heart hole
-
భారత స్టార్ క్రికెటర్ గుండెలో రంధ్రం.. సర్జరీ తర్వాత ఇలా..
అండర్-19 ప్రపంచకప్-2022 గెలిచిన భారత కెప్టెన్ యశ్ ధుల్ గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఈ ఏడాది అట్టహాసంగా ఆరంభించిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్(డీపీఎల్)లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌కు సారథిగా ఎంపికైన అతడు పూర్తిగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్సీని జాంటీ సిద్ధుకు అప్పగించిన యశ్ ధుల్.. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతున్నాడు.బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకున్నా ఫలితం లేకపోవడంతో ఓ మ్యాచ్‌కు దూరమయ్యాడు కూడా!.. ఇప్పటివరకు డీపీఎల్‌లో ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 93 పరుగులే చేయగలిగాడు యశ్ ధుల్. ఈ నేపథ్యంలో కామెంటేటర్లు, విశ్లేషకులు ఈ 21 ఏళ్ల బ్యాటర్ ప్రదర్శనపై విమర్శలు గుప్పిస్తున్నారు.క్రికెటర్ గుండెలో రంధ్రం.. ఇటీవలే సర్జరీఈ క్రమంలో యశ్ ధుల్ తన అనారోగ్యానికి సంబంధించిన షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. యశ్ ధుల్‌కు బాల్యం నుంచే గుండెలో రంధ్రం ఉందని.. ఇటీవలే ఇందుకు సంబంధించిన సర్జరీ ఒకటి జరిగిందని అతడి తండ్రి విజయ్ న్యూస్18తో అన్నారు. కొన్నాళ్ల క్రితం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందినపుడు అక్కడి నిపుణులు యశ్ ధుల్ సమస్యను గుర్తించి.. శస్త్ర చికిత్స చేయించుకోవాలని సూచించినట్లు తెలిపారు.అందుకే ఆడలేదుఈ క్రమంలో ఢిల్లీలో సర్జరీ చేయించామని.. బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తోందని విజయ్ వెల్లడించారు. ఇక ఇటీవల యశ్ ధుల్‌కు ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా జారీ చేశారని అతడి కోచ్ ప్రదీప్ కొచ్చర్ తెలిపారు. అయితే, ఎండ, ఆర్ద్రత ఎక్కువగా ఉన్న సమయంలో యశ్ ధుల్ విశ్రాంతి తీసుకుంటున్నాడని.. అందుకే కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడన్నారు. రంజీ ట్రోఫీ ఆడే క్రమంలో ఇప్పటి నుంచే ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.సానుకూల దృక్పథంతో ఉన్నాఇక ఈస్ట్ ఢిల్లీ రైడర్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొని కేవలం ఎనిమిది పరుగులే చేసిన అనంతరం ధుల్ మాట్లాడుతూ.. ‘‘గత కొన్ని రోజులుగా అనుకోని సంఘటనలు జరిగాయి. ఇప్పుడిప్పుడే నేను కోలుకుంటున్నాను. త్వరలోనే పూర్తిస్థాయిలో రాణిస్తాననే సానుకూల దృక్పథంతో ఉన్నాను. వంద శాతం ఎఫర్ట్ పెట్టి ఆడతా’’ అని పేర్కొన్నాడు. కాగా ఇటీవల ప్రకటించిన దులిప్ ట్రోఫీ-2024 రెడ్ బాల్ టోర్నీలో యశ్ ధుల్‌కు చోటు దక్కలేదు. ఇక ఐపీఎల్-2023లో యశ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ -
ఖమ్మం: గుండెపోటుతో 9వ తరగతి విద్యార్థి మృతి
క్రైమ్, ఖమ్మం: హఠాన్మరణాలు.. అందులో గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరోవైపు ఈ మరణాలపై వైద్య నిపుణులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. మరణించిన వాళ్లలో గుండె సంబంధిత సమస్యలూ ఉంటున్నాయని, వాటిని గుర్తించకపోవడం కూడా ఒక కారణమేనని చెబుతున్నారు. తాజాగా.. ఖమ్మంలో తొమ్మిదో క్లాస్ చదివే విద్యార్థి మరణం.. స్థానికంగా విషాదం నింపింది. ఎన్ఎస్పీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు మాదాసి రాజేష్. బుధవారం స్కూల్‌కు వెళ్లిన రాజేష్ ఆకస్మాత్తుగా కళ్లు తిరిగి కిందపడిపోయాడు. తోటి విద్యార్థులు అది గమనించి టీచర్లకు చెప్పడంతో.. వాళ్లు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రాజేష్ మరణించాడని, రాజేష్ మృతికి గుండెపోటు కారణమని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది. రాజేష్‌కు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఉంది. పైగా గత కొద్దిరోజులుగా నీరసంగా కూడా ఉంటున్నాడు. మూడు రోజుల నుంచి సరిగ్గా బడికి వెళ్లలేదు. అయితే.. బుధవారం స్కూల్లో విద్యార్థులకు అవగాహనా సినిమా ప్రదర్శించాడు. అందుకోసం వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో.. బడికి వెళ్లిన కాసేపటికే సొమ్మసిల్లి పడిపోయి కన్నుమూశాడు. ఈ ఘటనతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఇదీ చదవండి: తమ్ముడి పెద్దకర్మ ఆ అన్నకి ఆఖరిరోజు! -
బిపాసా కూతురికి గుండెల్లో రంధ్రాలు..శిశువులకు ఎందుకొస్తుంది..?
పుట్టుకతో గుండె లోపం గురించి విని ఉంటాం. ఇటీవల కాలంలో ఇది ఎక్కువగా వినిపిస్తుంది. మునపటి రోజుల్లో ఎక్కడో గానీ కనిపించేది కాదు. అదీగాక పోషకాహార లోపం కారణంగా వచ్చేదని భావించేవారు. కానీ ఇప్పుడూ స్టార్ హోదాలో చెలామణి అవుతున్న సినీతారల పిల్లలు కూడా ఈ వ్యాధిని బారినపడటం ఒకింత బాధకరం, ఆశ్చర్యం కలిగించే అంశం ఇది. ఇటీవల సినీ తార బిపాషా సైతం తన కూతురు గుండెల్లో రంధ్రాలు ఉన్నాయని సోషల్ మీడియా వేదిక వెల్లడించింది. పుట్టిన మూడు నెలల వయసులోనే చికిత్స చేయించినట్లు తెలిపింది. అలాగే మన టాలీవుడ్ హిరో మహేష్ బాబు కూడా హృద్రోగంతో బాధపడే చిన్నారులకు తన ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా వైద్యం చేయించి తన గొప్ప మనసును చాటుకున్న సంగతి తెలిసిందే. ఆయన కూడా ఒక సందర్భంలో తన కొడుకు కూడా పుట్టిన వెంటనే ఇలాంటి సమస్యతో బాధపడ్డాడని చెప్పిన సంగతి తెలిసిందే. పుట్టుకతో గుండెలోపం స్టార్ పిల్లలు దగ్గర నుంచి కామన్ మ్యాన్ పిల్లలు వరకు అందరూ ఫేస్ చేస్తున్న సమస్య. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు పుట్టుకతోనే చిన్నారుల్లో గుండె సమస్యల బారినపడుతున్నారు. ఎందువల్ల వస్తుంది ఎలా గుర్తించగలరు అనేదాని గురించే ఈ కథనం!. పుట్టుకతో వచ్చే గుండె సమస్యను వైద్య పరిభాషలో 'వెంట్రిక్యులర్ సెప్ట్ డిఫెక్ట్(వీఎస్డీ)'గా పిలుస్తారు. దీనివల్ల పుట్టినప్పుడే గుండెల్లో రంధ్రాలతో శిశువులు జన్మించడం జరుగుతుంది. కొందరూ చిన్నారులకు పెద్ద అవ్వడంతో పూడుకుపోయే అవకాశాలు ఉంటాయి. మరి కొందరికి ఆ ఛాన్స్ తక్కువగా ఉండటమే గాక పిల్లలు కూడా సమస్యను గట్టిగా ఫేస్ చేస్తుంటారు. ఇది సాధారణంగా బిడ్డ పుట్టిన మొదట కొన్ని రోజులు, వారాలు లేదా నెలలో ఈ సమస్య బయటపడుతుంది. గుండెల్లో ఏర్పడిన రంధ్ర పరిమాణాన్ని బట్టి లక్షణాలు వేరుగా ఉంటాయి. ఈ సమస్యతో ఉన్న చిన్నారుల్లో కనిపించే లక్షణాలు సరిగా తినలేకపోవడం శారీరక ఎదుగుదల సక్రమంగా లేకపోవడం వేగంగా శ్వాస తీసుకోవడం లేదా శ్వాస ఆడకపోవడం త్వరితగతిన అలసిపోవడం స్టెతస్కోప్‌తో హృదయాన్ని వింటున్నప్పుడు హూషింగ్ శబ్దం తదితర లక్షణాలు శిశువుల్లో కనిపిస్తాయి. ఎందువల్ల వస్తుందంటే.. గర్భధారణ సమయంలో శిశువు గుండె ఏర్పడినప్పుడే ఈ సమస్య వస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. గుండె ఎడమ, కుడివైపు వేరుచేసే కండరాల గోడ పూర్తిగాఏర్పడకపోవడంతో ఈ రంధ్రాలు ఏర్పడతాయి. రంధ్రాల పరిమాణం కూడా వేరుగా ఉంటుంది. ఇకి ఇది ఎందువల్ల వస్తుందనేదిచెప్పలేం అన్నారు వైద్యులు. ఇందుకు జన్యులోపం, పర్యావరణ కారకాలు రెండు కావొచ్చని చెబుతున్నారు. చాలామంది శిశువులకు ప్రధానంగా పుట్టకతోనే గుండెల్లో రంధ్రాలు లేదా ఇతర హృద్రోగ సమస్యలకు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అందువల్ల గర్భంతో ఉన్న మహిళలో మొదటి మూడు నుంచి ఆరు నెలలు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండక పౌష్టికరమైన ఆహారం తీసుకుంటే ఇలాంటి సమస్య ఎదురవ్వదు. శిశువు అవయవాలు ఏర్పడే క్రమంలో వీలైనంత మంచి ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యం. (చదవండి: గర్భధారణ సమయంలో గుండెల్లో వచ్చే మంట ప్రమాదమా..?) -
అయ్యో.. చిన్నారికి ఎంత కష్టం..
సాక్షి, తిరుమలాయపాలెం(ఖమ్మం): అమ్మ పొత్తిళ్లలో హాయిగా ఉండాల్సిన ఈ పిల్లాడు ఆస్పత్రి బెడ్డుపై బిక్కుబిక్కుమంటున్నాడు. గుండెకు రంధ్రం పడి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న బిడ్డడిని చూస్తూ పేద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మేడిదపల్లి గ్రామానికి చెందిన బందారపు లింగేశ్వర్, శైలజ దంపతుల ఎనిమిది నెలల బాబు మోక్షిత్ గుండె సమస్యతో బాధపడుతున్నాడు. నాలుగు నెలల కిందట శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించారు. పుట్టుకతోనే హృదయానికి రంధ్రం ఉందని అక్కడి వైద్యులు గుర్తించారు. హైదరాబాద్‌లోని కార్పొరేట్ హాస్పిటల్‌కు సిఫారసు చేయగా..పరీక్షించిన పెద్ద డాక్టర్లు ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, రూ.12 లక్షలు ఖర్చవుతాయని తెలిపారు. ఉన్నత చదువు చదివినా ఉద్యోగం రాకపోవడంతో పెయింటింగ్ వర్కర్‌గా పనిచేస్తూ జీవిస్తున్న లింగేశ్వర్.. ఇప్పటి దాకా రూ.3 లక్షలు అప్పుచేసి వైద్యం చేయించాడు. ఆరోగ్యం క్షీణిస్తున్న బిడ్డడిని చూస్తూ.. చేతిలో డబ్బులు లేక కుమిలిపోతున్న ఆ అమ్మానాన్నల హృదయ వేదన అంతాఇంతా కాదు. దాతలు సాయం చేయాలి.. వైద్య సౌకర్యం ఉన్న ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ పరిధిలో లేకపోవడంతో మొత్తం డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని చిన్నారి తల్లిదండ్రులు అంటున్నారు. పనిచేస్తేనే ఇల్లు గడుస్తుందని, తమ బిడ్డ మోక్షిత్ ఆపరేషన్‌కు దాతలు సాయం చేయాలని లింగేశ్వర్, శైలజ కోరుతున్నారు. దయార్థ్ర హృదయులు స్పందించాలని వేడుకుంటున్నారు. సెల్ నంబర్ 8179913499కు కాల్ చేసి కానీ, ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా కానీ..ఆర్థిక సాయం చేసి, ఆపరేషన్‌కు చేయూతనివ్వాలని వేడుకుంటున్నారు. -
పసికందుకు పునర్జన్మ
చైతన్యపురి: ఆ పసికందు బరువు 2.5 కేజీలు. పుట్టుకతోనే శ్వాసకోశ, గుండె సంబంధిత ఇబ్బందులు. గుండెలో రంధ్రం ఉండటంతో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఆపరేషన్ చేసేందుకు సహకరించని వయసు, పసికందు బరువు. దీంతో పారమిత ఆస్పత్రి యాజమాన్యం, వైద్యబృందం, హీల్ ఎ చైల్డ్ స్వచ్ఛంద సంస్థ చొరవతో ప్రత్యేక చికిత్స చేశారు. గుండె రంధ్రాన్ని ప్రత్యేక పరికరంతో కోనార్ డివైజ్ అమర్చి విజయవంతంగా ఆపరేషన్ చేశారు. గురువారం చైతన్యపురిలోని పారమిత ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యం బృందం మాట్లాడుతూ..తక్కువ వయసుఉన్న పసికందు (21 రోజులు)కు ఇటువంటి ఆపరేషన్ చేయటం ప్రపంచంలోనే మొదటిసారి అని తెలిపారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ సతీష్, శోభ దంపతులకు జన్మించిన కుమారుడు పుట్టుకతోనే నిమోనియాతో శ్వాస సంబంధిత ఇబ్బందులు రావటంతో నగరంలోని పారమిత చిల్డ్రన్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు బాబుకు గుండెలో రంధ్రం ఉన్నట్లు గుర్తించారు. వెంటిలేటర్ ఏర్పాటు చేసి చికిత్స మొదలుపెట్టారు. శిశువుకు పరీక్షలు చేసిన చిన్నపిల్లల నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ ముర్కి, డాక్టర్ శ్రీరాంలు ఆపరేష్ తప్పనిసరి అని నిర్ధారించారు. పారమిత ఆస్పత్రి ఎండీ డాక్టర్ ధనరాజ్, మెడికల్ డైరెక్టర్ సతీష్‌లు కేసును చాలెంజ్‌గా తీసుకుని రెయిన్బో కార్డియాక్ సెంటర్‌కు చెందిన పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్‌ను సంప్రదించారు. ఆపరేషన్ చేసేందుకు ముందుకు వచ్చారు. కోనార్ డివైజ్ బటన్‌ను అమర్చి గుండెకు ఉన్న రంధ్రాన్ని మూసేందుకు సమ్మతించా రు. అనారోగ్య పిల్లలకు ఆర్థిక సహాయం చేసే స్వచ్ఛంద సంస్థ, పారమిత ఆస్పత్రి వర్గాల ఆర్థిక సహకారంతో డాక్టర్ నాగేశ్వర్, శ్వేత బృందం 21 రోజుల పసికందుకు విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత శిశువు పూర్తిగా కోలుకుందని, సొంతంగా ఊపిరి తీసుకుంటోందని, గుండెపనితీరు కూడా బాగుందని వైద్యులు తెలిపారు. ప్రపంచంలోనే 21 రోజుల పసికందుకు గుండె ఆపరేషన్ చేయటం మొదటిసారి అని పేర్కొన్నారు. తమ బాబుకు గుండె రంధ్రానికి ఆపరేషన్ చేసి పునర్జన్మ ప్రసాదించారని తల్లిదండ్రులు సతీష్, శోభలు తెలిపారు. పారమిత ఆస్పత్రి వైద్యులు, యాజమాన్యం, హీల్ ఏ చైల్డ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డాక్టర్ ప్రమోద్, ఆపరేషన్ చేసిన డాక్టర్లు నాగేశ్వరరావు, శ్వేతలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
కన్నపేగుకు ఎంతకష్టం
* ఉన్నదంతా అమ్మినా నయకాని రోగం * ఆపన్న హస్తం కోసం ఎదిరుచూపులు పేదరికం వారి పాలిట శాపమైంది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబాలు కన్నపేగు బాగు కోసం ఉన్నదంతా ఊడ్చి పెట్టారు. అరుునా మాయదారి జబ్బు నయం కాలేదు. చివరకు చేతిలో చిల్లి గవ్వలేక వైద్యం చేయించడానికి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు ముందుకొస్తే బిడ్డల ప్రాణాలు నిలుస్తాయని ఆ కన్నతల్లిదండ్రులు వేడుకుంటున్నారు. - ధర్మపురి/హుజూరాబాద్ టౌన్ మెదడు సంబంధ వ్యాధిలో బాలుడు ధర్మపురి మండలం ఆరెపెల్లి గ్రామానికి చెందిన ఆరెల్లి కిష్టయ్య-మమత దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు సంతానం. భర్త ముంబాయిలో ఒకరి ఇంట్లో పనిమనిషిగా చేస్తుం డగా భార్య కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని నెట్టుకువస్తోంది. చిన్నకుమారుడు రక్షిత్(5) పుటిన మూడేళ్ల వరకు ఆడుతూ పాడుతూ తల్లి గోరుముద్దలు తిన్నాడు. రెండు సంవత్సరాల క్రితం ఒక్కసారి ఫిట్స్‌తో రక్షిత్ పడిపోయాడు. తల్లిదండ్రులు స్థానిక ఆర్ఎంపీ వద్ద వైద్యం చేరుుంచి కొన్ని రోజులకు ధర్మపురిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించి మందులు వాడుతున్నారు. ఒక్కసారి వచ్చిన ఫిట్స్ వారంలో మూడు సార్లు వస్తూ ఉండడంతో స్థానిక వైద్యుల సూచన మెరకు జగిత్యాల, కరీంనగర్ పట్టణాల్లో వైద్యం చేయించారు. అప్పటికే రూ.మూడు లక్షల వరకు ఖర్చయ్యూరుు. ఉన్న ఎకురుం పొలం అమ్మెశారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఫిట్స్ కాదు మెదడులో రక్తప్రసరణ లేక తరుచుగా ఇలా జరుగుతోందని చెప్పారు. ఆ తర్వాత ఒకసారి ఫిట్స్‌తో కిందపడిపోగా కోమాలోకి వెళ్లి 15 రోజులు మూసిన కన్ను తెరువలేదు. హైదరాబాద్ తీసుకెళ్లమని డాక్టర్లు చెప్పడంతో ఉన్న ఇల్లు సైతం అమ్మెసి బయట కొంత అప్పుచేసి చికిత్స చేరుుంచారు. సుమారు రూ.8 లక్షల వరకు ఖర్చరుుందని, చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇంటికి చేరినట్లు మమత తెలిపింది. గత సంవత్సరం చీఫ్‌విప్ చొరవతో సీఎం రిలీఫ్ ఫండు ద్వారా రూ.48వేలు రాగా అవి ఆస్పత్రిలో ఉన్నపుడు వారంరోజుల మందులకు సరిపోలేదని చెపింది. ప్రస్తుతం రోజువారీ మందులకు ఇబ్బందవుతోందని, ఇటీవల మందులు వాడకపోవడంతో రక్షిత్ కిందపడిపోరుు తలకు, చేతికి తీవ్రగాయాలయ్యాయని కన్నీటి పర్యంతమైంది. కొడుక్కి వైద్యం కొనసాగించడానికి ఆపన్నహస్తం కోసం ఆ కన్నతల్లి ఎదురుచూస్తోంది. సహాయం చేయూలనుకునే దాతలు 94408 43740 నంబర్లో సంప్రదించవచ్చు. చిన్నారి గుండెకు రంధ్రం హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామానికి చెందిన మన్యాల తిరుపతి, స్వప్న దంపతుల కూతురు జ్ఞానప్రసన్న(9) జన్మించిన కొన్ని నెలలకే అస్వస్థకు గురవుతుండటంతో తల్లిదండ్రులు కరీంనగర్‌లోని పిల్లల ఆస్పత్రిలో చూపించారు. పరీక్షించిన వైద్యులు బాలిక గుండెకు రంధ్రం ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా పాపకు చెడు, మంచి రక్తం రెండూ కలుస్తున్నాయని నిర్ధారించి వైద్యానికి భారీగా ఖర్చువుతుందని చెప్పారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ దంపతులకు ఏమి చేయూలో తోచలేదు. కూలీపనికి వెళితేనే కుటుంబం గడవని పరిస్థితి. అయినా చివరకు ధైర్యం చేసి కూతురును కాపాడుకోవాలనే తపనతో వైద్యం చేయించడానికి బంధువులు, మిత్రుల వద్ద అప్పుచేశారు. కరీంనగర్, గోదావరిఖనితోపాటు హైదరాబాద్‌లో ఆస్పత్రులు తిరిగారు. అప్పటికే సుమారు రూ.లక్షా 50 వేలు ఖర్చయ్యాయి. చిన్నారని పరిక్షించిన వైద్యులు ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామని చెప్పినటప్పటికీ మందులు, స్కానింగ్‌లు, ఇతర పరీక్షలకు మరో రూ.2లక్షల వరకు అదనంగా ఖర్చవుతుందని చెప్పారు. దీంతో ఏమి చేయూలో తోచని స్థితిలో ఆ దంపతులు కొట్టుమిట్టాడుతున్నారు. వైద్యానికి సాయంమందికి కూతురును కాపాడాలని దాతలను వేడుకుంటున్నారు. సహయం చేయదలిచిన వారు 94407 22283 నంబర్‌కు సంప్రదించాలి.