* ఉన్నదంతా అమ్మినా నయకాని రోగం
* ఆపన్న హస్తం కోసం ఎదిరుచూపులు
పేదరికం వారి పాలిట శాపమైంది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబాలు కన్నపేగు బాగు కోసం ఉన్నదంతా ఊడ్చి పెట్టారు. అరుునా మాయదారి జబ్బు నయం కాలేదు. చివరకు చేతిలో చిల్లి గవ్వలేక వైద్యం చేయించడానికి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు ముందుకొస్తే బిడ్డల ప్రాణాలు నిలుస్తాయని ఆ కన్నతల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
- ధర్మపురి/హుజూరాబాద్ టౌన్
మెదడు సంబంధ వ్యాధిలో బాలుడు
ధర్మపురి మండలం ఆరెపెల్లి గ్రామానికి చెందిన ఆరెల్లి కిష్టయ్య-మమత దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు సంతానం. భర్త ముంబాయిలో ఒకరి ఇంట్లో పనిమనిషిగా చేస్తుం డగా భార్య కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని నెట్టుకువస్తోంది. చిన్నకుమారుడు రక్షిత్(5) పుటిన మూడేళ్ల వరకు ఆడుతూ పాడుతూ తల్లి గోరుముద్దలు తిన్నాడు. రెండు సంవత్సరాల క్రితం ఒక్కసారి ఫిట్స్‌తో రక్షిత్ పడిపోయాడు. తల్లిదండ్రులు స్థానిక ఆర్‌ఎంపీ వద్ద వైద్యం చేరుుంచి కొన్ని రోజులకు ధర్మపురిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించి మందులు వాడుతున్నారు. ఒక్కసారి వచ్చిన ఫిట్స్ వారంలో మూడు సార్లు వస్తూ ఉండడంతో స్థానిక వైద్యుల సూచన మెరకు జగిత్యాల, కరీంనగర్ పట్టణాల్లో వైద్యం చేయించారు. అప్పటికే రూ.మూడు లక్షల వరకు ఖర్చయ్యూరుు. ఉన్న ఎకురుం పొలం అమ్మెశారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఫిట్స్ కాదు మెదడులో రక్తప్రసరణ లేక తరుచుగా ఇలా జరుగుతోందని చెప్పారు. ఆ తర్వాత ఒకసారి ఫిట్స్‌తో కిందపడిపోగా కోమాలోకి వెళ్లి 15 రోజులు మూసిన కన్ను తెరువలేదు. హైదరాబాద్ తీసుకెళ్లమని డాక్టర్లు చెప్పడంతో ఉన్న ఇల్లు సైతం అమ్మెసి బయట కొంత అప్పుచేసి చికిత్స చేరుుంచారు.
సుమారు రూ.8 లక్షల వరకు ఖర్చరుుందని, చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇంటికి చేరినట్లు మమత తెలిపింది. గత సంవత్సరం చీఫ్‌విప్ చొరవతో సీఎం రిలీఫ్ ఫండు ద్వారా రూ.48వేలు రాగా అవి ఆస్పత్రిలో ఉన్నపుడు వారంరోజుల మందులకు సరిపోలేదని చెపింది. ప్రస్తుతం రోజువారీ మందులకు ఇబ్బందవుతోందని, ఇటీవల మందులు వాడకపోవడంతో రక్షిత్ కిందపడిపోరుు తలకు, చేతికి తీవ్రగాయాలయ్యాయని కన్నీటి పర్యంతమైంది. కొడుక్కి వైద్యం కొనసాగించడానికి ఆపన్నహస్తం కోసం ఆ కన్నతల్లి ఎదురుచూస్తోంది. సహాయం చేయూలనుకునే దాతలు 94408 43740 నంబర్‌లో సంప్రదించవచ్చు.
చిన్నారి గుండెకు రంధ్రం
హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామానికి చెందిన మన్యాల తిరుపతి, స్వప్న దంపతుల కూతురు జ్ఞానప్రసన్న(9) జన్మించిన కొన్ని నెలలకే అస్వస్థకు గురవుతుండటంతో తల్లిదండ్రులు కరీంనగర్‌లోని పిల్లల ఆస్పత్రిలో చూపించారు. పరీక్షించిన వైద్యులు బాలిక గుండెకు రంధ్రం ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా పాపకు చెడు, మంచి రక్తం రెండూ కలుస్తున్నాయని నిర్ధారించి వైద్యానికి భారీగా ఖర్చువుతుందని చెప్పారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ దంపతులకు ఏమి చేయూలో తోచలేదు. కూలీపనికి వెళితేనే కుటుంబం గడవని పరిస్థితి.
అయినా చివరకు ధైర్యం చేసి కూతురును కాపాడుకోవాలనే తపనతో వైద్యం చేయించడానికి బంధువులు, మిత్రుల వద్ద అప్పుచేశారు. కరీంనగర్, గోదావరిఖనితోపాటు హైదరాబాద్‌లో ఆస్పత్రులు తిరిగారు. అప్పటికే సుమారు రూ.లక్షా 50 వేలు ఖర్చయ్యాయి. చిన్నారని పరిక్షించిన వైద్యులు ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామని చెప్పినటప్పటికీ మందులు, స్కానింగ్‌లు, ఇతర పరీక్షలకు మరో రూ.2లక్షల వరకు అదనంగా ఖర్చవుతుందని చెప్పారు. దీంతో ఏమి చేయూలో తోచని స్థితిలో ఆ దంపతులు కొట్టుమిట్టాడుతున్నారు. వైద్యానికి సాయంమందికి కూతురును కాపాడాలని దాతలను వేడుకుంటున్నారు. సహయం చేయదలిచిన వారు 94407 22283 నంబర్‌కు సంప్రదించాలి.
కన్నపేగుకు ఎంతకష్టం
Published Sun, Aug 2 2015 10:05 AM | Last Updated on Sun, Sep 3 2017 6:39 AM
Advertisement
Advertisement