విమానం కొన్న హీరో సూర్య.. రేటు రూ.100 కోట్లు పైనే? | Actor Suriya Buys Private Jet Worth Rs 120 Crore; Details Inside | Sakshi
Sakshi News home page

Suriya Private Jet: కోట్లు ఖరీదు చేసే ప్రైవేట్ జెట్ కొనుగోలు.. నిజమేంటి?

Published Sat, Aug 24 2024 11:23 AM | Last Updated on Sat, Aug 24 2024 11:37 AM

Actor Suriya Buys Private Jet Worth Rs 120 Crore; Details Inside

హీరో సూర్య పేరుకే తమిళ హీరో గానీ తెలుగులోనూ మన స్టార్ హీరోల రేంజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం 'కంగువ' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ చేయగా.. రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఇప్పుడు వ్యక్తిగతంగా మరోసారి వార్తల్లో నిలిచాడు.

(ఇదీ చదవండి: బోల్డ్ సీన్స్‌ వైరల్.. నన్ను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు: రుహానీ శర్మ)

సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ పోతున్న సూర్య.. ఆస్తులు కూడా బాగానే కూడబెతున్నాడు. ఇతడి భార్య జ్యోతిక కూడా ప్రస్తుతం సినిమాల్లో నటిస్తోంది. సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా సూర్య.. దాదాపు రూ.120 కోట్లు ఖరీదు చేసే దస్సాన్ ఫాల్కన్ 2000 మోడల్ ప్రైవేట్ జెట్ కొన్నాడని న్యూస్ వైరల్ అవుతోంది.

సూర్య అనుకుంటే దీన్ని కొనేస్తాడేమో గానీ ఈ వార్తల్లో నిజం లేదని అతడి సన్నిహితులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్నవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని కొట్టిపారేశారు. సరే ఇదలా వదిలేస్తే 'కంగువ' సినిమా.. అక్టోబరు 10న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. టైమ్ ట్రావెల్ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించడం విశేషం.

(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement