
అకాల మరణాల వెనుక కారణాలు కూడా ఉంటాయని వైద్యులు..
క్రైమ్, ఖమ్మం: హఠాన్మరణాలు.. అందులో గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరోవైపు ఈ మరణాలపై వైద్య నిపుణులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. మరణించిన వాళ్లలో గుండె సంబంధిత సమస్యలూ ఉంటున్నాయని, వాటిని గుర్తించకపోవడం కూడా ఒక కారణమేనని చెబుతున్నారు. తాజాగా.. ఖమ్మంలో తొమ్మిదో క్లాస్ చదివే విద్యార్థి మరణం.. స్థానికంగా విషాదం నింపింది.
ఎన్‌ఎస్‌పీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు మాదాసి రాజేష్. బుధవారం స్కూల్‌కు వెళ్లిన రాజేష్ ఆకస్మాత్తుగా కళ్లు తిరిగి కిందపడిపోయాడు. తోటి విద్యార్థులు అది గమనించి టీచర్లకు చెప్పడంతో.. వాళ్లు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రాజేష్ మరణించాడని, రాజేష్ మృతికి గుండెపోటు కారణమని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది.
రాజేష్‌కు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఉంది. పైగా గత కొద్దిరోజులుగా నీరసంగా కూడా ఉంటున్నాడు. మూడు రోజుల నుంచి సరిగ్గా బడికి వెళ్లలేదు. అయితే.. బుధవారం స్కూల్‌లో విద్యార్థులకు అవగాహనా సినిమా ప్రదర్శించాడు. అందుకోసం వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో.. బడికి వెళ్లిన కాసేపటికే సొమ్మసిల్లి పడిపోయి కన్నుమూశాడు. ఈ ఘటనతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.
ఇదీ చదవండి: తమ్ముడి పెద్దకర్మ ఆ అన్నకి ఆఖరిరోజు!