ప్రముఖ మలయాళ నటుడు ఇంద్రన్స్.. ఏడో తరగతి పరీక్షలు రాశాడు. అది కూడా 68 ఏళ్ల వయసులో. చిన్నప్పుడు నాలుగో క్లాస్ వరకే చదువుకున్న ఇతడు.. పుస్తకాలు, వేసుకోవడానికి బట్టలు లేకపోవడంతో టైలర్‌గా మారిపోయాడు. స్కూల్ కి వెళ్లకపోయినప్పటికీ.. చదువుకోవడం నేర్చుకున్నాడు. అలా పెద్దయిన తర్వాత నటుడిగా మారాడు.
(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?)
1980 నుంచి మలయాళంలో పలు చిత్రాల్లో ఇంద్రన్ నటిస్తున్నాడు. గతేడాది రిలీజైన '2018' అనే డబ్బింగ్ మూవీలో అంధుడి పాత్ర పోషించాడు. ఇందుకు గానూ ఉత్తమ నటుడిగా కేరళ ఫిల్మ్ అవార్డుని కూడా సొంతం చేసుకున్నాడు.
ఇక 10వ తరగతి పాస్ కావాలనే కోరిక ఇంద్రన్‌కి కలిగింది. ఇది జరగాలంటే తొలుత 7వ తరగతి పాస్ కావాలని రూల్ ఉంది. దీంతో తాజాగా తిరువనంతపురంలోని అట్టకుళంగర సెంట్రల్ స్కూల్‌లో ఏడో తరగతి పరీక్షలు రాశాడు. ఏదేమైనా 68 ఏళ్ల వయసులో చదువుకోవాలని ఇతడి ఉత్సాహాన్నfి చూసి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలో స్టార్ హీరో తీసిన పిల్లల సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్)
Comments
Please login to add a commentAdd a comment