
ఖమ్మం క్రైం: కరేబియన్ దీవుల్లోని బార్బడోస్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న ఖమ్మం విద్యార్థి గుండెపోటుతో మృతిచెందిన విషాద ఘటన ఇది. ఖమ్మం ట్రాఫిక్ ఎస్సై రవికుమార్ కుటుంబ సభ్యులతో కలసి ఖమ్మం రూరల్ మండలం పెదతండాలో నివసిస్తున్నారు. ఆయన పెద్ద కుమారుడైన హేమంత్ శివరామకృష్ణ (20) బార్బడోస్‌లో ఎంబీబీయస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
స్నేహితులతో కలసి మంగళవారం బీచ్‌కు వెళ్లిన అతను... ఈత కొట్టివచ్చిన కాసేపటికే గుండెపోటుతో కుప్పకూలాడు. సహచరులు అతన్ని ఆస్పత్రికి తరలించేలోగానే మృతిచెందాడు. శివరామకృష్ణ మృతదేహన్ని స్వస్థలానికి పంపించేందుకు అక్కడి భారతీయులు ఏర్పాట్లు చేస్తున్నారు.