
ఖమ్మం: ఖమ్మంలో ఉంటూ కండక్టర్‌గా పనిచేసే ఎక్కిరాల దేవమణిని ఆమె భర్త రాంబాబు కుటుంబ కలహాల నేపథ్యంలో ఆదివారం రాత్రి రోకలిబండతో మోది చంపేశాడు. ప్రైవేటు కళాశాల హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న వీరి కుమారుడు ప్రణవ్‌తేజ్‌కు ఇది తెలిస్తే టెన్త్ తొలిరోజు పరీక్షకు హాజరు కాలేడని భావించిన బంధువులు.. విషయం చెప్పలేదు.
పరీక్ష పూర్తయ్యాక నేరుగా మార్చురీ వద్దకు తీసుకెళ్లి తల్లి మృతదేహాన్ని చూపించడంతో ఒక్కసారిగా ఖిన్నుడయ్యాడు. అంతకు కొద్దిక్షణాల ముందే పరీక్ష బాగా రాశానని తనకెదురైన తన తల్లి స్నేహితురాలికి నవ్వుతూ ప్రణవ్ బదులివ్వడాన్ని చూసి బంధువులు కంటతడి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment