poor familes
-
కాకినాడ జిల్లా పర్యటనలో పలువురికి ఆర్థిక సాయం అందజేసిన సీఎం జగన్
-
ఉచిత రేషన్ మరో ఐదేళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపించిన వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 81.35 కోట్ల మంది పేదలకు నెలకు 5 కిలోల మేరకు ఉచిత రేషన్ అందిస్తున్న ఆహార ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై)ను మరో ఐదేళ్లు పొడిగించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా 15 వేల మహిళా స్వయం సహాయ బృందాలకు డ్రోన్లు అందజేయాలని కూడా నిర్ణయించారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తాలూకు ప్రయోజనాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడమే దీని లక్ష్యమని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ పథకాన్ని రెండేళ్ల పాటు కొనసాగిస్తాం. మహిళా సంఘాలకు డ్రోన్ల కొనుగోలు వ్యయంలో 80 శాతం దాకా ఆర్థిక సాయం అందిస్తాం. ఇందుకు ఏటా రూ.1,261 కోట్లు కేటాయిస్తున్నాం. మిగతా మొత్తాన్ని రుణంగా తీసుకునే అవకాశం కలి్పస్తాం. ఈ డ్రోన్లను వ్యవసాయ సేవల నిమిత్తం రైతులకు మహిళా సంఘాలు అద్దెకిస్తాయి. తద్వారా ఒక్కో సంఘం ఏటా కనీసం రూ.లక్షకు పైగా ఆదాయం పొందవచ్చు’’ అని వివరించారు. మహిళా సంఘాలకు డ్రోన్లు అందజేస్తామని ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించడం తెలిసిందే. ఇక పీఎంజీకేఏవైను మరో ఐదేళ్లు కొనసాగించేందుకు రూ.11.8 లక్షల కోట్లు అవసరమని మంత్రి వివరించారు. కరోనా నేపథ్యంలో 2020లో కేంద్రం ఈ పథకాన్ని మొదలు పెట్టడం తెలిసిందే. 2026 నుంచి ఐదేళ్ల పాటు కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ శాతం తదితరాలపై సలహాలు, సూచనలకు ఏర్పాటు చేయనున్న 16వ ఆర్థిక సంఘం తాలూకు విధి విధానాలకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కమిషన్ 2025 అక్టోబర్ అంతానికల్లా నివేదిక సమరి్పంచాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి జనజాతీ ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌కు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 10.45 కోట్లు గిరిజన జనాభా ఉంది. అందులో 18 రాష్ట్రాలు, అండమాన్ నికోబార్‌లోని 75 గిరిజన సమూహాలను ప్రమాదంలో ఉన్నవిగా గుర్తించారు. దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల కోసం కేంద్ర ప్రాయోజిత పథకాన్ని మూడేళ్లు కొనసాగించేందుకు కూడా కేబినెట్ నిర్ణయించింది. -
2014కు ముందు సర్వం అవినీత, కుంభకోణాలమయం
భోపాల్: దేశంలో 2014కు ముందు మొత్తం అవినీతి, కుంభకోణాలే రాజ్యమేలాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పేద ప్రజల హక్కులను, సంపదను విచ్చలవిడిగా దోచుకున్నారని మండిపడ్డారు. పేదల కోసం ప్రభుత్వం కేటాయించిన సొమ్ము వారికి చేరకుండా మధ్యలోనే లూటీ చేశారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ అరాచకానికి తెరపడిందని, ఇప్పుడు ప్రతి పైసా నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లోకే పంపిస్తున్నామని ఉద్ఘాటించారు. నీతి ఆయోగ్ నివేదికను ఆయన ప్రస్తావించారు. గత ఐదేళ్లలో ఏకంగా 13.50 కోట్ల మంది భారతీయులు దారిద్య్ర రేఖ దిగువ(పీబీఎల్) కేటగిరీ నుంచి బయటపడ్డారంటూ నీతి ఆయోగ్ ప్రకటించిందని గుర్తుచేశారు. దేశంలో పన్నులు చెల్లించేవారి సంఖ్య భారీగా పెరిగిందని అన్నారు. పన్నుల సొమ్మును మంచి పనుల కోసం, దేశ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్న నమ్మకం వారిలో కనిపిస్తోందని చెప్పారు. సోమవారం మధ్యప్రదేశ్‌లో కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమంలో ప్రధాని వర్చువల్‌గా ప్రసంగించారు. భోపాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ‘అమృతకాలంలో’ తొలి సంవత్సరం నుంచే సానుకూల వార్తలు రావడం ఆరంభమైందని, దేశంలో సంపద వృద్ధి చెందుతోందని, పేదరికం తగ్గిపోతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్(ఐటీఆర్)లు దాఖలు చేసే వారి సగటు వార్షికాదాయం ఆదాయం 2014లో రూ.4 లక్షలు ఉండేదని, ఇప్పుడు అది రూ.13 లక్షలకు చేరిందని వెల్లడించారు. ప్రజలు దిగువ ఆదాయ వర్గం నుంచి ఎగువ ఆదాయ వర్గంలోకి చేరుకుంటున్నారని మోదీ తెలిపారు. దేశమంతటా సానుకూల వాతావరణం దేశంలో దాదాపు అన్ని రంగాలు బలోపేతం అవుతున్నాయని, అదే స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, నూతన ఉద్యోగాల సృష్టి జరుగుతోందని ప్రధాని చెప్పారు. 2014లో మన దేశం ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని, ఇప్పుడు ఐదో ఆర్థిక వ్యవస్థగా మారిందని చెప్పారు. కొత్తగా నియమితులైన 5,580 మంది ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ఇచి్చంది. -
పేదలకు శరవేగంగా ఇళ్లు కట్టి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం
-
పేదలందరికీ ఇళ్ల పథకంతో సొంతింటి కల సాకారం
-
గత ప్రభుత్వ పాలకులు ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన చేశారా?: సీఎం వైఎస్ జగన్
-
చంద్రబాబు, ఎల్లో మీడియాకు మా తడాఖా ఏంటో చూపిస్తాం..
-
పేదలపై పచ్చి విషం కక్కుతున్న బాబు అండ్ కో
-
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
-
బిగ్ క్వశ్చన్: గూడులేని నిరుపేదల జీవితాల్లో సొంతింటి వెలుగులు
-
వెన్ను తడితే.. బంగారు భవితే!
ప్రతిభకు పేదరికం అడ్డుకాలేదు. పుట్టెడు పేదరికాన్ని జయించి టెన్త్‌లో ఉత్తమ విజేతలుగా నిలిచారు. రెక్కలు ముక్కలు చేసుకుని బతుకీడ్చే కుటుంబాల్లో పుట్టిన ఈ చిన్నారులు ఎన్నో కష్టాలు చుట్టుముట్టినా ఏమాత్రం వెరవకుండా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తున్నారు. ఒకవైపు అడ్డా కూలీలు, ఆటో డ్రైవర్లు, సెక్యురిటీ గార్డులుగా బతుకుబండి నెట్టుకొస్తున్న తల్లిదండ్రులకు పనిలో ఆసరా అవుతూనే.. మరోవైపు చదువులోనూ రాణిస్తున్నారు. సర్కారు బడులను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా నిలిపారు. ఉత్తమ ప్రతిభ చూపిన పేదింటి పిల్లలు భవిష్యత్తులో మరిన్ని విజ యాలు సాధించాలంటే వీరి తల్లిదండ్రుల శ్రమ ఒక్కటే సరిపోదు. సమాజం కూడా అండగా నిలవాలి. వారి చదువులకు తమవంతు తోడ్పాటును అందించినప్పుడే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తారు. మానవతావాదులు ముందుకొచ్చి ఆర్థిక సాయం అందించి, వారి వెన్ను తట్టినప్పుడే ఇది సాధ్యం. – సాక్షి, సిటీబ్యూరో సెక్యురిటీ గార్డ్ కుమారుడు టాపర్.. తల్లితో నీలకంఠం శేరిలింగంపల్లి: పాపిరెడ్డి కాలనీలోని రాజీవ్ గృహకల్పకు చెందిన శివన్న నాయుడు (సెక్యూరిటీ గార్డ్), దమయంతి దంపతుల కుమారుడు నీలకంఠం 9.2 సాధించి శేరిలింగంపల్లి హైస్కూల్ టాపర్ టాపర్‌గా నిలిచాడు. తాను భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవుతానని నీలకంఠం చెబుతున్నాడు. ఇప్పటికే పాలిటెక్నిక్‌లో సీటు వచ్చిందని, దాతలు ప్రోత్సహిస్తే మరింత ముందుకు సాగుతానంటున్నాడు. దాతలు.. 9573398513 ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చు. పుట్టెడు దుఃఖంలోనూ.. తండ్రి రాములుతో రష్మిత ఎల్బీనగర్: తండ్రి ప్రైవేటు ఉద్యోగి. మంచాన పడిన తల్లి. వీరి కూతురు రష్మిత పట్టుదలతో కష్టపడి 10వ తరగతిలో 9.8 జీపీఏ సాధించింది. తల్లి సుజాత మరణించిన 15 రోజులకే 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో ఓ వైపు తల్లి లేని బాధ, మరోవైపు పరీక్షలు. అయినా మొక్కవోని దీక్షతో పరీక్ష రాసింది. 9.8 జీపీఏ సాధించింది. తండ్రి రాములు ఆటోనగర్‌లోని ఓ ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపులో చాలీచాలని జీతంతో బతుకుబండి లాగుతున్నాడు. వనస్థలిపురంలో నివాసముంటున్న వీరి ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆదుకుంటే పైచదువులు చదువుతానని రష్మిత చెబుతోంది. దాతలు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్: 94410 66370 విజయ ప్రసాదం.. తల్లిదండ్రులతో పూర్ణకంటి ప్రసాద్ ఆల్విన్‌కాలనీ: జగద్గిరిగుట్ట రిక్షాపుల్లర్స్ కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్ణకంటి ప్రసాద్ పదో తరగతి ఫలితాల్లో 9.5 జీపీఏ గ్రేడింగ్ సాధించాడు. బాలరామ్, కురువమ్మ దంపతుల కుమారుడు ప్రసాద్ పేదరికంలోనూ పదో తరగతి ఫలితాల్లో గ్రేడింగ్‌లో విజయం సాధించాడు. తండ్రి బాలరామ్ కార్పెంటర్‌గా జీవనం కొనసాగిస్తుంటాడు. ఉన్నత చదువులు చదివి ఇంజనీరింగ్‌లో రాణించాలని ప్రసాద్ లక్ష్యంగా ఎంచుకున్నాడు. దాతలు ఎవరైనా ఆదుకొంటే ఉన్నతవిద్య చదువుతానని ప్రసాద్ చెబుతున్నాడు. దాతలు సంప్రదించాల్సిన ఫోన్: 96528 70380 రాళ్లు కొట్టే ఇంట రతనాల బిడ్డ తల్లిదండ్రులతో షేక్ సకినాబీ ఘట్‌కేసర్‌టౌన్: ఘట్కేసర్ జెడ్పీ బాలికల పాఠశాలలో చదివిన షేక్ సకినాబీ 2017– 2018 విద్యా సంవత్సరంలో ఎస్సెస్సీలో మండల టాపర్‌గా నిలిచింది. షేక్ సకీనాబీ తల్లితండ్రులు షేక్ ఇమాం, లాల్‌బీ రాళ్లు కొట్టుకుని జీవించే కుటుంబం. తమ కూతురు 9.5 పాయింట్లతో మండల టాపర్‌గా రావడంతో ఆనందం వ్యక్తంచేస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఈ పేదలు తమ కూతురిని పై చదువులు ఎలా చదివించాలో అర్థం కావడం లేదు. దాతలు ముందుకొచ్చి చేయూతనిస్తే ఉన్నత చదువులు చదువుతానని విద్యార్థిని షేక్ సకినాబీ చెబుతోంది. దాతలు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 90101 55941 ప్లంబర్ కూతురు బంపర్.. తల్లిదండ్రులతో అఫ్రీన్ శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లిలోని నెహ్రూనగర్ బస్తీలో నివాసం ఉండే ఎస్డీ సలీమ్ (ప్లంబర్), రజియా దంపతుల పెద్ద కుమార్తె అఫ్రీన్. టెన్త్‌లో 9.2 సాధించి టాపర్‌గా నిలిచింది. సలీమ్ ప్లంబర్‌గా పనిచేస్తూ ఇద్దరు పిల్లలను స్థానికంగా ఉన్న శేరిలింగంపల్లి హైస్కూల్లో చదివిస్తున్నాడు. ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు చెల్లించే స్థోమత లేక గవర్నమెంట్ స్కూల్ చేర్పించినట్లు తెలిపారు. బైపీసీ పూర్తి చేసి డాక్టర్‌ను కావాలని ఉన్నా ఆర్థి«క పరిస్థితుల దృష్ట్యా సాధ్యం కాదని ఎంఈసీ చేయాలనుకుంటున్నానని అఫ్రీన్ చెబుతోంది. దాతలు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 99122 55986 ఈ రాజేశ్వరి.. విజయేశ్వరి.. రాజేశ్వరి సుభాష్‌నగర్: సూరారం జిల్లా పరిషత్ పాఠశాలలో టి.రాజేశ్వరి 9.7 జీపీఏ సాధించి ప్రభుత్వ పాఠశాలల్లో మండలంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సూరారం పారిశ్రామికవాడలో నివాసం ఉంటున్న రాజేశ్వరి తండ్రి విన్నారావు ఓ పరిశ్రమలో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. తల్లి భూలక్ష్మి రోజువారీ కూలి. భవిష్యత్తులో తనకు ప్రొఫెసర్ కావడమే లక్ష్యమని రాజేశ్వరి పేర్కొంటోంది. దాతలు తనను ఆదుకుకునేందుకు ముందుకు వస్తే రాణిస్తానని చెబుతోంది. ఆర్థిక సాయం అందించేవారు సంప్రదించాల్సిన ఫోన్: 95020 53302 పేదింట్లో పుట్టినా.. వంశీకృష్ణ వనస్థలిపురం: పేదింటిలో పుట్టినా.. ప్రభుత్వ పాఠశాలలో చదివినా.. ఆ విద్యార్థి పట్టుదలతో ఎస్సెస్సీలో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. 9.7 గ్రేడ్‌తో ప్రథమ స్థానంలో నిలిచాడు ఎల్బీనగర్ ఎన్టీఆర్నగర్కు చెందిన పబ్బ రాంమోహన్, సంధ్యారాణిల కుమారుడు వంశీకృష్ణ. వనస్థలిపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన వంశీ మొదటి స్థానంలో నిలిచాడు. తండ్రి రాంమోహన్ బిగ్‌బజార్ గోదాములో వర్కర్‌గా పనిచేస్తుండగా తల్లి గృహిణి. వీరి ఆర్థిక స్థోమత అంతంత మాత్రం కావడంతో వంశీకృష్ణ విద్యాభ్యాసానికి దాతలు సహకరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. దాతలు సంప్రదించాల్సిన ఫోన్: 95423 01731 -
కన్నపేగుకు ఎంతకష్టం
* ఉన్నదంతా అమ్మినా నయకాని రోగం * ఆపన్న హస్తం కోసం ఎదిరుచూపులు పేదరికం వారి పాలిట శాపమైంది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబాలు కన్నపేగు బాగు కోసం ఉన్నదంతా ఊడ్చి పెట్టారు. అరుునా మాయదారి జబ్బు నయం కాలేదు. చివరకు చేతిలో చిల్లి గవ్వలేక వైద్యం చేయించడానికి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు ముందుకొస్తే బిడ్డల ప్రాణాలు నిలుస్తాయని ఆ కన్నతల్లిదండ్రులు వేడుకుంటున్నారు. - ధర్మపురి/హుజూరాబాద్ టౌన్ మెదడు సంబంధ వ్యాధిలో బాలుడు ధర్మపురి మండలం ఆరెపెల్లి గ్రామానికి చెందిన ఆరెల్లి కిష్టయ్య-మమత దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు సంతానం. భర్త ముంబాయిలో ఒకరి ఇంట్లో పనిమనిషిగా చేస్తుం డగా భార్య కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని నెట్టుకువస్తోంది. చిన్నకుమారుడు రక్షిత్(5) పుటిన మూడేళ్ల వరకు ఆడుతూ పాడుతూ తల్లి గోరుముద్దలు తిన్నాడు. రెండు సంవత్సరాల క్రితం ఒక్కసారి ఫిట్స్‌తో రక్షిత్ పడిపోయాడు. తల్లిదండ్రులు స్థానిక ఆర్ఎంపీ వద్ద వైద్యం చేరుుంచి కొన్ని రోజులకు ధర్మపురిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించి మందులు వాడుతున్నారు. ఒక్కసారి వచ్చిన ఫిట్స్ వారంలో మూడు సార్లు వస్తూ ఉండడంతో స్థానిక వైద్యుల సూచన మెరకు జగిత్యాల, కరీంనగర్ పట్టణాల్లో వైద్యం చేయించారు. అప్పటికే రూ.మూడు లక్షల వరకు ఖర్చయ్యూరుు. ఉన్న ఎకురుం పొలం అమ్మెశారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఫిట్స్ కాదు మెదడులో రక్తప్రసరణ లేక తరుచుగా ఇలా జరుగుతోందని చెప్పారు. ఆ తర్వాత ఒకసారి ఫిట్స్‌తో కిందపడిపోగా కోమాలోకి వెళ్లి 15 రోజులు మూసిన కన్ను తెరువలేదు. హైదరాబాద్ తీసుకెళ్లమని డాక్టర్లు చెప్పడంతో ఉన్న ఇల్లు సైతం అమ్మెసి బయట కొంత అప్పుచేసి చికిత్స చేరుుంచారు. సుమారు రూ.8 లక్షల వరకు ఖర్చరుుందని, చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇంటికి చేరినట్లు మమత తెలిపింది. గత సంవత్సరం చీఫ్‌విప్ చొరవతో సీఎం రిలీఫ్ ఫండు ద్వారా రూ.48వేలు రాగా అవి ఆస్పత్రిలో ఉన్నపుడు వారంరోజుల మందులకు సరిపోలేదని చెపింది. ప్రస్తుతం రోజువారీ మందులకు ఇబ్బందవుతోందని, ఇటీవల మందులు వాడకపోవడంతో రక్షిత్ కిందపడిపోరుు తలకు, చేతికి తీవ్రగాయాలయ్యాయని కన్నీటి పర్యంతమైంది. కొడుక్కి వైద్యం కొనసాగించడానికి ఆపన్నహస్తం కోసం ఆ కన్నతల్లి ఎదురుచూస్తోంది. సహాయం చేయూలనుకునే దాతలు 94408 43740 నంబర్లో సంప్రదించవచ్చు. చిన్నారి గుండెకు రంధ్రం హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామానికి చెందిన మన్యాల తిరుపతి, స్వప్న దంపతుల కూతురు జ్ఞానప్రసన్న(9) జన్మించిన కొన్ని నెలలకే అస్వస్థకు గురవుతుండటంతో తల్లిదండ్రులు కరీంనగర్‌లోని పిల్లల ఆస్పత్రిలో చూపించారు. పరీక్షించిన వైద్యులు బాలిక గుండెకు రంధ్రం ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా పాపకు చెడు, మంచి రక్తం రెండూ కలుస్తున్నాయని నిర్ధారించి వైద్యానికి భారీగా ఖర్చువుతుందని చెప్పారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ దంపతులకు ఏమి చేయూలో తోచలేదు. కూలీపనికి వెళితేనే కుటుంబం గడవని పరిస్థితి. అయినా చివరకు ధైర్యం చేసి కూతురును కాపాడుకోవాలనే తపనతో వైద్యం చేయించడానికి బంధువులు, మిత్రుల వద్ద అప్పుచేశారు. కరీంనగర్, గోదావరిఖనితోపాటు హైదరాబాద్‌లో ఆస్పత్రులు తిరిగారు. అప్పటికే సుమారు రూ.లక్షా 50 వేలు ఖర్చయ్యాయి. చిన్నారని పరిక్షించిన వైద్యులు ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామని చెప్పినటప్పటికీ మందులు, స్కానింగ్‌లు, ఇతర పరీక్షలకు మరో రూ.2లక్షల వరకు అదనంగా ఖర్చవుతుందని చెప్పారు. దీంతో ఏమి చేయూలో తోచని స్థితిలో ఆ దంపతులు కొట్టుమిట్టాడుతున్నారు. వైద్యానికి సాయంమందికి కూతురును కాపాడాలని దాతలను వేడుకుంటున్నారు. సహయం చేయదలిచిన వారు 94407 22283 నంబర్‌కు సంప్రదించాలి. -
పేదలెవరు.. ధనికులెందరు
సాక్షి, ఏలూరు : సామాజిక, ఆర్థిక, కులగణన(ఎస్ఈసీసీ) ముసాయిదా జాబితాను గురువారం ప్రచురించనున్నారు. పేద కుటుంబాలను గుర్తించి వారికి ఉద్దేశించిన పథకాలను అమలు చేయాలనే లక్ష్యంతో 2011లో కుటుంబాలు, వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారం పరిశీలన 2013లో పూర్తయ్యింది. అన్ని గ్రామ పంచాయతీల్లో ఆయూ కుటుం బాల ముసాయిదా జాబితా రూపంలో తాజాగా ప్రచురణ జరుగుతుంది. గ్రామ సమాఖ్యల వద్ద, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద, రెవెన్యూ కార్యాలయం జాబితాలను ప్రజల పరిశీలనార్థం ఉంచుతారు. ‘హెచ్‌టీటీపీ/ఎస్ఈసీసీ/జిఓవీ.ఇన్’ వెబ్సైట్లోనూ ముసాయిదా జాబితా అందుబాటులో ఉంటుంది. జాబితా ప్రచురణకు సంబంధించిన ఫారాలు, స్టేషనరీ, ప్రచారానికి అవసరమైన కరపత్రాలను తహసిల్దార్, మునిసిపల్ కమిషనర్లకు అందజేశారు. జాబితా ప్రచురితమైన 10రోజుల లోపు గ్రామసభ జరుగుతుంది. 30 రోజులపాటు ప్రజల నుంచి విజ్ఞప్తులు, ఆక్షేపణలు స్వీకరిస్తారు. ప్రజలు తమ అభ్యంతరాలను ఏ, బీ, సీ, డీ, ఈ ఫారాల్లో అందజేయాలి. స్వదస్తూరితో రాసిచ్చినా తీసుకుంటారు. గ్రామ, మండల, పట్టణ స్థాయిల్లో పంచాయతీ కార్యదర్శి నుంచి మునిసిపల్ కమిషనర్ వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఏలూరు నగరపాలక సంస్థలో మాత్రం పట్టణ ప్రణాళికాధికారిని చార్జ్ ఆఫీసర్‌గా నియమించారు. ముసాయిదా జాబితా ప్రచురించిన 82వ రోజు అంటే అక్టోబర్ 20న తుది జాబితా ప్రచురిస్తారు. ఏ వ్యక్తి అయినా నిర్ధేశిత అధికారులు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోతే గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ డివిజి నల్ అధికారికి, పట్టణ ప్రాంతం వారు జాయింట్ కలెక్టర్‌కు 7 రోజుల లోపు అప్పీల్ చేయవచ్చు. క్లెయిములు/ఆక్షేపణల షెడ్యూల్ ఇలా గ్రామ సభల నిర్వహణ ఆగస్టు 9 క్లెయిములు/ఆక్షేపణలను నిర్ణీత నమూనాలో స్వీకరించుట ఆగస్టు 29 క్లెయిములు/ఆక్షేపణలను పరిష్కరించుట సెప్టెంబర్ 20 అప్పీలేట్ అధికారికి దరఖాస్తుల సమర్పణ సెప్టెంబర్ 28 అప్పీల్స్ పరిష్కరించుట అక్టోబర్ 18 తుది జాబితా ప్రచురణ అక్టోబర్ 20