసు విద్యార్థులు ఉండే, తల్లితండ్రులను వదలి ఉండే, పేదరికం కారణంగానో నిస్సహాయ పరిస్థితుల వల్లనో హాస్టళ్లల్లో ఉండి చదువుకోక తప్పని వర్గాల పిల్లలుండే హాస్టళ్లు ఎంతో ఆదరణీయంగా ఉండాలి. ఆత్మీయంగా ఉండాలి. అక్కున జేర్చుకునేలా ఉండాలి. అలా ఉన్నదా? నీ పిల్లలు ఉండే చోటు ఎలా ఉండాలనుకుంటావో... ఆ పిల్లలు ఉండే చోటు అలా ఉండాలనుకుంటున్నావా? ‘అంకుల్ టామ్స్ కేబిన్ ’ అనే ఒక్క పుస్తకం నల్ల బానిసల జీవితాల్లో సమూలంగా మార్పు తెచ్చింది. మన దేశంలో ఎన్ని పుస్తకాలు వస్తే సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే – దేవునితో తప్ప మరెవరితోనూ మొత్తుకునే వీలులేని– ట్రంకుపెట్టె పిల్లల జీవితాలు మారతాయి? -
మెనూ మారినా.. భోజనం మారలే..!
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మెనూ మార్చినప్పటికీ పాఠశాలల్లో మాత్రం తీరు మారలేదు. వారికి నాసిరకం భోజనమే దిక్కవుతుంది. దీంతో విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నా రు. గతంలో పలుమార్లు చిన్నారులు ఆస్పత్రి పా లైన ఘటనలు ఉన్నా మేమింతే.. మా తీరు మారద న్న విధంగా అధికారులు, కొంత మంది ఉపాధ్యాయులు, సిబ్బంది వ్యవహరిస్తున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగా సర్కారు బడుల్లో చదివే పేద విద్యార్థుల కు అవస్థలు తప్పడం లేదు. ఉడకని అన్నం, నీళ్లప ప్పు పెడుతున్నట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపమే కారణంగా తెలుస్తోంది.సంఘటనలు జరిగినప్పుడు మెమోలు ఇవ్వడం, సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం తప్పా శాశ్వ త పరిష్కారం చూపడం లేదనే విమర్శలున్నాయి. గుడ్డు మింగేస్తున్నారు.. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారానికి మూడు రోజులు కోడిగుడ్ల ను అందజేస్తోంది. ఇందు కోసం ఒక్కో గుడ్డుకు రూ.5 చొప్పున కేటాయిస్తుంది. ప్రాథమిక విద్యార్థులకు కుగింగ్ కాస్ట్ కోసం రూ.5.45, 6నుంచి 8 తరగతుల విద్యార్థులకు రూ.8.17లతో పాటు 9,10 త రగతుల విద్యార్థుల కోసం రూ.10.67లను కేటాయిస్తుంది. అయితే చాలా పాఠశాలల్లో వారానికి ఒక రోజు మాత్రమే గుడ్డు పెడుతున్నారు. మిగతా రోజుల్లో మామూలు భోజనం అందిస్తున్నారు. పర్యవేక్షణ కరువు.. అధికారుల పర్యవేక్ష లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు ఆకుకూరలు, కూరగాయలు, పప్పు, కోడిగుడ్డుతో భోజనం వండి పెట్టాల్సి ఉండగా, చాలా పాఠశాలల్లో నాసిరకం భోజనమే అందిస్తున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు ఇంటికెళ్లి భోజనం చేస్తుండగా, మరికొంత మంది టిఫిన్ బాక్సులు తెచ్చుకుంటున్నారు. ఎంఈవోలు రోజుకు మూడు పాఠశాలలను తనిఖీ చేయాల్సి ఉండగా, కార్యాలయానికే పరిమితం కావడంతో పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్‌లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బుధవారం కేవలం పప్పు, అన్నం మాత్రమే వడ్డించారు. కోడిగుడ్డు ఇవ్వలేదు. అలాగే కూరగాయలు, ఆకుకూరలతో భోజనం పెట్టాల్సి ఉండగా, కేవలం నీళ్ల పప్పే దిక్కయ్యింది. నార్నూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఏకలవ్య ఆదర్శ గురుకులంలో గత మార్చిలో నాసిరకం భోజనం కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సమస్యతో ఆస్పత్రి పాలయ్యారు. ఇదివరకు ఆదిలాబాద్ పట్టణంలోని రూరల్ కేజీబీవీలో, అలాగే జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న భీంపూర్ కేజీబీవీలో, నేరడిగొండ కేజీబీవీలో, తాంసి మండలంలోని ఘోట్కురి పాఠశాలల్లో నాసిరకం భోజనం కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయినా జిల్లాలోని చాలా పాఠశాలల్లో విద్యార్థులకు నాసిరకం భోజనమే దిక్కవుతుంది. మెనూ ఇది.. వారం పెట్టాల్సిన భోజనం, సోమ కిచిడీ, మిక్స్డ్ వెజిటెబుల్ కర్రి, కోడిగుడ్డు, మంగళ అన్నం, పప్పు, మిక్స్డ్ వెజిటెబుల్ కర్రి, బుధ అన్నం, ఆకుకూరలతో పప్పు, మిక్స్డ్ వెజిటెబుల్ కర్రి, కోడిగుడ్డు, గురు వెజిటెబుల్ బిర్యానీ, మిక్స్డ్ వెజిటెబుల్ కర్రి, శుక్ర అన్నం, సాంబార్, మిక్స్డ్ వెజిటెబుల్ కర్రి, కోడిగుడ్డు, శని అన్నం, ఆకుకూరలు, వెజిటెబుల్ కర్రి. మెనూ ప్రకారం భోజనం పెట్టాలి పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం తప్పనిసరిగా భోజనం పెట్టాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు మఽ ద్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించాలి. వంట గదులు శుభ్రంగా ఉంచాలి. వారానికి మూడు సార్లు కోడిగుడ్లు అందించాలి. – ప్రణీత, డీఈవో -
ప్రపంచాన్ని గెలిచేలా.. పాఠాలను మారుద్దాం
మన విద్యా వ్యవస్థలో వీఆర్ (వర్చువల్ రియాలిటీ), ఏఆర్ (అగ్మెంటెడ్ రియాలిటీ), ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీల సాంకేతికతను పెంచాలి. లో లెవల్ మెషిన్ లెర్నింగ్, మెటావర్స్‌తో మిళితం చేయాలి. మన విద్యార్థులు ఏఐలో నిష్ణాతులుగా మారి, ఆ తర్వాత క్రియేటర్లుగా రాణించేలా ఇక్కడి నుంచే తొలి అడుగు వేయాలి. అందుకే పాఠశాల విద్య, ఉన్నత విద్య స్థాయిలో వేర్వేరుగా ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేస్తాం. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ విద్యా వ్యవస్థలో సాంకేతికతను ముందుకు తీసుకెళదాం. అత్యుత్తమ ప్రతిభావంతుల ద్వారా పాశ్చాత్య దేశాల విద్యా విధానంలోని అంశాలతో మన కరిక్యులమ్‌ను రీడిజైన్ చేద్దాం. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యా విధానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ప్రవేశ పెట్టడం ద్వారా విద్యార్థులకు అత్యుత్తమ బోధన, నేర్చుకునే సామర్థ్యం పెంచడంతో పాటు.. వారిని ఏఐ క్రియేటర్లుగా తీర్చిదిద్దేలా పాఠ్య ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్సిటీల వీసీలకు పిలుపునిచ్చారు. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు కరిక్యులమ్‌లో ఏఐ ఒక భాగం కావాలని స్పష్టం చేశారు. భవిష్యత్తు విద్యా విధానాన్ని ఏఐ మార్చబోతోందని, ఈ రూపంలో ప్రపంచం నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. బోధన, నైపుణ్యాభివృద్ధిలో తొలిసారిగా ఎమర్జింగ్ టెక్నాలజీ అనుసంధానం చేసేలా వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యా శాఖ అధికారులు, విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లతో గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ప్రాక్టికల్ అప్లికబులిటీ ఆఫ్ నాలెడ్జ్‌ను తీసుకురావడంతో పాటు మరిన్ని వర్టికల్స్ చదువుకునే అవకాశం ఇవ్వాలన్నారు. సాంకేతిక వైద్య విధానాలు అందుబాటులోకి రావడంతో వైద్య విద్య పాఠ్య ప్రణాళిక, బోధనలో రోబోటిక్స్, ఏఐల ప్రాధాన్యం పెంచాలని చెప్పారు. నాలుగవ పారిశ్రామిక విప్లవంలో ఏపీ విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తయారు చేయడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేయాలని దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలు సీఎం జగన్ మాటల్లోనే.. ఏఐలో మనమే లీడర్లుగా ఉండాలి ► ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులను అనేక రంగాల్లో లీడర్లుగా చూడాలనుకుంటున్నాం. అందుకు తగ్గట్టుగా మనం చదువులు అందిస్తున్నామో లేదో ఆలోచించాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విప్లవం వేగంగా అడుగులు వేస్తోంది. అందులో మనం వెనుకబడితే కేవలం అనుసరించే వాళ్లుగానే మిగిలిపోతాం. ఏఐ అభివృద్ధి చెందేకొద్దీ.. దానిని వినియోగించుకుని, సామర్థ్యాన్ని పెంచుకునే వర్గం ఒకటైతే.. ఏఐని క్రియేట్ చేసే వర్గం మరొకటి తయారవుతుంది. ► టెక్నాలజీ పరంగా తొలి రివల్యూషన్ 1784లో స్టీమ్‌తో నడిచే రైలు ఇంజన్ ద్వారా చూశాం. ఆ తర్వాత 100 ఏళ్లకు విద్యుత్, 1960–70ల్లో కంప్యూటర్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రూపంలో మరో రెండు విప్లవాలు అత్యంత మార్పును తీసుకొచ్చాయి. ఈ మూడింటిలోనూ మనం వెనుకబడ్డాం. ఏదీ క్రియేట్ చేసే పరిస్థితుల్లో లేం. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మనం క్రియేటర్లుగా మారాలి. ఈ రంగంలో మనమే లీడర్లుగా ఉండాలి. అందుకోసం ఆ దిశగా అడుగులు వేగంగా వేయాలి. ఫ్యాకల్టీల్లో ఆప్షన్లు పెంచాలి ► జర్మనీ వంటి దేశంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఉంది. పాశ్చాత్య ప్రపంచం అంతా జనాభా అసమతుల్యత (డెమొగ్రఫిక్ ఇన్‌బ్యాలెన్స్)ను ఎదుర్కొంటోంది. కానీ, భారతదేశంలోనైనా.. ఆంధ్రప్రదేశ్‌లో చూసినా సుమారు 70 శాతం మంది పనిచేసే వయస్కులు ఉన్నారు. వీరికి సరైన విజ్ఞానం, నైపుణ్యం అందించేందకు విద్యా రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టాలి. ► ఇప్పటి వరకు మన విద్యార్థులకు కొన్ని సబ్జెక్టులను మాత్రమే నిర్దేశిస్తున్నాం. అదే పాశ్చాత్య దేశాల కరిక్యులమ్‌లో ఒక ఫ్యాకల్టీలో చాలా వర్టికల్స్ కనిపిస్తాయి. అక్కడ బీకాంలోనే అసెట్ మేనేజ్మెంట్, ఫైనాన్సియల్ మార్కెట్, రిస్క్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ అనాలసిస్ ఇలా ఎన్నో ఉంటాయి. ఇవి మన దగ్గర లేవు. ► మన వాళ్లు మంచి డిగ్రీ కోసం విదేశాలకు వెళ్లాల్సిందే. ఏపీలో చదువుకునే విద్యార్థులకు నచ్చిన వర్టికల్స్ చదువుకునే అవకాశాలు ఇవ్వాలి. తాజాగా డిగ్రీలకు సంబంధించి క్రెడిట్స్ ఇస్తున్నాం. ఇకపై వాటి స్థాయిని పెంచుతూ ప్రతి ఫ్యాకల్టీలో ఎక్కువ ఆప్షన్లలో బోధన సాగించాలి. ఇప్పటికే ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసి, ఉద్యోగాల కల్పన దిశగా అడుగులేశాం. విద్యార్థుల ఉన్నతికి ఇలాంటి ఎన్నో మార్పులు అవసరం. ► సెక్యూరిటీ అనాలసిస్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి వర్టికల్ కోర్సులకు బోధన సామర్థ్యం మన దగ్గర అందుబాటులో లేకపోతే.. వర్చువల్ రియాలిటీని.. ఆగ్మెంటెడ్ రియాలిటీతో అనుసంధానించి వర్చువల్ క్లాస్ టీచర్ ద్వారా పాఠాలు చెప్పిద్దాం. మెడికల్ కోర్సుల్లో సాంకేతిక విజ్ఞానం పెంపు ► వైద్య విద్య కోర్సుల్లోని బోధన పద్ధతుల్లో గణనీయమైన మార్పులు రావాలి. భవిష్యత్తులో ఐదేళ్ల మెడికల్ కోర్సులో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచాలి. శరీర భాగాలను కోసి ఆపరేషన్ చేసే రోజులు మారిపోయాయి. కంప్యూటర్ల ద్వారా ఏఐను వాడకుని చిన్న చిన్న రంధ్రాలతో ఆపరేషన్ చేస్తున్నారు. అందుకే వైద్య విద్యలో రోబోటిక్స్, ఏఐలను భాగస్వామ్యం చేయాలి. ► హర్యానాలోని ఒక మెడికల్ కాలేజీలో ఇలాంటి కోర్సులనే ప్రవేశపెట్టారు. కేవలం మెడిసిన్‌లో చికిత్సకు సంబంధించిన విజ్ఞానం ఇవ్వడమే కాదు, టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించడంపై కూడా పాఠ్య ప్రణాళికలో జోడించాలి. త్వరలో ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ ► ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) ఏర్పాటుతో వ్యవసాయం చేసే తీరులో గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టాం. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే గ్రామ స్థాయిలోనే రైతును చేయి పట్టుకుని సాగు చేయించే వ్యవస్థను తీసుకొచ్చాం. ► ఇంతటితో ఆగిపోకుండా.. ప్రతి ఎకరాలో భూసార పరీక్షలు చేసి పంట సాగయ్యేలా చర్యలు చేట్టాలి. శాటిలైట్ ఇమేజ్ ద్వారా భూమిలోని కాంపోజిషన్‌ను తెలుసుకోవచ్చు. డ్రోన్ల ద్వారా భూమిలోని మినరల్ డిపాజిట్లను ఇంకా దగ్గరగా తెలుసుకునే అవకాశం వస్తోంది. ఆ రిపోర్టుల ద్వారా వ్యవసాయంలో ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకురావచ్చు. అప్పుడు పంటలకు ఎంత మోతాదులో ఎరువులు వేయాలో సులభంగా తెలుస్తుంది. ఇటువంటి టెక్నాలజీని మన విద్యార్థులకు నేర్పించాలి. హైలెవల్ అకడమిక్ బోర్డు ► ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ, కేంబ్రిడ్జ్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లోని పాఠ్యపుస్తకాలు, బోధనా పద్ధతులు, ప్రశ్నపత్రాల సరళి మన కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. అక్కడ టెక్ట్ బుక్స్ విద్యార్థులకు ఇచ్చి సమాధానాలు రాయిస్తారు. తద్వారా ప్రాక్టికల్ అప్లికబిలిటీని పరీక్షిస్తారు. అందుకే మనదగ్గర కూడా ప్రశ్నపత్రాల రూపకల్పన, బోధనా పద్ధతులు పూర్తిగా మారాలి. ఒక్కో యూనివర్సిటీ ఒక్కో రకంగా కరిక్యులమ్ తయారు చేయడం కాకుండా అందరూ అనుసరించేలా ఒక నిర్దిష్టమైన కరిక్యులమ్ రూపొందించాలి. ► అందుకే పాఠశాల విద్య, ఉన్నత విద్య స్థాయిలో వేర్వేరుగా ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు మనం విజన్ కోసం ఒక హైలెవల్ అకడమిక్ బోర్డు అవసరం. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభావంతులతో ఈ బోర్డును ఏర్పాటు చేద్దాం. తద్వారా పాశ్చాత్య దేశాల విద్యా విధానంలోని అంశాలతో మన కరిక్యులమ్‌ను రీడిజైన్ చేద్దాం. పాఠ్యప్రణాళికను, బోధనను, ప్రశ్నపత్రాల తీరును మారుద్దాం. పాఠశాల స్థాయి నుంచే మార్పులు ► విద్యా వ్యవస్థలో పాఠశాల స్థాయి నుంచే సమూల మార్పులు రావాలి. ఇప్పటికే మనం ఆ దిశగా చర్యలు చేపట్టాం. ఇంగ్లిష్ మీడియం చదువులు, బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు, ఆరో తరగతి నుంచి డిజిటల్ బోధనను తీసుకొచ్చాం. డిసెంబర్ నాటికి 63 వేల క్లాస్ రూమ్స్‌ను ఐఎఫ్‌పీ ఫ్యానెల్స్‌తో డిజిటలైజ్ చేస్తున్నాం. ఇప్పటికే 31 వేల తరగతి గదుల్లో ప్యానెల్స్ ఏర్పాటు చేశాం. ► బైజూస్ కంటెంట్‌ను ఇంటిగ్రేట్ చేశాం. ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చాం. దీనికి తదుపరిగా మరిన్ని మార్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎమర్జింగ్ టెక్నాలజీల్లో చాలా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అవసరమైతే ఇంటర్నెట్లోని కంటెంట్ ద్వారా టెక్నాలజీ వాడకంపై శిక్షణ ఇస్తే మనకూ తగినంత ఫ్యాకల్టీ సిద్ధమవుతారు. ► విద్యా రంగంలో ఇప్పుడు జరుగుతున్న మార్పులను గమనిస్తే.. మనం ఒక స్థాయిలో ఉంటే.. లక్ష్యం ఇంకో స్థాయిలో ఉంది. ఈ గ్యాప్‌ను పూడ్చాలంటే వైస్ చాన్సలర్లు కూడా ఆలోచించాలి. దీనిపై మరిన్ని సమాలోచనలకు నాలుగైదు యూనివర్సిటీలతో వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేయాలి. మెడికల్, ఇంజినీరింగ్‌తో పాటు ఇతర ఫ్యాకల్టీలు కూడా గ్రూపులుగా ఏర్పాటు చేసుకుని అత్యుత్తమ పాఠ్య ప్రణాళిక, అత్యుత్తమ బోధనా పద్ధతులను ఖరారు చేయాలి. ► ఈ సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్, కళాశాల విద్యా శాఖ కమిషనర్ పోలా భాస్కర్, ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, ఐ అండ్ పీఆర్ కమిషనర్ టి.విజయ్‌కుమార్‌రెడ్డి, విశ్వవిద్యాలయాల వైస్‌చాన్సలర్లు పాల్గొన్నారు. -
పది ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు
-
ఉన్నత విద్యలో హెరిటేజ్, కల్చర్
సాక్షి, అమరావతి: దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఇండియన్ హెరిటేజ్ (భారతీయ వారసత్వం), కల్చర్ (సంస్కృతి) ఆధారిత కోర్సుల అమలుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) శ్రీకారం చుడుతోంది. శాస్త్రీయ నృత్యం, ఆయుర్వేదం, భారతీయ భాషలు, సంగీతం, సంస్కృతం, మానవ విలువలు, వేద గణితం, యోగా తదితర కోర్సులను ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించి ముసాయిదా మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది. బహుళ ప్రవేశ నిష్క్రమణలతో స్వల్పకాలిక క్రెడిట్–ఆధారిత కోర్సులుగా వీటిని అమలు చేయనున్నట్లు పేర్కొంది. జాతీయ నూతన విద్యావిధానం–2020 ప్రకారం భారతీయ వారసత్వం, సంస్కృతీ, సంప్రదాయాలను ప్రోత్సహించడానికి వీలుగా భారతీయ సనాతన వారసత్వ సంపద ఎంత గొప్పదో ప్రపంచానికి తెలియచేయడమే లక్ష్యంగా ఈ కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు యూజీసీ పేర్కొంది. ఆయుర్వేదం, శాస్త్రీయ నృత్య రూపాలు, భారతీయ భాషలు, సంగీతం, సంస్కృతం, సార్వజనీన మానవ విలువలు, వేద గణితం, యోగా వంటి కోర్సుల కోసం కరిక్యులమ్ ఫ్రేమ్వర్కును రూపొందించనుంది. ఈ కోర్సులతో విదేశీ విద్యార్థులను భారతదేశానికి ఆకర్షించడమే లక్ష్యంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. 3 విభాగాలుగా ఈ కోర్సులను యూజీసీ ప్రతిపాదించింది. పరిచయ స్థాయి, మధ్యంతర స్థాయి, అధునాతన స్థాయిగా వీటిని విభజించనుంది. కోర్సులను అందించే సంబంధిత ఉన్నత విద్యాసంస్థలు వాటికి నిర్దిష్ట అర్హత పరిస్థితులను నిర్ణయించడానికి యూజీసీ అనుమతించింది. ఆయా ప్రోగ్రాములు ఫ్లెక్సిబుల్ హైబ్రిడ్ (ఆన్లైన్–ఆఫ్‌లైన్ కాంబినేషన్) కింద అందించనున్నారు. ఆయా ఉన్నత విద్యాసంస్థలు కోర్సులకు సంబంధించి సంబంధిత ముఖ్యమైన సాహిత్యం గ్రంథాలు నేర్చుకున్న పండితుల సహకారం తీసుకుని పాఠ్యాంశాలను అభివృద్ధి చేయాలని సూచించింది. ఆయా ప్రోగ్రాములను రూపొందించేటపుడు బోధనా విధానాల్లోనూ ఆధునిక నాలెడ్జ్ సిస్టమ్‌తో అనుసంధానం ఉండాలని స్పష్టం చేసింది. బోధన వివిధ మాధ్యమాల్లో ఉంటుంది. ఉపన్యాసాలు, ఆడియో–వీడియో కంటెంట్, గ్రూపు చర్చలు, ఆచరణాత్మక సెషన్లు, విహారయాత్రలు కూడా బోధనలో భాగంగా ఉంటాయి. అభ్యాసకులకు క్రెడిట్లను అందించడానికి రెండు రకాల మూల్యాంకన విధానాలు పాటిస్తారు. నిరంతర, సమగ్ర అంచనా (సీసీఏ), పీరియాడికల్ మూల్యాంకనాలను అనుసరించనున్నారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత విద్యార్థులకు ఆయా ఉన్నత విద్యా సంస్థలే సర్టిఫికెట్లను మంజూరు చేస్తాయి. ఆ సర్టిఫికెట్లు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్ఏడీ)లో డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటాయి. -
విదేశాల్లో చదువుకుంటున్నారా? కేంద్రం భారీ షాక్!
విదేశాల్లు చదువుకునే విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులకు కేంద్రం భారీ షాకిచ్చింది. యూనియన్ బడ్జెట్-2023 లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ ఏడాది జులై నుంచి విదేశాల్లో చదువుకు ఇతర ఖర్చుల కోసం పంపించే డబ్బుపై కేంద్రం ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్(టీసీఎస్) ట్యాక్స్‌ను వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. సరళీకృత చెల్లింపుల పథకం (liberalised remittance scheme – LRS) కింద వసూలు చేసేవిదేశీ ప్రయాణాలు,పెట్టుబడులు, నగదు ట్రాన్స్‌ఫర్‌పై ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఈ ట్యాక్స్‌లో ఎడ్యుకేషన్, మెడికల్ విభాగాలకు మినహాయింపు ఇచ్చింది. అయితే విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్న వారి రోజువారీ ఖర్చులకు తల్లిదండ్రులు పంపే మనీ.. వారి కాలేజీ ఫీజు సంబంధిత ఖర్చులకు కిందకు రావు. విదేశీ విద్యకు ఎడ్యుకేషన్ లోన్ ద్వారా చెల్లిస్తే ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ కింద ఎడ్యూకేషన్ లోన్ తీసుకొని విదేశాల్లో చదువు నిమిత్తం పంపే డబ్బు రూ.7లక్షలు దాటితే 0.5 శాతం ట్యాక్స్ కట్టాలి. అయితే, ఎడ్యుకేషన్ లోన్ కాకుండా ఇతర లోన్లు తీసుకొని విదేశాలకు రూ.7లక్షలకు మించి పంపితే 5శాతం ట్యాక్స్ పడుతుంది. ఇతర ఖర్చులపై 20శాతం ట్యాక్స్ విదేశాలకు చెందిన కాలేజీ క్యాంపస్‌లోని హాస్టల్స్ ఉండి చదువుకునే పిల్లలకు హాస్టల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు చెల్లించేందుకు డబ్బులు పంపుతున్నట్లు తల్లిదండ్రులు ఆధారాలు చూపించాలి. అలా కాకుండా రోజువారీ ఖర్చులకు పంపితే మాత్రం 20 శాతం టీసీఎస్ పే చేయాల్సి ఉంటుంది. బ్యాంక్‌లో ఏ-2 ఫామ్ తప్పని సరి ఎల్ఆర్ఎస్ విధానంలో భాగంగా విదేశాల్లో ఉన్న పిల్లలకు డబ్బులు ఎందుకు పంపిస్తున్నామో తెలుపుతూ బ్యాంకులో ఏ-2 ఫామ్ నింపాలి. అందులో ఏ అవసరాలకు చెల్లిస్తున్నారో తెలుపుతూ డిక్లరేషన్ ఫామ్ సంతకం చేయాలి. అక్కడ మీరు మీ పిల్లల విద్యావసరాలకు కాకుండా ఇతర అవసరాల కోసం డబ్బులు పంపుతున్నారని తేలితే 20 శాతం టీసీఎస్ వసూలు చేస్తారు. -
ఉన్నత విద్యలో ఏపీ ఆదర్శం
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో అమలు చేస్తున్న విద్యా విధానం పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని విద్యా రంగ నిపుణులు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు ప్రశంసనీయమని చెప్పారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ప్రభుత్వం ముందుందని తెలిపారు. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో రెండో రోజు శనివారం ఉన్నత విద్యపై ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీఎస్సీహెచ్ఈ) చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి అధ్యక్షతన ప్యానల్ చర్చ జరిగింది. ‘ఇంపాక్ట్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్’ అనే అంశంపై విద్యా రంగ నిపుణులు చర్చించారు. హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ వృత్తి నైపుణ్య కేంద్రంగా మారిందని చెప్పారు. నాస్కాం, మైక్రోసాఫ్ట్, స్కిల్ ఫోర్స్, టీం లీడ్స్, టీసీఎస్ వంటి కంపెనీలతో ఏపీఎస్సీహెచ్ఈ ఒప్పందాలు కుదుర్చుకుంటోందన్నారు. ఇంజినీరింగ్, ప్రొఫెషనల్, డిగ్రీ, ఫార్మసీ విద్యార్థులకు ఆన్లైన్లో అడ్వాన్స్డ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కోర్సులను అందిస్తూ ఉద్యోగ కల్పనలో ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోందని వివరించారు. ఏపీలో విద్యా విధానం భేష్ విట్ ఫౌండర్, చాన్సలర్ జి.విశ్వనాథన్ మాట్లాడుతూ ఏపీలో ఉన్నత విద్యా బోధన, విధానం చాలా బాగున్నాయని, ప్రభుత్వం దీనిపై అధిక శ్రద్ధ పెట్టిందని చెప్పారు. ఏఐసీటీఈ సీవోవో బుద్దా చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయాన్ని కల్పించడం వల్ల చాలా కుటుంబాల్లో ఇంజినీర్లు తయారవుతున్నారని చెప్పారు. చర్చలో ఐఐఎస్సీ (బెంగళూరు) ప్రొఫెసర్ ఎన్.బాలకృష్ణన్, ఐఐటీ హైదరాబాద్ ఫౌండర్ ఉదయ్ దేశాయ్, ఐఐఎం విశాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
ఏపీ విద్యా పథకాలు అద్భుతం.. ఢిల్లీ విద్యావేత్తల బృందం ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న వివిధ విద్యా కార్యక్రమాలు, పథకాలు, వాటిని సమగ్రంగా అమలు చేసేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థలు అద్భుతంగా ఉన్నాయని ఢిల్లీకి చెందిన విద్యావేత్తల బృందం ప్రశంసించింది. రాష్ట్ర విద్యా వ్యవస్థలో అమలవుతున్న వివిధ పథకాలు, స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఢిల్లీ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో 60 మంది విద్యావేత్తల బృందం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విజయవాడలో 28 మంది సభ్యుల బృందం గత రెండు రోజులుగా కృష్ణా జిల్లాలోని పెనమలూరు, నిడమానూరు పాఠశాలలను సందర్శించింది. ఈ బృందానికి రాష్ట్ర ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాపరెడ్డి ఆహా్వనం పలికారు. క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, డిజిటల్ విద్య, జగనన్న అమ్మఒడి, మన బడి నాడు–నేడు, ద్వి భాషా పాఠ్యపుస్తకాలు, విద్యార్థుల సహ పాఠ్య కార్యక్రమాలను బృందం పరిశీలించింది. పెనమలూరు విద్యార్థుల డ్రమ్స్, నిడమానూరులో యోగా ప్రదర్శనలను ఆసక్తితో తిలకించింది. అనంతరం రాష్ట్ర ఎస్సీఈఆర్టీలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలను ఈ బృందం పరిశీలించింది. ఎస్సీఈఆర్టీ అధ్యాపక బృందంతో వివిధ బోధన విధానాల గురించి పరస్పరం అభిప్రాయాలు పంచుకుంది. ఢిల్లీలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల గురించి కూడా బృందం వివరించింది. అనంతరం సమగ్ర శిక్ష కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ఎస్పీడీ శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. సాల్ట్ పథకంలో భాగంగా వివిధ ప్రముఖ సంస్థలు విద్యాశాఖతో కలిసి పనిచేస్తున్న అంశాల మీద అవగాహన కలి్పంచారు. మృదుల భరద్వాజ్ ఆధ్వర్యంలో పర్యటిస్తున్న ఈ బృందం రాష్ట్రంలో అమలవుతున్న పథకాల పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఇక్కడ జరుగుతున్న మంచి విధానాలపై తమ రాష్ట్ర అధికారులకు నివేదిక సమరి్పస్తామని మృదుల భరద్వాజ్ చెప్పారు. -
చదువుతో జాతీయ భద్రతకు లంకె?
గ్రామీణ భారత్‌లో 3–16 సంవత్సరాల వారి చదువుల మీద వెలువడిన ‘యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు–2022’ (ఏఎస్ఈఆర్) ఒక విలువైన నివేదిక. 6–14 సంవత్సరాల మధ్య వయసు విద్యార్థులలో 98.4 శాతం మంది పాఠశాలల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారన్న వాస్తవం ప్రశంసకు అర్హమైనది. అయితే విద్యావంతులైన యువత మాత్రమే సమ్మిళితమైన జాతీయ భద్రతా ఇమేజీని ప్రకాశవంతం చేయగలదు. ఏ అగ్ర రాజ్యమైనా సాంకేతికపరమైన వ్యక్తిత్వం సాధించడానికి అత్యున్నత నాణ్యతతో కూడిన జాతీయ విద్యా విధానం మాత్రమే వీలు కల్పిస్తుంది. ఉనికిలో ఉన్న విద్యావిధానం సాంకేతికంగా సన్నద్ధుడైన సైనికుడి స్వభావానికి ఆచరణీయమైన వ్యవస్థగా ఉంటుందా అనేది పరిశీలనాంశం. గ్రామీణ భారత్‌లో 3–16 సంవత్సరాల వయో బృందపు విద్యా పరిస్థితిపై సర్వే చేసిన ‘యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు –2022’ (ఏఎస్ఈఆర్)ను ఒక విలువైన డాక్యుమెంట్‌గా పేర్కొనాలి. ప్రభుత్వేతర సంస్థ అయిన ప్రథమ్ ఫౌండేషన్‌కు నిజంగానేకృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే ఇది విద్యా రంగంలో అసాధారణ సేవను అందిస్తున్న సంస్థ. జాతీయ సర్వేల శుష్కత్వం, విశ్వస నీయమైన హెచ్‌డీఐ (మానవాభివృద్ధి సూచిక) గణాంకాల దృష్ట్యా చూస్తే, ఈ సమగ్రమైన నివేదికను రూపొందించడంలో ప్రథమ్ ఫౌండేషన్ కీలకపాత్ర పోషించింది. ఏఎస్ఈఆర్ సర్వేను చివరిసారిగా 2018లో నిర్వహించారు. కోవిడ్ సంవత్సరాలు కలిగించిన అంతరాన్ని ఈ తాజా నివేదికతో పూరించినట్లయింది. 3–16 సంవత్సరాల వయో బృందంలోని దాదాపు 7 లక్షల మంది పిల్లలను పరిశీలిస్తూ, దేశవ్యాప్తంగా 616 జిల్లాలలో నిర్వహించిన సమగ్ర గృహ సర్వే నుంచి ఏఎస్ఈఆర్–2022 నివేదిక రూపొందింది. వరుస క్రమంలో అమర్చనప్పటికీ, కొంత డేటాను ప్రాథమికంగా విశ్లేషణ చేయడం ద్వారా, జాతీయ భద్రత అల్లికకు సంబంధించిన కొన్ని లంకెలను ఇది అందించింది. పైగా వస్తుగత పాలసీ సమీక్ష, చర్చకు ఇది హామీ ఇచ్చింది. నమోదు పెరిగింది ఈ రిపోర్టులోని పరిమాణాత్మక బుల్లెట్ పాయింట్లు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి. 6–14 సంవత్సరాల వయసున్న విద్యా ర్థులలో దాదాపు 98.4 శాతం మంది గ్రామీణ భారత్‌లోని పాఠశా లల్లో ఇప్పుడు తమ పేర్లు నమోదు చేసుకున్నారన్న వాస్తవం నిజంగా ప్రశంసకు అర్హమైనది. ఈ ధోరణి సానుకూలమైనది. 2010 లోని 96.6 శాతంతో పోలిస్తే, 2014లో అది 96.7 శాతానికి పెరిగింది. 2018లో 97.2 శాతం నుంచి 2022లో 98.4 శాతానికి చేరడం అంటే విద్యార్థుల నమోదులో సత్వర పెరుగుదలనే ఇది సూచిస్తోంది. అయితే యువ భారతానికి సంబంధించి ఏఎస్ఈఆర్–2022 లోని గుణాత్మక అంశం ప్రగాఢ ఆందోళనకు కారణమవుతుంది. ఇది బయట పెట్టిన విషయాలు ఉద్వేగభరితమైన జాతీయవాదం, తప్పుడు ధ్రువీకరణల మిశ్రమంతో దూకుడు ప్రదర్శిస్తూ, ఇప్పుడు తనను తాను విశ్వగురువుగా చెప్పుకొంటున్న దేశానికి అసంగతంగా కనిపిస్తాయి. భారతదేశంలో విద్య రాష్ట్రాలకు చెందిన అంశంగా ఉంటున్నందున పిల్లలు నేర్చుకునే నైపుణ్యాలు వివిధ రకాలుగా ఉంటాయి. ఈ విషయంలో ఒక ఆసక్తి కలిగించే అంశం మహారాష్ట్రకు సంబంధించినది. తలసరి ఆదాయం, మానవ భద్రతా సూచికల రీత్యా అత్యంత పురోగామి రాష్ట్రాల్లో ఇదొకటి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో గణిత శాస్త్ర నైపుణ్యాలు ప్రమా దకర స్థాయిలో తగ్గిపోతున్నాయని ఈ నివేదిక పేర్కొంది. 2018లో 3వ తరగతిలోని 28 శాతం మంది పిల్లలు మాత్రమే తీసివేతలను చేయగలిగారనీ; 5వ తరగతిలో 31 శాతం పిల్లలు, 8వ తరగతిలోని 41 శాతం పిల్లలు భాగహారాన్ని సంతృప్తికరంగా చేయగలిగారనీ తెలి పింది. అదే 2022లో 3వ తరగతిలో 18.5 శాతం, అయిదో తరగతి పిల్లల్లో 20 శాతం, 8వ తరగతిలో 38 శాతం మంది మాత్రమే వీటిని చేయగలిగారని నివేదిక పేర్కొంది. ఒక రాష్ట్రం (మహారాష్ట్ర)లో ఈ పతనానికి అనేక అంశాలు కారణం కావచ్చు. బోధనా పద్ధతుల్లో, పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సామర్థ్యాలకు సంబంధించి కోవిడ్ మహమ్మారి కలిగించిన అంతరాయం దీనికి కారణం కావచ్చు. అయితే మరొక వర్గపు డేటా స్ఫూర్తిదాయకం కావచ్చు. ఈ నివేదిక భారతదేశ స్థాయిలో ప్రైవేట్ విద్యాసంస్థల్లోని ధోరణిని ఎత్తిచూపింది. అలాంటి ఎంపిక చేసుకున్న విద్యార్థుల శాతం 26.4 నుంచి 2022లో 30.5 శాతానికి పెరిగింది. ఈ జాబితాలో బిహార్ 71.7 శాతంతో అగ్రస్థానంలో ఉంది. అయితే ప్రైవేట్ చదువులో ఈ పెరుగుదలకు గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, త్రిపుర రాష్ట్రాలు మాత్రం మినహాయింపుగా ఉన్నాయి. యుద్ధాల తీరు మారుతోంది భారత్‌లో మొత్తం విద్యాపరమైన సూచిక, జాతీయ భద్రత మధ్య లంకెను రెండు మార్గాలలో సమీక్షించవచ్చు. జనవరి 16న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్రివిధ దళాలకు చెందిన అగ్నివీర్ల తొలి బ్యాచ్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త నియామక పథకం ద్వారా మార్గదర్శకులు అవుతున్నందుకు వారికి అభినందనలు తెలిపారు. 21వ శతాబ్దిలో జరుగుతున్న యుద్ధాల తీరు మారిపోతోందనీ, సాంకేతికంగా ముందంజలో ఉన్న సైనికులు మన సాయుధ బలగాల్లో కీలక పాత్ర పోషిస్తారనీ చెప్పారు. ఏఎస్ఈఆర్– 2022 అంచనా ప్రకారం, ఉనికిలో ఉన్న విద్యా వ్యవస్థ ప్రధాని మోదీ పేర్కొన్నట్లుగా, సాంకేతికంగా సన్నద్ధుడైన సైనికుడి తరహా స్వభావానికి అత్యంత ఆచరణీయమైన ఎకో సిస్టమ్‌గా ఉంటుందా అనేది పరిశీలనాంశం. అన్ని స్థాయుల్లో భారతీయ సైన్యంలో రిక్రూట్ కావడం అనేది తీవ్రమైన పోటీతో కూడి ఉంటుంది. ఉత్తమమైన, చురుకైన అర్హత కలిగిన వారే యూనిఫామ్ ధరించగలరు. రాబోయే దశాబ్దాల్లో, విద్యావంతులైన యువత మాత్రమే సమ్మిళితమైన జాతీయ భద్రతా ఇమేజీని ప్రకాశవంతం చేయగలదు. దీనికి వ్యతిరేకమైనది ఏమిటంటే, పెరుగుతున్న అవిద్యావంతులైన యువత శాతం; వీరు ఉత్పాదక భారత్ ఆకాంక్షను వెనక్కు లాగడమే. ఇది దేశంలో అంతర్గత భద్రతాపరమైన చిక్కులను కొనితేగలదు. నిరుద్యోగం, నిరాశా నిస్పృహలకు గురైన అఖిల భారత జనాభా సమూహం కచ్చితంగా అత్యంత ప్రమాదకర పరిస్థితిని తెచ్చిపెట్టగలదు. పరిశోధనా పత్రాల్లో చైనా టాప్ విద్యను జాతీయ భద్రతతో అనుసంధానించే రెండో మార్గం భారతీయ విధాన నిర్ణేతలకు సముచితమైనదిగా ఉంటుందని అమెరికాలోని ఒహాయో స్టేట్ యూనివర్సిటీకి చెందిన విద్యావేత్త కరోలిన్ వాగ్నర్ చేసిన సర్వే ద్వారా అర్థమవుతుంది. 2019లో ఆమె వెల్లడించిన సర్వే ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన 8,422 శాస్త్రీయ పత్రాలను చైనా ప్రచురించింది. కాగా తర్వాతి స్థానంలో అమెరికా 7,959 పత్రాలు, యూరోపియన్ యూనియన్ 6,074 శాస్త్రీయ పత్రాలను ప్రచురించాయి. ఇక 2022లో కృత్రిమ మేధపై అమెరికా పరిశోధకుల కంటే మూడు రెట్లు అధికంగా శాస్త్రీయ పత్రాలను చైనా పరిశోధకులు ప్రచురించారని వాగ్నర్ అధ్యయనం తెలిపింది. పరిశోధన ఎంత నాణ్యతతో జరుగుతున్నదో తేల్చడానికి ఉపకరించే ఉటంకింపుల దృష్ట్యా చూసినా కూడా– అనేక శాస్త్ర సాంకేతిక విభాగాల్లో ప్రచురించిన పత్రాల్లో చైనా పరిశోధకులు టాప్ 1 శాతంతో అగ్రస్థానంలో ఉంటున్నారు. 20వ శతాబ్దిలో కీలకమైన దేశ సమ్మిళిత సైనిక సామర్థ్యాన్ని.. దృఢమైన జాతీయ పరిశోధన, అభివృద్ధి, పారిశ్రామిక, వస్తూత్పత్తి పునాది నిర్ణయించిందని భావిస్తున్నారు. అయితే ప్రస్తుత యుగంలో ఏ ప్రముఖ అగ్రరాజ్యమైనా సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కో వాల్సి ఉంటుంది. వాటితో వ్యవహరించేందుకు అవసరమైన సాంకే తికపరమైన వ్యక్తిత్వం సాధించడానికి అత్యున్నత నాణ్యతతో కూడిన జాతీయ విద్యా విధానం మాత్రమే వీలు కల్పిస్తుంది. అందుకే భారత్ ముందు కఠిన ప్రయాసతో కూడిన మార్గం ఉందని ఏఎస్ఈఆర్– 2022 సర్వే ఎత్తి చూపింది. వ్యాసకర్త సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అఫ్గాన్‌లో విద్యార్థినుల నిరసన గళం
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో ఉన్నతవిద్యాసంస్థల్లో మహిళా విద్యార్థులపై నిషేధం విధించి, మహిళా విద్యను ఉక్కుపాదంతో అణిచివేస్తున్న తాలిబన్ ప్రభుత్వానికి విద్యార్థినుల నుంచి నిరసనలు మరింత పెరిగాయి. దయలేని తాలిబాన్లను ఎదిరించి వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగిన విశ్వవిద్యాలయాల విద్యార్థినులు తమ గొంతుకను గట్టిగా వినిపిస్తున్నారు. శనివారం హెరాత్ నగరంలోని రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసం ఎదుట ఆందోళన చేసేందుకు దాదాపు 150 మంది వర్సిటీ విద్యార్థినులు బయల్దేరారు. ‘విద్య మా హక్కు’ అంటూ ప్లకార్డులు, బ్యానర్లను చేతబూనిన వారిని తరిమికొట్టేందుకు తాలిబన్ భద్రతా బలగాలు వాటర్ కేనన్లు వినియోగించారు. రహదారి వెంట ఉన్న చెట్ల కొమ్మలతో విద్యార్థినులను కొట్టారు. అయినాసరే నిరసనర్యాలీని ముందుకు తీసుకెళ్లేందుకు విద్యార్థినులు ప్రయత్నించారు. సంబంధించిన వీడియోను అసోసియేటెడ్ ప్రెస్ వార్తాసంస్థ విడుదలచేసింది. ‘తారిఖీ పార్క్ నుంచి నిరసన ర్యాలీ మొదలుపెట్టాం. అయితే, నగరంలో ప్రతీ వీధిలో సాయుధ తాలిబన్లు మమ్మల్ని అడ్డుకున్నారు. కొట్టారు. మాపై దాడి దారుణం’ అని మరియం అనే విద్యార్థిని ఆగ్రహంగా మాట్లాడారు. అయితే, ఈ నిరసన ర్యాలీపై రాష్ట్ర గవర్నర్ హమీదుల్లా ముతావకిల్ భిన్నంగా మాట్లాడారు. ‘ఓ నలుగురైదుగురు అమ్మాయిలు వచ్చి ఏదో ఫిల్మ్ షూట్ చేసి వెళ్లిపోయారు. వారికి ఎలాంటి అజెండా లేదు’ అని అన్నారు. వర్సిటీల్లో మహిళా విద్యపై నిషేధం విధించడంతో తాలిబాన్ పాలనపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. సౌదీ అరేబియా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, జీ–7 కూటమి దేశాలు తాలిబన్ సర్కార్‌ను తీవ్రంగా తప్పుబట్టాయి. అఫ్గాన్ విద్యార్థినులకు మద్దతుగా పాక్‌లోని క్వెట్టా సిటీలో కొందరు అఫ్గాన్ శరణార్థి విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఉద్యోగినులను తీసేయండి స్వచ్ఛంద సంస్థలకు తాలిబన్ల అల్టిమేటం మహిళలను చదువులకు దూరం చేసేందుకు కంకణం కట్టుకున్న అఫ్గాన్ తాలిబన్ పాలకులు తాజాగా మహిళలకు శరాఘాతం వంటి మరో చర్యకు పూనుకున్నారు. అఫ్గానిస్తాన్‌లోని విదేశీ, దేశీయ ప్రభుత్వేతర సంస్థలు మహిళా ఉద్యోగాలను తొలగించాలంటూ ఆదేశాలిచ్చారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇవి అమల్లో ఉంటాయని ఆర్థిక మంత్రి మహ్మద్ హనీఫ్ పేర్కొన్నారు. వీటిని పాటించని ఎన్జీవోల అనుమతులను రద్దు చేస్తామని హెచ్చరించారు. పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ప్రవేశించరాదనే ఆంక్షలు ఇప్పటికే ఉన్నాయి. -
భావి విద్యకు బాటలు
రాజ్‌కోట్: స్వతంత్ర భారతంలో తొలిసారిగా దేశ భావి అవసరాలను సంపూర్ణంగా తీర్చేలా సమగ్ర విద్యా విధానం అమలుకు చిత్తశుద్ధితో కృషి జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘బ్రిటిష్ పాలనలో కనుమరుగైన మన ఉజ్జ్వల పురాతన గురుకుల విద్యా విధానం తదితరాల సుగుణాలను పునరుద్ధరించేందుకు స్వాతంత్రం రాగానే పాలకులు నడుం బిగించాల్సింది. కానీ బానిస మనస్తత్వంలో నిండా కూరుకుపోయిన గత ప్రభుత్వాలు ఈ దిశగా ఏ ప్రయత్నమూ చేయలేదు పైగా చాలా అంశాల్లో తిరోగమన ధోరణితో దేశాన్ని వెనక్కు తీసుకెళ్లాయి’’ అంటూ కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ఇలాంటి తరుణంలో మన బాలలకు మళ్లీ గురుకుల తరహా నాణ్యమైన విద్యను అందించేందుకు ఆధ్యాత్మిక గురువులు పూనుకున్నారు. శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ ఇందుకు ఉదాహరణ’’ అన్నార. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఉన్న సంస్థ 75వ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ప్రధాని శనివారం వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. సనాతన భారతదేశం అన్ని విషయాల్లోనూ విశ్వ గురువుగా భాసిల్లిందన్నారు. ‘‘మిగతా ప్రపంచం అంధకారంలో మునిగి ఉన్న సమయంలో మన దేశం విద్యా దీపాలను సముఉజ్జ్వలంగా వెలిగించింది. నలంద, తక్షశిల వంటి మన విశ్వవిద్యాలయాలు ప్రపంచమంతటికీ నిస్వార్థంగా, వివక్షారహితంగా విద్యా దానం చేశాయి. ఆత్మ తత్వం నుంచి పరమాత్వ తత్వం దాకా, ఆయుర్వేదం నుంచి సామాజిక శాస్త్రం, గణిత, లోహ అంతరక్ష శాస్త్రాల దాకా, సున్నా నుంచి అనంతం దాకా అన్ని శాస్త్రాలూ మన దేశంలో ఉచ్ఛ స్థాయిలో విలసిల్లిన కాలమది. వాటన్నింటినీ ప్రస్తుత తరాలకు అందించేందుకు స్వామి నారాయణ్ వంటి విద్యా సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్నాయి’’ అని ప్రశంసించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఐఐటీలు, ఐఐఎంలు, వైద్య కళాశాలల వంటి అత్యున్నత నాణ్యతతో కూడిన విద్యా సంస్థల సంఖ్య 65 శాతానికి పైగా పెరిగిందని చెప్పారు. ‘‘దేశ భవిష్యత్తు గొప్పగా ఉండాలంటే విద్యా విధానం, విద్యా సంస్థల పాత్ర చాలా కీలకం. కాబట్టే ఈ దిశగా అన్ని స్థాయిల్లోనూ శరవేగంగా మెరుగైన మార్పులు తెచ్చేందుకు మేం నడుం బిగించాం’’ అన్నారు. -
Education Report 2021: అధ్యాపకుల కొరతే కారణం
పాఠశాల విద్యారంగంలో మౌలిక వసతులతో పాటు మానవ వనరుల కొరత తీవ్రంగా ఉందని యునెస్కో ఆధ్వర్యంలో వెలువడిన ‘విద్యా నివేదిక–2021’ చాటుతోంది. ఆ నివేదిక ప్రకారం దేశంలో మొత్తం 15.51 లక్షల పాఠశాలలు ఉండగా, వాటిలో 21.83 కోట్ల మంది విద్యార్థులు చదువుతున్నారు. 91.30 లక్షల మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. అందులో 7 శాతం ఏకోపాధ్యాయ పాఠశాలలే కావడం గమనార్హం. ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఖ్య ఏటా తగ్గుతూ ఉంది. ప్రాథమికోన్నత పాఠశాలల్లోనే ఉపాధ్యాయుల కొరత అధికంగా ఉంది. ఈ పాఠశాలల్లో గణితం, సైన్స్, సోషల్, భాషా సబ్జెక్టులను బోధించేందుకు తప్పనిసరిగా అధ్యాపకులు ఉండాల్సి ఉంది. కానీ ప్రత్యేకించి సబ్జెక్ట్ టీచర్లు లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. నీతి ఆయోగ్ 2019లో విడుదల చేసిన పాఠశాల విద్యా నాణ్యతా సూచీ ప్రకారం దేశంలో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థుల్లో కేవలం 30 శాతానికే గణితంలో ప్రావీణ్యం ఉందని తేలడం వంటి ఉదంతాలే ఇందుకు నిదర్శనం. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉండటం విద్యా వ్యవస్థపై ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. 2,021 లెక్కల ప్రకారం మధ్యప్రదేశ్‌లో 21,077, ఉత్తర ప్రదేశ్‌లో 17,683 బడులు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా పని చేస్తున్నాయి. దేశంలో ఇప్పుడు సుమారుగా 11.16 లక్షల మంది ఉపాధ్యాయుల అవసరం ఉంటుందని యునెస్కో స్పష్టం చేసింది. టీచర్ల నియామకం జరుపకుండా ఏళ్ల తరబడి ఒప్పంద ఉపాధ్యాయులు, విద్యావలంటీర్లతో సరిపెడుతుండటంతో విద్యావ్యవస్థ గాడి తప్పుతోంది. ఈ క్రమంలో సర్కారీ విద్యావ్యవస్థను బలహీనపరుస్తూ, పరోక్షంగా ప్రైవేటు పాఠశాలల విశృంఖల విద్యా వ్యాపారానికి ప్రభుత్వాలే కారణమవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరగడం గమనార్హం. కరోనా మహమ్మారి కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని అనేక ప్రైవేట్ పాఠశాలలు మూతపడ్డాయి. ఆయా పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మరోమార్గం లేకే ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు ముందుకొస్తున్నారు. హరియాణాలో 2020వ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో 20 లక్షల విద్యార్థులు ఉండగా ఈ ఏడాది వారి సంఖ్య 25 లక్షలకు పెరిగింది. ఈ ఏడాది తెలంగాణలో సుమారు రెండు లక్షలకుపైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోకి అదనంగా వచ్చి చేరారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేరుతున్న తరుణంలో టీచర్లు తగ్గి పోతుండటం ఆందోళన కలిగించే అంశం. రాష్ట్రంలో ఇప్పటికీ 18 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తక్షణమే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం ఎంతైనా అవసరం. (క్లిక్ చేయండి: దేశభక్తి అంటే తిరంగా సెల్ఫీ కాదు!) – మోటె చిరంజీవి, వరంగల్ -
జాతీయ నూతన విద్యావిధానంతో మేలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రపంచంతో విద్యార్థి పోటీపడేలా జాతీయ నూతన విద్యావిధానం దేశంలో అమల్లోకి రానున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యార్థులకు పౌష్టికాహారంతోపాటు మాతృభాషలో విద్యనందిస్తారన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా బండమీదిపల్లిలో గురువారం పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ) మూడో స్నాతకోత్సవానికి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ బీజే రావుతో కలిసి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రస్తుత విద్యావిధానాల వల్ల విద్యార్థుల్లో సామర్థ్యాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం జాతీయ విద్యా విధానాన్ని అమల్లోకి తేనుందని.. దీని ద్వారా మాతృభాషకు ప్రాధాన్యం పెరిగి విద్యార్థుల్లో సామర్థ్యం పెరుగుతుందన్నారు. దేశంలో ఇంకా పేదరికం, అవినీతి, అనారోగ్య సమస్యలున్నాయని.. వీటిని రూపుమాపే పరిశోధనలకు నూతన విద్యావిధానం పునాది వేస్తుందని ఆకాంక్షించారు. క్లిష్టమైన సమయంలో కరోనాకు వ్యాక్సిన్‌ను కనుగొని భారత్ ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలదని నిరూపించిందన్నారు. విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. స్నాతకోత్సవానికి ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ హాజరుకాలేదు. అదనపు కలెక్టర్ సీతారామారావు గవర్నర్‌కు స్వాగతం పలికారు. గొప్ప వ్యక్తులు కలిస్తే అద్భుతాలు గొప్ప వ్యక్తులు కలిస్తే అద్భుతాలు జరుగుతాయని గవర్నర్ తమిళిసై చెప్పారు. 1893లో స్వామి వివేకానంద, జంషెడ్ టాటా ఒకే ఓడలో కెనడాలోని వాంకోవర్‌కు బయల్దేరారని గుర్తుచేశారు. ఆ సమయంలో టాటా.. బ్రిటీష్ ఇండియాకు స్టీల్ ఉత్పత్తులు తెచ్చి విక్రయిస్తున్న విషయం వారి మధ్య చర్చకు వచ్చిందని చెప్పారు. భారత్‌లోనే సైన్స్ ఆఫ్ స్టీల్‌కు సంబంధించిన పరిశోధనాలయాన్ని ఏర్పాటు చేయాలని, ఇక్కడే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేలా కృషి చేయాలని టాటాకు వివేకానంద సూచించారన్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న టాటా 1898లో బెంగళూరులో టాటా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను స్థాపించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆరుగురికి పీహెచ్డీ, 72 మంది పీజీ, డిగ్రీ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. -
ఉచిత విద్యను 'రేవడీ' అనడం బాధాకరం.. ఆ దేశాన్ని చూసి నేర్చుకోవాలి
సాక్షి,న్యూఢిల్లీ: ఉచిత విద్యపై మరోసారి కీలకవ్యాఖ్యలు చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. డెన్మార్క్‌లో ఫ్రీ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి ఓ పాత నివేదికను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. విద్యార్థులందరికీ ఉచిత విద్య అందించినందువల్లే ఆ దేశం సుసంపన్నమైందని పేర్కొన్నారు. అలాంటిది మనదేశంలో మాత్రం ఉచిత విద్యను 'రేవడీ' సంస్కృతి అనడం తను బాధిస్తోందని కేజ్రీవాల్ తెలిపారు. భారత్‌ను సంపన్న దేశంగా అభివృద్ధి చేయాలంటే దేశంలోని విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను పైసా ఖర్చు లేకుండా అందించాలని సూచించారు. డెన్మార్క్ ప్రభుత్వం యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు నెలకు 1000 డాలర్ల వరకు సాయంగా అందిస్తున్నట్లు కేజ్రీవాల్ వీడియో రూపంలో షేర్ చేసిన నివేదికలో ఉంది. వాళ్లకు చదువుకుంటూనే పని చేసుకుని సంపాదించుకునే వెసులుబాటు కల్పిస్తోంది ప్రభుత్వం. పలు ఇతర దేశాల్లో మాత్రం విద్య కోసమే రూ.లక్షలు ఖర్చు చేసే పరిస్థితి ఉంది. ये वीडियो देखिए… अमीर देशों में शिक्षा फ्री है। मुझे बहुत दुःख होता है कि हमारे देश में फ्री शिक्षा को ये नेता फ्री की रेवड़ी कहते हैं ये देश अमीर इसलिए बने क्योंकि ये फ्री शिक्षा देते हैं। अगर हर भारतीय को अमीर बनाना है तो भारत के हर बच्चे को अच्छी शिक्षा फ्री देनी ही होगी। pic.twitter.com/iAincN3phy — Arvind Kejriwal (@ArvindKejriwal) October 25, 2022 ఇటీవల మధ్యప్రదేశ్‌లో గృహప్రవేశ కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరైన ప్రధాని మోదీ.. దేశానికి రేవడీ సంస్కృతి(ఉచితాలు) నుంచి విముక్తి కల్పించాలని వ్యాఖ్యానించారు. ఎంతో మంది పన్నుచెల్లింపుదారులు తనకు లేఖలు రాసి బాధపడ్డారని పేర్కొన్నారు. ఈ విషయంపై కేజ్రీవాల్ ఇప్పిటికే ప్రధానిపై విమర్శలు గుప్పించగా.. మంగళవారం మరోసారి డెన్మార్క్ ఉచిత విద్యా విధానాన్ని చూపి మోదీకి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. చదవండి: షిండేకు పదవీ గండం.. ఏ క్షణమైనా మహారాష్ట్రకు కొత్త సీఎం? -
అలా అంటుంటే చాలా బాధపడ్డాను: అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొంతమంది రాజకీయ నాయకులు ఉచిత విద్యావిధానం విషయంలో చేసిన వ్యాఖ్యలకు బాధపడ్డానన్నారు. తాను ప్రతి ఒక్క భారతీయుడు చదువుకునేలా... ఉచితంగా మంచి విద్యనభ్యసించాలని ఆకాంక్షించానన్నారు. కానీ భారత్‌లో ఉన్న రాజకీయ నాయకులు వీటిని ఉచిత రేవడి లేదా ఉచిత స్కీంల ఎర వంటివిగా అభివర్ణించారని చెప్పారు. డెన్మార్క్ వంటి దేశాలు ఉచిత విద్యా విధానంతో ధనిక దేశాలుగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ఈ మేరకు కేజ్రీవాల్ 2017లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చిన నివేదికను ప్రస్తావిస్తూ...."డెన్మార్క్ తమ దేశంలోని విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఉండనట్లయితే వారి నెలవారి ఖర్చుల నిమిత్తం దాదాపు రూ. 82 వేలు అందిస్తున్నట్లు పేర్కొంది. అలాగే వారి తల్లిదండ్రులు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఈ విధానంతో విద్యార్థులకు మంచి విద్యను పొందే అవకాశాన్ని మాత్రం ఇస్తున్నాయి అని" అన్నారు. తాను కూడా ఆ ఉద్దేశంతోనే ఈ పథకాన్ని తీసుకువచ్చానన్నారు. ప్రతి భారతీయుడు ధనవంతుడు కావాలంటే ప్రతి ఒక్క చిన్నారికి ఉచితంగా నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలని అన్నారు. వాస్తవానికి కేజ్రీవాల్ మోదీ పేరు ప్రస్తావించకుండానే ఆయన్ను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీది ఉచితంగా ఇస్తానని చెప్పకూడదని, రాజకీయ సంస్కృతిలో ఈ ఉచిత రేవడిలు ఒక ఎత్తుగడ వంటివని విమర్శించిన సంగతి తెలిసిందే. (చదవండి: కొరడాతో కొట్టించుకున్న చత్తీస్‌గఢ్ సీఎం.. ఎందుకంటే?) -
అమెరికాలో చదువుకోవాలనుకునే వారికి శుభవార్త
అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్ధులకు శుభవార్త. తమ దేశంలో చదువుకోండంటూ జనవరి నుంచి ప్రారంభమయ్యే ఎడ్యుకేషన్ ఇయర్ కోసం వీసా ధరఖాస్తు కోసం అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇటీవల భారత్-అమెరికా విదేశాంగ శాఖ మంత్రుల సమావేశంలో భారత్ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. వీసాల కోసం భారతీయులు ఎక్కువ కాలం ఎదురు చూడడం ఇబ్బందికరంగా ఉందని వ్యాఖ్యానించారు. దీంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన అమెరికా ప్రభుత్వం పలు దేశాల్లోని అమెరికా కార్యాలయాల నుంచి సిబ్బందిని భారత్‌కు పంపటానికి రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఎడ్యుకేషన్ వీసాలను జారీ చేసేందుకు అమెరికా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కోవిడ్-19 నుంచి అన్ని రకాల వీసాలను జారీ చేసేందుకు ఎక్కువ సమయం పట్టేది. దీంతో మిగిలిన వీసాల జారీని నిలిపివేసి కేవలం చేసి గడిచిన విద్యా సంవత్సరంలో ఎఫ్-1 వీసాలకు ప్రాధాన్యం ఇచ్చింది. కాగా, గత ఎడ్యుకేషన్ ఇయర్ 82వేల మందికి ఎఫ్-1 వీసాలు జారీ చేయగా.. త్వరలో ప్రారంభమయ్యే ఎడ్యుకేషన్ ఇయర్‌కు అదే తరహాలో వీసా జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఏపీలో విద్యా విధానం అద్భుతం
జగ్గయ్యపేట అర్బన్: ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానం, స్కూళ్ల ఆధునికీకరణ, సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర బృంద సభ్యులు కొనియాడారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్లు కతక్ శుక్లా, దేవస్మిత చక్రవర్తి తదితరులతో కూడిన కేంద్ర బృందం గురువారం జగ్గయ్యపేటలోని జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్‌ను సందర్శించింది. మనబడి నాడు–నేడు, తరగతుల విలీనం చేసిన ప్రక్రియ, ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్ల కేటాయింపు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక తదితర పథకాల అమలు తీరును పరిశీలించారు. నాడు–నేడు ద్వారా చేపట్టిన పనులు, నిధుల వినియోగం, తల్లిదండ్రుల కమిటీ పాత్ర తదితర అంశాలను ఎంఈఓ రవీంద్ర, ప్రధానోపాధ్యాయురాలు మాధవీలత వారికి వివరించారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన మెనూ గురించి తెలియజేయగా.. రోజుకొక వెరైటీ వంటకమా అంటూ వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, డిజిటల్ రూమ్, తరగతుల నిర్వహణ, భోజనశాల తదితరాలను పరిశీలించారు. 10, 9, 8 తరగతుల విద్యార్థులతో మాట్లాడి వారి సామర్థ్యాలను పరీక్షించారు. ప్రొఫెసర్ దేవస్మిత చక్రవర్తి మాట్లాడుతూ.. స్కూల్లోని మౌలిక సదుపాయాలన్నీ బాగున్నాయని.. నాడు–నేడు పనులైతే అద్భుతమని కితాబిచ్చారు. ఈ సందర్శనలో డీఈవో రేణుక, డీవైఈవో బి.గౌరీశంకర్, సీమెట్ ప్రొఫెసర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. -
Teachers Day 2022: బంగారు భవిష్యత్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఇతర పేద పిల్లలకు చదువే ఆస్తి. మన విద్యా విధానం ఆ ఆస్తిగా ఉందా? లేక భారంగా ఉందా? అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కేవలం పట్టా మాత్రమే పిల్లల చేతిలో పెట్టేలా మన చదువుల తీరు ఉందా? అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ పరిస్థితులను మార్చి, మన పిల్లలకు బంగారు భవిష్యత్ ఉండేలా దారి చూపాలనేది మనందరి ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసమే ఈ రంగంలో మార్పులుచేశాం తప్ప.. ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడానికి ఎంతమాత్రం కాదు. ఒక మంచి టీచర్ ఒక స్కూలును, ఒక వ్యవస్థను మార్చగలడు. గ్రామంతో మొదలు పెట్టి.. గొప్ప విప్లవాన్ని తీసుకు రాగలుగుతాడు. తన కన్న పిల్లల కోసమే కాదు, తరగతిలో ఉన్న పిల్లలందరూ బాగు పడాలని టీచర్ ఆరాట పడతారు. పిల్లలకు కేవలం సబ్జెక్టు మాత్రమే కాకుండా, వారి వ్యక్తిత్వాన్ని కూడా మలుస్తారు. వివేకాన్ని పెంచుతారు. పిల్లల్లోని ప్రతిభను బయటకు తీయడంలో కీలక పాత్ర పోషిస్తారు. క్రమశిక్షణతో జీవించడం నేర్పుతారు. బతకడం ఎలాగో టీచర్ నుంచే నేర్చుకుంటారు. తన కన్నా తన శిష్యులు గొప్ప వాళ్లు కావాలని ఆరాట పడతారు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కల్పించే దిశగా బాటలు వేసేలా విద్యా రంగంలో సంస్కరణలు అమలు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ సంస్కరణలు ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేవి కావని, ఆ ఉద్దేశంతో తీసుకొచ్చినవి కాదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మాదిరి ప్రభుత్వ టీచర్లకు నష్టం చేయడానికో, ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేయడానికో ఈ చర్యలు తీసుకోలేదని చెప్పారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన గురుపూజోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఇప్పటి మన విద్యా విధానంతో పిల్లలకు ప్రయోజనం కలుగుతోందా లేదా అని ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోలన్నారు. ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని, ఇవి సత్ఫలితాలు ఇచ్చి పిల్లలు అత్యున్నత స్థాయిలోకి వెళ్లేలా చేయడంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులదే కీలక భూమిక అన్నారు. ఈ దిశగా అందరూ ప్రభుత్వానికి తోడ్పాటు అందించాలని కోరారు. ‘కొన్ని సామాజిక వర్గాలు వేల సంవత్సరాలపాటు చదువులకు దూరంగా ఉన్నాయి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేదల పిల్లలు వారి మీద రుద్దిన చదువులను వేరే గత్యంతరం లేక చదువుకుంటున్నారు. వాటిని మార్చడంపై మన ప్రభుత్వం దృష్టి పెట్టింది. అత్యంత ప్రాధాన్యతా రంగంగా విద్యారంగాన్ని గుర్తించడంతో పాటు మూడేళ్ల కాలంలో అనేక అడుగులు ముందుకు వేశాం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. గురుపూజోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి సీఎం వైఎస్ జగన్ నివాళులు గురువులందరికీ వందనం ► రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పని చేస్తున్న టీచర్లకు, లెక్చరర్లకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. గురువులందరికీ శిరస్సు వంచి వందనం చేస్తున్నా. ఉపాధ్యాయులు అందరికీ శిఖరం లాంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన రాష్ట్రపతి స్థాయికి ఎదిగి, అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ► ‘నాకు జన్మనిచ్చినందుకు నా తండ్రికి రుణపడి ఉంటాను. ఈ జన్మను సార్థకం చేస్తూ.. మెరుగైన జీవితాన్ని పొందడం ఎలాగో నేర్పినందుకు నా గురువుకు రుణపడి ఉంటాను’ అనేవి స్ఫూర్తిదాయకమైన మాటలు. ఇవి నేను చెప్పడమే కాదు.. ఒకప్పుడు ప్రపంచాన్నే ఏలిన గొప్ప నాయకుడు అలెగ్జాండర్ కూడా చెప్పారు. సానపట్టక ముందు వజ్రమైనా రాయి లాగే ఉంటుంది. మంచి శిల్పి చేతిలో పడితే రాయి కూడా అద్భుతమైన శిల్పంగా మారుతుంది. అలాంటి అద్భుత శిల్పాలను చెక్కే వారు మన ఉపాధ్యాయులు. గురుపూజోత్సవం కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు, అధికారులు దేశంలోనే ముందుండాలని.. ► దేశంలో అన్ని రాష్ట్రాలకన్నా.. మెరుగ్గా ఉండేలా విద్యా రంగాన్ని తీర్చిదిద్దుతూ అడుగులు వేస్తున్నాం. ప్రపంచంలో చాలా వేగంగా మార్పులు వస్తున్నాయి. అందుకు అనుగుణంగా మన పిల్లలనూ తీర్చిదిద్దాల్సిన అవసరముంది. అందుకే విద్యా రంగాన్ని అత్యంత ప్రాధాన్యతా రంగంగా గుర్తించాం. ఈ మూడేళ్లలో అనేక అడుగులు ముందుకు వేశాం. ► నేను ముఖ్యమంత్రి అయ్యాక విద్యా శాఖ మీద చేసిన రివ్యూలు బహుశా మరే శాఖ మీదా చేయలేదు. ఎందుకంటే.. మన రాష్ట్రంలోని పిల్లలు, వారి కుటుంబాల తలరాతలను మార్చగలిగే ఒక అస్త్రం చదువు మాత్రమే. అందుకే విద్యా రంగంపై అంతగా దృష్టి పెట్టాను. గత ప్రభుత్వంలో మాదిరి విద్యా రంగం నుంచి ప్రభుత్వం తప్పుకుని, కార్పొరేట్ వర్గాలకు ఈ రంగాన్ని అమ్మేసి.. పేద సామాజిక వర్గాలకు అన్యాయం చేయడానికి ఈ సంస్కరణలు తీసుకురాలేదు. పెద్ద చదువులకు, మంచి చదువులకు.. పేదరికం ఏమాత్రం అడ్డు కాకూడదు అన్న ఉద్దేశంతో తెచ్చిన మార్పులివి. గతంలో మాదిరి కార్పొరేట్ రంగంతో కుమ్మక్కై ఇంగ్లిష్ మీడియం, క్వాలిటీ ఎడ్యుకేషన్‌ను పేదలకు దూరంచేసే మార్పులు కావు. ప్రభుత్వ టీచర్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టేవి కావు. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసేవి అంతకంటే కావు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ బడికి ఘన వైభవం ► గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యానికి గురైన విద్యా సంస్థలను అభివృద్ధి పరిచి, వాటికి ఘన వైభవం చేకూర్చే తపనతో ప్రభుత్వం ఈ మార్పులు చేపట్టింది. నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర పేదలు దశాబ్దాలుగా ఆశించిన ఫలితాల కోసం చేపట్టిన మార్పులు ఇవి. పిల్లల చదువులను ప్రోత్సహించేందుకు తల్లులకు మద్దతుగా ఉండేందుకు తెచ్చిన మార్పులివి. ప్రభుత్వ బడి కార్పొరేట్ బడికన్నా బాగుండాలని చేసిన మార్పులివి. టీచర్లు తమ పిల్లలను కూడా ప్రభుత్వ స్కూళ్లలోనే చదివించాలన్న మంచి సంకల్పంతో తీసుకొస్తున్న మార్పులివి. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం ఎలా? లిటరసీని పెంచడం ఎలా? నాణ్యమైన విద్యను అందించడం ఎలా? అను ప్రశ్నలకు సమాధానంగా తీసుకొస్తున్న మార్పులు ఇవి. ► ఉన్నత విద్యలో కనీసంగా 70 శాతం జీఈఆర్ రేషియో ఉండాలన్న ఉద్దేశంతో అడుగులు ముందుకేస్తున్నాం. ఇవన్నీ బాగుండాలంటే, ఈ లక్ష్యాలు చేరుకోవాలంటే.. మనం అంతా ఒక్కటిగా ముందుకు సాగితేనే సాధ్యం అవుతుంది. గత ప్రభుత్వంలో కార్పొరేట్‌కు అందలం ► గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసి, కార్పొరేట్ విద్యా రంగానికి పెద్దపీట వేశారు. ప్రభుత్వ స్కూళ్లకు, ఆస్పత్రులకు, చివరకు ఆర్టీసీ బస్సు ఎక్కడం కూడా వేస్ట్ అన్న రీతిలో వ్యవహారం సాగింది. తుదకు ఉద్యోగులను తీసేసే పరిస్థితిలోకి వెళ్లింది. ► మన ప్రభుత్వం వచ్చాక ఉపాధ్యాయులను, ఉద్యోగులను ఎంతో గౌరవిస్తోంది. ఎవరూ అడక్కపోయినా 62 ఏళ్లకు పదవీ విరమణ వయసును పెంచాం. ఎస్జీటీలను ఎస్ఏలుగా, ఎస్ఏలను గ్రేడ్–2 హెడ్మాస్టర్లుగా, హెడ్మాస్టర్లను ఎంఈఓలుగా ప్రమోషన్లు ఇస్తున్నాం. విద్యా రంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఇవి అవసరం అని భావించి వెనక్కి ముందడుగు వేస్తున్నాం. క్షేత్ర స్థాయిలో విద్యా బోధనను పటిష్టం చేసేందుకు అడుగులు ముందుకేస్తున్నాం. అమ్మ ఒడి, సంపూర్ణ పోషణ, గోరుముద్ద, విద్యా కానుక, మనబడి నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్, సబ్జెక్ట్ టీచర్స్ కాన్సెప్ట్, బైజూస్‌తో ఒప్పందం, ఎనిమిదవ తరగతి పిల్లలకు ట్యాబ్‌ల పంపిణీ, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, బై లింగువల్ టెక్ట్స్ బుక్స్ పంపిణీ, సునాయాసంగా బోధించేందుకు టీచర్లకు స్కిల్స్ అప్‌గ్రేడేషన్ ప్రొగ్రాం, ఉన్నత విద్యలో విద్యా దీవెన, వసతి దీవెన, కరిక్యులమ్‌లో మార్పులు.. ఇలా వీటన్నింటి కోసం ఈ మూడేళ్లలో మనందరి ప్రభుత్వం ఖర్చు చేస్తున్న సొమ్ము రూ.53 వేల కోట్లు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యా రంగం మీద ప్రేమ, సానుభూతి ఉన్న ఏకైక ప్రభుత్వం మనది. పేదలకు ఉచిత విద్యను, నాణ్యమైన విద్యను, జీవితంలో వారు నిలదొక్కుకోవడానికి ఉపయోపడే విద్యను ఇవ్వాలన్నది మన విధానం. ఇందులో చదువు చెప్పడం మాత్రమే కాకుండా, శిలలను శిల్పాలుగా చెక్కినట్లు.. వ్యక్తిత్వాన్ని సైతం మలిచే ఉపాధ్యాయులుగా మీ తోడ్పాటు చాలా ముఖ్యం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తశుద్ధితో పెన్షన్ సమస్యకు పరిష్కారం.. ► ఏ ఒక్కరూ కూడా పట్టించుకోని ఉద్యోగుల పెన్షన్ విషయం మీద పూర్తి చిత్తశుద్ధితో, వారికి మేలు చేసేలా అడుగులు వేస్తున్నాం. మంచి పరిష్కారం కోసం వెతుకుతున్న ప్రభుత్వం మనదే. ఇప్పుడున్న ప్రతిపక్షం గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. వారికి మంచి చేయాలని ఏనాడూ ప్రయత్నించలేదు. ► కానీ ఇప్పుడు మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఉద్యోగులకు చేస్తున్న మేలు గురించి, వారి పెన్షన్‌పై చేస్తున్న కృషికి సంబంధించి ఒక్క వాక్యం కూడా రాయని, చూపని ఎల్లో మీడియా.. ఇప్పుడు మనం పరిష్కారం కోసం చిత్తశుద్ధితో అడుగులు ముందుకు వేస్తోంటే రెచ్చగొట్టేలా కుతంత్రాలు పన్నుతోంది. ► వీటన్నింటినీ గమనించాలని మిమ్మల్ని కోరుతున్నాను. అన్ని వర్గాలకు మంచి చేసిన చరిత్ర కలిగిన.. టీచర్లకు, ప్రభుత్వ స్కూళ్లకు ఎన్నడూ లేని గౌరవాన్ని పెంచిన ఈ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండదండలు అందించాలి. -
ఇంగితమూ జ్ఞానమే!
విద్యాభ్యాసం, విస్తృత పుస్తక పఠనాల వల్ల పొందే జ్ఞానం ఒకటైతే, మనిషిలో ఉండే సహజమైన గ్రహింపు శక్తి, అవగాహన శక్తి వలన వచ్చే జ్ఞానం మరొకటి. దీనికే ఇంగితం లేదా ఇంగితజ్ఞానం అని పేరు. చదువుకున్న వారిలోనే ఇది ఉండనక్కరలేదు. ఇది ప్రతి మనిషిలో ఉండే ఒక అంతర్లీనమైన ఒక జీవలక్షణం. జీవితంలో మనకు కలిగే అనేక అనుభవాలతో ఈ ఇంగితం మరింతగా పదునెక్కుతుంది. అందుకే ఇది ఎంతో విశిష్టమైంది. చదువుతో నిమిత్తంలేకుండా ప్రతి మనిషి జీవనానికి, జీవితానికి అత్యంత ఆవశ్యకమైనది. ఈ ఇంగితం మనలను అప్రమత్తులను చేసి వ్యవహార దక్షతను పొంచి జీవితం సజావుగా సాగేటట్టు చేస్తుంది. విద్యాధికులలో ఉండే జ్ఞానమనే బంగరు పళ్లెరానికి ఇది ఒక గోడ చేర్పు లాంటిది. అనేక శాస్త్రాలను మధించి దాని జ్ఞానామృతాన్ని గ్రోలిన పండితులైనా, తమ జీవితాన్ని నూతన ఆవిష్కరణల కోసమై ధారపోసే శాస్త్రవేత్తలైనా తమ ఇంగితం ఉపయోగించవలసిన అవసరం ఉంటుంది. అలా కానివేళ, వారి జ్ఞానం వారికే కాక మానవాళికే ముప్పు తెస్తుంది. చరిత్ర పుటలు తిరగవేసినా, మన సమకాలీన చరిత్రను పరిశీలించినా ఈ విషయం తేటతెల్లమవుతుంది. ఒక గురువు తనవద్ద శ్రద్ధతో విద్యాభ్యాసాన్ని పూర్తిచేసుకున్న నలుగురు శిష్యులకు చనిపోయిన వారిని బతికించగల అద్భుత శక్తినిచ్చాడు. అయితే, దానిని అత్యవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించ మని హెచ్చరించి పంపాడు. వారిలో ముగ్గురు మార్గమధ్యంలో ఒక పులి కళేబరాన్ని చూసి వారి అద్భుత శక్తిని ప్రయోగించాలని ఉవ్విళ్ళూరటం, నాలుగవవాడు వారి మూర్ఖత్వానికి వగచి, హితవు పలికి భంగపడి వీరికి దూరంగా వెళ్లి తన ప్రాణాలు దక్కించుకున్న కథ మనకు తెలుసు. ప్రాణాలు కోల్పోయిన ఆ నలుగురు జ్ఞానసంపన్నులే. కాని వారిలో కొరవడిన ఇంగితం ప్రాణం నిలబెట్టుకున్న వాడిలో మెండుగా ఉంది. అలాగే పరస్త్రీని తాకకూడదన్న ధర్మాన్ని మనసులో స్థిరరచుకున్న ఒక శిష్యుడు ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక స్త్రీని రక్షించడానికి ముందుకు రాలేదు. అక్కడ ఆపదలో ఉన్నది ఒక జీవి మాత్రమేనని భావించిన రెండోవాడు ఆమెను కాపాడటానికి కారణం ఇంగితమే. ఇంగితమంటే వివేకమే. ఒకరకమైన యుక్తాయుక్త విచక్షణ. సందర్భోచిత జ్ఞానం. మన చదువుల సారానికి, జీవితానుభవాన్ని విచక్షణాశక్తిని కలిపి చూడగలగటమే ఇంగితం. మన ప్రవర్తనలో, వ్యవహార శైలిలో దానిని చూపగలిగేవారి జీవితం అపార్థాలు, తగాదాలు లేకుండా సాగుతుంది. వందలాది పక్షులకు ఆశ్రయమిచ్చే ఓపెద్ద చెట్టుకింద కూర్చుని ధ్యానముద్రలో ఉన్నాడో పండితుడు. అపుడో పక్షి విడచిన విసర్జనం అతని తల మీద పడింది. విపరీతమైన కోపమొచ్చిన ఆయన దాని వంక తీక్షణంగా చూసాడు. అంతే! ఆ పక్షి కాలి బూడిదై పోయింది. ఆయనకు సంతోషమూ, గర్వమూ కలిగాయి. అన్ని పక్షులున్న చెట్టు కింద కూర్చుంటే ఆ అనుభవం ఎదురవ్వటం నీరు పల్లానికి వెళుతుందన్న నంత సహజం. ఇంత చిన్న విషయం ఆయనకు తట్టకపోవటానికి కారణం తన ఇంగితజ్ఞానాన్ని ఉపయోగించ లేకపోవటమే. ఇక్కడ ఇంగితమంటే వివేకమని అర్థం. చాల సహజమైన ఈ ఇంగితజ్ఞానాన్ని ఉపయోగించకపోతే పండితులు, జ్ఞానసంపన్నులు వారి శాస్త్ర సంబంధమైన జ్ఞానాన్ని, సాధన ద్వారా పొందిన జ్ఞానాన్ని ఎలా మట్టిపాలు చేసుకుంటారో చెపుతుందీ ఉదాహరణ. నిస్సందేహంగా జ్ఞానమే ఆధిక్యమైనది, గొప్పది, విలువైనది. ఈ జ్ఞానాన్ని ప్రదర్శించేటప్పుడు ఒక నియంత్రణాశక్తిగా ఈ ఇంగితం పనిచేయాలి. రివాల్వరు ఉపయోగించగలగటం జ్ఞానం. అయితే, దానిని ఆ సందర్భంలో వాడవలసిన అవసరం ఉందా లేదా అనే సంగతిని మనకు బోధపరచే గొప్ప వజ్జ ఈ ఇంగితం. ఇంగితమంటే తార్కికత, విచక్షణ, భావోద్వేగాలపై ఒక పట్టు. ఇంగితమంటే మన శక్తియుక్తుల్ని అవసరమైన చోట, తప్పనిసరైన క్షణాన మాత్రమే ఉపయోగించేటట్టు మనల్ని సమాయత్తం చేసే ఒక నిబద్ధత, ఒక అదుపు. అలా కానివేళలలో అది పిచుక మీద బ్రహ్మాస్త్రమే అవుతుంది. ఒక పండితుడు గణితంలో అపారమైన జ్ఞానాన్ని సంపాదించాడు. విశేషమైన ప్రజ్ఞతో గణితానికి చెందిన ఏ లెక్కనైనా, సమస్యనైనా పరిష్కరించసాగాడు. తన గ్రామంలోనూ, చుట్టుపక్కల గ్రామాలలోనూ అంతటి మేధావి లేడని ఖ్యాతి పొందాడు. పేరు, డబ్బు వచ్చింది. ప్రజలు, ఇంత గణితశాస్త్ర పండితులు ఆయన ప్రజ్ఞాపాటవాలకు ఆశ్చర్యానుభూతికి లోనై ఆయనకు నీరాజ నాలిచ్చి సత్కారాలు, సన్మానాలు చేసారు. గణితంలో తనకన్నా ప్రజ్ఞావంతుడు లేడనే అహంకారం ప్రవేశించింది అతనిలో. గర్వం తారస్థాయికి చేరుకొని ‘నాతో పోటీపడగలవారెవరైనా ఉన్నారా మీ గ్రామంలో?’ అని సవాలు విసరి, తలపడినవారిని ఓడించి, దూషించి అవమానించసాగాడు. ఒకసారి ఒక సాయంసంధ్య వేళలో ఒక గ్రామంలోకి ప్రవేశిస్తున్న సమయాన ఒక పశువుల కాపరి కలిసాడు. ఆ చదువురానివాడితోనూ తన గొప్పతనాన్ని గురించి అతిగా చెపుతూ వెళుతున్నాడు. ఒకచోట ఆ కాపరి తటాలున కిందకు వంగి ఒక గుప్పెడు ఇసుకను తీసుకుని ‘అయ్యా, కొంచెం ఇదెంతో లెక్కించి చెప్పగలరా?’ అని ఆ గణితశాస్త్ర పండితుణ్ణి అడిగాడు. ఆ ప్రశ్నకాపండితుడి నోటివెంట ఒక క్షణం మాట రాలేదు. ఆలోచన స్తంభించి పోయింది. చివరకు ఆ ఇసుకను లెక్కించలేమన్నాడు. దానికా పశువులు కాపరి ‘సామీ! దీనిని గుప్పెడని కదా అంటారు. ఐదు వేళ్ళు దగ్గరకు చేర్చి తీసుకుంటే చారెడు, రెండు అరచేతులతో తీసుకుంటే దోసెడు, బొటనవేలికి, చూపుడువేలికి మధ్య తీసుకుంటే చిటికెడని కదా అంటారు’ అన్నాడు. అంతే ఆ పండితుడికి తన తప్పు తెలిసింది. మామూలు పద్ధతిలోనే ఆ ఇసుకను లెక్కించే యత్నం చేయటం వల్ల సమాధానం చెప్పలేకపోయానని. సహజసిద్ధమైన ఇంగితజ్ఞానాన్ని తను చూపలేకపోయానని అర్థం చేసుకుని తన అహంకారానికి సిగ్గుపడి అతడికి నమస్కరించి ఇంటిముఖం పట్టాడు. నిజానికి ఆ నిరక్షరాస్యుడు పండితుడికి ఏ విషయంలో పోటీనే కాదు. కాని అతడు పండితుణ్ణి ప్రశ్నించటానికి కారణం అతడి ఇంగితమే. దీనినే మరో కోణం నుండి చూస్తే ఆ పండితుడి గర్వానికి, అనుచిత ప్రవర్తనకు ఆ పశువుల కాపరి ప్రశ్న నిరోధకం. అంతేకాదు. సహజ సిద్ధమైన ఇంగితానికి.. జీవితపరిశీలన, అన్వయం, సందర్భాచిత ఆకళింపు జత కూడితే అది విశేషమైన ప్రజ్ఞ. ఏ పుస్తకాలలో చెప్పని ఏ గురువు నేర్పని విద్య ఇది. ఇంగితమనే పుస్తకంలో జీవితానుభావాలే పుటలు, అధ్యాపకులు. మనలో సహజంగా ఉండే ఏ అద్భుత శక్తి, మన జీవిత మార్గదర్శి. విద్య వల్ల మరింతగా పదునెక్కాలి. అపుడే మరింతగా ప్రకాశిస్తుంది. ఇంగితమంటే లోకజ్ఞానం. ఇది మన నిత్య వ్యవహారాల నిర్వహణలో సహాయపడుతూ ఉంటుంది. అలాగే కొన్ని ముఖ్య సందర్భాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ ఇంగితం మనకు ఎంతో వెన్నుదన్నుగా ఉంటుంది. ఇంగితం మన ‘వివేచనా నేత్రం’ ఇన్ని ఉదాహరణలవల్ల మనం గ్రహించవలసింది ఏమిటి? ఇంగితమంటే ఒకసహజమైన తెలివిడి, లోతైన పరిశీలన, బుద్ధికి, మనస్సుకి గోచరమయ్యే ఒక అద్భుత అవగాహన. చదువుకున్న వారిలో ఉండేవి, ఉండవలసిన లక్షణాలు ఇవే కదూ! శాస్త్రపరమైన జ్ఞానం అక్షరాస్యులదైతే, నిరక్షరాస్యులది పరిశీలనా గతమైనది. ఇంగితం జ్ఞానమే. అది సహజాతమైనది అన్నారు పెద్దలు. –బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
పట్టా పట్టు.. కొలువు కొట్టు
చదువు పూర్తికాగానే ఉద్యోగం కల్పించే లక్ష్యంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందు కోసం ఉన్నత విద్యలో నూతన జాతీయ విద్యావిధాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థి దశలోనే వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే దిశగా కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఇంజినీరింగ్‌లో అమల్లో ఉన్న ఇంటర్న్‌షిప్ ఈ విద్యా సంవత్సరం నుంచే డిగ్రీలో కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సిద్ధపడిన విద్యార్థులను పరిశ్రమలతో మ్యాపింగ్ పూర్తి చేసింది. నెల్లూరు (టౌన్): ఉన్నత విద్య చదివే విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. 2022–23 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను తప్పని సరి చేసింది. ఇప్పటికే ఇంజినీరింగ్‌లో ఇంటర్న్‌షిప్ ఉంది. డిగ్రీలో కూడా ఇంటర్న్‌షిప్‌ను అమలు చేస్తే విద్యార్థులు చదువు పూర్తి కాగానే సులభంగా ఉద్యోగ, ఉపాధి పొందే అవకాశం ఉంది. తద్వారా నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి ప్రభుత్వ లక్ష్యంగా పని చేస్తోంది. 10 నెలల ఇంటర్న్‌షిప్ తప్పని సరి డిగ్రీలో 10 నెలల పాటు ఇంటర్న్‌షిప్ తప్పని సరి చేశారు. అకడమిక్ విద్యా సంవత్సరం ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్‌షిప్‌లో చూపిన ప్రతిభకు మార్కులు కేటాయించారు. కోర్సుకు సంబంధించిన పరిశ్రమలో చదువుతో పాటు అనుభవం సంపాదించడం, పరిశ్రమలతో అనుబంధం ఏర్పడేందుకు ఇంటర్న్‌షిప్ ఎంతో ఉపయోగపడుతోంది. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో రెండు సెమిస్టర్ పరీక్షలు అయిన తర్వాత 2 నెలలు పాటు కమ్యూనిటీ సర్వీసు ప్రాజెక్టు చేయాల్సి ఉంటుంది. ద్వితీయ సంవత్సరంలో 3, 4 సెమిస్టర్ పరీక్షలు పూర్తయిన తర్వాత 2 నెలల పాటు ఇంటర్న్‌షిప్ చేయాలి. డిగ్రీ తృతీయ సంవత్సరంలో 5వ సెమిస్టర్ పరీక్షలు పూర్తయిన తర్వాత 6 నెలల పాటు ప్రాజెక్టు వర్క్ చేయాల్సి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 4 ఏళ్లు డిగ్రీ కోర్సు అమలు చేయనున్నట్లు ఉన్నత విద్య అధికారులు చెబుతున్నారు. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు కోర్సును బట్టి (ఉదాహరణకు బీఏ హానర్స్ పేరుతో) సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. 8,964 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ జిల్లాలో మొత్తం 74 ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వ–10, ఎయిడెడ్–3, ప్రైవేట్– 61 కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో డిగ్రీ 3 సంత్సరాలు కలిపి మొత్తం 45 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్న్‌షిప్ కోసం విద్యార్థులు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టం పోర్టల్ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 13,547 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 8,964 మంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌కు పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 3,883 మంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌కు ఆయా పరిశ్రమలు, సంస్థలతో మ్యాపింగ్ చేసుకోవడం జరిగింది. మిగిలిన విద్యార్థులు కూడా పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకునేందుకు వర్సిటీ అధికారులు చర్యలు చేపట్టారు. ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్‌తో విద్యార్థుల డేటాను తెప్పించి వర్సిటీలోనే నమోదు చేయిస్తున్నారు. ఇంటర్న్‌షిప్ మీద కళాశాలల యాజమాన్యాలతో పాటు ప్రిన్సిపల్స్‌కు కూడా వర్సిటీ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా స్థాయిల్లో పర్యవేక్షణ కమిటీలు నూతన విద్యా విధానాన్ని పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి కమిటీలో చైర్మన్‌గా కలెక్టర్, మెంబర్‌గా వర్సిటీ వైస్ చాన్సలర్, మెంబర్ సెక్రటరీగా జాయింట్ కలెక్టర్, అడిషనల్ మెంబరు సెక్రటరీగా వర్సిటీ రిజిస్ట్రార్, మెంబర్లుగా డీఐఈపీసీ జనరల్ మేనేజర్, డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, విజ్ఞాన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ (చేజర్ల), కృష్ణచైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్, ఆదానీ విల్మర్, సీమెన్స్గమేసా, ఆదానీపోర్ట్, ఐఆర్సీఎస్ చైర్మన్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, బీఎం ఆర్ గ్రూపు జీఎంలు ఉన్నారు. ఇంటర్న్‌షిప్‌కు అవకాశం డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కోసం తిరుపతి జిల్లా కలెక్టర్‌తో సమావేశ అనంతరం పరిశ్రమలు, సచివాలయాలు, ఆర్బీకేలు, శ్రీసిటీ, స్కిల్ డెవలప్మెంట్ తదితర విభాగాల్లో 4 వేల మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పించారు. వచ్చే నెల 6న కమిటీ చైర్మన్ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, పరిశ్రమలు, సంస్థల ప్రతినిధులతో మాట్లాడి మిగిలిన విద్యార్థులకు కూడా ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పించనున్నాం. – సుందరవల్లి, వైస్ చాన్సలర్, వీఎస్‌యూ -
‘అమెరికా మీడియా ప్రశంసిస్తే.. ఇక్కడ సీబీఐ దాడులు చేయిస్తున్నారు’
న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై జరుగుతున్న సీబీఐ దాడులు గురించి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలోని విద్యా విధానంపై అమెరికాలోని ప్రఖ్యాత వార్తా పత్రిక న్యూయార్క్ టైమ్స్ మనీష్ సిసోడియాను ప్రశంసలతో ముంచెత్తుతూ ఫ్రంట్ పేజీలో ఆర్టికల్ రాస్తే, అలాంటి వ్యక్తిని మన కేంద్ర ప్రభుత్వం సీబీఐ దాడులతో సత్కరిస్తోందంటూ ఎద్దేవా చేశారు. సీబీఐ దర్యాప్తు సంస్థ శుక్రవారం ఢిల్లీ డిప్యూటి సీఎం మనీష్ సిసోడియా నివాసంతో సహా సుమారు 10 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. అయినా తాము సీబీఐని స్వాగతిస్తామని, తాము నిజాయితీపరులమని కేజ్రీవాల్ అన్నారు. తాము లక్షలాది మంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నామని, ఇలాంటి మంచి పనులు చేసేవారిని వేధించడం దురదృష్టకరం అని ఆవేదనగా అన్నారు. బహుశా అందుకేనేమో మన దేశం ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా మారలేదు అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వాస్తవానికి గతనెలలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఎక్సూక్యూజ్ పాలసీ 2021-22 అమలులో అవతవకలపై సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. ఐతే ఆయన మనీష్ సిసోడియా కూడా ఈ పాలసీ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ... సీబీఐతో విచారణ జరిచాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు ఢిల్లీ సీఎం గతంలో కూడా సీబీఐ దాడులు జరిగాయని అప్పుడు కూడా ఏమీ కనుగొనబడలేదని చెప్పారు. అంతేగాదు తనపై కూడా చాలా కేసులు నమోదయ్యాయని, వాటిలో ఏది నిజం అని తేలలేదు కాబట్టి ఇప్పుడూ కూడా ఏం జరగదని ధీమాగా అన్నారు. जिस दिन अमेरिका के सबसे बड़े अख़बार NYT के फ़्रंट पेज पर दिल्ली शिक्षा मॉडल की तारीफ़ और मनीष सिसोदिया की तस्वीर छपी, उसी दिन मनीष के घर केंद्र ने CBI भेजी CBI का स्वागत है। पूरा cooperate करेंगे। पहले भी कई जाँच/रेड हुईं। कुछ नहीं निकला। अब भी कुछ नहीं निकलेगा https://t.co/oQXitimbYZ — Arvind Kejriwal (@ArvindKejriwal) August 19, 2022 (చదవండి: కేజ్రీవాల్ ఎఫెక్ట్.. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంట సీబీఐ రైడ్స్) -
విద్యాభివృద్ధి కార్యక్రమాలు ఏపీలో అద్భుతం
సాక్షి, అమరావతి: ఏపీలో అమలుచేస్తున్న విద్యాభివృద్ధి కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయని గోవా రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రతినిధులు ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయంగా ఈ కార్యక్రమాలు నిలుస్తున్నాయన్నారు. గోవా స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, డైరెక్టరేట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రతినిధులు, గురువారం ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌ను సందర్శించారు. జాతీయ విద్యా విధానం–2020 అమలులో ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ విధానాలను పరిశీలించారు. మల్టీ డిసిప్లినరీ, ప్రవేశ పరీక్షల నిర్వహణ, డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ఇంటర్న్‌షిప్, న్యాక్, ఎన్ఐఆర్ఎఫ్, ఎన్బీఏ ర్యాంకింగ్స్‌లో ఏపీ చేపడుతున్న చర్యల గురించి మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ప్రతినిధి బృందానికి వివరించారు. డిగ్రీ మూడో సంవత్సరం చదువు తర్వాత ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ఆప్షన్, ఆపై పరిశోధనతో నాలుగేళ్ల హానర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌ను ఏపీ ఎలా ప్రవేశపెట్టిందో తెలిపారు. ప్రొఫెషనల్, సంప్రదాయ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో 10 నెలల తప్పనిసరి ఇంటర్న్‌షిప్‌ను ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీ, జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీలు ఇంటర్న్‌షిప్‌ల పురోగతిని పర్యవేక్షిస్తున్నాయని ఆయన చెప్పారు. పరిశ్రమలతో విద్యా సంస్థల అనుసంధానం కోసం ’ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ కనెక్ట్ పోర్టల్’ను ఏర్పాటుచేశామన్నారు. ఎల్ఎంఎస్ పోర్టల్ ద్వారా, అమెజాన్ వెబ్ సర్వీసెస్, సేల్స్‌ఫోర్స్, మైక్రోసాఫ్ట్ మొదలైన బహుళజాతి కార్పొరేట్ సంస్థలు, నాస్కామ్ సహకారంతో 1.75 లక్షల మందికి ఆన్లైన్ ఇంటర్న్‌షిప్‌లను అందిస్తున్నట్లు హేమచంద్రారెడ్డి వివరించారు. ప్రొఫెషనల్ కోర్సులలో ప్రవేశానికి వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణ, సంప్రదాయ డిగ్రీ ప్రోగ్రామ్‌ల కోసం ఆన్లైన్ డిగ్రీ ప్రవేశాల నిర్వహణ గురించి కూడా ఆయన వివరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనా అభినందనలు ఇక పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ అయిన జగనన్న విద్యా దీవెనతో పాటు జగనన్న వసతి దీవెన కింద విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని గోవా బృందం అభినందించింది. రాష్ట్రంలోని ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 86 శాతం మంది విద్యార్థులకు ఇది ప్రయోజనం చేకూరుతుండడం అద్భుతమని.. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకాల్లేవని కొనియాడింది. నూతన విద్యా విధానం–2020ని అమలుచేయడంలో ఏపీ కృషిని బృందం ప్రశంసించింది. అలాగే, రూ.32.కోట్లతో ప్రత్యేక పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని 3.5 లక్షల మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లను అందించే బృహత్తర కార్యక్రమాన్ని ప్రశంసించింది. మండలి వైస్‌చైర్మన్ ప్రొఫెసర్ కె. రామ్మోహనరావు, కార్యదర్శి ప్రొ. సుధీర్ ప్రేమ్‌కుమార్ కూడా బృందంతో సంభాషించారు. గోవా బృందంలో టీచింగ్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రొఫెసర్ నియాన్ మార్చోన్, హయ్యర్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ (అకడమిక్స్) ప్రొ. ఎఫ్ఎం నదాఫ్, రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్, స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వందనా నాయక్, ఉన్నత విద్యా డైరెక్టరేట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెల్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు సందేశ్ గాంకర్, సిద్ధి భండాంకర్, మెలాన్సీ మస్కరెన్హాస్, నెట్వర్క్ సిస్టమ్ ఇన్చార్జి డారిల్ పెరీరా తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: 13 ఏళ్లకే 10వ తరగతి పూర్తి.. యాంకర్‌గా అదరగొడుతున్న అభిషేక్ -
నాణ్యమైన విద్యే లక్ష్యం
పాఠశాలల్లో కొన్ని తరగతుల విలీనం చేయడం ద్వారా నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రాథమిక పాఠశాలల తరగతులు, హైస్కూల్లో ప్రాథమికోన్నత పాఠశాల తరగతులు విలీన ప్రక్రియను ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ఆరంభించింది. అయితే ఈ విధానాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నా.. విద్యార్థుల్లో కింది తరగతుల నుంచే విద్యా ప్రమాణాలు పెంపు లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెల్లూరు (టౌన్): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే విద్యా విధానంలో అనేక సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం తాజాగా 2022–23 విద్యా సంవత్సరం నుంచి మరో కొత్త అడుగు వేసింది. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఒకటి నుంచి మూడు కి.మీ. దూరంలో ఉండే ప్రాథమికోన్నత పాఠశాలల్లో, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 6, 7, 8 తరగతుల విద్యార్థులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లోకి విలీనం చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. జిల్లా విద్యాశాఖాధికారులు ఈ మేరకు పాఠశాలల విలీనం మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇప్పటికే కొంత మంది విద్యార్థులను సమీప పాఠశాలల్లో విలీనం చేశారు. మరికొన్ని పాఠశాలల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. 17,588 మంది విద్యార్థులు విలీనం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కి.మీ. దూరంలోపు ఉన్న 478 ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులను 276 హైస్కూల్స్ల్లోకి విలీనం చేశారు. మరో 113 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులను 87 ప్రా«థమికోన్నత పాఠశాలల్లోకి విలీనం చేశారు. కిలో మీటరు నుంచి 3 కి.మీ.లోపు ఉన్న 19 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7, 8 తరగతులు చదువుతున్న విద్యార్థులను 15 ఉన్నత పాఠశాలల్లోకి విలీనం చేశారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 17,588 మంది విద్యార్థులు విలీనమయ్యారు. ఫౌండేషన్ నుంచి హైస్కూల్ ప్లస్‌గా ఏర్పాటు నూతన విద్యావిధానం అమల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి ఫౌండేషన్ స్కూల్స్ నుంచి హైస్కూల్స్ ప్లస్‌గా తరగతుల వారీగా ఏర్పాటు చేయనున్నారు. ఫౌండేషన్ స్కూల్స్‌గా పీపీ–1, పీపీ–2, 1, 2 తరగతులు, ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్‌గా పీపీ–1, పీపీ–2, 1 నుంచి 5 తరగతుల వరకు, ప్రీ హైస్కూల్స్‌లో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, హైస్కూల్లో 3 నుంచి 10వ తరగతి వరకు, హైస్కూల్ ప్లస్ స్కూల్లో 3 నుంచి 12 తరగతుల వరకు నిర్వహిస్తారు. నూతన విద్యా విధానం ప్రకారం ప్రతి 30 మంది విద్యార్థులకు ఉపాధ్యాయుడిని నియమించనున్నారు. ఉపాధ్యాయుల సర్దుబాటు నూతన విద్యా విధానం అమలు చేయడంతో ఉపాధ్యాయులను త్వరలో సర్దుబాటు చేయనున్నారు. ప్రతి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను నియమించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో ఇప్పటికే అవసరానికి మించి 2,514 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్కలు తేల్చారు. 980 మంది మిగులు ఉపాధ్యాయులు ఉన్నట్లు తేలింది. వీరిని విద్యార్థులు ఎక్కువ సంఖ్య ఉన్న పాఠశాలలను గుర్తించి సర్దుబాటు చేయాలని ఆదేశించారు. ప్రతి సబ్జెక్ట్‌కు ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఉపాధ్యాయులకు వారంలో 30 నుంచి 32 గంటలకు మించి పనిభారం పడకుండా 45 పిరియడ్లకు మించకుండా చర్యలు తీసుకోనున్నారు. విలీనం వల్ల ఉపయోగాలు విద్యార్థుల్లో ప్రాథమిక తరగతుల నుంచి విద్యా పునాదులు వేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రాథమిక పాఠశాలల్లో ఐదు తరగతులు ఉన్నా.. విద్యార్థులను బట్టి ఒకరిద్దరూ మాత్రమే ఉపాధ్యాయులు ఉంటారు. దీని వల్ల ఒకే ఉపాధ్యాయుడు అన్ని తరగతులను బోధించడం వల్ల ప్రాథమిక స్థాయిలో మెరుగపడడం కష్టం. అదే 3, 4, 5 తరగతులను హైస్కూల్స్‌లో విలీనం చేయడం వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఉంటుందని విద్యావేత్తలు చెబుతున్నారు. ప్రాథమిక విద్య నుంచే సబ్జెక్ట్‌కు ఒక టీచరు బోధించడం వల్ల విద్యార్థులోనైపుణ్యం పెరగడంతో పాటు ఉత్తమ బోధన అందుతుంది. ఉన్నత పాఠశాలల్లో ల్యాబ్, గ్రంథాలయం ఉండడం వల్ల విద్యార్థులకు ఉపయోగం ఉంటుంది. ఆటలు ఆడుకునేందుకు విశాల మైదానం ఉంటుంది. బాలురు, బాలికలకు విడివిడిగా టాయ్‌లెట్స్ ఉంటాయి. వీటితో పాటు మెరుగైన వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటం వల్ల విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వ ఆలోచన. విద్యార్థులకు ఎంతో మేలు 3, 4, 5 తరగతులను హైస్కూల్స్‌ల్లో విలీనం చేయడం వల్ల విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. ప్రతి సబ్జెక్ట్‌కు ఒక టీచరు ఉండడం వల్ల సబ్జెక్ట్‌పై విషయ పరిజ్ఞానం పెంచకునేందుకు వీలు పడుతుంది. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబరు 117ను స్వార్థంగా ఆలోచించే ఉపాధ్యాయలు మాత్రమే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. – జీవీ ప్రసాద్, ఏపీ స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ ఏ ఒక్క పాఠశాల మూతపడదు నూతన విద్యా విధానం వల్ల ఏ ఒక్క పాఠశాల మూతపడదు. 3, 4, 5 తరగతుల విద్యార్థులను కి.మీ. లోపు ఉంటే హైస్కూల్స్‌కు పంపిస్తున్నాం. ఆరు అంచెల విద్యావిధానాన్ని అమలు చేస్తున్నాం. 3, 4 ,5 తరగతులకు సబ్జెక్ట్‌కు ఒక టీచరు ఉండడం వల్ల నాణ్యమైన బోధన అందుతుంది. హైస్కూల్స్‌ల్లో పూర్తిస్థాయిలో వసతులు ఉంటాయి. – పి. రమేష్, జిల్లా విద్యాశాఖాధికారి -
సేవకుల తయారీ విధానమది
వారణాసి: బ్రిటిష్ వలస పాలకులు రూపొందించిన విద్యావిధానం ముఖ్యోద్దేశం వారి అవసరాలను తీర్చేలా సేవకులకు తయారు చేయడమేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆ విధానంలోని చాలా అంశాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా గురువారం వారణాసిలో ఆయన పర్యటించారు. జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) అమలుపై ఏర్పాటైన మూడు రోజుల ‘అఖిల భారతీయ శిక్షా సమాగమ్’ సమ్మేళనాన్ని ప్రారంభించారు. బ్రిటిషర్ల విద్యావిధానంలో స్వాతంత్య్రానంతరం కొన్ని మార్పులు జరిగినా చాలా వరకు పాతవే కొనసాగుతున్నాయన్నారు. కేవలం డిగ్రీ హోల్డర్లను తయారు చేయడమే కాకుండా దేశాన్ని ముందుకు నడిపించేందుకు అవసరమైన మానవ వనరులను సమకూర్చడమే విద్యావిధానం లక్ష్యం కావాలన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన వాతావరణాన్ని క్యాంపస్‌లలో కల్పించాలి. విద్యావిధానం ద్వారా మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా యువతను సంసిద్ధులను చేయడమనే గురుతర బాధ్యత మనపై ఉందన్నారు. ‘వినూత్నమైన, నవీనమైన కొత్త ఆలోచనలను ఈ వేదికపై చర్చించాలి. వర్సిటీకి 50–100కిలోమీటర్ల పరిధిలోని సమస్యలను, వనరులను గుర్తించి, వాటికి పరిష్కారాలను కనుగొనాలి. ప్రభుత్వ పథకాల ప్రభావాన్ని అధ్యయనం చేయాలి’ అని విద్యార్థులకు ప్రధాని సూచించారు. విద్యార్థులు క్షేత్ర పర్యటనల ద్వారా ఆధార సహిత పరిజ్ఞానం పెంచుకోవాలని ప్రధాని నొక్కి చెప్పారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మొదటిసారిగా పర్యటించిన ప్రధాని..అక్షయపాత్ర మధ్యాహ్న భోజన వంటశాలను ప్రారంభించారు. ఎల్టీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కిచెన్‌లో లక్ష మంది విద్యార్థులకు భోజనం తయారు చేసేందుకు వీలుంటుంది. ఈ సందర్భంగా ప్రధాని రూ.1,774 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సంపూర్ణానంద స్టేడియంలో ఏర్పాటైన సభలో ప్రధాని ప్రసంగిస్తూ..అభివృద్ధి అంటే పైపై మెరుగులు కాదు..పేదలు, అణగారిన, గిరిజన వర్గాల సాధికారతేనని అన్నారు. ‘ఎంపీగా సేవచేసేందుకు కాశీ నాకు ఒక అవకాశమిచ్చింది. స్వల్పకాలిక పనులతో కొందరు లాభపడి ఉండొచ్చు. కానీ, అలాంటి వాటితో దేశం అభివృద్ధి చెందదని కాశీ ప్రజలు కోరుకున్నారు. వారి ముందుచూపువల్లే ప్రస్తుతం వారణాసిలో ఎంతో అభివృద్ధి జరిగింది. ఈ మొత్తం ప్రాంతం దీనివల్ల ప్రయోజనం పొందుతోంది. దివ్య, నవ్య, భవ్య కాశీ అనే రీతిలో ఎనిమిదేళ్లుగా అభివృద్ధి చెందుతోంది’ అని ప్రధాని చెప్పారు. మీ ప్రతిభ అమోఘం జాతీయ విద్యావిధానం సమ్మేళనానికి హాజరైన ప్రధాని మోదీ స్కూలు విద్యార్థుల ప్రతిభాపాటవాలను చూసి ముగ్ధులయ్యారు. ఆయన చుట్టూ చేరిన స్కూలు పిల్లలు ఒకరు శివతాండవ స్తోత్రమ్ ఆలపించగా మరొకరు డ్రమ్ వాయించారు. ఒకరు యోగాసనాలు వేసి చూపించగా మరొకరు స్వచ్ఛతా కార్యక్రమం ప్రాముఖ్యంపై పాట పాడారు. ‘మీ అందరికీ ధన్యవాదాలు. ఒక్కొక్కరికీ ఒక్కో ప్రతిభ ఉంది. మీ అందరూ చాలా ప్రతిభావంతులైన చిన్నారులు’అంటూ వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతి రోజూ పరిశుభ్రత పాటిస్తున్నారా? వ్యాయామం చేస్తున్నారా? అంటూ ప్రశ్నించగా వారంతా అవునని సమాధానమిచ్చారు. -
బాల్యం బడికి దూరం
సాక్షి, బెంగళూరు: అన్నెం పున్నెం ఎరుగని బాల్యంపై కరోనా భూతం పంజా విసిరింది. పాఠశాలల్లో అక్షరాలు నేరుస్తూ, ఆడుకోవాల్సిన చిన్నారులు పొలాల్లో, కార్ఖానాల్లో, దుకాణాల్లో పనివాళ్లుగా మారిపోయారు. రోజంతా పనిచేస్తే వచ్చే కూలీ తమతో పాటు ఇంట్లో వారి ఆకలి తీరుస్తుందన్న ధ్యాసే తప్ప చదువుకోవాలన్న ఆశ వారికి దూరమైంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమయినా.. విద్యార్థుల చేరికలు తక్కువగా ఉన్నాయి. కరోనా వల్ల గత రెండేళ్లుగా వేలాదిమంది బాలలు బడికి దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన బాలలు చదువు మానేసి ఏదో ఒక పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు. కుటుంబ పెద్దను కరోనా వైరస్ కబళించగా అనేక కుటుంబాలు దీనావస్థలోకి జారుకున్నాయి. ఫలితంగా మళ్లీ బడి ముఖం చూసే అదృష్టానికి వేలాది బాలలు నోచుకోలేకపోతున్నారు. ఈ సమస్య ఉత్తర కర్ణాటకలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 20 వేల మందిలో 35 శాతం మంది పిల్లల డ్రాపవుట్లపై ఎన్ఎఫ్హెచ్ఎస్ (నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే) చేపట్టిన అధ్యయనంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా మంది విద్యార్థులు తమకు చదువుపై ఆసక్తి లేదని చెప్పారట. 20 వేల మంది బాలురను సంప్రదించగా అందులో 35.7 శాతం మంది ఇదే మాట అన్నారు. బాధాకరమైన కారణాలు 21 వేల మంది బాలికలను ఈ ప్రశ్న అడగ్గా 21.4 శాతం మంది చదువు వద్దని చెప్పారు. బాధాకరమైన కారణాలు చదువుకునేందుకు పాఠశాలల్లో ఫీజులు చెల్లించేంత డబ్బు లేదు చదువుకు బదులు ఏదైనా పని చేసుకుంటే ఇల్లు గడుస్తుంది పాఠశాలలు దూర ప్రాంతాల్లో ఉండడంతో వెళ్లలేని పరిస్థితి బాలికలకు సరైన వసతులు లేకపోవడంతో చదువంటే అనాసక్తి ప్రభుత్వ బడుల్లో సరైన బోధన లేదు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు చెల్లించి చదవలేం (చదవండి: ‘నాకీ భార్య వద్దు’ .. మ్యాగీ వండిపెట్టిందని విడాకులిచ్చాడు) -
బాలికల విద్యకు భరోసా.. ప్రతి మండలానికో జూనియర్ కళాశాల: సీఎం జగన్
కాకినాడ జిల్లా బెండపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇంగ్లిష్‌పై మంచి పట్టు సాధించారని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకురాగా.. ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడి ఇంగ్లిష్ టీచర్ ప్రసాద్ విద్యార్థులకు నేర్పించిన ఆంగ్ల బోధనా విధానాన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)గా రూపొందించాలన్నారు. ఏడాదిలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఈ తరహా బోధనా విధానాన్ని ప్రవేశ పెట్టాలని సీఎం ఆదేశించారు. ఫొనెటిక్స్(ధ్వనిశాస్త్రం)పై ప్రస్తుతం పరిశోధన చేస్తున్న వారిని ఇందులో భాగస్వాములను చేయాలని, భాష సమగ్రంగా నేర్చుకోవడంలో యాక్సెంట్ (యాస), డైలెక్ట్ (మాండలికం) చాలా ప్రధానమైన అంశాలని చెప్పారు. వీటిపై ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించారు. గూగుల్ రీడ్ ఎలాంగ్ యాప్ ప్రతి టీచర్ మొబైల్లో ఉండేలా చూడాలన్నారు. ఇంగ్లిష్ టీచర్ ప్రసాద్‌ను ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 37 వేల అదనపు తరగతి గదులు అవసరం. నాడు–నేడు రెండో దశలో వీటి నిర్మాణం చేపట్టనున్నాం. ఇంగ్లిష్ భాషా బోధన, అభ్యాసం, ఫొనెటిక్స్ కోసం ప్రత్యేకంగా గూగుల్ సహకారంతో ‘గూగుల్ రీడ్ ఎలాంగ్ యాప్’ను రూపాందించాం. దీనిని శుక్రవారం (నేడు) అందుబాటులోకి తేనున్నాం. సమగ్రమైన ఇంగ్లిష్ బోధనకు ఈ యాప్ చాలా ఉపయోగకరం. అమ్మ ఒడికి బదులుగా రాష్ట్రంలో 8.21 లక్షల మంది విద్యార్థులు ల్యాప్‌టాప్‌లు కావాలని ఆప్షన్ ఎంచుకున్నారు. – సీఎం వైఎస్ జగన్‌తో అధికారులు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ స్థాయి విద్యావకాశాలను విస్తృత పరచడంలో భాగంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల సంఖ్యను పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా బాలికల కోసం మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా ప్రభుత్వ విద్యా విధానం మెరుగు పడడమే కాకుండా ఎక్కువ మంది వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విద్యా శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మరుగుదొడ్ల నిర్వహణను సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 245 మండలాల్లో మాత్రమే బాలికల జూనియర్ కళాశాలలు ఉన్నాయని, మిగిలిన 434 మండలాల్లో జూనియర్ కాలేజీలను అందుబాటులోకి తేవాలని సూచించారు. అందుకోసం కేజీబీవీ లేదా హైస్కూల్‌ను ప్లస్ 2 స్థాయికి పెంచడం లేదా ఉన్న కాలేజీల్లోనే బాలికలకు ప్రత్యేక కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశంపై విస్తృతంగా ప్రచారం చేస్తే విద్యార్థులు వినియోగించుకునే అవకాశాలు మెరుగు పడతాయని చెప్పారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని అధికారులు వివరించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడుతున్న బెండపూడి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు మేఘన, తేజస్విని, రిష్మ, అనుదీప్, వెంకన్నబాబు 23,975 స్కూళ్లలో నాడు–నేడు రెండోదశ ► పాఠశాలల ప్రమాణాలను పెంచేందుకు నాడు–నేడు కార్యక్రమం చేపట్టాం. రెండో దశలో భాగంగా 23,975 స్కూళ్లలో రూ.8 వేల కోట్లతో సమూల మార్పులు చేయాలి. అన్ని స్కూళ్లలో నెల రోజుల్లో పనులు నూరు శాతం ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ► ప్రతి పాఠశాలలో విద్యార్థులకు ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానం పెంచేలా చర్యలు తీసుకోవాలి. అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, మరుగుదొడ్ల నిర్వహణ సమర్థవంతంగా ఉండేలా చూడాలి. అందుకోసం పక్కాగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) పాటించాలి. ► గోరుముద్ద (మధ్యాహ్న భోజనం)పై అధికారులు మరింత శ్రద్ధ పెట్టాలి. ఎక్కడా రాజీ పడకుండా పూర్తి నాణ్యతతో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. అప్పుడే ఆశించిన లక్ష్యాన్ని చేరుకుంటాం. టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ (టీఎంఎఫ్), స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ (ఎస్ఎంఎఫ్), గోరుముద్ద పథకాన్ని మరింత మెరుగ్గా ఎలా అమలు చేయవచ్చో అధికారులు ఆలోచించాలి. ► విద్యార్థులకు అందించే విద్యా కానుక నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడొద్దు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా కిట్లు ఉండాలి. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి తెరిచే జూలై 4 నాటికి కిట్లు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. జూన్‌లో అమ్మ ఒడి అమలు చేసేందుకు సన్నద్ధంగా ఉండాలి. ► ఈ సమీక్షా సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, సర్వశిక్షా అభియాన్ ఎస్పీడీ వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మీ స్ఫూర్తితోనే ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం ► బెండపూడి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు సీఎం వైఎస్ జగన్‌తో అనర్గళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లలో నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియంలో బోధన వంటి గొప్ప కార్యక్రమాల ద్వారా మీరే మాకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. ► విభజన తర్వాత రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇన్ని గొప్ప పథకాలు ప్రవేశపెడుతున్నారని, మీ వల్లే ఇంత గొప్పగా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకోగలుగుతున్నామని ఎనిమిదో తరగతి విద్యార్థిని తేజస్విని ఆనందం వ్యక్తం చేసింది. తన చెల్లితో కలిసి కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న డబ్బులు రూ.929 సీఎంకు విరాళంగా అందజేసింది. అయితే బాలిక గుర్తుగా సీఎం కేవలం రూ.19 తీసుకుని మిగతా డబ్బును తిరిగిచ్చారు. ► పదో తరగతి విద్యార్థిని మేఘన ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ.. అమ్మ ఒడి పథకం ఎంతోమంది పేద విద్యార్థులకు ఉపయోగపడిందని, తాను తన ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఆంగ్ల భాషపై పట్టు సాధించానని చెప్పింది. అంతర్జాతీయ ఇంగ్లిష్ న్యూస్ చానెళ్లు కూడా తన భాషా పరిజ్ఞానానికి ఎంతో ఉపయోగపడ్డాయంది. ► మరో విద్యార్థిని రిష్మ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ విద్యను ప్రవేశపెట్టింది సీఎం జగన్ మాత్రమేనని, తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. ప్రపంచంతో అనుసంధానం అయ్యేందుకు ఇంగ్లిష్ మాత్రమే ఉపయోగ పడుతుందని పేర్కొంది. ► ఏడో తరగతి విద్యార్థి అనుదీప్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై వస్తున్న విమర్శలను పట్టించుకోవద్దు. మీ నిర్ణయంపై మీరు (సీఎం) య«థావిధిగా ముందుకెళ్లాలి. మీ నమ్మకాన్ని మేం వమ్ము చేయం. మీ వెనుక మేముంటాం. నేను బాగా చదువుకుని ఐఏఎస్ అవుతా. అప్పుడూ మీరే సీఎంగా ఉండాలి. నేను మీ వద్ద సెక్రటరీగా పనిచేసి ఇప్పుడు విమర్శిస్తున్న అందరి నోళ్లు మూయిస్తా. నాకు ఆ అవకాశం ఇస్తానని మాటివ్వండి’ అని కోరాడు. అనుదీప్ మాటలపై సీఎం జగన్‌తో పాటు అక్కడున్న అధికారులంతా ఆనందపడ్డారు. -
ప్రభుత్వ పథకాలతో వివక్ష మాయం
భరుచా: ప్రభుత్వ పథకాలు నూటికి నూరు శాతం అమలైతే సమాజంలో వివక్షల్ని రూపుమాపవచ్చునని, బుజ్జగింపు రాజకీయాలకు కూడా తెరదించవచ్చునని ప్రధాని మోదీ చెప్పారు. ప్రభుత్వ పథకాలపై సరైన సమాచారం లేక అవి కాగితాలకే పరిమితమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం వితంతువులు, వృద్ధులు, నిరుపేదలకు ఆర్థిక సాయం అందించడం కోసం రూపొందించిన నాలుగు పథకాలు నూటికి నూరు శాతం భరూచీ జిల్లాలో లబ్ధిదారులందరికీ అందిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మోదీ భావోద్వేగం అంతకు ముందు ప్రధాని మోదీ పథకాలు అందుకున్న లబ్ధి దారులతో మాట్లాడారు. వారిలో కంటి చూపు కోల్పోయిన అయూబ్ పటేల్ తన పెద్ద కుమార్తె అలియాతో కలిసి వచ్చారు. పన్నెండో తరగతి చదువుతున్న ఆమె డాక్టర్ చదవాలని అనుకుంటోందని, అందుకోసం సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకు డాక్టర్ చదవాలని అనుకుంటున్నావు అని ఆ అమ్మాయిని ప్రశ్నించగా ఆమె చెప్పిన సమాధానం విని ప్రధాని కదిలిపోయారు. చూపు లేని తన తండ్రి దుస్థితిని చూస్తూ తట్టుకోలేకపోతున్నానని, అందుకే డాక్టర్ అవుదామని అనుకుంటున్నానని అలియా కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పారు. దీంతో ప్రధాని కాసేపు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. డబ్ల్యూహెచ్ఓలో సంస్కరణలు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)లో సంస్కరణలు చేపట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కరోనా వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చే విషయంలో ఒక సరళమైన విధానాన్ని తీసుకురావాలన్నారు. మేధో సంపత్తి హక్కులు మంజూరు చేసే విషయంలో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనలను సరళం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలో కోవిడ్–19పై గురువారం నిర్వహించిన రెండో గ్లోబల్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాపోసా పాల్గొన్నారు. -
ఇదేం న్యాయం.. మా ఆడబిడ్డల సంగతి ఏంటి?
తాలిబన్ల బుద్ధి.. వంకర బుద్ధి. ఏం జరిగినా.. అది మారదు. ఈ మాట అంటోంది అఫ్గన్ పౌరులే. తాలిబన్ల పాలనలో గతంలో కంటే పరిస్థితి ఇంకా దిగజారుతోందనేది వాళ్ల ఆవేదన. ఇందుకు ఉదాహరణగా బాలికల విద్యను హరిస్తూ.. వాళ్ల హక్కులను కాలరాయడం గురించి ప్రస్తావిస్తున్నారు. ఆఖరికి ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకున్నా.. తాలిబన్లు మాత్రం వెనక్కి తగ్గట్లేదు!. ఇస్లామిక్ ఎమిరేట్ అలియాస్ తాలిబన్ సర్కార్.. అంతర్జాతీయ సమాజంలో గుర్తింపు కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అది దొరికితేనే.. నిలిచిపోయిన నిధులు అఫ్గన్ గడ్డకు చేరేది, సంక్షోభం నుంచి తేరుకునేది. అయితే హేయనీయమైన తాలిబన్ల తీరు వల్లే అది జాప్యం అవుతోంది. మహిళలకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యయుతమైన విధానాలతో తమ పాలనలో కొత్త అఫ్గనిస్థాన్‌ను చూస్తారంటూ హామీలు ఇచ్చిన తాలిబన్లు.. నీటి మీద రాతల్లాగే ఉన్నాయి. తీరు మార్చుకోకుండానే ముందుకు పోతున్నట్లు తాలిబన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అఫ్గనిస్థాన్‌లో అమ్మాయిలు.. విద్యాఉద్యోగాలు, క్రీడారంగానికి క్రమక్రమంగా దూరం అవుతున్నారు. అదే సమయంలో తాలిబన్ నేతలు మాత్రం వాళ్ల పిల్లలను విదేశాల్లో చదివిస్తూ.. స్వేచ్ఛగా బతకనిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తాలిబన్ కేబినెట్లో పాతిక మంది దాకా తమ పిల్లలను పొరుగున ఉన్న పాక్‌లోని పెషావర్, కరాచీలో.. ఇంకొందరు దోహాలోని స్కూల్స్‌లో పిల్లలను చదివించుకుంటున్నారు. వాళ్లలో ఆరోగ్య మంత్రి ఖ్వాలందర్ ఎబాద్, విదేశాంగ ఉపముఖ్యమంత్రి షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్, తాలిబన్ అధికార ప్రతినిధి సుహెయిల్ షాహీన్‌లు ఉన్నారు. సుహెయిల్ షాహీన్ పిల్లలు ఏకంగా దోహాలోని ఇస్లామిక్ ఎమిరేట్స్ అధికారిక కార్యాలయంలో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆయనగారి పెద్ద కూతురు ఏకంగా ఫుట్‌బాల్ టీంలో సభ్యురాలిగా ఉందట. ఖ్వాలందర్ కూతురు ఇస్లామాబాద్‌లో మెడిసిన్ చదువుతోంది. ఆమె టెన్నిస్ ఛాంపియన్. మరో ఇద్దరు కీలక నేతల కూతుళ్లు సైతం దోహాలోని ఓ ప్రముఖ విద్యాసంస్థలో చదువుతున్నారట. ఈ అంశాలనే ప్రస్తావిస్తూ.. తమకూ స్వేచ్చను ఇవ్వాలని ప్రధాన ప్రాంతాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు మహిళలు. అయితే.. ఈ అంశంపై నిర్ణయం తమ చేతుల్లో లేదని, త్వరలో భేటీ అయ్యి తుది నిర్ణయం తీసుకుంటామని తాలిబన్ ప్రతినిధులు చెప్తున్నారు. మార్చిలో బడులు తెరిచారని ఆనంద పడ్డ బాలికలకు.. ప్రవేశం లేదంటూ పిల్లలను వెనక్కి పంపి గట్టి షాకే ఇచ్చారు అక్కడి విద్యాశాఖ అధికారులు. మళ్లీ పెళ్లిళ్లు! ఇదిలా ఉంటే తాలిబన్ నేతలు ఓ కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. చదువుకున్న మహిళలను రెండో వివాహం చేసుకుంటున్నారు. అజ్ఞాతంలో ఉన్నంత కాలం తాము నాగరికతలో వెనుకబడిపోయామన్న భావనలో ఉన్న వాళ్లు.. మొదటి భార్యలకూ లోక జ్ఞానం లేదనే నిర్ణయానికి వచ్చేసి.. చదువుకున్నవాళ్లను మళ్లీ పెళ్లి చేసుకుని పట్టణాలు, నగరాల్లో కాపురాలు పెడుతున్నారు. రాజకీయ నాయకులే కాదు.. సివిల్ సర్వెంట్లు, ఇతర అధికారులు కూడా ఇప్పుడు ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుత్నున్నారు.. -
వాళ్లు అన్నదాంట్లో తప్పేముంది!: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
సాక్షి ఉత్తరాఖండ్(హరిద్వార్): హరిద్వార్‌లోని దేవ్ సంస్కృతి విశ్వ విద్యాలయంలో సౌత్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ రీకన్సిలియేషన్‌ను భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగంలో మాట్లాడుతూ దేశంలోని ప్రజలు తమ ‘వలసవాద మనస్తత్వాన్ని’ విడిచిపెట్టి, తాము భారతీయులం అని గర్వపడటం నేర్చుకోవాలని కోరారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతుందని ఇక లార్డ్ మెకాలే విద్యా విధానాన్ని పూర్తిగా స్వస్తి పలకాలని పిలుపు నిచ్చారు. ‘దేశంలో విద్యా మాధ్యమంగా.. విదేశీ భాషను విధించి ఉన్నత వర్గాలకే విద్యను పరిమితం చేశారని ఆరోపించారు. ఆ విద్యా విధానం మనల్ని మనం తక్కువ జాతిగా చూసుకోవడం నేర్పింది. మన స్వంత సంస్కృతిని, సంప్రదాయ వివేకాన్ని తృణీకరించేలా చేసింది. దేశీయంగా కూడా మన ఎదుగుదలను మందగించేలా చేసింది. ఈ విద్యా విధానానికి సంబంధించిన విద్యను కొంతమందికే పరిమితం చేసింది. దీని వల్ల అధిక జనాభా విద్యాహక్కును కోల్పోతోంది’ అని అన్నారు. మన వారసత్వం, మన సంస్కృతి, మన పూర్వీకుల గురించి మనం గర్వపడటమే కాక మనం మన మూలాల్లోకి తిరిగి వెళ్లాలన్నారు. మనం అనేక భారతీయ భాషలను నేర్చుకోవడమే కాక మాతృభాషను ప్రేమించాలని తెలిపారు. జ్ఞాననిధి అయిన మన గ్రంధాలను తెలుసుకోవాలంటే సంస్కృతం నేర్చుకోవాలని చెప్పారు. అన్ని గ్యాడ్జెట్ నోటిఫికేషన్లు సంబంధిత రాష్ట్ర మాతృభాషలో విడుదలయ్యే రోజుకోసం తాను ఎదురుచూస్తున్నానని అన్నారు. మీ మాతృభాష మీ కంటి చూపు లాంటిదని విదేశీ భాషపై ఉన్న జ్ఞానం మీ కళ్లద్దాలు లాగా ఉండాలని అభివర్ణించారు. భారతదేశ నూతన విద్యా విధానానికి భారతీయకరణ ప్రధానమైనదని మాతృభాషల ప్రోత్సాహానికీ అధిక ప్రాధాన్యతనిస్తుందని వెంకయ్యనాయుడు అన్నారు. అయితే గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం 2022-23 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు పాఠశాల సిలబస్‌లో భాగంగా భగవద్గీతను ప్రవేశపెడతామని కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రతిపక్షాలు విద్యను కాషాయికరణం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డాయి. దీంతో వెంక్యనాయుడు బీజేపీ అన్నదాంట్లో తప్పేముందంటూ గట్టి కౌంటరిచ్చారు. మన ప్రాచీన గ్రంథాలలో ఉన్న తత్వాలైన సర్వే భవంతు సుఖినాః (అందరూ సంతోషంగా ఉండండి) , వసుధైవ్ కుటుంబకం (ప్రపంచం ఒకే కుటుంబం) వంటివి నేటికీ మన విదేశాంగ విధానానికి మార్గదర్శకాలు అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నొక్కి చెప్పారు. (చదవండి: అమిత్ షాతో భేటీ పచ్చి అబద్ధం.. బీజేపీలో చేరేదే లే!) -
సీఎం కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న మంత్రివర్గ సమావేశం
-
సర్కారీ స్కూళ్లలో వచ్చే ఏడాది నుంచే ఆంగ్లంలో విద్యా బోధన
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని సర్కారీ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అలాగే ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. ఫీజులను నియంత్రించడం ద్వారా పేదలకు, సామాన్య మధ్యతరగతికి విద్యను మరింత చేరువ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రెండు అంశాలపై సమగ్ర అధ్యయనం జరపడంతో పాటు విధివిధానాల రూపకల్పన కోసం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కె.తారక రామారావుతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. వచ్చే శాసనసభా సమావేశాల్లో ఈ మేరకు నూతన చట్టాన్ని ప్రభుత్వం తీసుకురానుంది. మరోవైపు నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.7,289 కోట్లతో ‘మన ఊరు–మన బడి’ ప్రణాళిక అమలుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు జరిగిన రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదుపులోనే కరోనా: హరీశ్‌రావు రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులోనే ఉన్నదని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉందని ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు వివరించారు. రాష్ట్రంలో 5 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ జరిగిందని, అర్హులైన అందరికీ త్వరగా టీకాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు గుంపులుగా గుమిగూడకుండా స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనాను కట్టడి చేయవచ్చని పేర్కొన్నారు. సంపూర్ణంగా ధాన్యం కొనుగోళ్లు వానాకాలంలో పండిన ధాన్యం కొనుగోళ్లపై కేబినెట్ చర్చించింది. ఇప్పటికే చాలాచోట్ల ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావచ్చినా, అకాల వర్షాలతో కొన్ని జిల్లాల్లో ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. అందువల్ల ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు కేంద్రాలను కొనసాగించాలని, ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. ఇలావుండగా ఇటీవల అకాల వర్షాల వల్ల తీవ్ర పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పర్యటించాలని తీర్మానించింది. బీఎస్సీ ఫారెస్ట్రీ విద్యార్థులకు రిజర్వేషన్లు సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల.. పరిశోధన సంస్థలో (ఎఫ్సీఆర్ఐ)లో బీఎస్సీ ఫారెస్ట్రీ (హానర్స్) నాలుగేళ్ల డిగ్రీ కోర్సు ద్వారా అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్వాలిఫైడ్ ఫారెస్ట్రీ గ్రాడ్యుయేట్లను ప్రభుత్వం అందిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ చదివిన విద్యార్థులకు అటవీశాఖ ఉద్యోగాల భర్తీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు (ఏసీఎఫ్) పోస్టుల్లో 25 శాతం, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఓ), ఫారెస్టర్స్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ రూల్స్–1997, తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్–2000కు సవరణలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలో ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ అంగీకరించింది. అటవీశాఖ అధికారులు ప్రాథమిక నివేదికను అందించగా, వచ్చే కేబినెట్ సమావేశం నాటికి పూర్తిస్థాయి నివేదికతో రావాలని ఆదేశించింది. కాగా రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు కోసం విద్యాశాఖ మంత్రి చేసిన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తదుపరి మంత్రివర్గ సమావేశం ముందు పూర్తిస్థాయి ప్రతిపాదనలను ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్ రద్దు మంత్రివర్గ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశం నిర్వహిస్తారని సీఎం కార్యాలయం నుంచి సోమవారం సాయంత్రం ఆహ్వానం రావడంతో మీడియా ప్రతినిధులు ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. నేషనల్ మీడియాకు సీఎంఓ నుంచి సోమవారం ఉదయమే కబురు అందింది. దీంతో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ప్రధానంగా మాట్లాడతారనే చర్చ జరిగింది. ఢిల్లీ నుంచి కూడా కొందరు విలేకరులు వచ్చారు. అయితే చివరిలో ఈ విలేకరుల సమావేశం రద్దైనట్టు సీఎంఓ ప్రకటించింది. కేబినెట్లో చర్చించాల్సిన ఎజెండా అంశాలు ఎక్కువగా ఉన్నందున, సమావేశం ఎక్కువసేపు కొనసాగే అవకాశమున్న పరిస్థితుల్లో, మీడియాకు అసౌకర్యం కలగరాదనే ఉద్దేశంతో అనివార్య పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ రద్దు చేసినట్టు వివరణ ఇచ్చింది. ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దాలి విద్యారంగంపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్రంలో వ్యవసాయం తదితర అనుబంధ రంగాలు బలోపేతం కావడం, తద్వారా గ్రామీణ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడంతో.. పల్లెల్లో తల్లిదండ్రుల్లో తమ పిల్లల విద్య, భవిష్యత్తు పట్ల ఆలోచన పెరిగిందని కేబినెట్ గుర్తించింది. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంలో విద్యాబోధన చేపట్టినట్టయితే తమ పిల్లలను స్థానిక పాఠశాలల్లోనే చేర్పించేందుకు వారు సంసిద్ధంగా ఉన్నారని భావించింది. ఈ నేపథ్యంలోనే సర్కారీ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. అందుకు కావలసిన అన్ని రకాల మౌలిక వసతులను కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో ఇంగ్లిషు మీడియంలో బోధించేందుకు టీచర్లకు తర్ఫీదునిచ్చేందుకు, నాణ్యమైన ఆంగ్ల విద్యను అందించడం ద్వారా ప్రైవేట్, కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖను ఆదేశించింది. సర్కారీ స్కూళ్లకు కొత్త సొబగులు రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 19,84,167 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంతో పాటు దశలవారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుకు వీలుగా ‘మన ఊరు – మన బడి’ ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యంగా సాంకేతికత విజ్ఞాన ఆధారిత విద్యను అందించడం కోసం డిజిటల్ క్లాస్ రూంలు, అదనపు తరగతి గదులు, అవసరమైన మేరకు ఫర్నిచర్ ఏర్పాటు, మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర వసతుల కల్పన ఈ ప్రణాళిక ఉద్దేశం. సీఎం కేసీఆర్ ఆదేశానుసారం.. గతంలో రెండుసార్లు సమావేశమైన సబిత నేతృత్వంలోని మంత్రుల బృందం ‘మన ఊరు – మన బడి’ విధివిధానాలను రూపొందించింది. 12 రకాల విభాగాలను పటిష్టపరిచేందుకు ప్రతిపాదించడం జరిగింది. అవి.. నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు, విద్యుదీకరణ, త్రాగు నీటి సరఫరా, విద్యార్థులు మరియు సిబ్బందికి సరిపడ ఫర్నిచర్, పాఠశాల మొత్తానికి కొత్తగా రంగులు వేయడం, పెద్ద ..చిన్న మరమ్మతులు, గ్రీన్ చాక్ బోర్డులు, ప్రహరీ గోడలు, వంట గదులు (షెడ్లు), శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్ రూంలు, ఉన్నత పాఠశాలల్లో భోజనశాలలు, డిజిటల్ విద్య అమలు. ఇందుకు రూ.7,289.54 కోట్లు అవసరమవుతాయి. అన్ని పనులను వేగంగా అమలు చేయడం కోసం ‘పాఠశాల నిర్వహణ కమిటీ’ (ఎస్.ఎమ్.సి.)లకు బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నిధుల సమీకరణ కోసం ఆర్థిక శాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ప్రతి స్కూల్లో పూర్వ విద్యార్థుల సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. -
ఆన్లైన్.. కొత్త సారు.. ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ
ఆన్లైన్ క్లాస్ జరుగుతోంది.. టీచర్ సౌర కుటుంబం గురించి పాఠం చెప్తున్నారు.. గ్రహాలు, ఇతర అంశాల గురించి టీచర్ వివరిస్తున్న కొద్దీ.. స్క్రీన్‌పై ఒక్కొక్కటిగా స్పష్టంగా అర్థమయ్యేలా కనిపిస్తున్నాయి. కిడ్నీ పాఠం చెప్తున్నప్పుడు కిడ్నీ లోపలి భాగాలు, కణాల తీరు.. విత్తనం మొక్కగా మారే పాఠం వివరిస్తున్నప్పుడు విత్తనంలో జరిగే మార్పుల నుంచి మొక్క ఎదిగేదాకా.. స్పష్టంగా ఫోన్ తెరపై కనిపిస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరంలో మన ముందుకు కొత్త టీచర్లు వస్తున్నారు. ఆన్లైన్ పాఠాలైనా సరే.. తరగతి గదిలో కన్నా మెరుగ్గా నేర్పించనున్నారు. విద్యార్థుల నైపుణ్యాలను, అవగాహనను మరింత పెంచేలా అద్భుతంగా బోధించనున్నారు. వారే ‘డిజిటల్ టీచర్లు..’ వారికి తోడ్పడే సరికొత్త విధానాలే అగుమెంటెడ్, వర్చువల్ రియాలిటీలు. పాఠశాలల్లో కాస్త మౌలిక సదుపాయాలు, విద్యార్థుల దగ్గర ఇంటర్నెట్తో కూడిన స్మార్ట్‌ఫోన్/ట్యాబ్లెట్ ఉంటే చాలు. తక్కువ ఖర్చుతోనే అత్యుత్తమ విద్య అందించేందుకు వీలయ్యే అద్భుతమైన యాప్‌లు, వెబ్సైట్లు, సాంకేతిక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్లు, ఆంక్షలతో విద్యా బోధనపై ప్రభావం పడింది. దానితో ఆన్లైన్ విద్యా విధానంపై విస్తృతంగా పరిశోధనలు జరిగి.. మెరుగైన బోధనా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే పలు పాఠశాలల్లో ఈ విధానాలపై చేసిన ప్రయోగాలు మంచి ఫలితాలను ఇచ్చాయి కూడా. రెండు సాంకేతికతలతో.. ఆన్లైన్ బోధన అంటే ఇప్పటిదాకా చాలా మందికి తెలిసినది ఏమిటంటే.. తరగతి గదిలో టీచర్ పాఠం చెబుతుంటే, విద్యార్థులు సెల్ఫోన్లోనో, కంప్యూటర్లోనో చూస్తూ వినడమే. విద్యార్థికి పాఠం అర్థమవుతోందా? అసలు వింటున్నారా? లేదా? ఏదైనా సందేహం తీర్చుకోవాలనుకుంటున్నారా? అనేది తెలియడం కష్టమే. అంతేకాదు విద్యార్థులకు ఎంతమేర అర్థమైందన్నది బేరీజు వేసేందుకు పరీక్షలు లేకపోవడం మరో సమస్య. కానీ కొత్తగా అందుబాటులోకి వచ్చిన యాప్స్, వెబ్సైట్లు, ఇతర ఆన్లైన్ విధానాలతో ఈ పరిస్థితి సమూలంగా మారబోతోంది. ఈ క్రమంలో ప్రధానంగా అగుమెంటేషన్, వర్చువల్ రియాలిటీ అనే రెండు పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ► అగుమెంటేషన్ విధానంలో టీచర్ పాఠం చెప్తుండగానే.. విద్యార్థులు ఆయా అంశాలను అనుభవ పూర్వకంగా పరిశీలించగలిగే అవకాశం ఉం టుంది. ఉదాహరణకు మొక్క ఎదుగుదల పా ఠం చెబుతుంటే.. విత్తనం నుంచి మొక్కగా, చెట్టుగా ఎలా మారుతుందనే దృశ్యాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. టీచర్ నేరుగా మొక్కల మధ్య ఉండి పాఠం చెప్పినట్టుగా అనుభూతి కలుగుతుంది. ► వర్చువల్ రియాలిటీ విధానంలో కీలక అంశాలను అత్యంత సులువగా అర్థమయ్యేలా బోధించవచ్చు. ఉదాహరణకు టీచర్ సౌర కుటుంబం గురించి పాఠం చెప్తున్నప్పుడు.. టీచర్ ఒక్కో అంశాన్ని వివరిస్తున్న కొద్దీ దానికి సంబంధించిన చిత్రాలు కనిపిస్తుంటాయి. ప్రాక్టికల్‌గా ఆ అంశం తెలుసుకునే అనుభూతి వస్తుంది. సైన్స్ సబ్జెక్టుల్లో దీని ప్రాధాన్యత ఎక్కువ. కిడ్నీ గురించి చదివేటప్పుడు కిడ్నీని లోపలి నుంచి పరిశీలిస్తున్న అనుభూతి ఉంటుంది. అందుబాటులో ఎన్నో యాప్స్, వెబ్‌సైట్స్.. ► విద్యార్థులకు సులువైన రీతిలో విద్యా బోధన కోసం ఎన్నో యాప్స్, వెబ్‌సైట్స్ అందుబాటులోకి వచ్చాయి. పాఠశాలల్లో టీచర్లు ఆ యాప్స్/వెబ్‌సైట్స్‌లో తాము బోధించే పాఠాలను ముందే రూపొందించుకోవచ్చు. బోధిస్తున్న సమయంలో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా కాన్సెప్టులను, గ్రాఫిక్స్‌ను, చిత్రాలను.. త్రీడీ, అగుమెంటెడ్, వర్చువల్ రియాలిటీ పద్ధతుల్లో సిద్ధం చేసుకోవచ్చు. ► ఎడ్ పజిల్ యాప్ ద్వారా టీచర్ పాఠం చెప్తున్నప్పుడు విద్యార్థులను మధ్యలో ప్రశ్నలు అడిగే సాంకేతికత ఉంటుంది. అందులో ఎంత మంది అలర్ట్‌గా ఉన్నారనేది టీచర్ పసిగట్టవచ్చు. వారి సామర్థ్యాలను అంచనా వేయవచ్చు. ► ఆన్లైన్ వీడియో పాఠాలు వినే సమయంలో ఎడ్‌మోడో యాప్ ద్వారా.. విద్యార్థి ఏమేర విన్నాడనేది అంచనా వేయవచ్చు. ఇందుకోసం మధ్యలో కొన్ని ప్రశ్నలు వేస్తారు. సమాధానం చెబితేనే వీడియో ముందుకు కదులుతుంది. ► ప్లిప్గ్రిడ్ అనే మరో సాంకేతికత ద్వారా టీచర్ ఒక ప్రశ్న వేస్తే ఎవరెవరు ఏమేం సమాధానాలు చెప్పారనేది విడివిడిగా నమోదవుతుంది. టీచర్ వాటిని విశ్లేషించుకునే అవకాశం ఉంటుంది. ► నియర్‌పాడ్ యాప్/వెబ్సైట్ అద్భుతమైన విద్యా బోధనకు తోడ్పడుతుంది. బ్లాక్‌బోర్డ్ అవసరమే లేకుండా.. దాదాపు బోధన అంతా పూర్తిచేసేందుకు వీలు కల్పిస్తుంది. టీచర్ బోధించడంతోపాటు ఏదైనా రాసినా, ప్రశ్న వేసినా విద్యార్థులు తరగతి గదిలోనే ఉండి నేర్చుకున్న అనుభూతిని కలిగించగలుగుతుంది. అదే విధంగా విద్యార్థుల అవగాహన, నైపుణ్యాలను, వారు ఎంత అప్రమత్తంగా ఉంటున్నారన్నది ఎప్పటికప్పుడు గమనించే వీలుంటుంది. ► వీటితోపాటు పాఠాలపై విద్యార్థుల ఒపీనియన్ పోల్స్, వీకెండ్ ఎగ్జామ్స్, నెలవారీ అసెస్మెంట్ వంటివీ యాప్‌ల ద్వారా సాధ్యమవుతాయి. ► ఇక విద్యార్థుల మానసికోల్లాసాన్ని పెంచే మ్యూజికల్, ఏరోబిక్స్ మిక్స్, నృత్యం, ఆర్ట్స్ అండ్ క్రాప్ట్ట్, చిత్ర లేఖనం, పజిల్స్ అండ్ రిడిల్స్, మ్యాప్ పాయింటింగ్, ఫ్యాక్ట్స్ ఆఫ్ ది వరల్డ్, ఫోనిక్స్, కథలు చెప్పడం వంటివాటికీ ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. పాఠాలు ఆసక్తిగా ఉన్నాయి కరోనా సమయంలో హైదరాబాద్‌లో పెద్దమ్మ వాళ్ల ఇంటికి వచ్చాను. వారి అబ్బాయి, నేను ఇద్దరం ఒకే తరగతికావడంతో.. అతడి ఆన్లైన్ క్లాసుల పాఠాలన్నీ నేను కూడా విన్నాను. మా దగ్గర చెప్పే పాఠాల కంటే ఇక్కడ సులువుగా అర్థమయ్యాయి. సైన్స్ క్లాసులు చాలా బాగున్నాయి. నిజంగా నేను మొక్కల దగ్గరే ఉండి తెలుసుకున్నాననే ఫీలింగ్ వచ్చింది. – సాయి ప్రణీత్, పదో తరగతి విద్యార్థి, వరంగల్ విద్యార్థుల్లో నైపుణ్యం పెరిగింది.. హైదరాబాద్‌లోని బ్రూక్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్లో కరోనా సమయంలో అత్యాధునిక సాంకేతికత, కొత్త యాప్స్‌తో ఆన్లైన్ బోధన నిర్వహించారు. విద్యార్థుల్లో 83శాతం మంది గతం కన్నా మెరుగైన రీతిలో విద్యా ప్రమాణాలు కనబర్చినట్టు తేల్చారు. ‘‘తొలుత 64 శాతం మంది విద్యార్థులు ఆన్లైన్ క్లాసులను శ్రద్ధగా వినకపోవడం గమనించాం. దీనిని యాప్ ద్వారా పసిగట్టి వారిని ప్రోత్సహించాం. 53 శాతం మందిలో మార్పు వచ్చింది. చాలా మంది లెర్నింగ్ లాస్ లేకుండా ప్రతిభ చూపుతున్నారు’’ అని బ్రూక్‌ఫీల్డ్ స్కూల్ డైరెక్టర్ రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఉచితంగా అందించగల సాంకేతికతతో విదేశాల్లో విద్యకు సంబంధించిన ఆన్లైన్ సాంకేతికతను అందరికీ అందుబాటులో ఉండేలా (ఓపెన్ ప్లాట్‌ఫాంపై) అందుబాటులోకి తెచ్చా రు. ఆ యాప్స్ అన్నీ మనం వాడుకోవచ్చు. ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు 550 పాఠశాలల్లో టీచర్లకు దీనిపై శిక్షణ ఇచ్చాం. వీటిద్వారా బోధించినప్పుడు మంచి ఫలితాలు వస్తున్నాయని పాఠశాలల యాజమాన్యాలు చెప్తు న్నాయి. ఇందులో శిక్షణ, మౌలిక సదుపాయాల కోసం తప్ప పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. విద్యార్థులను పరిశోధన స్థాయికి తీసుకెళ్లే సరికొత్త బోధనగా దీన్ని చూడాలి. – పన్నేరు భానుప్రసాద్, సీఈవో, సూపర్ టీచర్ ఎడ్యు రిఫామ్స్ బోధనలో సరికొత్త విప్లవం.. మా విద్యాసంస్థల్లో 4 వేల మంది చదువుతున్నారు. వారందరికీ కొత్త టెక్నాలజీతో ఆన్లైన్ బోధన నిర్వహించాం. చాలా మంది విద్యార్థులు ప్రత్యక్ష బోధనకన్నా ఈ క్లాసులు బాగున్నాయని అంటున్నారు. పిల్లల్లో నైపుణ్యాలు గతంలో కన్నా ఎక్కువగా కన్పిస్తున్నాయి. ముఖ్యంగా సైన్స్, గణితం వంటి సబ్జెక్టుల్లో త్రీడీ టెక్నాలజీ సరికొత్త విప్లవం సృష్టిస్తోంది. కరోనా కాలమనే కాదు.. భవిష్యత్‌లో దీనిని కొనసాగించాలని భావిస్తున్నాం. – ఆర్.పార్వతీరెడ్డి, హార్వెస్ట్ స్కూల్ ప్రిన్సిపాల్, ఖమ్మం -
కోవిడ్‌తో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల చదువుపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: పూర్వ ప్రాథమిక విద్య నుంచి ప్లస్ టూ (ఇంటర్మీడియెట్) విద్య వరకు సమగ్ర విద్యా విధానం అమలు కావలసిన అవసరముందని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్ తెలిపారు. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) అమలులో భాగంగా ఒకే ప్రాంగణం లేదా 250 మీటర్లలోపు ప్రాథమిక పాఠశాలల్లో గల 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీప ఉన్నత పాఠశాలలకు అనుసంధానించాలన్నారు. తద్వారా 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు విషయ నిపుణుల చేత బోధన నిర్వహించాలని సూచించారు. గురువారం ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రస్తుతం గణాంక ఆధార వ్యవస్థ అవసరమైన దృష్ట్యా ప్రతి ఒక్కరూ గణాంకాల మీద లోతైన అవగాహన పెంచుకోవాలని డీఈవోలకు, ఏపీసీలకు సూచించారు. యూడైస్ ప్లస్ (ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థ)లో వివరాలు నమోదు చేయడంలో అలసత్వం చూపొద్దని విద్యాధికారులకు రాజశేఖర్ స్పష్టం చేశారు. దాని ప్రభావం జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రగతి సూచీలపై పడుతుందని తెలిపారు. యూడైస్ ప్లస్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కూడా ఉండేలా చూసుకోవాలన్నారు. కోవిడ్‌తో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల చదువులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇలాంటి పిల్లలు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉంటే ఉచిత విద్యతోపాటు ఇతర బాధ్యతలపై ఆయా సంస్థల నుంచి ధ్రువపత్రం తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి, పాఠశాల విద్య సలహాదారు ఎ.మురళి, జగనన్న గోరుముద్ద పథకం డైరెక్టర్ దివాన్ మైదీన్, ఆర్‌ఎంఎస్‌ఏ డైరెక్టర్ పి.పార్వతి, పౌర గ్రంథాలయాల సంచాలకులు డా.ప్రసన్నకుమార్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా.ప్రతాప్ రెడ్డి, పాఠశాల విద్య జాయింట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు. -
ఫీజు.. ప్లీజ్! 2,500కోట్లు గతరెండేళ్లలో పెండింగ్...
హైదరాబాద్‌లోని కొత్తపేటకు చెందిన ప్రశాంతి ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ కాలేజీలో బీటెక్ పూర్తిచేసింది. ఫైనలియర్ చివర్లో క్యాంపస్ సెలక్షన్లో క్యాప్ జెమినీ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికైంది. కోర్సు ముగియడంతో ఉద్యోగంలో చేరేందుకు ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంది. వాటికోసం కాలేజీలో సంప్రదిస్తే మూడో, నాలుగో ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ ఇంకా రాలేదని.. సర్టిఫికెట్లు కావాలంటే ఫీజు చెల్లించాలని యాజమాన్యం తేల్చి చెప్పింది. దీనితో ప్రశాంతి తల్లిదండ్రులు రూ.లక్షా పదివేలు అప్పు చేసి..కాలేజీలో కట్టాల్సి వచ్చింది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో వేల మంది విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కోర్సు పూర్తయ్యాక ఉద్యోగంలో చేరాలన్నా.. పైచదువులకు వెళ్లాలన్నా సర్టిఫికెట్లు కావాల్సిందే. దీంతో విధిలేని పరిస్థితుల్లో అప్పోసొప్పో చేసి కాలేజీలకు డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. ఇక సర్టిఫికెట్లతో అత్యవసరం లేని పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఇతర విద్యార్థుల ‘ఫీజు’బకాయిలు కూడా భారీగా పేరుకుపోయాయి. ప్రభుత్వం ఈ పథకాలకు అరకొరగా నిధులు విడుదల చేయడమే దీనికి కారణమని విద్యార్థులు, తల్లిదండ్రులు వాపోతున్నారు. బకాయిలు రూ.2,500 కోట్లు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల కింద.. 2019– 20, 2020–21 విద్యా సంవత్సరాలకు సంబంధించే రూ.2,500 కోట్ల వరకు విడుదల కావాల్సి ఉన్నట్టు సంక్షేమ శాఖల గణాంకాలు చెప్తున్నాయి. ఇందులో 2019–20 ఏడాది బకాయిలు రూ.406.66 కోట్లుకాగా.. 2020–21కు సంబంధించి దరఖాస్తుల పరిశీలన ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు రూ.1,178.21 కోట్లు అవసరమని తేల్చగా.. పరిశీలన పూర్తయ్యే సరికి మరో రూ.వెయ్యి కోట్లు పెరుగుతుందని అంచనా. మొత్తంగా 2020–21 నాటికే రూ.2,500 కోట్లకుపైగా అవసరం. ఇక ప్రస్తుత విద్యా సంవత్సరాని (2021–22)కి సంబంధించిన ఉపకార వేతనాలు, ‘ఫీజు’కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ట్రెజరీల్లో పెండింగ్! ఉపకార వేతనాలు, ‘ఫీజు’దరఖాస్తులను సంక్షేమశాఖలు పరిశీలించి అర్హతను నిర్ధారిస్తాయి. తర్వాత కాలేజీల వారీగా బిల్లులు సిద్ధం చేసి ఖజానా శాఖకు పంపుతాయి. ప్రస్తుతం సంక్షేమశాఖలు బిల్లులు పంపాయని.. ట్రెజరీల్లో పెండింగ్‌లో ఉన్నాయని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఉపకార వేతనాలు, ‘ఫీజు’బకాయిల తీరు (రూ.కోట్లలో) అప్పుల్లో కూరుకుపోయాం.. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయక కాలేజీల నిర్వహణ కష్టంగా మారింది. సిబ్బంది వేతనాల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. కరోనా పరిస్థితులతో కాలేజీల నిర్వహణ మరింత భారంగా మారింది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయాలి. – గౌరీ సతీశ్, తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీల సంఘం అధ్యక్షుడు -
ఇంజినీరింగ్ చేస్తే సైబర్ సెంటర్లో పనిచేయాలి.. ఆవేదనతో విద్యార్థి ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ప్రస్తుత విద్యా వ్యవస్థ నచ్చక ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హాసన్ జిల్లాలో చోటుచేసుకుంది. అరసీకెరె తాలూకా గండసి గ్రామానికి చెందిన హేమంత్‌గౌడ ఆత్మహత్యకు పాల్పడ్డ ఇంజినీరింగ్ విద్యా ర్థి. హేమంత్ హాసన్‌లోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మంగళవారం సెల్ఫీ వీడియో విడుదల చేసిన హేమంత్ నేటి విద్యా వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేసాడు. 20 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదన్నాడు. తన తండ్రి ఉపాధ్యాయుడని, ఆయన వద్ద చదువుకున్న ఎంతోమంది ఉన్నత స్థానాలను అలంకరించారన్నారు. ఇప్పుడు ఇంజినీరింగ్ చేస్తే సైబర్ సెంటర్లో పనిచేయాలని అసంతృప్తి వ్యక్తం చేసాడు. విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని కోరాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన అంత్యక్రియలకు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, ఆదిచుంచనగిరి స్వామి రావాలని, తన అవయవాలు దానం చేయాలని వీడియోలో కోరాడు. చదవండి: Tamilnadu Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం -
Rukmini Banerji: స్మార్ట్ మామ్ ఈ రుక్మిణి.. ఏం చేస్తారంటే!
పిల్లలు స్కూలుకు వెళ్లి చదువుకుంటున్నారు. కానీ ఏడాది ఏడాదికి తరగతులు మాత్రమే మారుతున్నాయి. వారు నేర్చుకున్నది ఏమీ కనిపించడం లేదు. స్కూళ్లలో చదువుతోన్న యాభైశాతం మంది పిల్లలు కనీసం పదాలు కూడా సరిగా రాయలేకపోతున్నారు. చిన్నపాటి వాక్యాలను కూడా చదవలేకపోతున్నారు. ఇక గణితం అయితే అంతే సంగతులు. ఈ స్థితిని ‘లెర్నింగ్ ప్రావర్టీ’గా పరిగణించాల్సిన అవసరం ఉంది. దీని మీద దృష్టి కేంద్రీకరించకపోతే రేపటితరం భవిష్యత్ అంధకారమవుతుంది అని అర్థవంతంగా చెప్పారు డాక్టర్ రుక్మిణీ బెనర్జి. దీంతో వందకుౖ పెగా దేశాల విద్యావేత్తలు పోటీపడిన బహుమతిని అవలీలగా అందుకున్నారు రుక్మిణీ బెనర్జీ. పాఠశాల విద్యలో అభ్యసన ప్రక్రియను మెరుగు పరచడానికి ఆమె సూచించిన అంశాలకు గాను ఎడ్యుకేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘యిదన్’ బహుమతి అందుకున్నారు. ఈ బహుమతి కోసం 130 దేశాలకు చెందిన విద్యావేత్తలు పోటీపడగా బెనర్జీని బహుమతి వరించడం విశేషం. ఆర్థికవేత్త నుంచి విద్యావేత్తగా... బిహార్‌కు చెందిన డాక్టర్ రుక్మిణీ బెనర్జీ న్యూఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో అర్థశాస్త్రాన్ని చదివి, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటి స్కాలర్‌గా చేరారు. తరువాత చికాగో యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఉన్నత విద్య పూర్తయ్యాక అమెరికాలోనే స్థిరపడిన బెనర్జి 1996లో ఇండియా వచ్చారు. అప్పుడు ముంబై కేంద్రంగా పనిచేస్తోన్న ఎన్జీవో ‘ప్రథమ్’లో చేరారు. అప్పటి నుంచి విద్యావ్యవస్థ అభివృద్ధే లక్ష్యంగా కృషిచేస్తున్నారు. వివిధ రకాల కార్యక్రమాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్కూలు పిల్లల అభ్యసనను మెరుగుపరుస్తున్నారు. ఈ క్రమంలోనే బెనర్జీ నేతృత్వంలోని బృందం ‘యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు’(ఏఎస్ ఈఆర్)ను విడుదల చేసింది. 2005–15 వరకు ఇంటింటికి తిరిగి సర్వే చేసి విడుదల చేసిన నివేదిక అది. వందరోజులకు పైగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి ఆరు లక్షలమంది పిల్లల అక్షరాస్యత నాణ్యతపై సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో అనేక స్కూళ్లను సందర్శించి ఎక్కువమంది పిల్లలు ప్రాథమిక అంశాలను కూడా చదవలేకపోవడం, చిన్నపాటి గుణింతాలు కూడా చేయలేకపోవడం గుర్తించి, అంతేగాక ‘టీచింగ్ ఎట్ ద రైట్ లెవల్’ (టీఏఆర్‌ఎల్) కార్యక్రమం ద్వారా విద్యార్థుల అభ్యసనను మెరుగు పరచవచ్చని సూచించారు. అంతేగాక టీఏఆర్ఎల్ను కొన్ని ప్రాంతాల్లో అమలు చేసి మంచి ఫలితాలను చూపించారు. ఈ కార్యక్రమానికి రుక్మిణి చేసిన కృషికి గుర్తింపుగా ఆమెను యిదన్ ప్రైజ్ వరించింది. ఏఎస్ఈఆర్.. ఏఎస్ఈఆర్తోపాటు .. పిల్లల కోసం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో దినపత్రికల్లో ఆరి్టకల్స్ రాయడం, పిల్లలకు సులువుగా అర్థమయ్యే విధంగా కథల పుస్తకాలను బెనర్జీ రాస్తున్నారు. ఏఎస్ఈఆర్ నివేదిక రూపొందించే బృందాన్ని ముందుండి నడిపించారు. ఈ నివేదికను విడుదల చేసిన తరువాత బెనర్జి ప్రథమ్‌కు సీఈవో అయ్యారు. విద్యావ్యవస్థ అభివృద్ధిని గుర్తించిన బిహార్ ప్రభుత్వం 2008లో ‘మౌలానా అబుల్ కలామ్ శిక్షా పురస్కార్’తో సత్కరించింది. రాష్ట్రంలో ఈ అవార్డును అందుకున్న తొలి వ్యక్తి బెనర్జీనే. తాజాగా 2021 సంవత్సరానికి గాను విద్యాభివృద్ధికి కృషిచేస్తోన్న వారికిచ్చే ‘యిదన్’ బహుమతిని అందుకున్నారు. స్మార్ట్ మామ్ విద్యద్వారా మెరుగైన ప్రపంచాన్ని అందించేవారిని సత్కరించేందుకు గాను 2016లో చార్లెస్ చెన్ యిదన్ ‘ద యిదన్ అవార్డు’ను ఏర్పాటు చేశారు. ఈ బహుమతి పొందిన వారికి స్వర్ణ పతకంతోపాటు, 3.9 మిలియన్ డాలర్లు( మన రూపాయల్లో దాదాపు 29 కోట్లు) దీనిలో సగం మొత్తా్తన్ని విద్యాభివృద్దికి వినియోగించాలి. ‘‘యిదన్ ప్రైజ్ విద్యాభివృద్ధికి మరింత కృషిచేసే అవకాశం కల్పించింది. గత 15 ఏళ్లుగా పిల్లల అక్షరాస్యతపై పనిచేస్తున్నాం. మొహల్లా లెర్నింగ్ క్యాంపెయిన్‌లో భాగంగా వలంటీర్లతో ‘టీచింగ్ ఎట్ ది రైట్ లెవల్’ను అందిస్తున్నాము. ‘స్మార్ట్ మామ్’ పేరిట విద్యార్థుల తల్లులకు ఎస్ఎమ్ఎస్, వాట్సాప్ మెస్సేజ్‌ల ద్వారా చిన్నపాటి యాక్టివిటీలను అప్పజెప్పి వారి ద్వారా పిల్లల అభ్యసనను మెరుగుపరుస్తున్నాం. దీనికి మంచి స్పందన లభిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పదివేల కమ్యూనిటీల్లో 30 నుంచి 35 వేలమంది తల్లులు పాల్గొంటున్న ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తాము’’ అని రుక్మిణీ బెనర్జీ వివరించారు. చదవండి: కూచునే హక్కు మీకు ఉంది... -
నచ్చిన కాలేజీలోనూ క్లాసులు వినొచ్చు
సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ డిగ్రీలో సరికొత్త విద్యా విధానాన్ని అమలు చేయనున్నారు. కొఠారీ కమిషన్, జాతీయ విద్యా విధానం సిఫార్సుల మేరకు క్లస్టర్ విధానానికి ఉన్నత విద్యా మండలి రూపకల్పన చేసింది. ఏదైనా ఒక కాలేజీలో చదువుకునే విద్యార్థి మరో కాలేజీలో వేరే సబ్జెక్టు క్లాసులకు హాజరయ్యే వెసులు బాటును ఇది కల్పిస్తుంది. దీనిపై కోఠి ఉమెన్స్ కాలేజీలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిం చారు. ఆధునిక విద్యావిధానం కోరు కునే విద్యార్థులకు క్లస్టర్ విధానం చక్కటి అవకాశమని అధికారులు తెలిపారు. ప్రత్యక్ష, పరోక్ష (ఆన్లైన్) చదువుకూ వీలుంటుంద న్నారు. తొలి దశలో తొమ్మిది కాలేజీల మధ్య సమన్వయం తీసుకొస్తున్నారు. కోఠి ఉమెన్స్ కాలేజీ, సిటీ కాలేజ్, రెడ్డి ఉమెన్స్, సెయింట్ ఆన్స్, సెయింట్ ఫ్రాన్సిస్, భవన్స్, లయోలా, బేగంపేట ఉమెన్స్ కాలేజ్, నిజాం కాలేజీలు ఈ జాబితాలో ఉన్నాయి. త్వరలో మార్గదర్శకాలు కళాశాలల్లోని ఫ్యాకల్టీ, లేబొరేటరీ, లైబ్రరీ, రీసెర్చ్ తదితర అంశాల్లో ప్రత్యేకతలను పరిగణనలోకి తీసుకుని వాటిలో ఎక్కడైనా విద్యార్థులు ఒక సబ్జెక్టును చదవచ్చు. దానికి సంబంధించిన పరీక్ష అదే కాలేజీలో నిర్వహించి, మార్కులు మాతృ కాలేజీకి పంపుతారు. తొమ్మిది కాలేజీల్లో ఒకే రకమైన పాఠ్య ప్రణాళిక, పరీక్ష విధానం, అడ్మిషన్ ప్రక్రియ ఉంటుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. ఈ ఉమ్మడి ఎజెండాకు అనుగుణంగా తొమ్మిది కాలేజీలు అవగాహన ఒప్పందానికి వస్తాయని, పరస్పర సమన్వయంతో ముందుకెళ్తాయని వివరించారు. దీనిపై త్వరలో మరోసారి సమీక్షించి, అవసరమైన మార్గదర్శకాలు అందుబాటులోకి తెస్తామని లింబాద్రి చెప్పారు. -
యూజీసీ నెట్, జూన్ 2021: ముఖ్య సమాచారం
దేశవ్యాప్తంగా హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్, తత్సమాన సబ్జెక్టులకు సంబంధించి జేఆర్ఎఫ్, లెక్చర్‌షిప్(అసిస్టెంట్ ప్రొఫెసర్) అర్హత కోసం నిర్వహించే యూజీసీ–నేషనల్ ఎలిజి బిలిటీ టెస్ట్(నెట్)–జూన్ 2021 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విడుదల చేసింది. ► అర్హత: హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్ (లాంగ్వేజెస్‌ని కలుపుకొని), కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, ఎలక్ట్రానిక్ సైన్స్ తదితర సబ్జెక్టుల్లో కనీసం 55శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి. ప్రస్తుతం మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న వారు, మాస్టర్స్ డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► వయసు: జేఆర్‌ఎఫ్‌నకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 01.10.2021 నాటికి 31ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. ► ఎంపిక విధానం: ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► పరీక్షా విధానం: ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఈ రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహా మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో అడుగుతారు.పేపర్ 1– 50 ప్రశ్నలు–100 మార్కులకు, పేపర్ 2–100 ప్రశ్నలు–200 మార్కులకు జరుగుతుంది. పరీక్షా సమయం మూడు గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమంలో ఉంటుంది. ముఖ్య సమాచారం: ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.09.2021 ► పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేది: 06.09.2021 ► పరీక్ష తేదీలు: 2021 అక్టోబర్ 06 నుంచి 11 వరకు జరుగుతాయి ► వెబ్సైట్: https://ugcnet.nta.nic.in -
సకల జనుల తెలంగాణే లక్ష్యం: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: సకల జనుల తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతానని దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజ శేఖరరెడ్డి కూతురు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. త్వరలో మంచి రోజులొస్తున్నాయని ప్రజలకు భరోసా ఇచ్చారు. ముసలవ్వలు నడిచేందుకు ఊతకర్రనవుతానని, బడి ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్న ఇంటికి పెద్దక్కనవుతానని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో షర్మిల పేర్కొన్నారు. డిగ్రీ పట్టా పట్టుకొని రోడ్డు మీదకొచ్చే తమ్ముళ్లు, చెల్లెమ్మల కోసం ఉద్యోగ బాటలు వేస్తానని తెలిపారు. చిన్నారులకు నాణ్యమైన విద్యను అందిస్తానన్నారు. మెరుగైన వైద్యం కోసం పడిగాపులు కాసే పరిస్థితిని సమూలంగా మార్చేస్తానని చెప్పారు. -
సీబీఎస్ఈ అఫిలియేషన్‌లో మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరిధిలో ఏర్పాటు కానున్న విద్యాసంస్థలకు గుర్తింపు (అఫిలియేషన్) మంజూరు ప్రక్రియలో పలు మార్పులు చేసినట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. అఫిలియేషన్ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లో నిర్వహించేలా చర్యలు చేపట్టింది. జాతీయ నూతన విద్యా విధానం–2020 ప్రకారం సీబీఎస్ఈ బైలాలో పలు మార్పులు చేసింది. ఈ విషయాలతో తన అధికారిక వెబ్సైట్లో తాజాగా ఒక నోటిఫికేషన్ పొందుపరిచింది. 2021 మార్చి 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. వివిధ కమిటీల సిఫార్సుల మేరకు నూతన విద్యా విధానంలో చేసిన సూచనల ప్రకారం ఈ మార్పులు చేస్తున్నట్టు సీబీఎస్ఈ పేర్కొంది. పునర్వ్యవస్థీకరణ లక్ష్యం ఇలా.. సీబీఎస్ఈ గుర్తింపు మంజూరుకు 2006 నుంచి ఆన్లైన్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం పూర్తిగా డిజిటలైజేషన్, డేటా అనలటిక్స్ ఆధారంగా తక్కువ మానవ వనరుల వినియోగంతో గుర్తింపు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు సీబీఎస్ఈ వివరించింది. త్వరితగతిన గుర్తింపు పొందడం, ఆటోమేటెడ్, డేటా డ్రైవన్ ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం, పారదర్శకత పెంచడం, మొత్తం అఫిలియేషన్ విధానంలో అకౌంట్‌బిలిటీని పెంచడం, త్వరితంగా, కాల పరిమితిలోగా దరఖాస్తులను పరిష్కరించడం లక్ష్యంగా కొత్త విధానాన్ని చేపడుతున్నట్టు పేర్కొంది. ఇందుకు పూర్తి నిర్దేశిత సమయాలను పాటించనుంది. ఆయా విద్యాసంస్థలు అవసరమైన డాక్యుమెంట్లను సీబీఎస్ఈ వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వివరించింది. చదవండి: వివాదాస్పద తీర్పుపై సుప్రీంకోర్టు స్టే -
దేశంలో నంబర్‌వన్‌గా నిలుపుతాం: మంత్రి సురేష్
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని యూనివర్సిటీల బలోపేతానికి ప్రాధాన్యతనిస్తున్నామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రతీ యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. తొమ్మిది యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్లని నియమించామని, మూడు యూనివర్సిటీలకి సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. విద్యా సంస్ధలలో రాజకీయ జోక్యం లేకుండా ఉత్తమ ఫలితాల దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశామని పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి సురేష్ మాట్లాడుతూ.. ఉన్నత విద్యలో అర్హులకి పూర్తిస్ధాయి ఫీజు రీఎంబర్స్ మెంట్ చెల్లిస్తున్నామన్నారు. ఈ నెల 11 న అమ్మ ఒడి రెండవ విడత కార్యక్రమం ప్రాంభిస్తున్నట్లు చెప్పారు. నాడు నేడులో మూడు విడతలలో 11 వేలకోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నామని, దేశంలో ఎక్కడాలేని విధంగా హైయర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు ఏర్పాటు చేశామన్నారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఉన్నత విద్యను బలోపేతం చేస్తున్నాం. నిబంధనలు పాటించని 247 కళాశాలలకి షోకాజ్ నోటీసులు ఇచ్చాం. 48 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలపై చర్యలు తీసుకున్నాం. నాణ్యతా ప్రమాణాలు పాటించని కళాశాలలపై చర్యలుంటాయి. ఈ నూతన విద్యా సంవత్సరంలో ఆన్ లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాం. ఇంటర్లో వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్ అడ్మిషన్లు ప్రారంభిస్తాం.అవినీతికి తావులేకుండా యూనివర్సిటీలలో పూర్తిగా కంప్యూటీకరణ చేస్తున్నాం. ఉన్నత విద్యలో ర్యాపిడ్ ఎడ్యుకేషన్ సర్వే నిర్వహిస్తున్నాం. ఈ విద్యాసంవత్సరంలో మూడు కొత్త కోర్సులు ప్రారంభిస్తున్నాం. అయిదేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుని ప్రారంభిస్తున్నాం.నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుని తీసుకువస్తున్నాం. నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోసం ఒక ఏడాది పిజికోర్సుని కొత్తగా ప్రవేశపెడుతున్నాం. ఈ ఏడాదిలో ఉన్నత విద్యామండలిని మరింత బలోపేతం చేసి దేశంలో నంబర్ వన్‌గా నిలబడతాం’ అని అన్నారు. -
మానవాభివృద్ధిలో నేలచూపు
మానవాభివృద్ధి సూచీలో ఎప్పటిలా మనం వెనకబడే వున్నాం. విద్య, వైద్యం, ఆయుర్దాయం వంటి చాలా అంశాల్లో నాసిరకం ప్రమాణాలతోనే నెట్టుకొస్తున్నాం. ప్రతి ఏటా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్డీపీ) విడుదల చేసే మానవాభివృద్ధి సూచీ నివేదిక ఏ దేశం సాధించినదెంతో చెబుతుంది. నిరుడు విడుదల చేసిన నివేదికలో అంతక్రితంకన్నా మెరుగై 129వ స్థానంలోకొచ్చిన మన దేశం ఈసారి మాత్రం రెండు మెట్లు కిందకు దిగి 131 స్థానానికి పోయింది. లోగడ 134వ స్థానంలో వున్న భూటాన్ వివిధ అంశాల్లోనూ తనను తాను మెరుగుపర్చుకుని ఇప్పుడు 129వ స్థానానికొచ్చింది. వాస్తవానికి ఈ నివేదిక 2019 సంవత్సరానికి సంబంధించి వివిధ దేశాల ప్రగతిని పరిగణనలోకి తీసుకుంది. అది ముగిసి 2020లోకి అడుగుపెట్టాక కరోనా మహమ్మారి కాటేసింది గనుక మనతోపాటు దాదాపు అన్ని దేశాలూ ఇందులో పొందిన ర్యాంకులకన్నా ప్రస్తుతం ఇంకా కిందకు దిగజారివుంటాయి. అయితే మన దేశం అన్ని ప్రమాణాల్లోనూ ఒకే రకంగా అట్టడుగు స్థాయిలో లేదు. కొన్నింటిలో మెరుగ్గా వుండగా, మరికొన్ని అంశాల్లో చాలా వెనకబడి వుంది. తాజా నివేదిక ప్రకారం మన దేశంలో సగటు ఆయుర్దాయం 69.7 సంవత్సరాలుంది. ఈ విషయంలో మనకన్నా బంగ్లాదేశ్(72.6), నేపాల్(70.8), భూటాన్(71.8) ఎంతో మెరుగ్గా వున్నాయి. అలాగే స్థూల జాతీయ తలసరి ఆదాయంలోనూ 2018తో పోలిస్తే నిరుడు తగ్గింది. మూడు దశాబ్దాలుగా ఐక్యరాజ్యసమితి ఈ మానవాభివృద్ధి సూచీ నివేదికలను ఏటా విడుదల చేస్తోంది. ప్రతి దేశమూ తమ పనితీరు సమీక్షించుకుని సవరించుకుంటాయని దాని ఆశ. ప్రగతికి కొలమానంగా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)ని చెప్పడం కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ దేశాలన్నిటా అలవాటుగా మారింది. జీడీపీ శాతాన్ని చూపుతూ అంతా సవ్యంగా వుందని మన పాలకులు కూడా నమ్మిస్తూనే వున్నారు. కానీ సాధారణ ప్రజలకు విద్య, వైద్యం, ఇతర మౌలిక వసతుల కల్పన ఎలావుందో, దేనికెంత వ్యయం చేస్తున్నారో లెక్కలు తీస్తే ఎప్పుడూ మనం దిగ దుడుపే. వాస్తవంగా సాధారణ ప్రజల తలసరి ఆదాయం ఎలావుంది... ఆ ఆదాయంలో వారు విద్య, వైద్యం, చదువు వగైరా అంశాల్లో ఎలా ఖర్చు చేస్తున్నారన్నదే కీలకమైన విషయం. అలాగే సామాజికంగా మహిళలు ఏ స్థానంలో వున్నారో, వారి అధీనంలో వున్న ఆస్తుల సగటువిలువెంతో, పాలనా వ్యవస్థలో వారికిస్తున్న స్థానం ఏపాటిదో పరిగణనలోకి తీసుకుంటేనే వాస్తవ అభివృద్ధి ఎలావుందో తెలుస్తుంది. దేశాన్నేలే పాలకులు వేటిని ప్రాధాన్యతా అంశాలుగా చూస్తున్నారో, వారి విధానాలు పౌరుల్ని ఎటువైపు నడిపిస్తున్నాయో, భిన్న రంగాల్లో ఒక దేశం సాధిస్తున్న అభివృద్ధేమిటో చూడటమే మానవాభివృద్ధి సూచీ లక్ష్యం. ఆరోగ్య సదుపాయాల సంగతే చూస్తే కొన్ని వెనకబడిన దేశాలకన్నా మనం నాసిరకంగా వున్నాం. పదివేల జనాభాకు సగటున మయన్మార్‌లో పది బెడ్లు వుంటే, మన దగ్గర అయిదు మాత్రమే వున్నాయి. బంగ్లాదేశ్‌లో అవి 8 అయితే, పాకిస్తాన్లో 6. ఇక వైద్యుల లభ్యత చూసినా అంతే. పదివేల జనాభాకు మన దేశంలో సగటున 8.6 వైద్యులుంటే పాకిస్తాన్లో ఆ సంఖ్య 9.8. చిత్రమేమంటే వైద్యుల లభ్యతలో మనకన్నా స్వల్పంగా వెనకబడి 8.3 దగ్గరే ఆగిన చిన్న దేశం వియత్నాంలో బెడ్ల సంఖ్యమాత్రం ఎక్కువ. అక్కడ పదివేల జనాభాకు సగటున 32 వున్నాయి. మౌలిక వైద్య సదుపాయాల కల్పనలో మనం చాలా వెనకబడివున్నామని కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడినప్పుడు తేటతెల్లమయింది. వైద్య విద్యకు అగ్ర ప్రాధాన్య మిచ్చి కళాశాలల సంఖ్యను గణనీయంగా పెంచాలని ప్రభుత్వాలు భావించకపోవడమే ఇందుకు కారణం. ఉన్న కళాశాలల్లో అవకాశాలు రాక మన విద్యార్థులు చైనా, రష్యా, ఫిలిప్పీన్స్ వగైరా దేశాలకు వలసపోవలసి వస్తోంది. పీజీ, సూపర్ స్పెషాలిటీ స్థాయిల్లో సీట్ల సంఖ్య మరీ తక్కువ. పైగా వైద్య విద్య ఖర్చు తడిసి మోపెడవుతోంది. ప్రైవేటు రంగంలోని కళాశాలలు, డీమ్డ్ యూని వర్సిటీల్లో 50 శాతం సీట్లకు ఇష్టానుసారం ఫీజుల్ని వసూలు చేసుకునే అవకాశం ఇవ్వడంతో వైద్య విద్య ఖరీదైన వ్యవహారంగా మారింది. పరిస్థితి ఇలా వున్నప్పుడు వైద్యుల సంఖ్య, ఆసుపత్రి సదుపాయాలు ఎలా పెరుగుతాయి? ఆయుర్దాయం, ఆరోగ్యం, విద్య, మెరుగైన జీవన ప్రమాణం వగైరా అంశాలకు విడివిడిగా సూచీలు రూపొందించి మొత్తం మానవాభివృద్ధి సూచీలో ఏ దేశం ఎలావున్నదో చెప్పడం నివేదిక ఉద్దేశం. సున్నా నుంచి ఒకటి వరకూ మొత్తంగా ఏ దేశం ఏ స్థానంలో వుందో అది వెల్లడిస్తుంది. అలా చూసుకుంటే తొలి స్థానంలో వున్న నార్వే కూడా పూర్తిగా ఒకటికి చేరలేకపోయింది. అది 0.957 దగ్గర వుంది. రెండో స్థానంలో వున్న ఐర్లాండ్, స్విట్జర్లాండ్‌లు 0.955 దగ్గర వున్నాయి. మనం 0.645 దగ్గర, శ్రీలంక 0.782 దగ్గర వున్నాయి. మానవాభివృద్ధి సూచీ అద్దంలాంటిది. అది మనం ఎలావున్నామో చెబుతుంది. దాన్ని చూసి సరిచేసుకోవడం మన బాధ్యత. జీడీపీ ఘనంగా కనబడినా, తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్పుకున్నా సాధారణ పౌరులకు ఒరిగేదేమీ వుండదు. వ్యవ సాయం, పరిశ్రమలు, సేవారంగం తదితరాల్లో మొత్తం ఉత్పత్తుల విలువ(జీఎన్డీపీ)ని లెక్కగట్టి, జనాభా సంఖ్యతో భాగించి తలసరి ఆదాయాన్ని లెక్కేస్తారు. ఇందులో ప్రభుత్వోద్యోగులకు లభించే జీతాలు కూడా వచ్చి చేరతాయి. ఇలావచ్చే జీడీపీని చూసి దారిద్య్రం తగ్గిందని, దేశం ప్రగతిపథంలో పయనిస్తోందని భావించడం పనికిమాలిన వ్యవహారమని నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. అందుకు బదులు విద్యను, వైద్యాన్ని, ఇతర మౌలిక సదుపాయాలను ఏమేరకు కల్పించామో ప్రభు త్వాలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. సాధారణ ప్రజానీకం ఆదాయాన్ని పెంచడానికి, వారు తమ కాళ్లపై తాము నిలబడటానికి ఏం చేస్తున్నామో గమనించుకోవాలి. అప్పుడు మాత్రమే మానవాభివృద్ధి సూచీలో గర్వపడదగిన స్థాయికి చేరుకోగలుగుతాం. -
విద్యార్థుల దశ ఇకనైనా మారేనా?
దేశంలో 1986 నుండి అమలులో ఉన్న 10+2 విద్యావిధానం స్థానంలో 5+3+3+4 విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. నూతన విద్యా విధానంపై 2015 నుండి రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు, వివిధ సంఘాల నుండి రెండు లక్షలకు పైగా సూచనలు సలహాలను స్వీకరించి కస్తూరిరంగన్ నివేదిక ఆధారంగా రెండు భాగాలుగా విభజించారు. (1) పాఠశాల విద్య (2) ఉన్నత విద్య. పాఠశాల విద్యను నాలుగు రకాలుగా విభజించారు. ఇందులో 3 నుండి 18 సంవత్సరాలు గల విద్యార్థులను చేర్చారు. (1) పునాది స్థాయి 1, 2వ తరగతులు (2) తయారు స్థాయి 3, 4, 5వ తరగతులు (3) మాధ్యమిక స్థాయి 6, 7, 8వ తరగతులు (4) సెకండరీ స్థాయి 9, 10, 11, 12వ తరగతులు, ఈ నూతన విధానంలో అదనంగా 3 నుండి 6 సంవత్సరాల విద్యార్థులను చేర్చారు. దీంతో 2 కోట్లమంది పిల్లలకు విద్యాభ్యసనకు అవకాశం కలుగుతుందని కేంద్రం అంచనా వేసింది. ఉన్నత విద్యలో గ్రాడ్యుయేషన్ కోర్సులను 3 లేదా 4 సంవత్సరాల మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్ని ప్రవేశపెట్టనున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను 1 లేదా రెండేళ్లుగా నిర్ధారించారు. మొత్తంగా దేశ అక్షరాస్యత 100% చేరుకునే విధంగా లక్ష్యం పెట్టుకున్నారు, ఈ విధానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకు పోవాల్సి ఉంటుంది. మొత్తం విద్యారంగంపై ఖర్చును జాతీయ జీడీపీలో 6% చేరుకోవాలని నిర్ణయించారు. నూతన విద్యా విధానంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, ఇతర ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్లు, ఆర్థికపరమైన రాయితీలు కొనసాగుతాయని తెలిపారు. కాలానుగుణంగా, అవసరాల రీత్యా, అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో సమానంగా పోటీ పడాలంటే విద్యా విధానాలలో మార్పు చేసుకోకతప్పదు. కేవలం విద్యా విధానాల మార్పు వలన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈ డబ్ల్యూఎస్ విద్యార్థులకు ఎంతమేరకు లబ్ధి చేకూరుతుందో ఆలోచించాలి. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు విద్యా సంస్థలలో విద్యార్థుల చేరిక దినదినం పెరుగుతోంది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఉన్నత, మధ్య తరగతి ఆదాయం కలిగిన కుటుంబాలు తమ పిల్లలను 90% పైగా ప్రైవేటు విద్యాసంస్థలలో ఆంగ్ల మాధ్యమంలో మౌలిక వసతులు కలిగిన విద్యా సంస్థలలో చదివించడానికి మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక వసతులైన పక్కా భవనాలు, విద్యుత్ సౌకర్యం, త్రాగునీరు, టాయిలెట్స్, తగు బోధన బోధనేతర సిబ్బంది, కంప్యూటర్ విద్యా విధానం, రవాణా లాంటి సౌకర్యాలను కల్పించకుండా విద్యా విధానాల మార్పుతో పెద్దగా ఆశించిన ఫలితాలు రావు. కేంద్ర ప్రభుత్వం 2009లో ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని ప్రవేశపెడుతూ 6 నుండి 14 సంవత్సరాల బాల బాలికలకు ప్రైవేటు విద్యాసంస్థలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అగ్ర కులాల్లోని ఆర్థికంగా బలహీన వర్గాలకు 25% రిజర్వేషన్లను కల్పించింది దేశంలో ఎక్కడా కూడా పటిష్టంగా ఈ రిజర్వేషన్లు అమలు జరగడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగంలో మాతృ భాషను కొనసాగిస్తూనే ఆంగ్ల మాధ్యమంలో విద్యాసంస్థల సంఖ్యను నాణ్యమైన విద్య, మౌలిక వసతులతో పెంచి రాజ్యాంగం కల్పిస్తున్న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, అగ్రకులాల్లోని ఆర్థికంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలుపరచి ఆర్థిక సహకారాన్ని కొనసాగించాలి. ముఖ్యంగా నూతన విద్యా విధానాల పేరిట ప్రైవేటు సంస్థలకు విద్యారంగాన్ని ధారాదత్తం చేస్తే లక్ష్యం నెరవేరకపోగా దేశంలో విద్యా రంగం అధోగతి పాలయ్యే అవకాశాలే ఎక్కువ. కె. కుమారస్వామి వ్యాసకర్త ప్రముఖ సామాజిక విశ్లేషకులు మొబైల్ : 94909 59625 -
కాలేజీల్లో నాణ్యతకు పెద్దపీట
కాలేజీల్లో ప్రమాణాలపై ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్)లు ఖరారు చేయాలి. అన్ని కాలేజీలలో రెగ్యులర్‌గా తనిఖీలు చేసేందుకు 30 మందితో 10 బృందాలు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా టీచర్ ట్రైనింగ్ కాలేజీలపై దృష్టి పెట్టాలి. వాటిలో ప్రమాణాలు లేకపోతే నోటీసులు ఇవ్వాలి. అయినా మార్పు రాకపోతే ఆ కాలేజీలను మూసి వేయాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని కాలేజీలు మూడేళ్లలో పూర్తి ప్రమాణాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. తప్పనిసరిగా ఎన్ఏసీ, ఎన్బీఏ అక్రిడిటేషన్ పొందాలని, ప్రభుత్వ కాలేజీలు కూడా ఆ ప్రమాణాలు సాధించాలని స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా రాష్ట్రంలో ఉన్నత విద్య విధానంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం సూచనలు, ఆదేశాలు ఇలా ఉన్నాయి. ► రాష్ట్రంలోని అన్ని కాలేజీలు వచ్చే 3 ఏళ్లలో నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ), నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (ఎన్ఏసీ–న్యాక్) సర్టిఫికెట్లు సాధించాలి. అన్ని ప్రభుత్వ కాలేజీలు కూడా తప్పనిసరిగా ఈ గుర్తింపు పొందాలి. ► ప్రమాణాలు లేని ఇంజనీరింగ్, ఇతర కాలేజీలు అన్నింటికీ నోటీసులు జారీ చేయాలి. మూడేళ్లలో కాలేజీల్లో మార్పు రాకపోతే చర్యలు తప్పవని చెప్పాలి. ప్రమాణాలు పాటించని ఇంటర్మీడియెట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి. ప్రత్యేక బృందాలతో తనిఖీలు ► బీఈడీ కాలేజీలు కచ్చితంగా ప్రమాణాలు పాటించి తీరాలి. టీచర్ ట్రైనింగ్ సంస్థల్లో క్వాలిటీ లేకపోతే నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి. టీచర్ల శిక్షణలోనే నాణ్యత లేకపోతే వారు పిల్లలకు పాఠాలు ఎలా చెబుతారు? ► కాలేజీలలో తనిఖీ కోసం నియమించిన బృందాలు శాశ్వత స్వా్కడ్ మాదిరిగా ఉండాలి. ప్రమాణాలు, నాణ్యత లేని కాలేజీలకు కొంత సమయం ఇచ్చి వాటిని మార్చుకోమని చెప్పాలి. ఈ తనిఖీల ప్రక్రియ నిరంతరం కొనసాగాలి. డిగ్రీ, పీజీ కోర్సుల్లో మార్పులు 1 ఇక మీదట రాష్ట్రంలో ఏడాది లేదా రెండేళ్ల పీజీ ప్రోగ్రాములు.. మూడు లేదా నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రాములు ఉంటాయి. ఈ ఏడాది నుంచే అవి ప్రారంభం అవుతాయి. 4 ఏళ్ల డిగ్రీ పూర్తి చేసిన వారికి నేరుగా పీహెచ్డీ అడ్మిషన్లు ఇస్తారు. 2 వచ్చే ఏడాది నుంచి 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్స్, 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రోగ్రామ్ ఉంటుంది. అటానమస్ కాలేజీల సంఖ్య పెరగాలి ► విద్యార్థులకు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉన్నత విద్యలో అడ్వాన్స్డ్ టాపిక్స్‌తో కోర్సులు రూపొందించాలి. ఆ దిశలో విద్యార్థులు చదివేలా కృషి చేయాలి. ► రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ వంటి కొత్త కోర్సులు ప్రారంభించాలి. బీకామ్‌లో సెక్యూరిటీ (స్టాక్) అనాలిసిస్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి అంశాలు కూడా ఉండాలి. ► రాష్ట్రంలో దాదాపు 3 వేల కాలేజీలు ఉండగా, వాటిలో 104 మాత్రమే అటానమస్‌గా పని చేస్తున్నందున వీటి సంఖ్య గణనీయంగా పెరగాల్సి ఉంది. ► జాతీయ అక్రిడిటేషన్ సంస్థలతో అనుబంధంగా రాష్ట్రంలో అక్రిడిటేషన్ విభాగాన్ని తయారు చేయాలి. విద్యా సంస్థలన్నింటినీ అక్రిడిటేషన్ వైపు నడిపించాలి. ► విజయనగరంలో ఇంజనీరింగ్ విద్య ఫోకస్‌గా మల్టీ డిసిప్లినరీ వర్సిటీ, టీచర్ ఎడ్యుకేషన్ ఫోకస్‌గా ఒంగోలు వర్సిటీ ఏర్పాటు. ► కాలేజీలలో ప్రమాణాలపై ఇప్పటికే దృష్టి పెట్టామని, ఈ దిశగా 200 కాలేజీలకు నోటీసులు ఇచ్చామని అధికారులు సీఎంకు వివరించారు. స్కిల్ డెవలప్మెంట్–రీసెర్చ్ ఓరియెంటేషన్ ప్రధాన లక్ష్యంగా ఈ విద్యా సంవత్సరం నుంచే నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సు ప్రారంభిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. (ఇంటర్ తర్వాత నాలుగేండ్ల డిగ్రీ కోర్సు పూర్తి చేస్తేనే విదేశాల్లో ఉన్నత చదువుకు అవకాశం ఉంటుంది. ఈ దృష్ట్యా నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ ప్రవేశ పెట్టనున్నారు) ► ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎవరి ప్రయోజనాలకు ఈ పరీక్షలు?
విద్యకు సంబంధించి సంవత్సరం కాదు కదా.. ఒక్క రోజు, ఒక్క నెలను కూడా పోగొట్టుకోకూడదని వ్యవస్థ విభాగాలన్నీ ఇప్పుడు ప్రబోధిస్తున్నాయి. కోవిడ్–19 మరో సంవత్సరం కొనసాగవచ్చు. మరి అంతవరకు వేచి ఉండాలా? దానివల్ల దేశానికి, విద్యార్థుల కెరీర్‌కి ఎంత నష్టమో మీకు అర్థం అవుతోందా? అని ఒక న్యాయమూర్తి ప్రశ్నించారు. అందుకే న్యాయస్థానం నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించింది. విద్యార్థుల జీవిత భద్రత కంటే విద్యా సంవత్సరం నష్టపోతామన్న భయమే ఎందుకు కలుగుతోంది అంటే విద్య ఒక పెట్టుబడి వనరు. దాన్ని స్తంభింపజేస్తే ఉత్పత్తికి అవసరమైన కార్మికులు తయారు కారు. ఈ భయమే కేంద్రం, యూజీసీ, కోర్టులు అన్నింటినీ విద్యా సంవత్సరం కొనసాగింపునకు అనుకూలంగా మారుస్తున్నాయి. ఆసుపత్రులు, బెడ్లు, కిట్లు, టెస్టులు, మెడిసిన్స్, డాక్టర్లు, నర్స్‌లు, చావులు, మురికివాడలు, వలస కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు వగైరా పదాల కంటే లాక్డౌన్, అన్‌లాక్ అనే రెండు పదాలే ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని అవగాహన చేయించే కీలక పదాలుగా మారాయి. అయితే వివిధ దశల్లో అన్ లాక్ చేయడం, ప్రతి దశలోనూ పాటించాల్సిన విధానాలు, వాటిద్వారా వచ్చే లాభాలు, నష్టాలకు సిద్ధపడటం వంటి అంశాల్లో నయా ఉదారవాదం ఎలా పనిచేస్తోంది అనేది పూర్తి మార్మికతతో అర్థంకాని విధంగా సాగుతోంది. పెట్టుబడిని ఒక ప్రక్రియగా ఒక కార్యాచరణగా మనం అర్థం చేసుకున్నట్లయితే, ఆర్థిక వ్యవస్థను, నగరాలను, పని స్థలాలను, రవాణాను, పాఠశాలలు, కాలేజీలను అన్‌లాక్ చేయడంపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. స్తంభించిపోయిన అకడమిక్ పరీక్షల ప్రక్రియ, మతపరమైన ఉత్సవాలు, కరోనా కాలంలో స్తంభించిన సమాజ జీవితాన్నే ఎలా అన్‌లాక్ చేయాలి అనేది ముఖ్యం అయిపోయింది. కోవిడ్–19 వ్యాప్తి సమయంలో భౌతిక దూరం అనే పదబంధం మనిషి జీవితానికి సంబంధించిన కీలక ప్రశ్నగా కనిపించింది. దీని కంటే ముఖ్యంగా ప్రతి సామూహిక ఆవరణం కూడా ఇప్పుడు వైయక్తిక భద్రతా పరిమితిలోకి కుదించుకుపోయింది. ఇదే ఇప్పుడు మన సామాజిక సంబంధాలన్నింటినీ పునర్నిర్మిస్తోంది. పరీక్షలు నిర్వహించడంలోనూ ఇది వాస్తవం. జాతీయ సాంకేతిక విద్యారంగంలో (మెడికల్, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లు, బిజి నెస్ అడ్మినిస్ట్రేషన్, జీవ సాంకేతిక శాస్త్రాలు వగైరా) పరీక్షలు నిర్వహించడంపై చర్చలే కరోనా వైరస్ కంటే ఇప్పుడు కీలకంగా మారిపోయాయి అనిపిస్తోంది. విద్యా సంవత్సరాన్ని కొనసాగించే క్రమంలో విద్యార్థుల జీవిత పరిరక్షణే కీలకమైన అంశంగా ఉంటుంది. కరోనా వైరస్‌ను అధిగమించడానికి మనం ఎంతకాలం వేచి ఉండాలి. కోవిడ్–19 ఇంకో ఏడాది కొనసాగవచ్చు. మరి మరో ఏడాది వరకు వేచి ఉండాలని చెబుతున్నారా? దానివల్ల దేశానికి, విద్యార్థుల కెరీర్‌కి ఎంత నష్టమో మీకు అర్థం అవుతోందా? అని ఒక న్యాయమూర్తి ప్రశ్నించారు. అందుకే న్యాయస్థానం నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించింది. విద్యలో నయా ఉదారవాద విధానం అందుచేత, కోవిడ్–19 జీవన సంక్షోభం మధ్యనే జీవితం సాగాల్సి ఉంది. జీవితం ప్రయోజనాలకు సంబంధించిన ఈ ద్వంద్వ లక్షణం అటు వ్యక్తి జీవితం భద్రతపైనా, నయా ఉదారవాద జీవితం అంటే ప్రపంచ నైపుణ్యాల ఉత్పత్తి భద్రత పైనా దృష్టి పెట్టేలా చేస్తోంది. ఇప్పుడు మొత్తం వివాద కేంద్రస్థానాన్ని ఆక్రమిస్తున్నది ప్రధానంగా సాంకేతిక విద్యే అనే విషయం మనం మర్చిపోకూడదు. ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు (పశ్చిమ బెంగాల్, పంజాబ్, రాజస్తాన్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్) వలస కార్మికుల సమస్యపై ఐక్యంగా సమావేశమై నిరసన తెలుపలేక పోయారు. కానీ ఇప్పుడు మాత్రం వీరు భారీస్థాయిలో జరుగుతున్న జాతీయ విద్యా పరీక్షల నేపథ్యంలో లక్షలాది మంది విద్యార్థుల జీవితాన్ని కాపాడేందుకు ఐక్యం కావడం మంచిదే. జాతీయ తృష్ణకు చెందిన సమస్య ప్రధానమైంది. గుర్తుంచుకోండి. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ జాతీయ పరీక్షా సంస్థను ఏర్పర్చింది. ఇది స్వతంత్ర స్వయంప్రతిపత్తి కలిగిన కీలకమైన పరీక్షా సంస్థ. విద్యాపరీక్షలను పారదర్శకంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించేందుకు సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్–1860 కింద దీన్ని ఏర్పర్చారు. అత్యున్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు అభ్యర్థుల పోటీతత్వాన్ని అంచనా వేసే సంస్థ ఇది. దీని ఆధ్వర్యంలోనే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తున్నారు. ఎన్ఐటీలు, ఐఐటీలు, ఇతర కేంద్ర, రాష్ట్రాల నిధులతో నడిచే సాంకేతిక సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రాముల్లో చేరడానికి ఇవే కీలకం. స్వావలంబన సాధించే జాతి నిర్మాణం కోసం ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపులో విద్యాపరమైన తృష్ణ కాకుండా ఆధ్యాత్మికపరమైన విద్యా తృష్ణే కనిపిస్తోంది. ఆయన పిలుపులో శాస్త్రీయ స్ఫూర్తి లేదు. ప్రకృతి నుంచి నేర్చుకుంటూ ఎలా జీవించాలో నేర్పే విద్య దాంట్లో లేదు. ఇతర ప్రాణులతో మమేకమవుతూ స్వార్థం నుంచి బయటపడే స్ఫూర్తి ఆ పిలుపులో లేదు. వీటికి బదులుగా దేశాన్ని సంపన్నవంతంగా మార్చే మేనేజిరియల్ నైపుణ్యాలను ప్రబోధించే సాంకేతిక పరమైన తృష్ణతో కూడిన విద్యకోసం మోదీ పిలుపిస్తున్నారు. వ్యాపారం, వాణిజ్యం, సంపన్నులతో భుజంభుజం కలిపే తరహా షాంఘై ర్యాంకింగ్‌లను తలపించే సంపన్న సమాజం కోసం మోదీ పిలుపిస్తున్నారు. విద్యకు సంబంధించి సంవత్సరం కాదు కదా. ఒక్క రోజు, ఒక్క నెలను కూడా పోగొట్టుకోకూడదని వ్యవస్థకు సంబంధించిన అన్ని విభాగాలు ఇప్పుడు ప్రబోధిస్తున్నాయి. ఇప్పుడు టెక్నాలజీ అనేది క్వారంటైన్లో ఉన్న విభాగాలను మార్కెట్ కోసం సామాజిక ఉత్పాదక యూనిట్లుగా మార్చివేసింది. పైగా విద్యారంగంలో భౌతిక దూరం పాటించడం నయా ఉదారవాద విద్యకు చెందిన కొత్త పరికరంలాగా మారిపోయింది. సాంప్రదాయిక క్లాస్ రూమ్ విద్య స్థానంలో ఆన్లైన్ విద్య ఇప్పుడు మరింత ఉన్నతంగా మారిపోయింది. దూరం పాటిస్తూ నేర్చుకునే యంత్రాంగం పెట్టుబడికి కొత్త హద్దులను సృష్టిస్తోంది. మీ సరుకును, మీ కేపిటల్ గూడ్స్‌ని లాభాలు ఆర్జించే దిశగా నడిపించకుండా గోడౌన్లలో కుళ్లబెడితే మీరు తట్టుకోగలరా? సరఫరా ప్రక్రియను మొత్తంగా నిలిపివేస్తే మీరు భరించగలరా? అందుకే భౌతిక దూరం అనే భావనను కూడా పరీక్షల క్రమ నిర్వహణ, కఠినమైన విద్యా క్యాలెండర్లు, ప్రత్యేకించి సాంకేతిక, వైద్య విద్యలో నిర్దిష్ట ఉద్యోగ నియామకాల వ్యవస్థతో తప్పనిసరిగా మిళితం చేయాల్సిందే. కోవిడ్–19 విద్యా పునర్నిర్మాణంలో భాగంగా సామాజిక క్షేత్ర పునర్నిర్మాణం చేయగలిగే అవకాశాన్ని రాజ్యానికి దఖలు పర్చింది. అందుకే కోవిడ్–19 నేపథ్యంలో జేఈఈ, నీట్ వంటి పరీక్షలను వాయిదా వేయాలనే సాధారణ ప్రశ్నను దాటి మనం ఇప్పుడు ఈ సమస్య గురించి చర్చిస్తున్నాం. దాంట్లో భాగంగానే లక్షలాదిమంది విద్యార్థుల భద్రత, ఆరోగ్యానికి, వారి ప్రాణాలకు కలిగే ప్రమాదం గురించి ఆలోచిస్తున్నాం. ఆన్లైన్ విద్యలో ఇంటర్నెట్ కనెక్టివిటీ, బ్యాండ్ విడ్త్‌ను అందరూ సమానంగా పొందే అవకాశాలను గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నాం. వాస్తవ సమస్యలు మనం విద్య అనే సరుకు మనుగడ సమస్యను ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థ ప్రధాన వనరుల్లో విద్య ఒకటి. కానీ రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలోని పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను పొందే హక్కు ఉంటోంది. ప్రతి శిశువు పూర్తికాలం ప్రాథమిక విద్యను సంతృప్తికరంగా నాణ్యమైన రీతిలో పొందే హక్కును రాజ్యాంగ సవరణ దఖలు పర్చింది. కానీ ఈ దేశంలో ఒక వలస కార్మికుడు లేదా వలస కూలీ కుటుంబంలోని పిల్లల విద్యా జీవితం ఒక వరద వల్లో, దుర్భిక్షం వల్లో, తండ్రి లేక తల్లి మరణం వల్లో ఎలా విచ్ఛిన్నమవుతోందని మనం ఎన్నడైనా ప్రశ్నించుకున్నామా? విద్యేతర కారణాల వల్ల ఎంతమంది కింది తరగతులకు చెందిన పిల్లల కెరీర్ అంతమవుతోందో మనం ఎన్నడైనా ఆలోచించామా? అఖిల భారత పరీక్షలను వాయిదా వేయాలంటూ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభ్యర్థనను సుప్రీం కోర్టు కూడా కొట్టేసింది. కోర్టు తీర్పుతో నిర్వహిస్తున్న ఈ పరీక్షలు విద్యార్థులను కార్మికులుగా తయారు చేస్తున్నాయనీ, లేబర్ మార్కెట్లో ప్రవేశించడానికి వీరిని సిద్ధం చేస్తున్నారని మనం మర్చిపోకూడదు. వలస కార్మికుల పిల్లలను నూతన నైపుణ్యాలతో అభివృద్ధి చేయాల్సిన అవసరం గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే కార్మికుల పిల్లలు నిర్మాణరంగం, హస్తకళలు, చిన్న తరహా గని పనుల కోసం కారుచౌకగా ఎప్పుడూ లభ్యమవుతూనే ఉంటారు. వారికి నైపుణ్య విద్య ఉంటే ఎంత? లేకుంటే ఎంత? అందుకే విద్యలో జాతీయ స్వభావం గురించి టముకు వాయిస్తున్న వారు మన సాంకేతిక విద్యా సంస్థల్లో కూడా భవిష్యత్ కార్మికులను అసమాన నైపుణ్యాలు, వ్యత్యాసాలతో కూడిన జీతాలు, లేబర్ మార్కెట్లో అసమాన అవకాశాల వ్యవస్థలోకి చొప్పించాలని చూస్తున్నారు. ఒకవైపు విద్యపై అధికంగా ఖర్చుపెడుతున్న రాష్ట్రప్రభుత్వాలు విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని తపనపడుతుంటే ఏమాత్రం లక్ష్యపెట్టని యూజీసీ దాని రెగ్యులేటరీ అధికారులు విద్యార్థుల జీవి తాలను పరీక్షల పేరిట నియంత్రించాలని చూడటమే విషాదం. (ది వైర్ సౌజన్యంతో) వ్యాసకర్త: రణబీర్ సమద్దర్, చైర్పర్సన్, కోల్‌కతా రీసెర్చ్ గ్రూప్ ఈ–మెయిల్ : : ranabir@mcrg.ac.in -
ప్రైవేట్ విద్యతో పేదలకు పిడుగుపాటే
‘‘సమానత్వం, సామాజిక న్యాయం సాధనలో ఒకే ఒక గొప్ప సాధనం విద్య. సమ్మిళిత, సమభావనతో కూడిన విద్య సమసమాజం సాధించడంలో కీలక భూమిక పోషిస్తుంది. ప్రతి పౌరుడు సమాజంలో గౌరవస్థానం పొందడానికి కలలుకంటూ వాటిని సాధించుకోవడానికి నిరంతరం తపనపడుతుంటారు. భారతదేశంలోని ప్రతి బాలుడు, బాలిక తాము అభివృద్ధి చెంద డానికి అవకాశాలు ఉండాలి. వారి పుట్టుక, సామాజిక నేపథ్యం వల్ల వాళ్ళు నిరాదరణకు గురి కావద్దు’’ అని కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టబోతోన్న ‘జాతీయ విద్యా విధానం’ విధాన పత్రంలో పేర్కొన్నారు. కస్తూరి రంగన్ నాయకత్వంలో నియమించిన కమిటీ తన నివేదికను డిసెంబర్ 15, 2018న ప్రభుత్వానికి సమర్పించింది. దాదాపు ఒకటిన్నర ఏడాది తర్వాత 2020, జూలై 19వ తేదీన కేంద్ర మంత్రి మండలి ఈ నివేదికకు ఆమోదం తెలిపింది. దాదాపు 484 పేజీలతో కూడిన ఈ నివేదిక సారాన్ని 66 పేజీలకు కుదించి, కేంద్ర ప్రభుత్వం తన విధానంగా ప్రకటించుకున్నది. అందులో 27 అంశా లను పొందుపరిచారు. పైన పేర్కొన్న వాక్యాలు ఆరవభాగంలోనివి. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన జాతీయ విద్యావిధానంపైన ఇప్పటికే చాలా మంది తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. కానీ అందరూ విస్మరించిన ఏకైక అంశం ఆరవ భాగం. ఈ మొత్తం విధానంలో ఇదే కీలకమైనదని భావిస్తున్నాను. వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత లభిస్తుందా? చారిత్రకంగా విద్య సముపార్జనలో ప్రాతినిధ్యం లేని వర్గాలకు న్యాయం జరగాలని ఆ ఆరవభాగం సారాంశం. దీనికి అనుబంధంగా ఈ విధానంలో 14వ భాగాన్ని కూడా జోడించారు. ఈ వర్గాలను సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన బృందాలుగా పేర్కొన్నారు. ఇందులో మళ్ళీ కొన్ని విభజనలు చేశారు. ఇందులో లింగ వివక్షను ఎదుర్కొంటోన్న మహిళలు, ట్రాన్స్ జెండర్స్, సామాజికంగా, సాంస్కృతికంగా అణగారిన వర్గాలుగా ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు, భౌగోళికంగా వివక్షకు గురవుతోన్న గ్రామీణ, చిన్నపట్టణాల, వెనుకబడిన జిల్లాల విద్యార్థులు, దివ్యాంగులు, అంతిమంగా సామాజికంగా, ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటోన్న వలస కార్మికులు, స్వల్ప ఆదాయ వర్గాలు, ఇలా ఎన్నో వర్గాలను ఇందులో పేర్కొన్నారు. యునైటెడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్(యు.డైస్) సర్వే ప్రకారం ఎస్సీ, ఎస్టీలలో, దివ్యాంగుల్లో బడిమానేస్తున్న వారి సంఖ్య అధికంగా ఉన్నదని కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలు విద్యను ప్రత్యేకించి, నాణ్యమైన విద్యను అందుకోలేకపోతున్నారని కూడా నివేదిక స్వయంగా ప్రకటిం చుకున్నది. ఈ విషయాన్ని ఇంత వివరంగా చెప్పడానికి ఒక కారణం ఉన్నది. జాతీయ విద్యావిధాన పత్రంలో ఉన్న 27 భాగాల అంశాలు సాంకేతికపరమైనవి, పాలనాపరమైనవి, విధానపరమైనవి. అయితే ప్రభుత్వం నామకరణం చేసిన ఎస్.ఇ.డి.జి వర్గాలకు విద్య అందడా నికి ప్రభుత్వాలు నిర్దేశిస్తున్న విద్యను అందించడానికి ఎటువంటి విధానాలు అవలంబించాలనే దానిపై సమగ్రమైన ప్రణాళిక లేదని స్పష్టమౌతోంది. ప్రత్యేక నిధుల కేటాయింపు అభినందనీయం ఈ విధానపత్రంలోని 14వ భాగంలో ఏవో కొన్ని సూచనలు చేశారు. అందులో ప్రభుత్వం ఎన్.ఇ.డి.జి వర్గాల ఉన్నత విద్యకు అవసరమైన నిధులను ప్రత్యేకంగా కేటాయించాలని పేర్కొన్నారు. ప్రైవేట్, ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల్లో చదివే ఈ వర్గాల విద్యార్థు లకు ఆర్థిక సహాయం, స్కాలర్షిప్లు అందించాలని సూచించారు. వీటితో పాటు మరికొన్ని ప్రతిపాదనలు చేశారు. సంతోషమే. అటువంటి నిర్ణయం చేయడంలో శ్రద్ధ చూపించినందుకు అభినందించాలి. అయితే వాటిని ఎట్లా అమలు చేస్తారు? అందులో ప్రభుత్వం ఏమేరకు చిత్తశుద్ధితో పనిచేస్తుందనేదీ ప్రశ్నార్థకమే. అయితే ఇప్పటివరకు గత ఆరేళ్ళలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ వర్గాల పట్ల అనుసరిస్తున్న వైఖరికీ, ఇప్పుడు వీరి విద్యా భివృద్ధికి మాట్లాడుతున్న మాటలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రతి సంవత్సరం ఇచ్చే పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్లు గణనీయంగా క్షీణించడం ఒక ఉదాహరణ మాత్రమే. అయితే ప్రభుత్వం గత అనుభవాలను సమీక్షించుకొని, తన విధానాలలో మార్పులు తీసుకువస్తే, మంచి పరిణామమే అవుతుంది. అణగారిన వర్గాల అభివృద్ధే ప్రగతికి కొలమానం భారతదేశంలో అణగారిన వర్గాల సంఖ్య విస్మరించదగినది కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ విద్యా విధానంలో పేర్కొన్న ఎస్.ఇ.డి.జి.లు దాదాపు 80 శాతం నుంచి 90 శాతం వరకు ఉంటారు. ఈ దేశంలోని ఏ అభివృద్ధినైనా కొలవాలంటే వీరి ప్రగతిపైనే ఆధారపడి ఉంటుంది. భారతదేశం విద్యారంగంలో తలెత్తుకొని నిల బడాలంటే, ఈ వర్గాలు ఆత్మగౌరవంతో ఆర్థిక, సామాజిక రంగాల్లో ముందడుగు వేయాలి. అందుకుగాను విద్య ఎంతో ముఖ్యమైన అంశం అవుతుందని జాతీయ విద్యా విధాన పత్రమే స్పష్టం చేసింది. ఈ విషయంలో దక్షిణాదిలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు మార్గదర్శకంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్టాలు ఇంకా కొంత నిర్దిష్ట విధానాలను అవలంబిస్తున్నాయి. జాతీయ విద్యా విధానంలో పేర్కొన్న వర్గాల కోసం, ఈ రాష్ట్రాలు ఒక నమూనాగా నిలుస్తున్నా యనడంలో ఆశ్చర్యం లేదు. రెసిడెన్షియల్ స్కూల్ విధానం ప్రాణాధారం ఈ వర్గాల్లో విద్యావ్యాప్తి వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కనీసం చదువుకొనేందుకు సైతం వారి ఇండ్లు, పరిసరాలు అనువుగా ఉండవనేది ఒక సత్యం. అందుకుగాను ప్రత్యేక హాస్టల్స్, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు కావాలనేది 1927లో బాబాసాహెబ్ అంబేడ్కర్ బొంబాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో రెసిడెన్షియల్ స్కూల్ విధానం ప్రారంభమైంది. 2012 సంవ త్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించిన సబ్‌ప్లాన్ చట్టం తర్వాత ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలు 188, ఎస్టీ 190, బీసీ 104లకు కొత్తగా అనుమతి లభించగా, ఇప్పటికే 84 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. తెలంగాణలో ఎస్సీలకు 268, ఎస్టీలకు 183, బీసీలకు 142, మైనారిటీలకు 204 రెసిడెన్షియల్ విద్యా లయాలున్నాయి. తెలంగాణలో డిగ్రీ విద్యార్థులకు 30 రెసిడెన్షియల్ కళాశా లలున్నాయి. కర్ణాటకలో కూడా ఎస్సీలకు 500, ఎస్టీలకు 153, బీసీలకు 165 రెసిడెన్షియల్ పాఠశాలలున్నాయి. అయితే తెలంగాణలో మైనారిటీల కోసం నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలలు దేశంలోనే తొలి ప్రయత్నం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం, పాఠశాల విద్య కోసం ఎన్నో వినూత్న ప్రయోగాలు మొదలుపెట్టింది. పాఠశాలలు, కళాశా లల్లో మౌలిక వసతుల కోసం పన్నెండు వేలకోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఈ సంవత్సరం 3,800 కోట్లు ఖర్చు చేయాలని అంచనా వేశారు. అది పెరిగే అవకాశం కూడా ఉంది. దీనితో పాటు బడికి వెళ్ళే పిల్లల కుటుంబాలకు ఒక్కొక్కరికి 15 వేల చొప్పున దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిని ఎంపిక చేసి ఇస్తున్నారు. దీన్నే అమ్మఒడి పథకంగా పిలుస్తున్నారు. జగనన్న విద్యాకానుక పేరుతో మూడు జతల యూనిఫాం, పుస్తకాలు, నోట్ బుక్స్, ఒక జత బూట్లు, బెల్ట్, బ్యాగ్‌తో సహా బడికెళ్ళిన రోజే అందిస్తున్నారు. 43 లక్షల మంది పిల్లలు దీని వల్ల లబ్ధిపొందుతున్నారు. 648 కోట్ల రూపాయలు దీనికి కేటా యించారు. గోరుముద్దతో పౌష్టికాహారానికి హామీ మధ్యాహ్న భోజన పథకానికి అదనపు బడ్జెట్ కేటాయించి, మంచి పౌష్టికాహారాన్ని జగనన్న గోరుముద్ద పేరుతో అందిస్తున్నారు. ఇది ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపుతుంది. వారికొక భరోసానిస్తుంది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే, ప్రభుత్వ పాఠశాలలకు గౌరవం తెచ్చిపెట్టే ఇటు వంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలుచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. జాతీయ విద్యావిధాన పత్రంలో అత్యంత లోపభూయిష్టంగా ఉన్న విషయం, సమకాలీన, సామాజిక, ఆర్థిక పరిస్థితులను విస్మరించడం. ఈ రోజు డ్రాపౌట్స్ సంఖ్య విపరీతంగా పెరగడానికీ, నైపుణ్యత కలిగిన విద్యను అందుకోలేకపోవడానికి పేదరికమే ప్రధాన కారణం. దేశంలోని ఎస్.ఇ.డి.జి. వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు తీసుకు రాకుండా ఎటువంటి సంస్కరణలైనా తాత్కాలికమే అన్న విషయం ఇప్పటికైనా గుర్తించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా విద్య ప్రైవేటీకరణ విషయంలో సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. దానికి ఫిలాంత్రఫీ అనే ఒక పదాన్ని పదే పదే వాడారు. ప్రైవేట్ విద్యకు ఫిలాంత్రఫిస్టులు (ధర్మదాతలు) చేత ప్రోత్సహించాలని రాసు కున్నారు. ఇప్పటికీ జరుగుతున్నదదే. ప్రైవేట్ విద్యతో సమాజ సేవ బూటకం ప్రతి ప్రైవేట్ పాఠశాల, కార్పొరేట్ విద్యాసంస్థల అధినేతలందరూ తాము వ్యాపారం కోసం మాత్రమే కాక, సమాజ సేవకోసం విద్యా సంస్థలు నడుపుతున్నామనే చెప్పుకుంటారు. కానీ అసలు నిజం అందరికీ తెలుసు. ప్రైవేట్ విద్యను ప్రోత్సహించడమంటేనే, ఈ దేశం లోని 90 శాతం మంది ప్రజలను, విద్యార్థులను చీకట్లోకి నెట్టివేయ డమే తప్ప మరొకటి కాదు. లక్షల రూపాయల ఫీజులు కట్టి, చదివే విద్యార్థులతో చెట్లకింద చదివే విద్యార్థులు పోటీపడటం అసాధ్యం. అందుకే ప్రభుత్వాలు మాట్లాడే మాటలను ఆచరణతో పోల్చి చూసు కుంటే నిజా నిజాలు తేటతెల్లం అవుతాయి. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
సర్వతోముఖాభివృద్ధికి దివిటీ
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో 34 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం, దేశ వాస్తవ స్థితిగతులను పరిగణనలోకి తీసుకుంటూ, సామాజిక, సాంస్కృతిక అంశాల సమ్మిళి తంతో రూపొం దించిన నూతన జాతీయ విద్యా విధానం –2020, విద్యారంగంలో ఒక నవశకానికి నాందీవాచకం పలకనుంది. ప్రధాని మోదీ లక్ష్యించిన ‘ఆత్మనిర్భర్ భారత్’ను సాకారం చేసుకునే దిశగా, విద్యాబోధనతోపాటు సృజనాత్మకత, నైతికత, శారీరక–మానసిక స్థైర్యాన్ని పెంచుతూ.. విద్యార్థి సమగ్ర వికాసానికి దోహదపడే విధంగా నూతన విద్యావిధానం ఆవిష్కృతమైంది. దేశాభివృద్ధి ప్రక్రియలో కుటుం బం, సమాజం అంశాలు కూడా కీలకమని గుర్తించి ‘వసుధైక కుటుంబం’ అన్న భారత జాతి స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పే తరాన్ని, మున్ముందు చూడబోతున్నాం. నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, నూతన విద్యావిధాన రూపకల్ప నకు ప్రముఖ శాస్త్రవేత్త కృష్ణస్వామి కస్తూరి రంగన్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ దాదాపు నాలుగేళ్లపాటు.. అన్ని వర్గాల ప్రజలతో సంప్రదింపులు జరిపింది. ఇంకా ఆన్లైన్ ద్వారా అందరి సూచనలు పరిగణనలోకి తీసుకుని భవ్యమైన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నూతన విద్యావిధానాన్ని రూపొందించింది. ఇది మన దేశానికి ఓ దిక్సూచిగా ఉండబోతోంది. భారతీయ ఆత్మను ఆవిష్కరించే నూతన జాతీయ విద్యా విధానంలో భారతీయ వైవిధ్యత, భాషలు, కులాలు, మతాలు, తెగలు, వారి ఆచార సంప్రదాయాలు వీరందరూ ఉత్పత్తి చేసిన జ్ఞాన సంపద.. మన వారసత్వ సంపద.. మన పాఠశాల విద్యలో, పాఠ్యప్రణాళికలో భాగస్వామ్యం కానున్నాయి. జాతీయ నూతన విద్యా విధానం 2020.. మూడేళ్ల నుండి 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులందరినీ విద్యా హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావడం విప్లవ విప్లవాత్మకమైన మార్పు. ఈ విధానం ద్వారా ముఖ్యంగా.. పాఠశాల స్థాయి, ఉన్నత విద్య, వృత్తి విద్యలో సమూల మార్పులు రాబోతున్నాయి. వీటికి అనుబంధమైన ఉపాధ్యాయ విద్యలోనూ అవసరమైన మార్పులు వస్తాయి. విద్యార్థుల శారీరక, మానసిక, సాంఘిక, భావోద్వేగ వికాస దశలకు గుణంగా పాఠ్యప్రణాళిక, బోధనా పద్ధతి ఆధారంగా, ‘5+3+3+4’ సూత్రం ఆధారంగా.. పాఠశాల విద్య దశల విభజన జరిగింది. ప్రారంభ బాల్య సంరక్షణ్ విద్య (ఈసీసీఈ)ని మూడేళ్ల వయసులోనే చేర్చడంతో మరింత మెరుగైన అభ్యాసన, అభివృద్ధి, శ్రేయస్సుకు బాటలు పడతాయి. ఎనిమిదో తరగతి వరకు మాతృభాషలో బోధన జరగాలని ఈ విద్యావిధానం ప్రతిపాదిస్తోంది. నూతన విధానంలో ఆంగ్లభాష నేర్చుకుంటూనే, మాతృభాషలో బోధన జరగడంతో విద్యార్థులు సులభంగా విషయాలను అర్థం చేసుకుంటారు. విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా వారు ఏ మాధ్యమం ఎంచుకున్నప్పటికీ.. అందులో పుస్తకాలు అందుబాటులో ఉండేట్లు జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేస్తారు. బట్టీ పట్టి పరీక్షలు పాసయ్యే మూస పద్ధతికి బదులు విద్యార్థి కేంద్రక విధానం రానుంది. 2040 నాటికి దేశంలో అత్యుత్తమ విద్యావ్యవస్థ ఉండాలన్నది మోదీ ప్రభుత్వ లక్ష్యం. ఇది విద్యార్థులందరికీ వారి సామాజిక, ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా.. ట్రాన్స్జెండర్లతో సహా అందరినీ అందుబాటులో ఉండాలని సర్కారు భావిస్తోంది. దేశంలో అందరి అవసరాలకు తగ్గట్లు పాఠ్య ప్రణాళిక, పాఠ్యపుస్తకాల రూపకల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్థల భాగస్వామ్యం ఉంటుంది. వృత్తి విద్యను అన్ని విద్యా సంస్థలు.. అంటే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో అనుసంధానం చేస్తారు. 2025 నాటికి కనీసం 50% మంది అభ్యాసకులకు వృత్తి విద్య అందుబాటులో ఉండేట్టు చూస్తారు. భారమైన పాఠ్యప్రణాళికను తగ్గించి కీలక విషయాలను మాత్రమే చేర్చడం, పాఠ్యపుస్తకాలలో స్థానిక అంశాలకు ముఖ్యమైన స్థానం కల్పించడం, స్థానిక భాషా పుస్తకాలు రూపొందించడం, జాతీయ స్థాయి పాఠ్య పుస్తకాలు ప్రాంతీయ భాషల్లో కూడా ముద్రించి ఉచితంగా అందించడం వంటి కార్యక్రమాలకు నూతన విద్యావిధానం వేదిక కానుంది. స్థానికంగా ఉండే వృత్తి నిపుణులు, కళాకారుల సేవలు వినియోగించుకోవడం ద్వారా శ్రమ పట్ల గౌరవాన్ని, అనుభవపూర్వక అభ్యసనాన్ని విద్యను అందించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఒకే విధమైన విద్యాప్రమాణాలు నెలకొల్పడం, రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల బోర్డులకు విద్యా ప్రమాణాల నిర్ధారణకు జాతీయ సంస్థ (్కఅఖఅఓఏ) మార్గ నిర్దేశనం చేస్తుంది. పరీక్షల బోర్డులు కీలకమైన విద్యార్థుల సామర్థ్యాలను మాత్రమే పరీక్షిస్తాయి. ప్రతి రాష్ట్ర పరీక్షల బోర్డు ఇతర రాష్ట్రాలతో సమానమైన విద్యాప్రమాణాలని రూపొందించాలి. కోచింగ్ సంస్కృతికి చరమగీతం పాడడానికి, ప్రవేశ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. వివిధ రాష్ట్రాల పరీక్షల బోర్డుల సమన్వయంతో పనిచేస్తుంది. ఈ నూతన విద్యావిధానం అమలుకు కేంద్రప్రభుత్వం సుముఖంగా ఉన్న తరుణంలో.. రాష్ట్రాలు కూడా దీన్ని అదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కృత్రిమ మేధ, డిజైనింగ్, సమగ్రమైన ఆరోగ్యం, సహజ జీవన విధానం, పర్యావరణ విద్య మొదలైన విషయాలను మాధ్యమిక, సెకండరీ దశలో ప్రవేశపెట్టడం. అదేవిధంగా సమస్య పరి ష్కారం, గణిత ఆలోచన నైపుణ్యాలు–కంప్యుటేషనల్ థింకింగ్ వంటి అంశాలను మాధ్యమిక దశ లోనే ప్రవేశ పెట్టడం చాలా గొప్ప నిర్ణయం. భారతీయ సాంప్రదాయ భాషలైన సంస్కృతం, ప్రాకృతం, పార్సీ వంటి అన్ని భాషలు నేర్చుకునేందుకు పాఠశాలలు అవకాశం కల్పిస్తాయి ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ నూతన విద్యావిధానం భారతదేశ ఆత్మలో నిగూఢమై ఉన్న జ్ఞాన నిధిని వెలికితీసి.. విశ్వమానవాళికి మేలు చేయటంలో గొప్ప పాత్రను పోషించబోతుంది. జి. కిషన్‌రెడ్డి వ్యాసకర్త కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఈ–మెయిల్: gkishanreddy@yahoo.com -
ఏడాదిలో రెండు సార్లు బోర్డు పరీక్షలు
న్యూఢిల్లీ : కొత్త జాతీయ విద్యా విధానానికి (ఎన్ఈపీ–2020) కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇది గత 34 సంవత్సరాల నాటి జాతీయ విద్యా విధానం స్థానంలో రూపుదిద్దుకుంది. ఇందులో పాఠశాల విద్య నుంచి ఎంఫిల్ వరకు విద్యా విధానంలో సమూల మార్పులు చేశారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే విధంగా విధివిధానాలను మార్చారు. ఈ మార్పుల్లో అతి ముఖ్యమైనది పరీక్షలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులకు రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడం. దీనిపై విద్యాశాఖ మంత్రి రమేశ్ నిశాంక్ పోఖ్రియాల్ మాట్లాడుతూ.. 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలు సులభతరం చేసేందుకు సంవత్సరానికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. సంపూర్ణ అభ్యాసం విద్యార్థి సామర్థ్యాలను అంచనా వేయడం ప్రధానం కాబట్టి రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థి పోటీపడే సామర్థ్యాలను పరీక్షించడమే తాజా పరీక్షల ఉద్దేశం అంతేకానీ బట్టీపట్టి పరీక్షల్లో నెగ్గేలా నూతన పరీక్ష విధానం ఉండదని వివరించారు. (పాఠశాల, ఉన్నత విద్యలో భారీ సంస్కరణలు) విద్యార్థులపై ఫైనల్ పరీక్షల భారాన్ని తగ్గించేందుకు ఏడాదికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఫైనల్ పరీక్షల అత్యున్నత విద్యను అందించడం, భారత్‌ను నాలెడ్జ్ సూపర్ పవర్ గా తయారు చేయడం వంటి లక్ష్యాలతో ఈ నూతన విధానాన్ని రూపొందించారు. కొత్త జాతీయ విద్యా విధానంలో 18 సంవత్సరాల వరకు ఉచిత విద్యను అందించడం, అలాగే పూర్వ ప్రాథమిక విద్యపై దృష్టిపెడుతూ 10+2 విద్య స్థానంలో 5+3+3+4 సంవత్సరాల విద్యను తీసుకురానున్నారు. (సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలు రద్దు) -
పాఠం చెప్పడమే పని..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీచర్లకే పని.. వారే ఎన్నికల విధుల్లో అత్యధిక శాతం మంది ఉంటారు.. అవే కాదు స్కూళ్లో మధ్యాహ్న భోజనం నిర్వహణ పనులు కూడా టీచర్లకే. రాష్ట్రంలో గత అనేక ఏళ్లుగా ఇదే విధానం కొనసాగుతోంది. కేంద్ర కేబినెట్ ఆమోదించిన కొత్త విద్యా విధానం మాత్రం టీచర్లు అవేవీ చేయకూడదని చెబుతోంది. టీచర్లకు ఆ పనులను అసలే చెప్పవద్దని స్పష్టం చేస్తోంది. అవే కాదు బోధనతో సంబంధం లేని ప్రభుత్వ పనులైనా సరే టీచర్లకు చెప్పవద్దని, పాలనా పరమైన వాటినీ అప్పగించవద్దని స్పష్టం చేస్తున్నా.. ఆచరణలో వాటి అమలే అసలు సమస్యగా మారనుంది. 2010 అమల్లోకి వచ్చిన విద్యా హక్కు చట్టం కూడా బోధనతో సంబంధంలేని పనులను టీచర్లకు అప్పగించవద్దని చెప్పినా.. గత పదేళ్లలో అమలుకు నోచుకున్న దాఖలాలు లేవు. డిప్యుటేషన్ పేరుతో బోధనేతర పనుల్లో ఇప్పటికీ డీఈవో కార్యాలయాల్లో వందలమంది టీచర్లు కొనసాగుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. చివరకు విషయం కోర్టు వరకు వెళ్లాకే ఎమ్మెల్యేలు, మంత్రులకు పీఏలుగా ఉన్న వారిని తొలగించింది. ఇక మధ్యాహ్న భోజనం నిర్వహణ పనులు, ఆ లెక్కల బాధ్యతలు తమకు వద్దని టీచర్లు మొత్తుకుంటున్నా రాష్ట్రంలోని 28 వేల జిల్లా పరిషత్తు, ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్లే వాటిని చూడాల్సి వస్తోంది. బోధనకు తోడు అదనపు పనుల వల్ల బోధనకు ఆటంకం కలుగుతోందని టీచర్లు మొత్తుకుంటున్నా వారితోనే ఆ పనులను విద్యాశాఖ చేయిస్తోంది. లెక్కల్లో తేడాలు వచ్చి మెమోలు అందుకున్న టీచర్లు ఉన్నారు. కొత్త విద్యావిధానం నేపథ్యం లో క్షేత్రస్థాయిలో ఆ నిబంధన ఎంతమేరకు విద్యాశాఖ అమలు చేస్తుందనేది తేలాల్సి ఉంది. కేంద్రం ఆశించినట్లుగా నాణ్యమైన విద్యా బోధన ఎంతమేరకు సాధ్యం అవుతుందన్నది కాలమే తేల్చనుంది. నిరంతరం వృత్తి నైపుణ్యాల అభివృద్ధి ప్రధానం.. టీచర్లు తమ వృత్తి పరమైన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు నేర్చుకోవాలని కూడా కొత్త విద్యా విధానం పేర్కొంది. ఇందుకోసం కంటిన్యుయస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ (సీపీడీ) అమలు చేయాలంది. స్థానిక, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సబ్జెక్టు వర్క్‌షాప్‌ల్లో పాల్గొనాలని పేర్కొంది. ఆన్లైన్లో అందుబాటులో ఉండే డెవలప్మెంట్ మాడ్యూల్స్ ప్రకారం నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయాలని అందులో టీచర్లు తమ అనుభవాలను పంచుకోవాలని, తద్వారా కొత్త విషయాలను నేర్చుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రతీ టీచర్ ఏటా కనీసంగా 50 గంటల సీపీడీ కార్యక్రమాల్లో పాల్గొనాలని వెల్లడించింది. బాగా పనిచేసే టీచర్లకు ప్రోత్సాహకాలు టీచర్ల కెరీర్ మేనేజ్మెంట్లో భాగంగా కీలక సంస్కరణలు చేసింది. బాగా పనిచేసే టీచర్ల పనికి గుర్తింపు ఇవ్వాలంది. అలాంటి వారికి పదోన్నతులివ్వడం, వేతనాలను పెంచడం వంటి చర్యలు చేపట్టాలంది. మిగతా టీచర్లు కూడా బాగా పని చేసేందకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొంది. పదోన్నతులు, వేతన విధానాన్ని అభివృద్ధి చేయాలని స్పష్టం చేసింది. టీచర్ల పని విధానాన్ని అంచనా వేసేందుకు పక్కాగా ఉండే విధానాన్ని రూపొందించాలని వెల్లడించింది. సమీక్ష, విద్యార్థుల అభిప్రాయాలు, హాజరు, కమిట్మెంట్, సీపీడీలో పాల్గొన్న గంటలు, ఇతర సేవ కార్యక్రమాలను కూడా ఇందులో పొందుపరచాలని వివరించింది. బాగా పనిచేసే టీచర్లకు అకడమిక్ లీడర్షిప్ ఇచ్చేందుకు వారికి తగిన శిక్షణ ఇవ్వాలంది. -
జాతీయ విద్యా విధానానికి ఆమోదం
-
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ (హెచ్ఆర్డీ) శాఖ పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చే ప్రతిపాదనను బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇస్రో మాజీ చీఫ్ కే కస్తూరిరంగన్ సారథ్యంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ తొలుత మంత్రిత్వ శాఖ పేరు మార్చాలని సిఫార్సు చేసింది. నూతన విద్యా విధానం డ్రాఫ్ట్‌లో ఇది కీలక సిఫార్సు కావడంతో పేరు మార్పునకు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. విద్య, బోధన, సాధన ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించే దిశగా హెచ్ఆర్డీ శాఖను విద్యా మంత్రిత్వ శాఖగా మార్చాలని ఈ కమిటీ సూచించింది. జాతీయ విద్యా విధానానికీ కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. చదవండి : సినిమాలు, జిమ్స్ తెరవొచ్చు! -
విద్యార్థులంతా స్వదేశంలోనే చదువుకునేలా ఏర్పాట్లు
న్యూఢిల్లీ: దేశంలోనే అధిక సంఖ్యలో విద్యార్థులకు చదువుకునే అవకాశాలు కల్పించేందుకు, కోవిడ్–19 కారణంగా విదేశాల నుంచి తిరిగివచ్చే విద్యార్థులకు సైతం ఇక్కడ చదువు కొనసాగించే అవకాశం కల్పించే లక్ష్యంతో రూపొందించే కార్యక్రమానికి మార్గదర్శకాలను తయారుచేయడం కోసం మానవ వనరుల శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఛైర్మన్ సారథ్యంలోని ఈ కమిటీ, ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో మరింత మందిని చేర్చుకునే అవకాశాలపై సైతం సిఫారసులు చేయనుంది. ఈ కమిటీ 15 రోజుల్లోగా తన రిపోర్టు అందించాల్సి ఉంది. విదేశాల్లో చదువుకోవాలనుకున్న అనేక మంది విద్యార్థులు కోవిడ్ –19 కారణంగా యిప్పుడు భారత్‌లోనే చదువుకోవాలని భావిస్తున్నారు. అమెరికా నుంచి భారత్‌కి తిరిగి వచ్చే విద్యార్థుల సంఖ్య సైతం పెరుగుతోంది’’అని ‘‘స్టే ఇన్ ఇండియా అండ్ స్టడీ ఇన్ ఇండియా’’కార్యక్రమంలో హెచ్చార్డీ మంత్రి రమేష్ పోక్రియాల్ నిశాంక్ చెప్పారు. గత ఏడాది 7.5 లక్షల మంది విద్యార్థులు తమ చదువుకోసం విదేశాలకు వెళ్ళారని ఆయన చెప్పారు. ‘‘ఈ ప్రతిభావంతులైన విద్యార్థులందర్నీ మన దేశంలోనే చదువు కొనసాగించేలా చర్యలు చేపట్టాలి’’అలాగే ప్రభుత్వం ప్రణాళికలో పేర్కొన్నట్లు ప్రముఖ విద్యాలయాలన్నింటిలోనూ 2024 కల్లా సీట్ల సామర్థ్యాన్ని 50 శాతం పెంచాలనీ, 2024కి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను 50కి పెంచాలని మంత్రి నిశాంక్ అన్నారు. -
విద్యలో సమానత్వమే అసలైన విప్లవం
భారతదేశంలో సమానత్వం అతి ప్రధాన సమస్య. చారిత్రకంగా చూస్తే అన్ని దేశాల్లోనూ ఆస్తిపై యాజమాన్యమే మానవుల్లో అసమానతలను సృష్టించింది. విద్యలో కులపరమైన అంతరాలు సైతం మనదేశంలో పూడ్చలేని అసమానత్వాన్ని సృష్టించాయి. కులవ్యవస్థ ద్వారా, విద్య ద్వారా ఈ అసమానత్వం మన దేశంలో విజయవంతంగా కొనసాగుతూ వచ్చింది. ఆధునిక కాలంలోనూ.. పౌరసమాజంలో ఉంటూ సమానత్వం కోసం పోరాడటం కంటే ప్రభుత్వంలో ఉంటూ సమానత్వం కోసం పోరాటం చాలా కష్టమైనది. తాను స్వయంగా అధికారంలో ఉంటూ ఆఫ్రికన్ అమెరికన్లకు బానిసత్వం నుంచి స్వేచ్ఛ కల్పించాలనుకున్న అబ్రహాం లింకన్ దానికోసం తన ప్రాణాల్నే బలిపెట్టాల్సి వచ్చింది. కానీ, అమెరికా అధ్యక్షుడి హోదాలో ఉంటూ లింకన్ హత్యకు గురవడం అమెరికన్ జీవితాన్ని ప్రత్యేకించి నల్లజాతి ప్రజల జీవితాలనే మార్చివేసింది. ఇంగ్లిష్ విద్య లేకుండా ఈరోజు నల్లజాతి ప్రజల పరిస్థితిని కాస్త ఊహించుకోండి. వారు పాఠశాలల్లో ఇంగ్లిష్ చదువుకోకుంటే ప్రపంచం వారి వాణిని అసలు విని ఉండేది కాదు. సమాజంలోని అత్యంత నిరుపేద వర్గాలకు పాఠశాల విద్యలో బోధనా మాధ్యమంలో సమానత్వం కోసం అధికారంలో ఉంటూనే ఒక సంవత్సర కాలంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న పోరాటం భారతీయ ప్రజాస్వామ్యంపై గణనీయమైన ప్రభావం కలిగించబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను ఆయన ప్రతిపాదించిన వెంటనే ప్రతిపక్షం నుంచి వ్యతిరేకత మొదలైంది. ఇంగ్లిష్ మీడియంపై ఆయన చేసిన ప్రతిపాదన సీబీఎస్ఈ అని పిలుస్తున్న సెకండరీ స్కూల్ విద్యా మండలి నెలకొల్పిన సిలబస్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు, సైనిక స్కూళ్లలో చెబుతున్న ఇంగ్లిష్ మీడియంలో బోధనను సరిగ్గా పోలి ఉంది. ఇలాంటి విద్యావ్యవస్థ 1947 నుంచి అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోనూ కొనసాగుతూనే ఉంది. అయితే సమాజంలోని అన్ని రంగాల్లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదువుతున్న విద్యావంతులే ఇప్పుడు ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మాతృభాషకు ప్రాధాన్యం, స్థానిక భాషలో విద్యను పిల్లలే ఎంపిక చేసుకోవడం, ఇంగ్లిష్ మీడియంకు తగిన సన్నాహకాలు లేవనడం, మన సంస్కృతి, నాగరికతలకే ఇంగ్లిష్ విద్య గొడ్డలిపెట్టు అని పెడబొబ్బలు పెట్టడం వంటి వ్యతిరేకతలన్నీ ట్యాంకుకు చిల్లు పడినప్పుడు ధారగా కారే నీటి చందాన పెల్లుబుకుతూ వస్తున్నాయి. శ్రామిక వర్గాలు ఒకసారి ఇంగ్లిష్ నేర్చుకుని సమాజంలో మంచి స్థానంలోకి ఎగబాకితే తమ ఇళ్లలో కారుచౌకగా పనులు చేసిపెట్టేవారు ఇక దొరకరనే స్వార్థంతోనే పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి రాకుండా అడ్డుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. తమ శ్రమశక్తిని కారుచౌకగా అమ్ముకుంటున్న నిరక్షరాస్యులైన వలస కార్మికులు కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్లో తమ వాణిని కూడా వినిపించలేక ఎంతగా ఇబ్బందులు పడ్డారో మనందరికీ తెలుసు. అన్ని రాష్ట్రాల్లోనూ వీరు 12వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం విద్యను పొంది ఉంటే, వారిపై ఇలాంటి దారుణమైన దోపిడీ జరిగి ఉండేది కాదు. గతంలోనూ భూస్వామ్య ఆర్థిక వ్యవస్థ రాజ్యమేలిన కాలంలో సమాన విద్యావకాశాలు లేకనే దళితులు, ఆదివాసీలు, ఓబీసీలకు చెందిన పేదలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ వర్గాలకు చెందినవారే ఇప్పుడు కూడా పట్టణ పెట్టుబడిదారీ కేంద్రాల్లో గూడు, కనీస గౌరవం లేకుండా దెబ్బతినిపోయారు. దేశంలోని 20 కోట్లమంది నిరక్షరాస్య శక్తులకు తమదైన వాణిని వ్యక్తీకరించలేని మహా విషాదాన్ని లాక్డౌన్ ప్రపంచానికి చాటి చెప్పింది. అమ్మఒడి పథకంతోపాటు మంచి సౌకర్యాలను కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం తలపెట్టిన ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్య ఏపీలోని శ్రామికుల జీవితాన్ని శాశ్వతంగా మార్చివేయనుంది. అలా జరుగుతుందనే, ఏపీలోని ఇంగ్లిష్ విద్యాధిక శక్తులు భీతిల్లిపోతున్నారు. మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా మాధ్యమం గురించి ఇవాళ ప్రతి ఇంటిలోనూ తీవ్రమైన చర్చ, వాదనలు జరుగుతున్నాయి. సంపన్న ఇంగ్లిష్ విద్యాధిక శక్తుల అసలు ఉద్దేశాలను పీడనకు గురవుతున్న ప్రజారాశులు తెలుసుకోలేకపోవచ్చు. నిజానికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే ఇంగ్లిష్ విద్యతో నైపుణ్యం పొందిన జనాభాతో భారతదేశం ఒక ప్రపంచ శక్తిగా భవిష్యత్తులో ఎదిగే క్రమాన్నే మన కులీన విద్యావంతులు వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా 130 కోట్లమంది నిపుణ కార్మికశక్తి ఇంగ్లిష్ విద్యను పొందినరోజు ప్రపంచ మార్కెట్లను వీరు ముంచెత్తవచ్చు. ఎందుకంటే ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం, నిపుణ కార్మికుల దన్నుతో భారత్ భవిష్యత్తులో అమెరికా, చైనాలను కూడా సులభంగా సవాలు చేయవచ్చు. కానీ ప్రతీఘాతక శక్తులు తాము పొందుతున్న సౌకర్యాలు చెక్కుచెదరకుండా ఉండాలని కోరుకుంటున్నాయి. గొంతులేని కౌరుచౌక కార్మికులు తమ చెప్పుచేతల్లోనే ఉంటూ అందుబాటులో ఉండాలని వీరు కోరుకుంటున్నారు. తమ రాష్ట్రం వెలుపల తగిన వ్యక్తీకరణ సామర్థ్యం లేని అవిద్యావంతులు, లేక ప్రాంతీయ భాషలో చదువుకున్న కార్మికులు ఇప్పటి వలస కార్మికుల్లాగే కారుచౌక శ్రమశక్తికి ఒక రిజర్వ్ పూల్లాగా ఉండిపోతారు. ఇలాంటి వ్యవస్థే ఎప్పటికీ కొనసాగుతుండాలని కులీన విద్యావంతులు కోరుకుంటున్నారు. చివరకు ఇంగ్లిష్ వ్యతిరేకత, వర్గ బానిసత్వ వ్యతిరేకత కలిగి ఉండే కమ్యూనిస్టు నేతలు సైతం బోధనా మాధ్యమం విషయంలో దోపిడీదారుల వాదననే బలపరుస్తూ వస్తుండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. వ్యవసాయ ఉత్పత్తి సంబంధిత పనులకు వెలుపల ఉంటున్న దోపిడీ వర్గ, కుల శక్తులు తాజా పరిణామంతో మరింత కలవరపడుతున్నారు. ఎందుకంటే కార్మికులు సైతం ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సాధించిన తర్వాత వారు ఇక ఎన్నటికీ బానిసలుగా పడి ఉండరన్నదే దోపిడీ శక్తుల కలవరానికి కారణం. అమెరికాలో నల్లజాతీయులు తమ ఇంగ్లిష్ విద్య ద్వారానే తమ బలాన్ని ప్రదర్శించగలుగుతున్నారు. దేశంలోని ఒక రాష్ట్రంలో ఇంతటి విప్లవాత్మక చర్యకు నాందిపలికితే, అది అన్ని రాష్ట్రాలకు ఒక నమూనాగా మిగులుతుంది. సమానవిద్య అనే ఆయుధంతో బానిస–యజమాని సంబంధాల వ్యవస్థను మార్చివేయాలనే తలంపుతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని కృతనిశ్చయంతో ఉంటున్నందుకు దోపిడీ శక్తులు ఆందోళన చెందుతున్నాయి. స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి తీసుకున్న అసాధారణ నిర్ణయం ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ శక్తులే భాష సమస్యలో మనోభావాలను రెచ్చగొట్టడంలో విజయం సాధించారు. ఇలాంటి శక్తుల మధ్యనే వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలోనే ప్రారంభ చర్యను చేపట్టి ఉన్నారు. ఈ శక్తుల ప్రాబల్యం కారణంగానే తన హయాంలో ఆయన కేవలం 6,400 ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఇంగ్లిష్ మీడియాన్ని పాక్షికంగా ప్రవేశపెట్టగలిగారు. ఆయన హయాంలోనూ, బోధనతో కాకుండా పైరవీలు చేసుకుంటూ బతికేసిన ఉపాధ్యాయ సంస్థలను ముందుకు నెట్టిన విప్లవకర శక్తులుగా డప్పు వాయించుకునే ఇంగ్లిష్ వ్యతిరేక వామపక్ష శక్తులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా సమానత్వ వ్యతిరేక శక్తులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకిస్తూన్నప్పటికీ వైఎస్ జగన్ ప్రభుత్వం ఏమాత్రం వెనుకకు తగ్గలేదు. 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం విద్య ప్రారంభమైనప్పుడు, నిజంగానే ఏపీలో విద్యావిప్లవం ప్రారంభమవుతుంది. ఏడాదికేడాదిగా ఈ విప్లవం ముందుకెళుతుంది. పట్టణాలు, నగరాల బాట పట్టకుండానే గ్రామీణ పిల్లలు 12వ తరగతి వరకు చదువు పూర్తి చేసుకోగలరు. ఇది మొత్తం గ్రామీణ వ్యవస్థనే మార్చేస్తుంది. అయితే మితవాద, వామపక్ష, ఉదారవాద ప్రజాస్వామిక శక్తులనే తేడా లేకుండా ఇంగ్లిష్ మీడియం వ్యతిరేక శక్తులు తమ ఏజెంట్లను కూడా గ్రామాల్లోకి చొప్పిస్తారన్న విషయాన్ని గ్రామాల్లోని పేదపిల్లల తల్లిదండ్రులు మర్చిపోరాదు. ఇంగ్లిష్ మీడియం మీకు సరిపడదని ఈ ఏజెంట్లు పేద తల్లిదండ్రులకు నచ్చచెప్పడానికి కూడా ప్రయత్నిస్తారు. ఇంగ్లిష్ విద్యతో గ్రామీణ సంస్కృతి కూడా మారిపోతుంది. తాగివచ్చి భార్యను చితకబాదే సంస్కృతి కూడా మారిపోతుంది. అవును ఇంగ్లిష్ విద్య శ్రామిక ప్రజారాశుల బానిస మనస్తత్వాన్ని మార్చివేస్తుంది. అందుకే గ్రామాల్లోని తల్లిదండ్రులు ఇంగ్లిష్ వ్యతిరేక శక్తులను ఏమాత్రం లెక్కపెట్టకుండా తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియమే కావాలని డిమాండ్ చేస్తూ, దరఖాస్తు పత్రాల్లో సంతకాలు చేయాలి. కొందరు ఓబీసీ, దళిత, ఆదివాసీ నాయకులు కూడా ఇంగ్లిష్ వ్యతిరేక యజమానుల తరపున ఏజెంట్లుగా వచ్చి ఇంగ్లిష్ విద్య సరైంది కాదని వాదించవచ్చు. వీరిని అసలు నమ్మకండి. ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లిష్ చదువుతున్న తమ పిల్లలకు గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పిల్లలు పోటీ రాకూడదని ఈ దళారీ నేతలు కోరుకుంటున్నారని మర్చిపోవద్దు. ఒక్కమాటలో చెప్పాలంటే మన గ్రామీణ జీవితంలోని అన్ని రంగాల్లోనూ విద్యలో సమానత్వం అనేది అనేక మార్పులను తీసుకురానుంది. ఇంగ్లిష్ విద్య ప్రాముఖ్యత గురించి తెలిసిన ఏపీలోని అన్ని యూనివర్సిటీలకు చెందిన యువత గ్రామాలకు వెళ్లి పిల్లలను ఇంగ్లిష్ మీడియంలోనే చేర్పించే విషయంలో తల్లులకు సహాయం చేయాలి. ఈ అవకాశం ఇప్పుడు కోల్పోతే, మరికొన్ని శతాబ్దాల పాటు శ్రామికవర్గాల్లో బానిసత్వం ఇప్పటిలాగే కొనసాగుతుంది. ఒకసారి మన పాఠశాలల్లో ఈ సరికొత్త విప్లవం మొదలయ్యాక, అధికారంలో ఉంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగిస్తున్న పోరాటం భారతదేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
‘ఇక మీదట స్కూల్స్ 100 రోజులే’
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఉదృతితో అన్ని వ్యవస్థలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వైరస్ ఎక్కువగా పిల్లలు, వృద్ధులకు వ్యాపిస్తుందన్న నిపుణుల హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ముఖ్యంగా సరికొత్త ప్రణాళికతో విద్యావ్యవస్థ నిర్వహణకు ప్రభుత్వం వ్యూహాలు రచిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గతంలో మాదిరిగా స్కూల్స్‌కు 220 పనిదినాలు 1,320గంటల తరగతి బోధన ఇక మీదట ఉండదని విద్యావేత్తలు భావిస్తున్నారు. గత విద్యావ్యవస్థకు ప్రత్యామ్నాయంగా రాబోయే విద్యా సంవత్సరంలో స్కూళ్లకు 100 రోజుల పనిదినాలు, 600 గంటల తరగతి బోధనకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. అలాగే విద్యార్థికి ఇంట్లోనే ఆన్లైన్ బోధనతో 100 రోజులు, 600 అభ్యాస గంటల విద్యా ప్రణాళికను ప్రభుత్వం రచిస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా మరో 20రోజులు విద్యార్థి మానసిక వికాసాన్ని పెంచే విధంగా డాక్టర్లు, కౌన్సెలర్లతో విద్యార్థులకు ప్రేరణ కలిగించే కార్యక్రములు చేపట్టనున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఆన్లైన్ సౌకర్యాలు లేని విద్యార్థులపై స్కూల్ యాజమాన్యాలు దృష్టి పెట్టాలని హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ సూచించింది. చదవండి: స్కూల్స్ పునఃప్రారంభానికి కసరత్తు -
డర్టీ ఛాట్
ఎప్పటినుంచో అనుకుంటున్నదే. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు, వారిని ఉన్నత పౌరులుగా తీర్చి దిద్దే బాధ్యతలో మన విద్యా వ్యవస్థ వైఫల్యం పొందుతున్న తీరు బహిరంగ రహస్యమే. ఇప్పుడు దేశ రాజధాని నగరంలోని బడా పాఠశాలల్లో చదువుకుంటున్న మగపిల్లలు ఒక సామాజిక మాధ్యమంలో గ్రూపు ఏర్పాటు చేసుకుని వికృతమైన పోకడలకు పోతున్నారని వెల్లడైన ఉదంతం ఈ వైఫల్యాలనే మరోసారి ఎత్తిచూపింది. ఈ గ్రూపు గురించి దేశమంతా చర్చించుకుంటుండగా బాలికలమధ్య కూడా ఇదే మాదిరి గ్రూపు ట్విటర్లో నడుస్తోందన్న వార్త అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక బాలుడు లేదా బాలిక సంపూర్ణమైన, బాధ్యతాయుతమైన పౌరులుగా రూపుదిద్దుకోవాలంటే అటు తల్లిదం డ్రుల ప్రమేయం, ఇటు విద్యా వ్యవస్థ ప్రమేయం తప్పనిసరి. ఆ రెండూ సాధ్యం కానప్పుడు పర్య వసానాలు ఇలాగే వుంటాయి. సామాజిక మాధ్యమం ‘ఇన్స్టాగ్రామ్’లో కొందరు మగపిల్లలు ‘బాయ్స్ లాకర్ రూం’ పేరిట గ్రూపు కట్టి, అందులో తమ సహ విద్యార్థినులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం, వారి ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేయడం వంటివి యధేచ్ఛగా సాగించడమే కాదు... కొందరు బాలికల పేర్లు చెప్పి, వారిపై సామూహిక అత్యాచారం చేద్దామంటూ మాట్లాడుకోవడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఇలా మాట్లాడుకుంటున్నవారిలో చాలామంది మైనర్లు. ఆ పనులు చేస్తే తాము నేరస్తులుగా మారతామన్న కనీస అవగాహన కూడా లేనివారు. ఇందులో 50మంది విద్యార్థులున్నారని, వారిలో 26మందిని గుర్తించామని పోలీసులు చెబుతున్నారు. ఒకరిద్దరిని అరెస్టు చేసి జువెనైల్ హోంకు తరలించారు కూడా. ఇదంతా చూసి గ్రూపులోని ఒక బాలుడు ఆందోళనలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పద్నాలుగేళ్లు కూడా లేని ఒక బాలుడిని యాదృచ్ఛికంగా ఈ గ్రూపులో చేర్చడం, అతను తన సహ విద్యార్థిని మార్ఫింగ్ ఫొటోను గమనించి కలవరపడి ఆమెకు స్క్రీన్ షాట్లు పంపడం, ఆమెనుంచి మరికొందరు బాలికలకు అవి చేరడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఇదంతా చూసి కొందరు ఆడపిల్లలు హడలెత్తి అసలు స్కూల్‌కే వెళ్లబోమనడం, ఒకరిద్దరు తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్ మాన్పించాలని చూడటం గమనిస్తే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థమవుతుంది. సమాచార సాంకేతికత రోజురోజుకీ వృద్ధి చెందుతోంది. ఒకప్పుడు కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ వుంటే మాత్రమే చూడగలిగేవి అరచేతుల్లో ఇమిడే స్మార్ట్ఫోన్లలో లభ్యమవుతున్నాయి. ఆ ఫోన్ ద్వారా తమ పిల్లలు ఎటువెళ్లారో, ఎక్కడున్నారో స్పష్టంగా తెలుసుకోగలిగే సాంకేతికత అందుబాటులోకొచ్చింది. కానీ ఆ ఫోన్లో వాళ్లేం చూస్తున్నారో, ఎలాంటి విష సంస్కృతిని ఒంట బట్టించుకుంటున్నారో, ఏ రకమైన వీడియో గేమ్‌లు ఆడుతున్నారో మాత్రం తల్లిదండ్రులకు తెలియదు. టీచర్లకు తెలియదు. కార్పొరేట్ స్కూళ్లు పుట్టుకొచ్చాక విద్యార్థులు వినియోగదారులయ్యారు. ఉపాధ్యాయులు సర్వీస్ ప్రొవైడర్లయ్యారు. కార్పొరేట్ స్కూళ్లు అడిగినట్టుగా లక్షలకు లక్షలు చెల్లి స్తున్నాం గనుక, అంతా వారిదే బాధ్యతన్నట్టు తల్లిదండ్రులు ప్రవర్తిస్తున్నారు. ఆఖరికి ఈ లాక్డౌన్ సమయంలో కూడా పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండాపోయిందని, వారు ఏ ప్రభావాల్లో పడుతున్నారో తెలియకుండాపోయిందని తాజా ఉదంతం వెల్లడిస్తోంది. లాక్‌డౌన్‌తో బయటికెళ్లే అవకాశం లేకపోవడంతోనే ఇలాంటి వికృతపోకడలు పుట్టుకొచ్చాయని కొందరంటున్నది నిజం కాదు. నిరుడే ఈ మాదిరి కేసులు బయటికొచ్చాయని, ‘బాయ్స్ లాకర్ రూం’ వంటి గ్రూపులు అసంఖ్యా కంగా వున్నాయని డిజిటల్ మీడియా నిపుణులు చెబుతున్న మాట. ఎక్కడో ఏదో జరిగిందని మీడియా ద్వారా తెలుసుకుని, సమాజం ధ్వంసమవుతున్నదని ఆవేదనపడే తల్లిదండ్రులు తమ ఇంట్లోనే ఒక నేరస్తుడు మొగ్గ తొడుగుతున్నాడని, తమ పెంపకంలో వున్న బాలిక క్రమేపీ ఒక ఊబిలో కూరుకుపోతున్నదని గుర్తించకపోవడం ప్రమాదకరమైన స్థితి. తల్లిదండ్రులకూ, సంతానానికీ... టీచ ర్కూ, విద్యార్థికీ మధ్య వుండాల్సిన మానవీయ సంబంధాలు పూర్తిగా తెగిపోయిన జాడలు ఈ తాజా ఉదంతంలో బయటపడుతున్నాయి. నిత్యం తమతో సంభాషించే పిల్లల్లో తమకు తెలియని మరొక రున్నారని... ఆ మరొకరు క్షణక్షణానికీ పెరిగి పెనుభూతమై, స్వీయవిధ్వంసం దిశగా అడుగులేస్తు న్నారని, సమాజానికి ముప్పుగా మారబోతున్నారని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించవలసిన తరుణం ఆసన్నమైంది. ఇంట్లోనూ, పాఠశాలలోనూ మాత్రమే కాదు...వెలుపలి సమాజంలో కూడా సర్వ అవలక్షణాలూ రాజ్యమేలుతున్నాయి. ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో జరిగిన నిరసనల్లో పాల్గొన్న ఒక యువతిని మూడు నెలల గర్భిణి అని కూడా చూడకుండా రాజద్రోహ నేరంకింద అరెస్టు చేశారని ఆమె సహచరులు ట్వీట్ చేస్తే, ఆ యువతిని కించపరుస్తూ కొందరు పెట్టిన ట్వీట్లు మనం ఎలాంటి సమాజంలో బతుకు తున్నామన్న కలవరం కలిగిస్తాయి. నోటితో ఉచ్చరించడానికి కూడా వీల్లేని భాషలో వ్యాఖ్యలు చేసి, మార్ఫింగ్ ఫొటోలు పెట్టిన తీరు సరే... 48 గంటలు గడుస్తున్నా ఇలాంటి ఉన్మాదులను ప్రశ్నించేవారు లేకపోవడం దిగ్భ్రాంతిగొలుపుతుంది. పరిస్థితి ఇలావున్నప్పుడు తమ సహ విద్యార్థి నుల గురించి తాము ఏమైనా అనొచ్చని, వారిపై ఎలాంటి నేరాలకు పాల్పడినా ఏం జరగదని ఢిల్లీ విద్యార్థులు అనుకోవడంలో వింతేముంది? తమ పిల్లలు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్లల్లో చేరి, పుస్త కాలు బట్టీపట్టి ఎదిగిపోవాలని కలలుగంటూ, నిరంతరం వేరే లోకంలో జీవిస్తున్న తల్లిదండ్రులు, తాము బ్రహ్మాండమైన శిక్షణ ఇస్తున్నామని మురిసిపోయే విద్యా సంస్థలు, టీచర్లు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పుస్తకజ్ఞానం ఒకటే కాక, చుట్టూవున్న సమాజం ఎలావుందో, అందులో ఎలాంటి ప్రమాదాలు పొంచివున్నాయో పిల్లలకు అర్థం చేయించాలి. అందుకు అనుగుణమైన పాఠ్యాంశాల రూపకల్పనకు ప్రభుత్వాలు కృషి చేయాలి. -
చదువులపై కర్ర పెత్తనం
చదువంటే ఏమాత్రం శ్రద్ధ లేని ప్రభుత్వమా మనది? చదువుల శాఖను ఏ విధంగా నిర్వహించారనే ప్రాతిపదికపైన ప్రభుత్వాల పనితీరును నిర్ణయించాలి. విద్యాశాఖను మానవ వనరుల అభివృద్ధి శాఖ అని పేరు మార్చారు. మానవులను అభివృద్ధి చేయాలంటే అందులో ముఖ్యమయిన వనరు చదువు అని అర్థం. మొదటిసారి బహుముఖ ప్రజ్ఞాశాలి, విద్యావేత్త, పీవీ నరసింహారావు ఆ శాఖ మంత్రిగా ఉన్నారు. అంతకుముందు విద్యాశాఖ మంత్రిగా ఆయన సమిష్టి ఆంధ్రప్రదేశ్‌కు సేవలందించారు. వాజపేయి ప్రభుత్వంలో ప్రొఫెసర్ మురళీ మనోహర్ జోషి ఆ శాఖను నిర్వహించారు. దురదృష్టమేమంటే, డిగ్రీకి, డిప్లొమాకు తేడా తెలియని టీవీ నటిని ఒకామెను తీసుకొచ్చి మానవ వనరుల శాఖ మంత్రిగా నియమించింది 2014లో బీజేపీ ప్రభుత్వం. కొత్తప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్న లక్షలాది మంది ఆశ్చర్యపోయారు. అప్పుడే అనుమానం మొదలైంది. ఆ శాఖ అనేక చేతులు మారి ప్రస్తుతం రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ చేతికి వచ్చింది. మనీష్ వర్మ ఆరోపణల ప్రకారం మంత్రిగారికి బీఏ డిగ్రీ కూడా లేదు. ఈయన ఎంఏ డాక్యుమెంట్ల కాపీలు ఆర్టీఐ కింద కోరితే ఇవ్వడానికి నిరాకరించారు. మానవవనరుల అభివృద్ధి శాఖ మాజీ మంత్రి స్మృతి ఇరానీ ధారాళంగా మాట్లాడతారు. మరికొందరు బీజేపీ నాయకులకు డిగ్రీలకు అతీతమైన తెలివితేటలున్నాయి. స్మృతి ఇరానీ గారి చదువు వివరాలు ఇవ్వాలని సీఐసీ ఆదేశిస్తే ‘కేజీ వివరాలు కూడా ఇస్తాం తీసుకొమ్మనండి’ అని ప్రకటన చేసిన ఈ మంత్రి గారు ఢిల్లీ హైకోర్టుకు వెళ్లి చదువు వివరాలు తన వ్యక్తిగత గోప్యత, రహస్య అంశాలనీ, బహిర్గతం చేయరాదని వాదిస్తూ స్టే తెచ్చుకున్నారు. వీరు మన చదువుల భవిష్యత్తు తీర్చిదిద్దే మంత్రులు. చదువుల శాఖకు వీరిని మంత్రులుగా నియమించేవారు మన జాతీయ నాయకులు. ప్రఖ్యాత అంతర్జాతీయ జర్నల్ ‘నేచర్’ తాజా సంచికలో భారతదేశంలో విశ్వవిద్యాలయాలను రక్షించుకోవలసిన ఆవశ్యకత ఏర్పడిందని ఒక సంపాదకీయంలో పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న విశ్వవిద్యాలయాలమీద ఈ ప్రభుత్వాలకు ద్వేషం. అక్కడ చదువుకున్న విద్యార్థులు ధైర్యంగా పాలకులు చేసే అన్యాయాలను ప్రశ్నించడం వీరికి నచ్చదు. ఆ విధంగా ప్రశ్నిం చడం వారి అధికార పునాదులు కదిలించి వేస్తుం దని గుండెల్లో దడ. కనుక ఆ విశ్యవిద్యాలయాలను నిధులు ఇవ్వకుండా మాడ్చుతారు. అక్కడ పెట్టే ఖర్చులు రేపటి విద్యావంతమైన చైతన్య సమాజానికి అవసరమైన పెట్టుబడులని అర్థం చేసుకోలేరు. లేదా అర్థం చేసుకున్నారు కనుకనే ఈ సంస్థలను నీరసింపచేస్తున్నారేమో. విశ్వవిద్యాలయాలకు నిధుల తగ్గింపు ఒకవైపు, ఇనుప రాడ్లతో దాడులు మరొకవైపు ఈ సంస్థలను నీరు కారుస్తున్నాయి. 2014–15లో మొత్తం వ్యయంలో 4.14 శాతం నిధులు విద్యారంగానికి కేటాయిస్తే దాన్ని 2019–20 నాటికి 3.4 శాతానికి తగ్గించారు. 2014–15లో దేశ జీడీపీలో విద్యా వ్యయం 0.53 శాతం అయితే 2019–20 నాటికి దాన్ని 0.45 శాతానికి తగ్గించారు. విద్యారంగాన్ని కాపాడుకోవాలంటే చదువుకోవడాన్ని చదువు‘కొన’డంగా మార్చకుండా చాలా సులువుగా తక్కువ ఖర్చుతో చదువుకునే పరిస్థితులు, సంస్థలు ఏర్పడాలి. ప్రయివేటు విద్యావ్యాపారులను దొడ్డిదారిన ప్రోత్సహించడం కాదు. ఉపాధి, ఉద్యోగ వనరులను కల్పించాలి. ఈ రెండు మార్గాల ద్వారానే విద్యాలయాల్లో ఆందోళనలు తగ్గుతాయని నేచర్ పత్రిక వివరించింది. జామియా, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలలో పోలీసులు వీటిలోకి చొరబడి కనబడిన వారినల్లా చితకబాదారు, శాంతి భద్రతల రక్షణ కోసం. ఇక జేఎన్‌యూలో ముసుగులు ధరించి గూండాలు ఇనుపరాడ్లతో విద్యార్థుల తలలు పగులగొడుతూ ఉంటే, వందల సంఖ్యలో ఉన్న పోలీ సులు అనుమతి లేదనే నెపంతో మౌనంగా ఉండిపోయారు. మూడు సంఘటనల్లో విద్యాలయాలు నెత్తుటి మడుగులైనాయి. బాధితులే అనుమానితులని వారిపైనే కేసులు పెడుతున్నారు. పోలీసుల నిష్క్రియ మీద ఏచర్యలూ లేవు. ఇవన్నీ చదువు పట్ల మనకున్న గౌరవానికీ, సంస్కారానికీ ప్రతీకలు. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ -
విద్యావ్యవస్థలో అత్యున్నత ప్రమాణాలే లక్ష్యం
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యా విధానంలో ఉత్తమ ప్రమాణాలు, భారీ సంస్కరణలు, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానటరింగ్ కమిషన్ పని చేస్తుందని కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో అత్యున్నత ప్రమాణాలు పెంచడంతో పాటు, ఉపాధ్యాయులకు శిక్షణలిచ్చి విద్యాబోధనలో నైపుణ్యం సాధించే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనలో భాగంగా ఈ నెల 14 నుండి మొదటి విడతలో ప్రతి మండలంలో 15 పాఠశాలల్లో నాడు- నేడు కార్యక్రమం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పేద బడుగు వర్గాల పిల్లల చదువు కోసం ఏపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం అమలు చేయనుందని చెప్పారు. ప్రైవేటు పాఠశాలల్లో తప్పనిసరిగా 25 శాతం సీట్లు బలహీన వర్గాల విద్యార్థులకు కేటాయించి ఉచిత విద్య అందించనున్నామని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకునేందుకు కమిషన్ కు జ్యుడీషియల్ అధికారాలు వున్నాయని వెల్లడించారు. -
ఉన్నత విద్యలో మరో ‘నీట్’
సాక్షి, న్యూఢిల్లీ: ఉన్నత విద్యలో మెరుగైన ఫలితాలు వచ్చేలా విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు కేంద్రం నేషనల్ ఎడ్యుకేషనల్ అలయన్స్ ఫర్ టెక్నాలజీ (ఎన్‌ఈఏటీ) అనే పథకాన్ని ప్రకటించింది. ‘విద్యార్థుల అవసరాల మేరకు వారి వ్యక్తిగత అభిరుచుల సహకరించేలా కృత్రిమ మేథస్సును ఉపయోగించడం దీని లక్ష్యం. దీనికి సంబంధించిన స్టార్టప్ సంస్థలను ఒక వేదిక పైకి తెచ్చి తద్వారా సాంకేతికతను విద్యార్థులకు సులభంగా అందుబాటులోకి తేనున్నాం. తద్వారా విద్యార్థులు దీన్ని సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఎడ్ టెక్ కంపెనీలు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సొల్యూషన్స్ తయారీ, విద్యార్థుల నమోదు కార్యక్రమాలు చూస్తాయి. విద్యార్థుల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజును కూడా వసూలు చేస్తాయి. నవంబర్ నుంచి ప్రారంభమయ్యే ఈ పథకంలో భాగంగా ఆ కంపెనీలు మొత్తం సీట్లలో పేద విద్యార్థులకు 25 శాతం కేటాయించాల్సి ఉంటుంది’ అని మానవ వనరుల అభివృద్ధి శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. -
అత్యుత్తమ విద్యకోసం ఎన్ఆర్ఎఫ్ ఫౌండేషన్
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భారత యువత కోసం ప్రత్యేక విద్యా విధానాన్ని ప్రకటించారు. బడ్జెట్ ప్రసంగంతో మ్యాజిక్ చేస్తున్న నిర్మల అప్రతిహతంగా తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. కీలక అంశాలను పదేపదే నొక్కి వక్కాణిస్తున్నారు. ఇందులో భాగంగా జాతీయ విద్యా విధానం ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావిధానాన్ని పరిచయం చేస్తామని తెలిపారు. ముఖ్యంగా ప్రాథమిక, ఉన్నత స్థాయి విద్యలో మార్పులు తీసుకురానున్నామని నిర్మల తెలిపారు. తద్వారా యువతను ఉన్నత విద్యలో నిపుణులుగా తీర్చాదిద్దాలనేది ప్రభుత్వం లక్ష్యంగా చెప్పారు. ఇందుకు ఎన్ఆర్ఎఫ్ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా దేశ విద్యారంగాన్ని, విద్యా సంస్థల్ని గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్తమంగా నిలబెడతామని ఆర్థికమంత్రి ప్రకటించారు. అదే విధంగా ప్రతి ఇంటికీ నీరు, తదితర అంశాలతో పాటు క్లస్టర్ల ఏర్పాటు ద్వారా సంప్రదాయ పరిశ్రమలకు ప్రోత్సాహాన్నందిస్తామని నిర్మల చెప్పారు. రైల్వేలో పెట్టుబడులకు ప్రోత్సాహాన్నిస్తామని, వ్యవసాయ రంగంలో కూడా ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహాన్నిస్తామని వెల్లడించారు. పప్పు ధాన్యాల విప్లవం తీసుకొస్తామన్నారు. కొత్తగా 10వేల రైతు సంఘాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కాగా ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం ఇంకా కొనసాగుతోంది. -
విద్యావిధానంలో అమెరికాకు, ఇండియాకు తేడా ఉంది
ఎంజీయు (నల్లగొండరూరల్) : విద్యా విధానంలో అమెరికా–ఇండియాకు తేడా ఉందని అమెరికాలోని న్యూయార్క్ స్టేట్ ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రిజిస్ట్రార్ వంగపర్తి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రాక్టికల్ నాలెజ్డ్ కోసం ప్రతి ఒక్కరూ ఇంటర్నషిప్ చేయాల్సి ఉంటుందని అన్నారు. మన దేశంలో ప్రాజెక్టు నిర్వహిస్తామని, థియరీ ఎక్కువగా బోధిస్తామని, ఇవి అధ్యయనం చేసిన విద్యార్థులు అమెరికాలో కొంత ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. మంచిభాషాపటిమ, సబ్జెక్టు నాలెడ్జితో పాటు ఇతర అంశాలలో కూడా విద్యార్థులు ప్రతిభ చాటాలని అన్నారు. అమెరికాకు వచ్చి విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులు ఇక్కడి ఏజెంట్లు చెప్పినట్లు కాకుండా మంచి కళాశాలను ఎంచుకోవడానికి అన్ని వివరాలను తెలుసుకోవాలని సూచించారు. వీసాలు పొందడం, చదువుకుంటూ సంపాదించే అవకాశాలను తెలుసుకోవాలని అన్నారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు సందేహాలను ఆయన నివృత్తి చేశారు. అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు కర్ణాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, తెలుగు విద్యార్థులకు పలు సూచనలు ఇస్తుందని తెలిపారు. వీసీ ఆల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ యూనివర్సిటీ అమలు చేస్తున్న విద్యాబోధన, నైపుణ్యంపై తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఉమేష్‌కుమార్, రవి, వసంత, సరిత, సబాన హెరాల్డ్, పరమేష్, భీంరెడ్డి పాల్గొన్నారు. -
సమస్యలను ఎదుర్కొనే విద్యావిధానం కావాలి
గుంటూరు: నేటి విద్యా విధానంలో స్వల్ప లోపాలున్నాయని సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. ప్రస్తుతం పిల్లలను పోటీ పరీక్షలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామేగాని, సమాజంలో బతకడం, సమస్యలను సమర్థంగా ఎదుర్కొనగలిగే శక్తిని అందించేలా తయారు చేయలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యపై పోరాడే శక్తిని విద్యార్థికి అందించేలా విద్యావిధానం మరింత వృద్ధి చెందాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గుంటూరులోని సిద్ధార్థ గార్డెన్స్‌లో మంగళవారం డాక్టర్ రామినేని ఫౌండేషన్ (యూఎస్ఏ) ఆధ్వర్యంలో 2016–17 విద్యా సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా 10వ తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు, ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామినేని ఫౌండేషన్ అధ్యక్షుడు ధర్మప్రచారక్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతి«థిగా విచ్చేసిన జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ.. విద్యారంగ అభివృద్ధికి రామినేని ఫౌండేషన్ అందిస్తున్న సేవలను కొనియాడారు. రామినేని వారసులు తల్లిదండ్రులను స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలతో వారిని సమాజంలో చిరస్థాయిగా నిలబెడుతున్నారని అభినందించారు. 138 మంది ప్రధానోపాధ్యాయులకు, 231 మంది ఉపాధ్యాయులకు కార్యక్రమంలో జస్టిస్ చలమేశ్వర్ చేతుల మీదుగా గురు పురస్కారాలు, విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. -
విద్యావికాసంతోనే దేశాభివృద్ధి
ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య రాజానగరం: ఏ దేశం అభివృద్ధిని సాధించా లన్నా విద్యారంగం అభివృద్ధి చెందితేనే సాధ్యమవుతుందని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామ య్య అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని దివాన్‌చెరువులో శ్రీప్రకాష్ విద్యానికేతన్‌లో ఐఐటీ ఫౌండేషన్ కోర్సులకు ఉపయోగపడే విధంగా గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలలో సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎకడమిక్ ఎక్సలెన్స్ ఇన్ స్కూల్స్ (స్పేస్) ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగే పునశ్చరణ తరగతులను శనివారం ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదటిరోజు పాఠశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గతంలో ప్రకృతి వనరులనే సంపదగా భావించేవారని, కానీ 21వ శతాబ్దంలో మానవ వనరులనే దేశ సంపదగా భావిస్తున్నారన్నారు. ఈ కారణంగా వా రికి తగిన నైపుణ్యాలను అందించాలంటే ఉపాధ్యాయులు, ఆలోచన అనే వాటి పై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయులలో యోగ్యతా ప్రమాణాల స్థాయిని పెంపొందించేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. కేవలం ఐఐటీ కోసమే కాదు.. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్పేస్ కార్యదర్శి కేవీ బ్రహ్మం మాట్లాడుతూ స్పేస్ కేవలం ఐఐటీ కోసమే కాదని, విద్యా విధానం, వ్యవస్థలలో మా ర్పు కోసం కృషి చేస్తుందని అన్నారు. గౌరవ అతిథి సీతామూర్తి మాట్లాడుతూ ‘స్వరాజ్, సత్యాగ్రహ, స్వధర్మ, సర్వోదయ, స్వదేశ్’ అనే పంచధర్మాలను విద్యార్థులకు అవగతం చేసి, ఆచరించేలా చూడాలన్నారు. జీవీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ చుక్కా రామయ్య ఎంతో దార్శనికతతో 14 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ‘స్పేస్’ ని నేడు ప్రపంచమంతటా అనుసరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి విజ యప్రకాష్, తెలుగు రాష్ట్రాలలోని స్పేస్ స్కూల్స్ నుంచి వచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వామ్మో..అంత ఫీజా!
♦ భావి ఇంజనీర్లతో ప్రభుత్వం ‘సీట్లా’ట! ♦ ఫీజుల ఖరారులో జాప్యం..భారీగా పెంచిన వైనం ♦ ఎంసెట్ షెడ్యూలంతా ప్రహసనమే ♦ కౌన్సెలింగ్‌ను నిర్వహించి మిన్నకున్నారు ♦ 1నుంచి కళాశాలలను ప్రారంభించాలని ప్రకటన ♦ ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు కడప ఎడ్యుకేషన్: విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చాం.. టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి అన్నింటా పారదర్శకంగా చేస్తున్నాం .... ఈ ఏడాది ఎంసెట్‌లో మార్పులు చేసి ముందుగానే పరీక్షలు నిర్వహించి కౌన్సెలింగ్ పూర్తిచేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. కానీ వాస్తవంలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా తీవ్రజాప్యంతో భావి ఇంజనీర్లకు చుక్కలు చూపెడుతోంది. ఫీజును భారీగా పెంచి వారిపై పెనుభారం మోపింది. ఫీజుల పెంపుతో కొంతమంది మధ్యతరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పునరాలోచనలో పడ్డారు. కొందరైతే అంత ఫీజు కట్టలేమంటూ డిగ్రీ వైపు వెళ్తున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. ఎంసెట్ ప్రవేశపరీక్షను ఏప్రిల్ 29న నిర్వహించారు. ఈ పరీక్షను ప్రొద్దుటూరు, కడపలోని పలు కేంద్రాల్లో 7 వేలమందికి పైగా విద్యార్థులు రాశారు. ఇందులో ర్యాంకులు వచ్చిన వారందరికీ ఈనెల 6 నుంచి 15 వరకూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, యోగివేమన విశ్వవిద్యాలయంతోపాటు ప్రొద్దుటూరు వైఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాలలోను కౌన్సెలింగ్‌ను నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్‌లో వైవీయూలో 1,400 మంది, ప్రొద్దుటూరు సెంటర్లో 1,323 మంది కడపలోని పాలిటెక్నిక్ సెంటర్లో 1,430 మంది పాల్గొన్నారు. వారి ర్యాంకు కార్డులతోపాటు సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు. వారంతా ఇష్టమైన కళాశాలలను, కోర్సులను ఎంపిక చేసుకునేందుకు వెబ్ కౌన్సెలింగ్‌కు వెళ్లారు. మళ్లీ ఏవైనా కోర్సులు కానీ కళాశాలలను మార్చుకోదలచిన వారు ఈనెల 21వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు మార్చుకోవచ్చని అవకాశం ఇచ్చారు. ఇది చాలదన్నట్లు ప్రభుత్వం కాలయాపన చేస్తూ మళ్లీ 24వ తేదీ రాత్రి విద్యార్థుల సెల్‌లకు మెసేజ్‌లను పంపుతూ 26 వతేదీ వరకూ కళాశాలలు, ఆప్షెన్లను మార్చుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే పొరుగురాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్లు పూర్తయి తరగతులను నిర్వహించడానికి సిద్ధమయ్యారు. కానీ మన రాష్ట్రంలో పరిస్థితి అందుకు విరుద్ధంగా అధ్వానంగా తయారైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కళా శాలల్లో ఫీజుల వివరాలను ప్రభుత్వం కాలయాపన చేసి శుక్రవారం విడుదల చేసింది. గతంలో కన్నా రెట్టిం పుగా ఫీజులను పెంచారు. కమీషన్ల కోసమే ఫీజుల పెంపు తతంగమం తా నడుపున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం కష్టమే.. ఎంసెట్ షెడ్యూల్ ప్రకటన విడుదల ప్రకారం జూలై 1 నుంచి కళాశాలలు ప్రారంభం ఉంటాయని ప్రకటించారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా కోర్సులకు ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు సీటు కేటాయింపుపై అతిగతీ లేకుండాపోయింది. దీంతో విద్యార్థులు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కాలయాపన చేస్తూ మళ్లీ విద్యార్థులకు వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చని సెల్‌లకు సంక్షిప్త సమాచారం పంపడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేద విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య ఇక కష్టమే పేదవాడికి సైతం ఇంజనీరింగ్ విద్యనందించాలన్న ఉన్నతాశయంతో దివంగత సీఎం వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో వేలమంది పేదలు ఇంజనీరింగ్‌ను పూర్తిచేసి ఉన్నతస్థాయిల్లో స్థిరపడ్డారు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం తాజాగా ఇంజనీరింగ్ ఫీజులను భారీగా పెంచేసింది. దీంతో పేద విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. గతంలో ఉన్న ఫీజుకంటే 30 శాతం అదనంగా ఫీజులను పెంచింది. తీరా కౌన్సెలింగ్ అయిపోయాక ప్రభుత్వం విద్యార్థులపై ఫీజుల పిడుగును పడేసింది. దీంతో ఇక్కడ భారీగా పెరిగిన ఫీజులు కట్టేదాని కంటే బయట ప్రాంతంలో మంచి కళాశాలలో చేరి ఇంజనీరింగ్ చేస్తే బాగుటుందని పలువురు చర్చించుకుంటున్నారు. గతంలో చిన్న కళాశాలల్లో రూ.35 వేల నుంచి ఇంజనీరింగ్ ఫీజులు ప్రారంభమయ్యేవి. అలాంటింది ఇప్పడు భారీగా పెరిగింది. గరిష్ట ఫీజును రూ.1.08 లక్షలుగా నిర్ణయించింది. దీంతో పేదలకే కాదు మధ్యతరగతి వారికి కూడా ఇంజనీరింగ్ విద్య ఇక మిథ్యగానే మిగలనుంది -
'దేశవ్యాప్తంగా ఒకే విద్యావిధానం అమలుచేయాలి'
తిరుచానూరు: దేశవ్యాప్తంగా ఒకే విద్యా విధానం అమలు చేసినప్పుడే ప్రభుత్వ విద్యారంగం బలోపేతమవుతుందని అఖిల భారత విద్యా సంఘాల సమాఖ్య (ఏఐఎఫ్ఈఏ) జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ బిజ్‌నందన్‌శర్మ తెలిపారు. తిరుపతిలో ఆదివారం 'కేంద్రం, రాష్ట్రం - విద్యాపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు' అనే అంశంపై జాతీయ స్థాయి విద్యాసదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బిజ్‌నందన్‌శర్మ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో ప్రభుత్వ విద్యారంగం కుంటుపడిందని, స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడచినా విద్యాపరంగా అభివృద్ధి చెందకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వాలు కార్పొరేట్‌కు అనుకూలంగా వ్యవహరించడం వల్లే సమస్య ఎదురవుతోందన్నారు. బ్రిటీష్ వారు వదిలి వెళ్లిన ఆంగ్ల భాషపై మక్కువ చూపుతూ మాతృభాషను చిన్నచూపు చూడడం కూడా దీనికి ఒక కారణమని తెలిపారు. మాతృభాషలో విద్యాబోధన జరిగినప్పుడే అభివృద్ధి చెందుతామని వివరించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి వివేకానందదాస్ మాట్లాడుతూ.. కొఠారి కమిషన్ రూపొందించిన నివేదికను అమలు చేసినప్పుడే విద్యావిధానం బలోపేతమవుతుందన్నారు. అనంతరం సదస్సులో 7 తీర్మానాలను ప్రతిపాదించారు. వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపనున్నట్లు పేర్కొన్నారు. -
రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సిలబస్ ఉండాలి
-
సమాజంలో తారతమ్యాల నివారణకుఏక విద్యా విధానం
= ఆంగ్ల మాధ్యమంపై వ్యామోహం సరికాదు = పాలనా, కోర్టు వ్యవహారాలు కన్నడలోనే సాగాలి : సీఎం = సీఎం సిద్ధరామయ్య.. = సమాజంలో తారతమ్యాలను నివారించవచ్చు = మాతృ భాషను విస్మరించరాదు = పాలనా, కోర్టు వ్యవహారాలు కన్నడలోనే సాగాలి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : సమాజంలో తారతమ్యాలను నివారించడానికి ఏక విద్యా విధానాన్ని అమలు చేయాల్సిన అనివార్యత ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. సామాజిక వర్గ వ్యవస్థ కారణంగా అక్షరాస్యులు, నిరక్షరాస్యుల మధ్య చాలా తేడా ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంతరాన్ని పోగొట్టాలంటే ఏక విద్యా విధానం ఒక్కటే మార్గమని అన్నారు. విధాన సౌధలో శనివారం కన్నడ అభివృద్ధి ప్రాధికార ఆధ్వర్యంలో ఎస్ఎస్ఎల్సీ, పీయూసీల్లో అత్యధిక మార్కులను సాధించిన విద్యార్థులకు కన్నడ మాధ్యమ అవార్డులను ప్రదానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ఆంగ్ల మాధ్యమంలో అభ్యసించవద్దని ఎవరూ చెప్పడం లేదని, కన్నడను విస్మరించి ఆంగ్లంపై వ్యామోహం పెంచుకోవడం సరికాదని హితవు పలికారు. నాణ్యత కలిగిన విద్య లభిస్తే కన్నడ మీడియం విద్యార్థులు పురోగతి సాధించగలరని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంగ్ల మీడియంలో చదివితేనే ఉన్నతోద్యోగాలు వస్తాయనే దురభిప్రాయం విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లో ఉందని, దానిని పోగొట్టుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. పాలనా, కోర్టు వ్యవహారాలు కన్నడలోనే సాగాలని ఆకాంక్షించారు. కన్నడ మీడియంలో విద్యాభ్యాసం చేసిన వారికి ఎక్కువగా ఉద్యోగాలు లభించేలా చూడాల్సి ఉందన్నారు. రాష్ట్ర భాష, మాతృ భాష కన్నడం కనుక కర్ణాటకలో ప్రతి ఒక్కరూ కన్నడంలో మాట్లాడాల్సిన అనివార్యత ఉందన్నారు. భాషా దురభిమానాన్ని తాను ప్రోత్సహించడం లేదని, అయితే మన భాష, సంస్కృతులకు హాని కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో బెంగళూరు, మైసూరు డివిజన్ల విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. పాఠశాలల విద్యా శాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్, బెంగళూరు ఇన్‌ఛార్జి మంత్రి రామలింగా రెడ్డి, కన్నడ అభివృద్ధి ప్రాధికార అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రు పాల్గొన్నారు.