విదేశాల్లు చదువుకునే విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులకు కేంద్రం భారీ షాకిచ్చింది. యూనియన్ బడ్జెట్-2023 లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ ఏడాది జులై నుంచి విదేశాల్లో చదువుకు ఇతర ఖర్చుల కోసం పంపించే డబ్బుపై కేంద్రం ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్(టీసీఎస్) ట్యాక్స్‌ను వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది.
సరళీకృత చెల్లింపుల పథకం (liberalised remittance scheme – LRS) కింద వసూలు చేసేవిదేశీ ప్రయాణాలు,పెట్టుబడులు, నగదు ట్రాన్స్‌ఫర్‌పై ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఈ ట్యాక్స్‌లో ఎడ్యుకేషన్, మెడికల్ విభాగాలకు మినహాయింపు ఇచ్చింది. అయితే విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్న వారి రోజువారీ ఖర్చులకు తల్లిదండ్రులు పంపే మనీ.. వారి కాలేజీ ఫీజు సంబంధిత ఖర్చులకు కిందకు రావు.
విదేశీ విద్యకు ఎడ్యుకేషన్ లోన్ ద్వారా చెల్లిస్తే
ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్ కింద ఎడ్యూకేషన్ లోన్ తీసుకొని విదేశాల్లో చదువు నిమిత్తం పంపే డబ్బు రూ.7లక్షలు దాటితే 0.5 శాతం ట్యాక్స్ కట్టాలి. అయితే, ఎడ్యుకేషన్ లోన్ కాకుండా ఇతర లోన్లు తీసుకొని విదేశాలకు రూ.7లక్షలకు మించి పంపితే 5శాతం ట్యాక్స్ పడుతుంది.
ఇతర ఖర్చులపై 20శాతం ట్యాక్స్
విదేశాలకు చెందిన కాలేజీ క్యాంపస్‌లోని హాస్టల్స్ ఉండి చదువుకునే పిల్లలకు హాస్టల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు చెల్లించేందుకు డబ్బులు పంపుతున్నట్లు తల్లిదండ్రులు ఆధారాలు చూపించాలి. అలా కాకుండా రోజువారీ ఖర్చులకు పంపితే మాత్రం 20 శాతం టీసీఎస్ పే చేయాల్సి ఉంటుంది.
బ్యాంక్‌లో ఏ-2 ఫామ్ తప్పని సరి
ఎల్ఆర్ఎస్ విధానంలో భాగంగా విదేశాల్లో ఉన్న పిల్లలకు డబ్బులు ఎందుకు పంపిస్తున్నామో తెలుపుతూ బ్యాంకులో ఏ-2 ఫామ్ నింపాలి. అందులో ఏ అవసరాలకు చెల్లిస్తున్నారో తెలుపుతూ డిక్లరేషన్ ఫామ్ సంతకం చేయాలి. అక్కడ మీరు మీ పిల్లల విద్యావసరాలకు కాకుండా ఇతర అవసరాల కోసం డబ్బులు పంపుతున్నారని తేలితే 20 శాతం టీసీఎస్ వసూలు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment