వరస సినిమాలు చేసే తమిళ స్టార్ హీరోల్లో శివ కార్తికేయన్ ఒకడు. నిర్మాతగానూ డిఫరెంట్ సినిమాలు తీస్తుంటాడు. అలా తీసిన చిన్న పిల్లల చిత్రమే 'కురంగు పెడళ్'. మే తొలి వారంలో థియేటర్లలో రిలీజైంది. మంచి టాక్ తెచ్చుకుంది. నెల తర్వాత ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు తెలుగు వెర్షన్ నేరుగా రిలీజ్ చేసేశారు.
(ఇదీ చదవండి: విమానం కొన్న హీరో సూర్య.. రేటు రూ.100 కోట్లు పైనే?)
ప్రస్తుతం 'కురంగు పెడళ్' సినిమా తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సైలెంట్‌గా అందుబాటులోకి తీసుకొచ్చేశారు. 1980 బ్యాక్ డ్రాప్ స్టోరీతో చిన్నప్పటి జ్ఞాపకాల్ని గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుంది. కమల కన్నన్ దర్శకత్వం వహించగా.. జిబ్రాన్ సంగీతమందించాడు.
'కురంగు పెడళ్' విషయానికొస్తే.. సైకిల్ నడపడం నేర్చుకోవాలని కలలు కన్న ఓ యువకుడు.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సైకిల్ నడపడం రాని ఈ పిల్లాడి తండ్రి.. కొడుకు కోరికని ఎలా నెరవేర్చాడు అనే పాయింట్ చుట్టూ భావోద్వేగభరితంగా తీశారు. ఇఫితో పాటు పలు అంతర్జాతీయ చిత్రాత్సవాల్లో ఈ మూవీ స్క్రీనింగ్ కావడం విశేషం.
(ఇదీ చదవండి: బోల్డ్ సీన్స్ వైరల్.. నన్ను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు: రుహానీ శర్మ)
Comments
Please login to add a commentAdd a comment