సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భారత యువత కోసం ప్రత్యేక విద్యా విధానాన్ని ప్రకటించారు. బడ్జెట్ ప్రసంగంతో మ్యాజిక్ చేస్తున్న నిర్మల అప్రతిహతంగా తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. కీలక అంశాలను పదేపదే నొక్కి వక్కాణిస్తున్నారు. ఇందులో భాగంగా జాతీయ విద్యా విధానం ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావిధానాన్ని పరిచయం చేస్తామని తెలిపారు. ముఖ్యంగా ప్రాథమిక, ఉన్నత స్థాయి విద్యలో మార్పులు తీసుకురానున్నామని నిర్మల తెలిపారు. తద్వారా యువతను ఉన్నత విద్యలో నిపుణులుగా తీర్చాదిద్దాలనేది ప్రభుత్వం లక్ష్యంగా చెప్పారు. ఇందుకు ఎన్‌ఆర్‌ఎఫ్ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా దేశ విద్యారంగాన్ని, విద్యా సంస్థల్ని గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్తమంగా నిలబెడతామని ఆర్థికమంత్రి ప్రకటించారు.
అదే విధంగా ప్రతి ఇంటికీ నీరు, తదితర అంశాలతో పాటు క్లస్టర్ల ఏర్పాటు ద్వారా సంప్రదాయ పరిశ్రమలకు ప్రోత్సాహాన్నందిస్తామని నిర్మల చెప్పారు. రైల్వేలో పెట్టుబడులకు ప్రోత్సాహాన్నిస్తామని, వ్యవసాయ రంగంలో కూడా ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహాన్నిస్తామని వెల్లడించారు. పప్పు ధాన్యాల విప్లవం తీసుకొస్తామన్నారు. కొత్తగా 10వేల రైతు సంఘాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కాగా ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం ఇంకా కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment