సాక్షి, న్యూఢిల్లీ : 2019-20 సంవత్సారానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర‍్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా శుక్రవారం సభలో ప్రవేశపెట్టనున్నారు. రక్షణశాఖ మంత్రిగా అనేక సవాళ్లను దీటుగా ఎదుర్కొన్న నిర్మలా సీతారామన్ మొట్టమొదటిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మహిళగా రికార్డులకెక్కనున్నారు. ఆర్థిక సవాళ్లను అధిగమించి అన్ని వర్గాలకు అనుగుణంగా బడ్జెట్‌ను ప్రవేశపెడతారో లేదో చూడాలి. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నవంబర్ 26, 1947న అప్పటి ఆర్థిక మంత్రి షణ్ముకం షెట్టి తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి భారతీయ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో 72 ఏళ్ల బడ్జెట్ ప్రస్థానం పై ఓ లుక్కేద్దామా..
చదవండి: వరాల సీతమ్మ
స్వతంత్ర భారత తొలి బడ్జెట్
భారతదేశానికి స్వాతంత్రం లభించిన మూడేళ్లకు 1950 సంవత్సరంలో రెండో ఆర్థిక మంత్రిగా జాన్‌మెతాయ్ నేతృత్వంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్లానింగ్ కమిషన్ ఏర్పాటుకు బాటలు పరిచిన ఈ బడ్జెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. మొదటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు జవహర్‌లాల్ నెహ్రు ప్రధానమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే.
బ్లాక్ బడ్జెట్
ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో 1973-74 సంవత్సరంలో ఆర్థిక మంత్రిగా యశ్వంత్ రావు చౌహన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను బ్లాక్ బడ్జెట్‌గా అభివర్ణించారు.అప్పటికే ఇంధనానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అప్పటి మంత్రి చౌహన్ బడ్జెట్ లో పెద్దమొత్తంలో బొగ్గు గనుల వెలికితీత, ఇన్యూరెన్స్ కంపెనీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో దీనికి బ్లాక్ బడ్జెట్‌గా పేరు వచ్చింది.
క్యారెట్ స్టిక్ బడ్జెట్
వీపీ సింగ్ ప్రభుత్వం పిబ్రవరి 28, 1986లో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 'పర్మిట్ లైసెన్స్ లేదా లైసెన్స్‌రాజ్' ను మొదటి సారి తీసుకొచ్చిన బడ్జెట్‌గా నిలిచింది. వివిధ రకాల వస్తువుల కొనుగోలుపై వినియోగదార్లు కట్టాల్సిన పన్నులపై భారం తగ్గించేందుకు మోడిఫైడ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్( మోడ్‌వాట్) పేరుతో అమల్లోకి తీసుకువచ్చిన ఘనత వి.పి.సింగ్ ప్రభుత్వానికే దక్కుతుంది.
చారిత్రాత్మక బడ్జెట్
1990ల కాలంలో సోవియట్ యూనియన్ విచ్చిన్నం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఈ ప్రభావం భారతదేశంపై కూడా పడింది. అప్పుడు భారతదేశానికి పీ.వీ నరసింహరావు ప్రధాన మంత్రిగా ఉన్నారు. ఈ సమయంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ భారతీయ బడ్జెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. మొదటిసారి లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవటైజేషన్ పేరుతో విడదీసి ఆర్థికంగా ఎదుగదలను చూపారు. ఇతర దేశాలతో స్నేహపూర్వక ఒప్పందాలు చేసుకొని భారతదేశాన్ని బలీయమైన ఆర్థికశక్తిగా తయారుచేసింది
డ్రీమ్ బడ్జెట్
1997-98 మధ్య కాలంలో అప్పటి ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రవేశపెట్టారు. కొత్త విధాన పన్ను విధాన సంస్కరణలను ప్రవేశపెట్టడంతో దీన్ని డ్రీమ్ బడ్జెట్ అని పేర్కొంటారు. అపర చాణక్యుడైన పి.చిదంబరం 2004లోనూ యూపీఏ హయాంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించి పలుమార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
మిలీనియం బడ్జెట్
1999లో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రేసేతర పార్టీగా 2000సంవత్సరంలో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ప్రవేశపెట్టారు. మిలీనియంలోకి అడుగు పెట్టిన తర్వాత భారతదేశం ఇతర దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకుంది. ఆ సమయంలోనే ఐటీ రంగం దేశంలో అడుగుపెట్టి దూకుడుగా పరిగెడుతుంది. యశ్వంత్ సిన్హా అప్పటి బడ్జెట్‌లో ఐటీ సంస్కరణలకు, పెట్టుబడులకు పెద్దపీట వేశారు. ఈ నేపథ్యంలోనే ఐటీ యాక్ట్-2002 చట్టం తీసుకువచ్చి నూతన అధ్యాయానికి తెరతీశారు.
ఇక చివరగా 72 వసారి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న తరుణంలో.. ఇప్పటివరకు అత్యధికంగా మొరార్జీ దేశాయ్ 10సార్లు వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టి వ్యక్తిగా మొదటిస్థానంలో ఉన్నారు. దేశ చరిత్రలో ఇప్పటివరకు ఒక మహిళ పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది లేదు. ఇంతకు ముందు ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలోనే ఆర్థిక మంత్రిగా మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్లారు. ఈ సందర్బంగా నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా చరిత్ర సృష్టించనున్నారు.
బడ్జెట్ హల్వాకు ప్రత్యేక స్థానం
భారతీయ చరిత్రలో బడ్జెట్ హల్వాకు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు 100 మంది ఆర్థికవేత్తలు బడ్జెట్ తయారీకి పది రోజుల ముందే ఒక దగ్గరకు చేరి సంవత్సరంలో సాధించిన ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి ఆర్థికమంత్రికి ఒక నివేదిక రూపంలో అందజేస్తారు. బడ్జెట్ ప్రవెశపెట్టే ప్రతీసారీ ఆర్థికమంత్రే స్వయంగా హల్వా తయారు చేసి అధికారులకు తినిపించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో హల్వా కార్యక్రమం ముగిసిన తర్వాత బడ్జెట్ తయారీలో పాల్గొన్న అధికారులను ఢిల్లీలోని నార్త్‌బ్లాక్ కార్యాలయానికి గోప్యంగా తరలిస్తారు.
పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టేవరకు దానికి సంబంధించిన ప్రతులను ఎక్కడా లీకవ్వుకుండా గోప్యంగా ఉంచడమే వీరి కర్తవ్యం. ఒక్కసారి బడ్జెట్ ప్రతులకు సీలింగ్ వేసిన తర్వాత ఆర్థిక మంత్రి కి కూడా ముట్టుకునే అధికారం ఉండదు. 1950 సంవత్సరం వరకు బడ్జెట్ ప్రతులను రాష్ట్రపతి భవనలో ముద్రించేవారు. అయితే తరలించేటప్పుడు కొన్ని బడ్జెట్ ప్రతులు లీకవ్వడంతో అక‍్కడి నుంచి మింట్ రోడ్‌లోని గవర్నమెంట్ ప్రెస్‌కు తరలించారు. 1980 తర్వాత నుంచి బడ్జెట్ ప్రతులను ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లోనే గోప్యంగా ముద్రణ కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment