న్యూఢిల్లీ : కొత్త జాతీయ విద్యా విధానానికి (ఎన్‌ఈపీ–2020) కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇది గత 34 సంవత్సరాల నాటి జాతీయ విద్యా విధానం స్థానంలో రూపుదిద్దుకుంది. ఇందులో పాఠశాల విద్య నుంచి ఎంఫిల్ వరకు విద్యా విధానంలో సమూల మార్పులు చేశారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే విధంగా విధివిధానాలను మార్చారు. ఈ మార్పుల్లో అతి ముఖ్యమైనది పరీక్షలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులకు రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడం. దీనిపై విద్యాశాఖ మంత్రి రమేశ్ నిశాంక్ పోఖ్రియాల్ మాట్లాడుతూ.. 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలు సులభతరం చేసేందుకు సంవత్సరానికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. సంపూర్ణ అభ్యాసం విద్యార్థి సామర్థ్యాలను అంచనా వేయడం ప్రధానం కాబట్టి రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థి పోటీపడే సామర్థ్యాలను పరీక్షించడమే తాజా పరీక్షల ఉద్దేశం అంతేకానీ బట్టీపట్టి పరీక్షల్లో నెగ్గేలా నూతన పరీక్ష విధానం ఉండదని వివరించారు. (పాఠశాల, ఉన్నత విద్యలో భారీ సంస్కరణలు)
విద్యార్థులపై ఫైనల్ పరీక్షల భారాన్ని తగ్గించేందుకు ఏడాదికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఫైనల్ పరీక్షల అత్యున్నత విద్యను అందించడం, భారత్ను నాలెడ్జ్ సూపర్ పవర్ గా తయారు చేయడం వంటి లక్ష్యాలతో ఈ నూతన విధానాన్ని రూపొందించారు. కొత్త జాతీయ విద్యా విధానంలో 18 సంవత్సరాల వరకు ఉచిత విద్యను అందించడం, అలాగే పూర్వ ప్రాథమిక విద్యపై దృష్టిపెడుతూ 10+2 విద్య స్థానంలో 5+3+3+4 సంవత్సరాల విద్యను తీసుకురానున్నారు. (సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పరీక్షలు రద్దు)
Comments
Please login to add a commentAdd a comment