board exams
-
7వ తరగతి పరీక్షలు రాసిన 68 ఏళ్ల నటుడు
ప్రముఖ మలయాళ నటుడు ఇంద్రన్స్.. ఏడో తరగతి పరీక్షలు రాశాడు. అది కూడా 68 ఏళ్ల వయసులో. చిన్నప్పుడు నాలుగో క్లాస్ వరకే చదువుకున్న ఇతడు.. పుస్తకాలు, వేసుకోవడానికి బట్టలు లేకపోవడంతో టైలర్‌గా మారిపోయాడు. స్కూల్ కి వెళ్లకపోయినప్పటికీ.. చదువుకోవడం నేర్చుకున్నాడు. అలా పెద్దయిన తర్వాత నటుడిగా మారాడు.(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?)1980 నుంచి మలయాళంలో పలు చిత్రాల్లో ఇంద్రన్ నటిస్తున్నాడు. గతేడాది రిలీజైన '2018' అనే డబ్బింగ్ మూవీలో అంధుడి పాత్ర పోషించాడు. ఇందుకు గానూ ఉత్తమ నటుడిగా కేరళ ఫిల్మ్ అవార్డుని కూడా సొంతం చేసుకున్నాడు.ఇక 10వ తరగతి పాస్ కావాలనే కోరిక ఇంద్రన్కి కలిగింది. ఇది జరగాలంటే తొలుత 7వ తరగతి పాస్ కావాలని రూల్ ఉంది. దీంతో తాజాగా తిరువనంతపురంలోని అట్టకుళంగర సెంట్రల్ స్కూల్లో ఏడో తరగతి పరీక్షలు రాశాడు. ఏదేమైనా 68 ఏళ్ల వయసులో చదువుకోవాలని ఇతడి ఉత్సాహాన్నfి చూసి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో స్టార్ హీరో తీసిన పిల్లల సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్) -
దివ్యాంగులకు పరీక్షా కాలంలో పలికే చేయి
పరీక్షల సీజన్ వస్తే రమా పద్మనాభన్ ఇంటి వ్యవహారాలను పెద్దగా పట్టించుకోదు. పెళ్లిళ్లు, ప్రయాణాలు అసలే ఉండవు. ఆమె తనకు వచ్చే కాల్స్‌ను అటెండ్ చేసే పనిలో ఉంటుంది. ‘అక్కా.. ఈ ఎగ్జామ్ రాయాలి’ ‘ఆంటీ... ఈ డేట్‌న ఎంట్రన్స్ ఉంది’ ఇలా దివ్యాంగులు ఆమెకు కాల్స్ చేస్తుంటారు. వారి కోసం ఆమె పరీక్ష హాల్‌కు వెళ్లి వారి ఆన్సర్స్‌ను రాసి పెడుతుంటుంది. ‘ఇది గొప్ప తృప్తినిచ్చే సేవ’ అంటోందామె.చదువుకునే రోజుల్లో ఎవరైనా పరీక్షలు రాయవచ్చు. చదువు అయిపోయాక ఏవైనా కోర్సులు సరదాగా చదివితే పరీక్షలు రాయవచ్చు. కాని రమా పద్మనాభన్ అలా కాదు. ఆమె ప్రతి ఆరు నెలలకు విద్యార్థులకు సెమిస్టర్ ఎగ్జామ్స్ జరిగినప్పుడల్లా 50 పరీక్షలు రాస్తుంది. అంటే రాసి పెడుతుంది. గత పదకొండేళ్లుగా ఆమె అలా చేస్తూనే ఉంది. దివ్యాంగులకు పరీక్షలు రాసి పెట్టే స్క్రయిబ్గా ఆమెకు కోయంబత్తూరులో ఉండే పేరు అలాంటిది.గృహిణిగా ఉంటూ...కోయంబత్తూరుకు చెందిన రమా పద్మనాభన్ సైకాలజీలో డిగ్రీ చేసింది. ఆ తర్వాత ‘గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్’లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కూడా చదివింది. భర్త ఫైనాన్షియల్ సెక్టార్లో పని చేస్తాడు. ఆమెకు ఇద్దరు అబ్బాయిలు. గృహిణిగా పిల్లలను చూసుకుంటూ కాలం గడుపుతున్న రమా పద్మనాభన్ జీవితం 2013లో మారింది. ‘ఆ రోజు నేను యోగా క్లాసుకు బయలుదేరాను. నా స్నేహితురాలి నుంచి ‘ఒక అంధ విద్యార్థికి పరీక్ష రాసి పెడతావా?’ అనే విన్నపం వచ్చింది. అలా రాయగలనా అనుకున్నాను. పరీక్ష కేంద్రం దగ్గరే కనుక ట్రై చేద్దామనిపించింది. వెళ్లి రాసి పెట్టాను.పరీక్ష ముగిశాక ఆ అంధ విద్యార్థి ముఖంలో కనిపించిన కృతజ్ఞత నాకు ఎంతో మనశ్శాంతిని ఇచ్చింది. ఆ తర్వాత నాకు కాల్స్ రావడం మొదలైంది. కోయంబత్తూరులో లూయిస్ బ్రెయిలీ అకాడెమీ ఉంది. వాళ్లు కాల్ చేస్తూనే ఉంటారు. వీరు కాకుండా దివ్యాంగులు, ఆటిజమ్ విద్యార్థులు... వీరు పెన్ పట్టి పరీక్ష రాయడం కష్టం. వారికి పరీక్షలు రాసి పెడుతుంటాను’ అని తెలిపింది రమా పద్మనాభన్.అంతా ఉచితమేదివ్యాంగులకు, అంధులకు పరీక్షలు రాసేందుకు రమ ఎటువంటి రుసుమూ తీసుకోదు. పరీక్షా కేంద్రానికి కూడా సొంత ఖర్చులతోనే వెళ్లి వస్తుంది. ‘అయితే అందుకు నా భర్తను అభినందించాలి. నీ డబ్బులు ఖర్చు పెట్టి వేరొకరి పరీక్షలు ఎందుకు రాస్తున్నావు అని ఎప్పుడూ అడగలేదు’ అంటుంది రమ. ‘అంధ విద్యార్థులు తమకు పరీక్షలు రాసి పెట్టే వారు లేరని తెలిస్తే చాలా టెన్షన్ పడతారు. ఆబ్సెంట్ అయితే పరీక్ష పోతుంది. అందుకే వారికి స్క్రయిబ్లు కావాలి. వారు చెబుతుంటే జవాబులు సరిగ్గా రాయగలగాలి. నేను ఆటిజమ్ విద్యార్థులకు రాసి పెట్టేటప్పుడు మరింత శ్రద్ధగా ఉంటాను. వారు సమాధానాలు కంటిన్యూస్‌గా చెప్పడంలో ఇబ్బంది పడతారు. ప్రోత్సహిస్తూ రాబట్టాలి. అదే కాదు హైస్కూల్ పాఠాల దగ్గరి నుంచి ఇంజినీరింగ్ పాఠాల వరకూ అవగాహన ఉండాలి. అందుకే ఆ పాఠాలు కూడా తెలుసుకుంటూ ఉంటాను. స్క్రయిబ్గా నేను మారేటప్పటికి నా పిల్లలు చిన్నవాళ్లు. నా చిన్నకొడుకుకైతే ఐదారేళ్లవాడు. ఇంటిదగ్గర వాణ్ణి ఒక్కణ్ణే వదిలి తాళం వేసుకుని పరీక్ష రాసి పెట్టిన సందర్భాలున్నాయి’ అని తెలిపిందామె.కొనసాగే అనుబంధం‘నేను రాసిన పరీక్షలతో కోర్సులు పాసై ఉద్యోగాలు పొందిన దివ్యాంగులు చాలా మంది ఉన్నారు. వాళ్లంతా నా కాంటాక్ట్‌లో ఉంటారు. తమ జీవితంలో సాధిస్తున్న ప్రగతిని తెలియజేస్తుంటారు. అదంతా వింటుంటే ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది. జీవితానికి ఒక అర్థం దొరికినట్టు ఉంటుంది. నా పెద్దకొడుకు సీనియర్ ఇంటర్‌కు వచ్చాడు. వాణ్ణి వీలున్నప్పుడల్లా స్క్రయిబ్గా పని చేయడానికి పంపుతున్నా. వాడు ఆ పని చేస్తున్నందుకు ఎంత సంతోష పడుతున్నాడో చెప్పలేను’ అని ముగించింది రమా పద్మనాభన్. -
ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన ప్రాచీ: ఉచితంగా ట్రీట్ చేస్తామన్న వైద్యులు
ఉత్తరప్రదేశ్ 10వ తరగతి పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచిన ప్రాచీ నిగమ్ ట్రోలర్స్‌కు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. ఎవరేమన్నా, తన విజయమేతనకు ముఖ్యమంటూ తేల్చి చెప్పింది."ట్రోలర్లు వారి ఆలోచనలతో వారుంటారు. నా విజయమే నా ప్రస్తుత గుర్తింపు. దీంతో నే సంతోషంగా ఉన్నాను" అని అంటూ బుధవారం తొలిసారి స్పందించింది. అలాగే తన రూపాన్ని చూసి, తన కుటుంబంగానీ, తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయులుగానీ, తోటి మిత్రులు గానీ ఎన్నడూ చిన్నచూపు చూడలేదని, దీంతో తన దృష్టి అంతా తన చదువుపైనే కేంద్రీకృతమైందని చెప్పుకొచ్చింది. అసలు తన రూపం గురించి తానెప్పుడూ బాధపడలేదనీ ఇంజనీర్ కావడమే లక్ష్యమని తెలిపింది. అంతిమంగా తన విజయం తప్ప తాను ఎలా ఉన్నాను అన్నది ముఖ్యం కాదని స్పష్టం చేసింది.విశ్వనాథన్ మద్దతుమరోవైపు భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ప్రాచీకి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమెను విద్యాపరమైన లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించాలని సలహా ఇచ్చారు. హార్మోన్ల ప్రభావం, చికిత్స ఉందిప్రాచీ నిగమ్‌కి సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్జీపీజీఐఎంఎస్) డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్కే ధీమాన్ తమ ఇన్స్టిట్యూట్ ఉచితంగా చికిత్స చేయనున్నట్లు వెల్లడించడం విశేషం. హార్మోన్ల ప్రభావంతో వచ్చే మహిళల్లో కనిపించే అవాంఛిత రోమాల పెరుగుదలను ఎండోక్రినాలజీ ద్వారా నియంత్రించవచ్చనీ, టీనేజ్ పిల్లల్లో సాధారణంగా కనిపించే ఈ సమస్య నెలరోజుల్లో నయమవుతుందని ధీమాన్ అన్నారు.ఇటీవల విడుదలైన 10వ తరగతి 98.5 శాతం మార్కులతో యూపీలో టాప్‌లో నిలిచింది. ఈ సందర్భంగా ప్రాచీ నిగమ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే 600లకు గాను 591 మార్కులు సాధించిన ఆమె ప్రతిభను చూడాల్సిన నెటిజన్లు కొంతమంది ఆమె ముఖంపై ఉన్న రోమాలను మాత్రమే చూశారు. అనుచిత వ్యాఖ్యలతో ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. -
చదువులతల్లి పట్ల దారుణం: చైల్డ్ లైన్ ఫిర్యాదుతో వెలుగులోకి!
అత్యాచార బాధితురాలి పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. సామూహిక అత్యాచారానికి గురైన బాలికను 12వ తరగతి పరీక్ష రాయకుండా అడ్డుకున్నారు. రాజస్థాన్‌లో అజ్మీర్‌లో ఒకప్రైవేట్ పాఠశాలలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు చైల్డ్ హెల్ప్లైన్నంబర్కు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 12 బోర్డు పరీక్షలకు తనను హాజరుకానివ్వలేదంటూ అజ్మీర్‌లోని ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని ఆరోపించింది. గత ఏడాది సామూహిక అత్యాచారానికి గురయ్యావు కాబట్టి, పరీక్షకు హాజరైతే వాతావరణం చెడిపోతుందని పాఠశాల అధికారులు చెప్పారని విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొంది. అడ్మిట్ కార్డ్ ఇవ్వ లేదని బాధితురాలు తెలిపింది. అడ్మిట్ కార్డు తీసుకోవడానికి వెళ్లినప్పుడు, అధికారులు ఇకపై పాఠశాల విద్యార్థిని కాదని తెలిపారు. అయితే దీనిపై మరో టీచర్‌ను సంప్రదించగా, ఆమె చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయమని సూచించింది. అయితే బాధిత విద్యార్థిని గత నాలుగు నెలలుగా పాఠశాలకు రాకపోవడంతో ఆమెను పరీక్షకు అనుమతించడం లేదని పాఠశాల అధికారులు వాదించారు. అయితే ఆమె స్కూలుకు హాజరుకావడాన్ని ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తనను లోపలికి రానీయకుండా నిషేధించారని ఇంటి నుండే చదువుకోవాలని సూచించిందని అందుకే ఇంట్లో ఉండే పరీక్షలకు ప్రిపేర్ అయినట్టు అంజలీ శర్మతో వాపోయింది. విద్యార్థిని ఫిర్యాదు మేరకు అజ్మీర్ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ (సిడబ్ల్యుసి) కేసు నమోదు చేసింది, విచారణ తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని సీడబ్ల్యూసీ చైర్పర్సన్ అంజలి శర్మ వెల్లడించారు. శిశు సంక్షేమ శాఖ కూడా కేసు నమోదు చేసింది. 10వ తరగతి పరీక్షలలో 97 శాతం స్కోర్ సాధించిన బాధితురాలు ఇపుడు కూడామంచి మార్కులు తెచ్చుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. కానీ పాఠశాల నిర్లక్ష్యం వల్ల ఏడాది సమయం వృథా అవుతుందేమోనని భయపడుతోంది. కాగా గతేడాది అక్టోబర్‌లో విద్యార్థినిపై ఆమె మామ, మరో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.దీనిపై విచారణ నడుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలికా విద్య, మహిళల భద్రత గురించి ఎంత మాట్లాడు తున్నా, ఎంత ప్రచారం కల్పిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదనీ, మరీ ముఖ్యంగా విద్య నేర్పే పాఠశాల్లో ఇలాంటి దారుణం ఏమిటి అనే విమర్శలకు తావిస్తోంది. -
10, 12 బోర్డు పరీక్షలు ఇకపై ఏడాదిలో రెండుసార్లు
న్యూఢిల్లీ: పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. రెండు పరీక్షలు రాయాలా, లేదా ఒక్క పరీక్షకే హాజరు కావాలా అన్నది విద్యార్థుల ఇష్టమని స్పష్టం చేసింది. ఈ ఆప్షన్ ఐచ్ఛికమే తప్ప, నిర్బంధం కాదని వివరించింది. విద్యార్థుల్లో పరీక్షంటే భయం దూరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం పీటీఐకి ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు. నూతన కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్సీఎఫ్) సాధాసాధ్యాలపై మంత్రి ప్రధాన్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈకి మాదిరిగానే విద్యార్థులకు రెండుసార్లు పరీక్ష రాసేందుకు వీలు దొరుకుతుంది. బెస్ట్ స్కోర్ సాధించొచ్చు. ఈ ఆప్షన్ పూర్తిగా విద్యార్థుల ఇష్టానికే వదిలేశాం. ఇందులో ఎటువంటి నిర్బంధం లేదు. ఏడాదిలో ఒకేసారి పరీక్ష ఉండటం, ఈ చాన్స్ మిస్సయితే ఒక సంవత్సరం కోల్పోతామనే భయం, ఒత్తిడి ఎక్కువమంది విద్యార్థుల్లో ఉంటున్నాయి. దీంతో, వారు పరీక్షలు సరిగా రాయలేకపోతున్నారు. రెండుసార్లు పరీక్షలు రాసే అవకాశమిస్తే ఇలాంటి భయాలు వారిలో ఉండవు. పూర్తిస్థాయిలో ప్రిపేరయి పరీక్ష రాస్తే సంతృప్తికరమైన స్కోర్ సాధించగలుగుతారు. ఒకసారి మంచి స్కోర్ తెచ్చుకున్న విద్యార్థి మరో విడత పరీక్ష రాయాలా వద్దా అనేది ఐచ్చికం. ఇందులో ఎటువంటి నిర్బంధం లేదు’అని వివరించారు. 2024 నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నామని తెలిపారు. డమ్మీ స్కూల్స్ పనిపడతాం రాజస్తాన్‌లోని కోటాలో పరీక్షలకు శిక్షణ నిమిత్తం వచ్చిన విద్యార్థులు ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో బలవన్మరణాలకు పాల్పడటంపై మంత్రి ప్రధాన్ స్పందిస్తూ.. ‘ఇది చాలా సున్నితమైన అంశం. విస్మరించరానిది’అన్నారు. అదేవిధంగా, తమ సొంత రాష్ట్రంలోని స్కూల్లో అడ్మిట్ అయిన విద్యార్థులు అక్కడ చదవకుండా, పరీక్షల శిక్షణ కోసం కోటా వంటి చోట్లకు వెళ్తుండటంపై మంత్రి.. ఇటువంటి డమ్మీ స్కూళ్లపై చర్యలకు ఉపక్రమించాల్సిన సమయం వచ్చిందన్నారు. పాఠశాలకు హాజరు కాకపోవడం విద్యార్థుల వ్యక్తిగత ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుందని, వారు ఒంటరితనంతో బాధపడుతూ, ఒత్తిడులకు గురవుతున్నట్లు నిపుణులు చెబుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యా సంబంధ విధాన నిర్ణయాలపై ప్రభుత్వానికి సలహాలిచ్చే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్(సీఏబీఈ)ని ఆధునీకరిస్తామని మంత్రి ప్రధాన చెప్పారు. -
ఇకపై ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎక్సామ్స్..
ఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా బోర్డ్ ఎక్సామ్స్‌తో సహా పలు కీలక మార్పులు చేయనున్నారు. అందుకు అనుగుణంగా 2024 ఏడాదికి పాఠ్య పుస్తకాలను సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రం నూతన విధివిధానాలకు సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ను విడుదల చేసింది. పరీక్షల్లో మంచి మార్కులు సాధించుకునేలా ప్రతి ఏడాది రెండు సార్లు బోర్డు పరీక్షలను పెట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకారం విద్యార్థులు బాగా చదివిని సబ్జెక్టులనే ఎక్సామ్స్ రాసుకునే వెసులుబాటు కల్పించారు. మంచి మార్కులు వచ్చిన పరీక్షనే ఫైనల్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఒత్తిడి లేకుండా ఆయా సబ్జెక్టుల్లో నైపుణ్యం తెచ్చుకునేలా ఈ విధానం ఉపయోగపడనుంది. ఇంటర్ స్థాయిలో విద్యార్థులకు రెండు భాషలను అభ్యసించేలా కొత్త విధానాలను సిద్ధం చేశారు. ఇందులో ఒకటి తప్పకుండా భారతీయ భాష అయి ఉండాలని నిబంధనలు విధించారు. పాఠ్యపుస్తకాల ధరను తగ్గించాలని నొక్కి చెబుతూనే, తరగతి గదిలో పుస్తకాలను 'కవరింగ్' చేసే ప్రస్తుత పద్ధతిని నివారించవచ్చని కొత్త ఫ్రేమ్‌వర్క్ గుర్తించింది. ఇదీ చదవండి: చంద్రయాన్-3 హీరోలు.. ఆ వెనుక ఉన్న మేధస్సు వీళ్లదే.. -
విద్యార్థి 35 శాతం మార్కులకే సంబరాల్లో కుటుంబం..వీడియో వైరల్
మహారాష్ట్ర: పరీక్షల్లో తప్పితే జీవితంలో తప్పినట్లు భావిస్తుంటారు కొందరు పిల్లలు. ఫలితాలను విడుదల చేసిన మరుసటి రోజు.. పేపర్లలో ఫెయిలైన విద్యార్థుల ఆత్మహత్య వార్తలను సాధారణంగా చూస్తుంటాం. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ విధానం కొనసాగుతూ వస్తోంది. అయితే.. ఇందుకు భిన్నంగా 35 శాతం మార్కులతో పాస్ అయిన ఓ విద్యార్థికి తన తల్లిదండ్రులు వేడుక చేశారు. ఈ స్ఫూర్తిదాయక సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. ఇటీవల మహారాష్ట్రలో విద్యాశాఖ పదో తరగతి విద్యార్థుల ఫలితాలను విడుదల చేసింది. ఇందులో ఓ ఆటోడ్రైవర్ కుమారుడు అన్ని సబ్జెక్టుల్లో 35 శాతం మార్కులతో పాస్ అయ్యాడు. తక్కువ మార్కులు సాధించినందుకు తిట్టకుండా తమ కుమారునికి ఆ కుటుంబం సంబరాలు చేసింది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవినీష్ శరణ్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాను కామెంట్ చేశారు. కింది స్థాయిల్లో తక్కువ మార్కులు సాధించినప్పటికీ జీవితంలో తాము సాధించిన గొప్ప విజయాలను పంచుకున్నారు. मुंबई के रहने वाले 10वीं के एक छात्र ने परीक्षा में 35% मार्क्स हासिल किए. लेकिन उसके माता-पिता ने दुखी या नाराज होने की बजाय उसकी सफलता को सेलिब्रेट किया. pic.twitter.com/fAa6szayiF — Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) June 8, 2023 ఇదీ చదవండి:ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్లనిపించేది ఇలాంటి సందర్భాల్లోనే కావొచ్చు..! -
పరీక్ష బాగా రాశాననే ఆనందం అవిరైంది.. తల్లి లేదని తెలిసి ఖిన్నుడయ్యాడు.
ఖమ్మం: ఖమ్మంలో ఉంటూ కండక్టర్‌గా పనిచేసే ఎక్కిరాల దేవమణిని ఆమె భర్త రాంబాబు కుటుంబ కలహాల నేపథ్యంలో ఆదివారం రాత్రి రోకలిబండతో మోది చంపేశాడు. ప్రైవేటు కళాశాల హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వీరి కుమారుడు ప్రణవ్‌తేజ్‌కు ఇది తెలిస్తే టెన్త్ తొలిరోజు పరీక్షకు హాజరు కాలేడని భావించిన బంధువులు.. విషయం చెప్పలేదు. పరీక్ష పూర్తయ్యాక నేరుగా మార్చురీ వద్దకు తీసుకెళ్లి తల్లి మృతదేహాన్ని చూపించడంతో ఒక్కసారిగా ఖిన్నుడయ్యాడు. అంతకు కొద్దిక్షణాల ముందే పరీక్ష బాగా రాశానని తనకెదురైన తన తల్లి స్నేహితురాలికి నవ్వుతూ ప్రణవ్ బదులివ్వడాన్ని చూసి బంధువులు కంటతడి పెట్టారు. -
పరీక్షా కేంద్రం నగరాన్ని మార్చుకునేందుకు ఓకే: సీబీఎస్ఈ
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే నెలలో ప్రారంభంకానున్న 10, 12 తరగతుల మొదటి టర్మ్ బోర్డు పరీక్షలకు సంబంధించి పరీక్షా కేంద్రం నగరాన్ని మార్చుకొనేందుకు సీబీఎస్ఈ అనుమతించింది. అడ్మిషన్ తీసుకున్న నగరంలో కాకుండా విద్యార్థి వేరే నగరంలో ఉన్న పరిస్థితుల్లో ఆ నగరంలో పరీక్ష రాసేందుకు అవకాశాన్ని కల్పిస్తూ సీబీఎస్ఈ బుధవారం ప్రకటన జారీ చేసింది. కొందరు విద్యార్థులు వారు అడ్మిషన్ తీసుకున్న నగరంలో కాకుండా ఇప్పటికీ ఇతర నగరాల్లో నివసిస్తున్నారని సీబీఎస్ఈ దృష్టికి వచ్చిందని ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యామ్ భరద్వాజ్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో పరీక్షా కేంద్రం నగరాన్ని మార్చడానికి విద్యార్థుల సంబంధిత పాఠశాలలకు ఒక అభ్యర్థన చేసేందుకు నిర్ధిష్ట సమయాన్ని ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్న విద్యార్థులు, ఆ సమయంలో దరఖాస్తు చేసుకుంటేనే బోర్డు అంగీకరిస్తుందని భరద్వాజ్ తెలిపారు. కాగా 10వ తరగతి ఫస్ట్ టర్మ్ పరీక్షలు నవంబర్ 30 నుంచి, 12 తరగతి పరీక్షలు డిసెంబర్ 1 నుంచి నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమైన విషయం తెలిసిందే. (ఈ కోర్సులు చదవితే జాబ్ ఆఫర్లు అపారం!) -
CBSE: ‘అలా చేస్తే విద్యార్థులకు అన్యాయం చేసినట్లే’
సాక్షి, న్యూఢిల్లీ: విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేయడం సరికాదంటూ టోనీ జోసెఫ్ అనే ఉపాధ్యాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేయడం వల్ల కష్టపడి చదివే విద్యార్థులకు అన్యాయం చేసినట్లు అవుతుందని టోనీ తరఫు న్యాయవాది జోస్ అబ్రహం ఈ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాది మమతా శర్మ దాఖలు చేసిన పిటిషన్లో ఇంప్లీడ్ అవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. ‘‘12వ తరగతి పరీక్షలు అనేవి విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకం. ఉన్నత విద్యలో చేరడానికి ఈ పరీక్షా ఫలితాలు ఎంతో ముఖ్యం. ఈ పరీక్షలను రద్దు చేస్తే కష్టపడి చదివే విద్యార్థులకు అన్యాయం చేసినట్లే. ఇంటర్నల్ అసెస్ మెంట్, విద్యా సంస్థలు నిర్వహించే ఆన్లైన్ పరీక్షలు ఆధారంగా ఉత్తీర్ణత చేయడం అన్యాయం. ఇంటర్నల్ పరీక్షలు అన్నీ కూడా ఇంట్లో కూర్చొనే విద్యార్థులు రాశారు’’ అని పిటిషన్లో పేర్కొన్నారు. కోవిడ్–19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా పరీక్షలు వాయిదా వేశారని, జూన్ 1న పరిస్థితిని సమీక్షిస్తామని సీబీఎస్ఈ పేర్కొందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చదవండి: ఈ పోటీలో గెలిస్తే రూ.50 వేలు మీ సొంతం? కొవిడ్‌తో అనాథలైన పిల్లలకు ప్రతి నెల రూ.2500 -
పరీక్షలు ఒక్కటే జీవితం కాదు: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: పరీక్షల్లో వచ్చే మార్కులు మాత్రమే మేధస్సుకు కొలమానం కాదనే విషయాన్ని తల్లిదండ్రులు, విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరీక్షల్లో మంచి మార్కులు రాని చాలామంది కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు, వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంచేందుకు ప్రధాని మోదీ 2018 నుంచి ఏటా ‘పరీక్షా పే చర్చా’కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికిగాను బుధవారం వర్చువల్ వేదికగా జరిగిన ‘పరీక్షా పే చర్చా–2021’కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని సావధానంగా సమాధానం ఇచ్చారు. పలు కీలక సూచనలు చేశారు. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి... పరీక్షల ముందు విద్యార్థులకు ఎదురయ్యే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలని ఏపీలోని ప్రకాశం జిల్లా పొదిలి ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పల్లవి అనే విద్యార్థిని ప్రధాని మోదీని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ప్రధాని.. ప్రతీ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో పరీక్షలు వస్తాయని ముందే తెలిసినప్పుడు ఒత్తిడి పెంచుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని సూచించారు. విద్యార్థులపై తల్లిదండ్రులు అనవసర ఒత్తిడిని పెంచొద్దని చెప్పారు. చిన్నారులతో ఎక్కువ సమయం గడపాలని, తద్వారా వారిలోని లోటుపాట్లు తెలుసుకొని సరిదిద్దడానికి అవకాశం ఉంటుందని తల్లిదండ్రులకు సూచించారు. అర్థంకాని కొన్ని సబ్జెక్టుల నుంచి పారిపోకుండా దీటుగా ఎదుర్కొన్నప్పుడే విద్యార్థులు విజయం సాధించగలరని చెప్పారు. అధ్యాపకులు సైతం కఠినమైన విషయాలను విద్యార్థులకు ఓపికగా వివరించాల్సిన అవసరం ఉందని, అలా చేస్తే కఠినమైన సబ్జెక్టులపై విద్యార్థుల్లో భయం దూరమవుతుందని తెలిపారు. అసమానతలు వద్దు ఇళ్లలో అమ్మాయిలు, అబ్బాయిల మధ్య చూపించే అసమానతల కారణంగా పిల్లల మనసులపై తీవ్ర ప్రభావం ఉంటుందని, తల్లిద్రండులు ఈ విషయంలో జాగ్రత్త పాటించాలని మోదీ స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను పిల్లలు సాధించే పరిస్థితి లేనప్పుడు వారిని నిందించడం తగదన్నారు. ఏ విషయమైనా పిల్లలకు తర్కబద్ధంగా నేర్పించేందుకు అవసరమైన వాతావరణాన్ని ఇంట్లో సృష్టించాల్సిన అవసరం తల్లిదండ్రులకే ఉందని చెప్పారు. ఏ విషయంలోనైనా పిల్లలు తమకు తామే ప్రేరణ పొందాల్సిన అవసరం ఉందని.. తల్లిదండ్రులు చిన్నారుల్లో ఆశావహ దృక్పథాన్ని పెంచాలే తప్ప, భయాన్ని పెంచకూడదని మోదీ స్పష్టం చేశారు. ఈ మధ్య సెలబ్రిటీ కల్చర్ పెరిగిపోయి, ప్రసార మాధ్యమాల్లో కనిపించే వారిలా తాము మారాలని కోరుకుంటున్నారని.. కానీ ఎవరైనా తమకున్న స్కిల్స్‌ను మెరుగుపర్చుకుంటూ ప్రపంచంలోని అనేక అవకాశాలను అందుకొనేలా సిద్ధం కావాలని సూచించారు. పరీక్షా కేంద్రం బయటే వదిలేయండి పరీక్ష రాసేందుకు వెళ్లే విద్యార్థులు తమకున్న ఆందోళనను పరీక్షా కేంద్రం బయటే విడిచిపెట్టాలని మోదీ సూచించారు. ఎగ్జామ్ వారియర్ పుస్తకంలో తను రాసిన సలహాలు, సూచనలు విద్యార్థులకే కాకుండా ప్రతీ ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటాయని గుర్తు చేశారు. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాదిగా ఏవైతే కోల్పోయామో, వాటికంటే ఎక్కువ తెలుసుకున్నామని మోదీ చెప్పారు. అతి తక్కువ వసతులతో ఎలా జీవించగలమో కరోనా మనకు నేర్పిందన్నారు. సామాజిక దూరాన్ని పాటించాలని చెప్పిన కరోనా.. మన మధ్య ఉండే భావోద్వేగాలను బలపరిచిందని చెప్పారు. పిల్లలతో స్నేహితుల్లా ఉండాలి ఇటీవల సమాజంలో పెరుగుతున్న జనరేషన్ గ్యాప్ తగ్గించే విషయంలో తల్లిదండ్రులే కీలకపాత్ర పోషిస్తారని మోదీ అన్నారు. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు వారిని సంతోషపర్చేందుకు తల్లిదండ్రులు ఏర్పర్చిన స్నేహపూరిత వాతావరణాన్ని.. పిల్లలు పెద్దయ్యాక కూడా కొనసాగించేలా చూడాలన్నారు. సాంప్రదాయ ఆహారం ప్రాధాన్యత తెలపండి సాంప్రదాయ ఆహారంపై చిన్నారులకు గౌరవం పెరిగేలా చూడాలని మోదీ పిలుపునిచ్చారు. ఆరోగ్యకర ఆహారం ప్రాధాన్యతను పిల్లలు తెలుసుకొనేలా ఏదైనా గేమ్ సిద్ధంచేసి, కనీసం వారానికోసారి అయినా ఆడించే ప్రయత్నం చేయాలన్నారు. సాంప్రదాయ ఆహారంలోని పోషక విలువల గురించి మన ఫ్యామిలీ డాక్టర్‌తో, స్కూల్ టీచర్లతో చిన్నారులకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. విద్యార్థులు పరీక్షలు పూర్తయ్యాక.. తమ రాష్ట్రాల్లో స్వాతంత్య్ర సంగ్రామంతో సంబంధమున్న 75 ఘటనలను మాతృభాషలో రాసే ప్రక్రియను ఏడాది పాటు ప్రాజెక్టు మాదిరిగా చేపట్టాలని కోరారు. ప్రతీ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో పరీక్షలు వస్తాయని ముందే తెలిసినప్పుడు ఒత్తిడి పెంచుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు.పరీక్షలు, మార్కులు అనే అంశాలను కొందరు జీవన్మరణ సమస్యగా మారుస్తున్నారు.. ఆ ఆలోచనల్లో మార్పు రావాలి. ఏదైనా విషయాన్ని చదివేటప్పుడు విద్యార్థులు ‘ఇన్వాల్వ్, ఇంటర్నలైజ్, అసోసియేట్, విజువలైజ్’ అనే నాలుగు అంశాలను పాటిస్తే వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. విద్యార్థులు ఖాళీ సమయాన్ని తమకు ఇష్టమున్న ఇతర అంశాలకు కేటాయించి.. తమలోని సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు ఉపయోగించుకోవాలి. కొందరు తల్లిదండ్రులు తాము నిర్దేశించుకున్న కలలు,లక్ష్యాలను పిల్లలపై రుద్ది..వాటిని సాధించేందుకు యంత్రాల్లా మార్చేస్తున్నారు. చిన్నారులతో తల్లిదండ్రులు స్నేహితులుగా ఉండాలే తప్ప శిక్షకులుగా మారొద్దు. చదవండి: తల్లి చెప్పినా వినలే.. పరీక్ష రాస్తూ మృత్యుఒడిలోకి -
తల్లి చెప్పినా వినలే.. పరీక్ష రాస్తూ మృత్యుఒడిలోకి
పాట్నా: జ్వరం అని తెలిసి కూడా పరీక్ష రాయడానికి ఆ విద్యార్థి వెళ్లాడు. తల్లి వద్దని మొరపెట్టుకున్నా ‘పరీక్ష రాయకపోతే ఈ విద్యా సంవత్సరం వేస్ట్ అవుతుంది’ అని నచ్చచెప్పి విద్యార్థి పాఠశాలకు వెళ్లాడు. అతడి ఉష్ణోగ్రత పరీక్షించగా అధికంగా ఉండడంతో పరీక్ష రాయడానికి పాఠశాల అధికారులు అనుమతి ఇవ్వలేదు. అయినా కూడా వారిని బతిమిలాడాడు. దీంతో తల్లితో పాటు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశాడు. అతడు ఎలాగైనా పరీక్ష రాస్తానని పట్టుబట్టడంతో అధికారులు అంగీకరించి ఒక్కడే బయట పరీక్ష రాయడానికి అనుమతించారు. అయితే పరీక్ష రాస్తున్న సమయంలో ఆరోగ్యం విషమించడంతో ఆ విద్యార్థి మృతిచెందాడు. చేతిలో పెన్ను.. పేపర్ పట్టుకుని మృత్యు ఒడికి చేరాడు. ఈ విషాద ఘటన బిహార్ రాష్ట్రంలో జరిగింది. మృతుడు రోహిత్ కుమార్. నలంద జిల్లాలోని బిహార్ షరీఫ్ పట్టణంలో ఆదర్శ్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతుండేవాడు. బోర్డు పరీక్షలు కావడంతో ఆ విద్యార్థి ఈసారి ఎలాగైనా పరీక్షలు రాయాలని పట్టుబట్టి మరీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటనతో పాఠశాలలో విషాదం ఏర్పడింది. -
50శాతం తగ్గనున్న సీబీఎస్ఈ, సీఐఎస్సీ సిలబస్?
న్యూఢిల్లీ : విద్యా ప్రమాణాలు అధికంగా ఉండే సీఐసీసీఈ జూన్‌లో 2020-21 ఏడాదికి సిలబస్ తగ్గించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో నెలకొన్న అసాధారణ (కరోనా) పరిస్థితుల నేపథ్యంలో రెగ్యులర్ సిలబస్‌తో విద్యార్థులకు బోధించలేమని భావించి 9 నుంచి 12వ తరగతులకు సిలబస్ 30 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. సీఐసీసీఈ తర్వాత సీబీఎస్ఈ కూడా అదే బాటలో 30 శాతం సిలబస్ తగ్గించింది. తొలగించిన సిలబస్ నుంచి పరీక్షలో ప్రశ్నలు ఏవీ రావని స్పష్టం చేసింది. సీబీఎస్ఈ, సీఐఎస్‌సీఈని అనుసరించి అనేక రాష్ట్ర బోర్డులు కూడా వారి సిలబస్‌లో 25శాతం నుంచి 30 శాతం వరకు తగ్గించాయి. చదవండి: 30% తగ్గనున్న సీబీఎస్ఈ సిలబస్ కాగా తాజాగా ఈ ఏడాది బోర్డు పరీక్షలను సులభతరం చేసేందుకు సిలబస్‌ను మరింత తగ్గించేందుకు సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ ఆలోచనలు చేస్తున్నాయి. ఇంతకు ముందు నిర్ణయించినట్లు 30 శాతానికి బదులు 50 శాతం సిలబస్ తగ్గించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ విషయంపై సీబీఎస్‌ఈఎస్ఈ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ..పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి రానందున ఈ ఏడాది బోర్డు పరీక్షలు 70శాతం లేదా 50 శాతం సిలబస్‌తో నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు , దీనిపై బోర్డు త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. చదవండి: రాజకీయం చేయొద్దు.. అందుకే ఈ చర్య.. ఇప్పటికీ పాఠశాలలు తెరుచుకోకపోవడం, ఆన్లైన్ తరగతులు కొనసాగుతుండటం వల్ల జాతీయ విద్యా బోర్డులు కూడా పరీక్షలను 45 నుంచి 60 రోజులు ఆలస్యం చేయాలని ఆలోచిస్తున్నాయి. బోర్డు పరీక్షలను ఏప్రిల్‌కు మార్చే అవకాశం ఉంది. అయితే వీటిపై ఇంకా విధానాన్ని ఖరారు చేయలేదు. కాగా పాఠశాలలు, కళాశాలలను తిరిగి తెరవడానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. నాన్-కంటైనర్ జోన్లలో అక్టోబర్ 15 నుంచి దశలవారీగా పాఠశాలలను తిరిగి తెరవవచ్చని పేర్కొంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తుది నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలిపెట్టింది. కానీ ఇప్పటికీ భారత్‌లో కోవిడ్ విజృంభణ కొనసాగుతున్నందున చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపంచేందుకు సిద్ధంగా లేరు. దీంతో ఇప్పట్లో స్కూళ్లకు పూర్తి స్థాయి హాజరు ఉండకపోవచ్చు. -
ఏడాదిలో రెండు సార్లు బోర్డు పరీక్షలు
న్యూఢిల్లీ : కొత్త జాతీయ విద్యా విధానానికి (ఎన్ఈపీ–2020) కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇది గత 34 సంవత్సరాల నాటి జాతీయ విద్యా విధానం స్థానంలో రూపుదిద్దుకుంది. ఇందులో పాఠశాల విద్య నుంచి ఎంఫిల్ వరకు విద్యా విధానంలో సమూల మార్పులు చేశారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే విధంగా విధివిధానాలను మార్చారు. ఈ మార్పుల్లో అతి ముఖ్యమైనది పరీక్షలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులకు రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడం. దీనిపై విద్యాశాఖ మంత్రి రమేశ్ నిశాంక్ పోఖ్రియాల్ మాట్లాడుతూ.. 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలు సులభతరం చేసేందుకు సంవత్సరానికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. సంపూర్ణ అభ్యాసం విద్యార్థి సామర్థ్యాలను అంచనా వేయడం ప్రధానం కాబట్టి రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థి పోటీపడే సామర్థ్యాలను పరీక్షించడమే తాజా పరీక్షల ఉద్దేశం అంతేకానీ బట్టీపట్టి పరీక్షల్లో నెగ్గేలా నూతన పరీక్ష విధానం ఉండదని వివరించారు. (పాఠశాల, ఉన్నత విద్యలో భారీ సంస్కరణలు) విద్యార్థులపై ఫైనల్ పరీక్షల భారాన్ని తగ్గించేందుకు ఏడాదికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఫైనల్ పరీక్షల అత్యున్నత విద్యను అందించడం, భారత్‌ను నాలెడ్జ్ సూపర్ పవర్ గా తయారు చేయడం వంటి లక్ష్యాలతో ఈ నూతన విధానాన్ని రూపొందించారు. కొత్త జాతీయ విద్యా విధానంలో 18 సంవత్సరాల వరకు ఉచిత విద్యను అందించడం, అలాగే పూర్వ ప్రాథమిక విద్యపై దృష్టిపెడుతూ 10+2 విద్య స్థానంలో 5+3+3+4 సంవత్సరాల విద్యను తీసుకురానున్నారు. (సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలు రద్దు) -
మాధవన్ టెన్త్ మార్కులు తెలుసా!
మార్కులు అనేవి జీవిత ఆశయాలను వెనక్కి తగ్గించలేవంటూ విద్యార్థులకు హీరో ఆర్ మాధవన్ ట్విటర్ ద్వారా సందేశం ఇచ్చారు. బుధవారం సీబీఎస్సీ 10వ తరగతి ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాధవన్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. అలాగే తక్కువ మార్కులు వచ్చిన వారు నిరాశ చెందొద్దంటూ మ్యాడీ తన 10వ తరగతి మార్కులను ఈ సందర్భంగా వెల్లడించాడు. ‘సీబీఎస్సీ బోర్టు వెల్లడించిన ఫలితాలలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికి అభినందనలు. నాకు 10వ తరగతిలో 58 శాతం మార్కులు వచ్చాయి. తక్కువ మార్కులు వచ్చిన వారు నిరాశ చెందకండి. ఎందుకంటే ఆట అప్పుడే మొదలు కాలేదు మిత్రులారా’ అంటూ గురువారం ట్వీట్ చేశాడు. (చదవండి: చిత్రం పేరు మాత్రమే నిశ్శబ్దం..) To all those who just got their board results— congratulations to those who exceeded their expectations and aced it . 👌👌👍👍.. and to the rest I want to say I got 58% on my board exams.. The game has not even started yet my dear friends ❤️❤️🤪🤪🚀😆🙏🙏 pic.twitter.com/lLY7w2S63y — Ranganathan Madhavan (@ActorMadhavan) July 15, 2020 అది చూసిన నెటిజన్లు మాధవన్‌కు మద్దతునిస్తున్నారు. ‘జీవితంలో అద్భుతాలు చేయడానికి మీ పోస్టు ప్రేరణ’ ‘మార్కులు కేవలం సంఖ్యలు మాత్రమే... పెద్ద సంఖ్య భవిష్యత్తులో దేనికీ హామీ ఇవ్వదు, తక్కువ సంఖ్యతో జీవితం అంతం కాదు.. వీటిని కేవలం మార్కులు గానే చూడాలి. ఇవి కేవలం మార్కులే’ ‘మీరు జీవితంలో ఎదగాలంటే మార్కులు కాదు ముఖ్యం తెలివి, అణకువ, విలువలు, కష్టపడి పనిచేయడం ఉంటే జీవితంలో అంతకంటే ఎక్కువ మార్కులు సాధిస్తారు’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. (చదవండి: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల) -
సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలు రద్దు
న్యూఢిల్లీ: పెండింగ్‌లో ఉన్న సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) , ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్( ఐసీఎస్ఈ) 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను కోవిడ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పరీక్షలు గత షెడ్యూల్‌ప్రకారం జూలైలో జరగాల్సిఉంది. ఇంటర్నల్ పరీక్షల్లో విద్యార్థులు చూపించిన ప్రతిభ ఆధారంగా ఫైనల్ పరీక్షల్లో మార్కుల్ని నిర్ణయించి ఆగస్టులో ఫలితాలను ప్రకటిస్తారు. ఈ విషయాన్ని కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే సీబీఎస్ఈ పన్నెండో తరగతి విద్యార్థుల్లో ఆసక్తి కలిగిన వారికి ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తారు. పరీక్ష రాస్తారా, లేదంటే గత మూడు పరీక్షల్లో చూపించిన ప్రతిభ ఆధారంగా వచ్చిన సర్టిఫికెట్తో ముందుకు వెళతారా అన్నది వారి ఇష్టానికే వదిలిపెట్టారు. ఇలాంటి అవకాశం పదో తరగతి విద్యార్థులకులేదు. ఐసీఎస్ఈ 10, 12 తరగతి విద్యార్థులకు పరీక్ష రాసే అవకాశం ఇవ్వలేదు. ఈ విషయాన్ని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్, సంజీవ్‌ఖన్నాల సుప్రీంకోర్టు బెంచ్‌కు కేంద్రం, సీబీఎస్ఈ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలియజేశారు. జూలై 1–15 వరకు జరగాల్సిన మిగిలిన బోర్డు పరీక్షలన్నీ రద్దు చేసినట్టు సుప్రీంకు చెప్పారు. సీబీఎస్ఈ పన్నెండో తరగతి పరీక్షలు రాయాలని భావించే విద్యార్థు లకు కోవిడ్ పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షల్ని నిర్వహించవద్దంటూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీం విచారణ చేపట్టిన సందర్భంగా కేంద్రం అత్యున్నత న్యాయస్థానానికి ఈ విషయాన్ని తెలిపింది. తాజా నోటిఫికేషన్ ఇవ్వండి : సుప్రీం సీబీఎస్ఈ పన్నెండో తరగతి విద్యార్థులకు ఇచ్చిన పరీక్షల ఆప్షన్, గత పరీక్షల్లో చూపించిన ప్రతిభ ఆధారంగా మార్కులు ఏ విధంగా నిర్ణయిస్తారు ? , ఫలితాల తేదీ వంటివాటిపై కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి, సీబీఎస్ఈ బోర్డుకి ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండడం వల్ల పరీక్షల్ని ఎలా నిర్వహిస్తారో స్పష్టం చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు. ఈ నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేస్తామని సొలిసిటర్ జనరల్ కోర్టుకు చెప్పడంతో విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు. -
పరీక్షలు రద్దు చేసిన తమిళ సర్కార్
చెన్నై : పది, పదకొండో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు మంగళవారం తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఎలాంటి పరీక్షలు లేకుండానే వారిని పై తరగతులకు పంపిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు. అయితే జూన్ 15న పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలని ప్రభుత్వం కోరగా హైకోర్టు మొట్టికాయలు వేసింది. కరోనా కారణంగానే విద్యాసంస్థలు మూసివేస్తే పరీక్షలు ఎలా నిర్వహించగలరని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బోర్డు ఎగ్జామ్స్ పేరిట లక్షల మంది విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టివేయలేమని స్పష్టం చేసింది. వారి ప్రాణాలకు ప్రభుత్వం బాధ్యత వహించగలదా అంటూ సూటిగా ప్రశ్నించింది. అంతేకాకుండా పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు పరీక్షలు నిర్వహించడానికి వీల్లేదని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఆ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తమిళనాడు సర్కార్ ప్రకటించింది. (గతేడాది ఆగస్టులోనే కరోనా ఆనవాళ్లు) తమిళనాడులో ప్రతిరోజూ కేసుల సంఖ్య పెరుగుతున్నందున 10, 11వ తరగతి పరీక్షలను రద్దు చేయాల్సిందిగా తమిళనాడు హై అండ్ హయ్యర్ సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అసోసియేషన్ బోర్డుకు విన్నవించుకుంది. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం జూన్ 15 నుంచే పరీక్షలు ఉంటాయని ప్రకటించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టివేస్తుందని ఎంఎస్‌ఎంకే చీఫ్ వైకో అన్నారు. (ఉద్యోగాలు కల్పించండి : సుప్రీం ఆదేశం ) -
సీబీఎస్ఈ పరీక్షలకు 15 వేల కేంద్రాలు
న్యూఢిల్లీ: పెండింగ్‌లో ఉన్న సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షలను దేశవ్యాప్తంగా 15 వేల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వెల్లడించారు. కోవిడ్–19 కారణంగా వాయిదా పడిన ఈ పరీక్షలు జూలై 1 నుంచి 15 వరకు జరగనున్నాయి. గతంలో నిర్ణయించినట్టు మూడువేల కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా సామాజిక దూరాన్ని పాటించేందుకూ, విద్యార్థులు ఎక్కువ దూరం ప్రయాణించే అవసరం లేకుండా ఉండేందుకూ, అత్యధిక పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసినట్టు మంత్రి చెప్పారు. హోంశాఖ నిబంధనల ప్రకారం కోవిడ్–19 కంటైన్మెంట్ ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించరు. అలాగే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు రవాణా సదుపాయాలను కల్పించే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. 12వ తరగతి పరీక్షలు దేశవ్యాప్తంగాను, ఈశాన్య ఢిల్లీలో వాయిదా పడిన 10వ తరగతి పరీక్షలు ఇప్పుడు జరుగుతాయి. -
సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూలై 1 నుంచి 15 వరకు 12వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలకు ప్రతి ఒక్క విద్యార్థి మాస్క్ తప్పనిసరిగా ధరించాలని నిబంధన విధించారు. అలాగే సానిటైజర్స్‌తో రావాలని సీబీఎస్ఈ తెలిపింది. అనారోగ్యంగా ఉన్న విద్యార్థులను పరీక్షలకు అనుమతించరని ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశంలోని 3 వేల సీబీఎస్ఈ పాఠశాలలను మూల్యాంకన కేంద్రాలుగా ఎంపిక చేసినట్లు రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. దాదాపు 1.5 కోట్లకు పైగా జవాబు పత్రాలను ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయనున్నట్లు ఆయన తెలిపారు. కాగా లాక్డౌన్ కారణంగా షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన పరీక్షలు తొలుత వాయిదా పడ్డ విషయం తెలిసిందే. -
పెండింగ్‌లో ఉన్న పరీక్షలు నిర్వహిస్తాం
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా పెండింగ్‌లో పడిన 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను కచ్చితంగా నిర్వహిస్తామని సీబీఎస్ఈ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ సాన్యం భరద్వాజ్‌బుధవారం చెప్పారు. లాక్డౌన్ కంటే ముందు కొన్ని సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించారు. ఆయా జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశించడానికి వీలుగా అత్యంత ముఖ్యమైన 29 సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ సన్నద్ధమవుతోంది. ఇంకా 40కిపైగా సబ్జెక్టులు పెండింగ్‌లో ఉండగా, 29 సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. పెండింగ్ పరీక్షలు ఎప్పటినుంచి జరుగుతాయన్న దానిపై విద్యార్థులకు 10 రోజుల ముందే నోటీసు ఇస్తామని భరద్వాజ్ తెలిపారు. -
సీబీఎస్ఈ ‘పది’ విద్యార్థులకు బోర్డు పరీక్షలు
పూరీ / న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలను తిరిగి ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర మానవవనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. దీంతోపాటు ఐదు, ఏడవ తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులను పై తరగతులకు పంపబోమని వెల్లడించారు. మరో అవకాశం కల్పించిన తర్వాత కూడా ఉత్తీర్ణులు కాకపోతేనే తర్వాతి తరగతులకు పంపబోమని జవదేకర్ స్పష్టం చేశారు. బోర్డు పరీక్షల్లో భారీ పర్సంటేజీలు సాధించేందుకు, మొత్తం ఉత్తీర్ణతా శాతంలో ఏకరూపకత కోసం పది, ఇంటర్ విద్యార్థులకు అదనపు మార్కులు నిలిపివేయాలని సీబీఎస్ఈతో పాటు అన్ని రాష్ట్రాలకు మానవవనరుల శాఖ సూచించింది. గ్రేస్ మార్కులను మాత్రం కొనసాగించాలని ఉత్తర్వులు జారీచేసింది. -
సీబీఎస్ఈ పదో తరగతికి బోర్డు పరీక్షలు
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పదో తరగతి విద్యార్థులందరికీ 2018 నుంచి బోర్డు పరీక్షలు తప్పనిసరి కానున్నాయి. సంబంధిత ప్రతిపాదనను సీబీఎస్ఈ గవర్నింగ్ బోర్డు మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. 2017–18 విద్యా సంవత్సరం నుంచి ఈ పరీక్షలు నిర్వహించేందుకు బోర్డు సభ్యులందరూ అంగీకరించారని అధికార వర్గాలు చెప్పాయి. ప్రభుత్వం ఆమోదించగానే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం సీబీఎస్ఈ విద్యార్థులు బోర్డు పరీక్షలనో లేదా పాఠశాల ఆధారిత(స్కూల్ బేస్డ్) పరీక్షలనో ఎంపిక చేసుకుంటున్నారు. బోర్డు పరీక్షల్లో సాధించిన మార్కులకు 80 శాతం వెయిటేజీ, స్కూల్ బేస్డ్ పరీక్షల్లో సాధించిన మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇవ్వాలనే ప్రతిపాదనొకటి వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. అలాగే, ప్రస్తుతం 6 నుంచి 8వ తరగతులకు అమలుచేస్తున్న త్రిభాషా సూత్రాన్ని(హిందీ, ఇంగ్లిష్, ఒక భారతీయ భాషా బోధన) 9, 10వ తరగతులకు కూడా వర్తింపజేయాలని మావన వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. -
ఉచిత ట్యూషన్ల కోసం మొబైల్ యాప్
విద్యార్థులకు పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. అయినా కొన్ని సబ్జెక్టులలో అనుమానాలు తలెత్తుతూనే ఉంటాయి. కొందరికి ఫిజిక్స్‌లో అయితే మరికొందరికి కెమిస్ట్రీ, ఇంకొందరికి మ్యాథ్స్.. ఇలా రకరకాల అనుమానాలు తలెత్తుతుంటాయి. వాటికి అప్పటికప్పుడే నిపుణులతో సమాధానాలు చెప్పించేందుకు ఓ మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. బెంగళూరుకు చెందిన హాష్ ఎడ్యుకేషన్ అనే స్టార్టప్ కంపెనీ ఈ యాప్‌ను లాంచ్ చేసింది. గూగుల్ ప్లేస్టోర్‌లో ఉన్న ఈ యాప్ మార్చి 31 వరకు సైనప్ చేసుకున్న విద్యార్థులకు నెల రోజుల పాటు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఐఐటీలు, బిట్స్‌లో చదివిన నిపుణులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో వచ్చే అనుమానాలను తక్షణం నివృత్తి చేస్తారు. ప్రతి ఒక్క విద్యార్థికీ అత్యున్నత నాణ్యతతో కూడిన ప్రైవేటు ట్యూషన్లు అందించాలన్నదే తమ లక్ష్యమని, అందరూ భరించగలిగే స్థాయిలోనే దీన్ని అందిస్తామని హాష్లెర్న్ సంస్థ సీఈవో జయదేవ్ గోపాలకృష్ణన్ చెప్పారు. 8 నుంచి 12వ తరగతి వరకు ఉండే అన్ని బోర్డు పరీక్షలు, జాతీయ స్థాయి ప్రవేశపరీక్షలకు సంబంధించిన ప్రశ్నలకు ఇందులో సమాధానాలిస్తారు. ఏదైనా టాపిక్ గురించి అనుమానం ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఇమేజిని అప్లోడ్ చేయాలి. వెంటనే దానికి సంబంధించిన సబ్జెక్టు నిపుణుడు లైన్లోకి వస్తారు. ఆయన అనుమానాన్ని తీర్చిన తర్వాత ఆ ట్యూటర్కు రేటింగ్ కూడా విద్యార్థి ఇవ్వాలి. అలాగే, విద్యార్థులు ప్రాక్టీసు చేసుకోడానికి వీలుగా వేలాది ప్రాక్టీసు ప్రశ్నలను కూడా అందుబాటులో ఉంచామని హాష్లెర్న్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.