ప్రపంచాన్ని మార్చడానికి విద్య చాలా ముఖ్యమైన ఆయుధం అని నెల్సన్ మండేలా అన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా అదే నమ్మకంతో రాష్ట్రంలో విద్యాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారు. అమ్మ ఒడి, విద్యా కానుక, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉన్నత విద్యలో సంస్కరణలు, కొత్త వైద్య కళాశాలలు మొదలైన అనేక సంక్షేమ పథకాలను ఆయన ప్రారంభించారు.
ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుని ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు...విద్యకు పెద్ద పీట వేస్తే ఇలాంటివి ఎన్నయినా సాధిస్తారు... ఇదొక ఉదాహరణ మాత్రమే. రాష్ట్రంలో విద్యా సంస్కరణలు అనేకం... ఇంగ్లిష్ మీడియం చదువులు, ప్రభుత్వ బడుల్లో ఆధునిక టెక్నాలజీ ఉపయోగం.. బడులు/భవనాల ఆధునికరణ... నాడు నేడు కింద ఆధునీకీకరణ ఎలా జరిగింది. ప్రభుత్వ బడుల్లో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఏమేం సౌకర్యాలు వచ్చాయి.. మరుగు దొడ్లలో మార్పులు... ఇంకా మరెన్నో.
విద్యలో చేపట్టిన సంస్కరణల గురించి చర్చించిన ఈ డిబేట్‌లో రానున్న రోజుల్లో విద్య వల్ల సమాజానికి ఎలాంటి పురోగతిని అనే వాటి గురించి సాక్షి ఒక చర్చ నిర్వహించింది. ఈ చర్చలో అమెరికాలోని పలువురు ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. డాక్టర్ కామేశ్వర బద్రి, PhD, మోర్‌హౌస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్, డైరెక్టర్, ప్రెసిడెంట్, అసోసియేషన్ ఆఫ్ సైంటిస్ట్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఇన్ అమెరికా, హ్యూస్టన్ నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సురేష్ రెడ్డి మైలం, ఫీనిక్స్ నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ధీరజ్ పోలా, హార్ట్‌ఫోర్డ్ నుంచి చరణ్ పింగిళి, సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, అట్లాంటా నుంచి కమల్ కిరణ్ జనుమల, సీవోవో, రెడ్ యాంట్స్ గ్రూప్ (IT, ఫైనాన్స్ & మీడియా ఈ చర్చల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment