Barbados
-
డికాక్ సునామీ ఇన్నింగ్స్.. 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో! రాయల్స్ ఘన విజయం
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024ను బార్బడోస్ రాయల్స్ విజయంతో ఆరంభించింది. ఆదివారం సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో బార్బడోస్ రాయల్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బార్బుడా ఫాల్కన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. బార్బుడా బ్యాటర్లలో జ్యువెల్ ఆండ్రూ(48) మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. రాయల్స్ బౌలర్లలో మెకాయ్ మూడు వికెట్లు పడగొట్టగా.. థీక్షణ, హోల్డర్ తలా రెండు వికెట్లు సాధించారు.డికాక్ ఊచకోత..అనంతరం 146 పరుగుల లక్ష్యాన్ని బార్బడోస్ రాయల్స్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది. లక్ష్య చేధనలో రాయల్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 45 బంతుల్లోనే 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 87 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మరో ఓపెనర్ కార్న్‌వాల్(34) సైతం దూకుడుగా ఆడాడు. ఆంటిగ్వా బౌలర్లలో వసీం ఒక్కడే వికెట్ సాధించాడు.చదవండి: #Babar Azam: 'బాబర్ నీ పని అయిపోయింది.. వెళ్లి జింబాబ్వేలో ఆడుకో' Quinton de kock vs Antigua & Barbuda Falcons 87*(45) incl. 9 Fours | 5 Sixes | SR 193+ pic.twitter.com/4JXTBixj6Q— SuperGiantsArmy™ — LSG FC (@LucknowIPLCover) September 2, 2024 -
కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌గా బార్బడోస్ రాయల్స్
మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ ఛాంపియన్‌గా బార్బడోస్ రాయల్స్ నిలిచింది. నిన్న (ఆగస్ట్ 29) జరిగిన ఫైనల్లో రాయల్స్ ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి వరుసగా రెండో ఏడాది టైటిల్ సొంతం చేసుకుంది. నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. జెనీలియా గ్లాస్గో (24), శిఖా పాండే (28), కైసియా నైట్ (17 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఆలియా అలెన్ 4 వికెట్లు తీసి నైట్‌రైడర్స్‌ను భారీ దెబ్బకొట్టింది. హేలీ మాథ్యూస్ 2, చినెల్ హెన్రీ ఓ వికెట్ పడగొట్టారు.94 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. చమారీ ఆటపట్టు (39 నాటౌట్) రాణించడంతో 15 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. హేలీ మాథ్యూస్ (13), క్యియాన జోసఫ్(14), లారా హ్యారిస్ (15) రెండంకెల స్కోర్లు చేశారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో సమారా రామ్‌నాథ్ 2, అనిసా మొహమ్మద్, జెస్ జొనాస్సెన్, శిఖా పాండే తలో వికెట్ పడగొట్టారు. నాలుగు వికెట్లు పడగొట్టి నైట్‌రైడర్స్‌ను దెబ్బకొట్టిన ఆలియా అలెన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కగా.. టోర్నీ ఆధ్యాంతం రాణించిన హేలీ మాథ్యూస్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. -
‘రోహిత్ ఎవరినో తిడుతున్నాడు.. ఆరోజు ద్రవిడ్‌కు నిద్ర పట్టలేదు’
2015, 2016, 2017, 2019, 2022.. 2023.. ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీల్లో భారత్‌కు ఎదురైన చేదు అనుభవాలను మరిపిస్తూ.. నెల రోజుల క్రితం ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది. ఫలితంగా దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి.ఈ టైటిల్ సాధించిన తర్వాత హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ తన ప్రస్థానం ముగించగా.. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. విండీస్‌లోని బార్బడోస్‌లో సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత్ విజేతగా నిలిచిన తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో కోహ్లి- రోహిత్ అభిమానులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. అయితే, యావత్ భారతావని మాత్రం వరల్డ్‌కప్ హీరోలు ఎప్పుడెప్పుడు తిరిగి వస్తారా? అని ఆసక్తిగా ఎదురుచూసింది. అయితే, బార్బడోస్‌లో హారికేన్ బీభత్సం వల్ల టీమిండియా రాక రెండు రోజులు ఆలస్యమైంది. ఉధృతమైన వర్షాల కారణంగా విమాన సర్వీసులు రద్దు కాగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి తక్షణ చర్యలు చేపట్టింది. వాతావరణం కాస్త తేలికపడగానే AIC24WC చార్టెడ్ ఫ్లైట్‌ను బార్బడోస్‌కు పంపింది. ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో పాటు కవరేజ్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులను కూడా ఇదే విమానంలో భారత్‌కు తీసుకువచ్చారు.ఈ క్రమంలో స్టార్ స్పోర్ట్స్ ప్రొడ్యూసర్ ఒకరు నాటి విమాన ప్రయాణానికి సంబంధించిన జ్ఞాపకాలను తాజాగా గుర్తుచేసుకున్నారు. ‘‘ఆరోజు బార్బడోస్ నుంచి ఢిల్లీకి విమాన ప్రయాణం. పదహారు గంటల జర్నీ. అయితే, ఆరోజు ఎవరూ కూడా ఆరు గంటలకు మించి నిద్రపోలేదు. అంతా సందడి సందడిగా సాగింది.ఆటగాళ్లలో చాలా మంది ప్రెస్ వాళ్లను కలవడానికి వచ్చారు. వారితో ముచ్చట్లు పెట్టారు. అందరి కంటే రోహిత్ శర్మ ఎక్కువసార్లు బయటకు వచ్చాడు. బిజినెస్ క్లాస్ అంతా విజయ సంబరంతో అల్లరి అల్లరిగా ఉండటంతో రాహుల్ ద్రవిడ్ ఒకానొక సమయంలో ఎకానమీ క్లాస్‌కు వచ్చేశాడు. బిజినెస్ క్లాస్‌లో నిద్రపట్టడం లేదని..ఎకానమీ క్లాస్‌లో నిద్రపోయాడు.నేను నిద్రపోతున్న సమయంలో రోహిత్ శర్మ ఎవరినో తిడుతున్నట్లుగా శబ్దాలు వినిపించాయి. లేచి చూస్తే నిజంగానే రోహిత్ అక్కడ ఎవరినో ఏదో అంటున్నాడు. అయితే, తనదైన స్టైల్లో సరదాగానే వారికి చివాట్లు పెడుతూ ఆటపట్టిస్తున్నాడు. ఆ తర్వాత రిషభ్ పంత్, హార్దిక్‌పాండ్యా అందరూ బయటకు వచ్చారు. మీడియా వాళ్లతో ముచ్చటించారు. ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు’’ అని పేర్కొన్నారు. -
T20 World Cup 2024: ఎట్టకేలకు బార్బడోస్‌ను వీడిన జగజ్జేతలు
టీమిండియా క్రికెటర్లు ఎట్టకేలకు బార్బడోస్‌ను వీడారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భారత బృందాన్ని న్యూఢిల్లీకి చేర్చేందుకు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం బార్బడోస్‌కు వచ్చింది. ఇవాళ (జులై 3) మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో విమానం టేకాఫ్ అయినట్లు తెలుస్తుంది. రేపు ఉదయం 9 గంటల లోపు భారత క్రికెటర్లు ఢిల్లీలో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. టీమిండియా రాక కోసం భారత్‌లో అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. T20I WORLD CUP TROPHY IS COMING BACK TO INDIA AFTER 17 LONG YEARS...!!!! 🇮🇳- The Heroes will reach tomorrow. [Nikhil Naz] pic.twitter.com/3pk57TL7Oy— Johns. (@CricCrazyJohns) July 3, 2024కాగా, "బెరిల్" హరికేన్ (గాలివాన) కారణంగా టీమిండియా క్రికెటర్లు ఫైనల్ మ్యాచ్‌కు వేదిక అయిన బార్బడోస్‌లో గత మూడు రోజులుగా ఇరుక్కుపోయారు. హరికేన్ తీవ్రరూపం దాల్చడంతో బార్బడోస్ ఎయిర్‌పోర్ట్‌ను మూసి వేశారు. బార్బడోస్ నగరంలో కర్ఫ్యూ అమల్లో ఉండింది. భారత క్రికెటర్లు గత మూడు రోజులుగా హోటల్ రూమ్లకే పరిమితమయ్యారు.ఇదిలా ఉంటే, యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2024ను టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 17 ఏళ్ల తర్వాత భారత్ పొట్టి ప్రపంచకప్‌తో స్వదేశానికి రానుంది. వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్ స్వదేశానికి తిరిగి రాగేనే తొలుత ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉంది. అనంతరం భారత ఆటగాళ్లు ముంబై నగర వీధుల్లో ఓపెన్ టాప్ బస్‌లో ఊరేగింపుగా వెళ్తారని సమాచారం. గతంలో టీమిండియా వరల్డ్‌కప్ గెలిచినప్పుడు ఇలాగే చేశారు. -
T20 World Cup 2024: హరికేన్ ప్రభావం.. ఇంకా బార్బడోస్‌లోనే టీమిండియా
టీ20 వరల్డ్‌కప్ విజయానంతరం మరుసటి రోజే (జూన్ 30) భారత్‌కు తిరిగి రావాల్సిన టీమిండియా.. హరికేన్ (గాలివాన) ప్రభావం కారణంగా ఫైనల్ మ్యాచ్‌కు వేదిక అయిన బార్బడోస్‌లోనే ఇరుక్కుపోయింది. హరికేన్ తీవ్రరూపం దాల్చడంతో బార్బడోస్‌లోని విమానాశ్రయం మూసివేశారు. దీంతో భారత క్రికెటర్లు గత రెండు రోజులుగా హోటల్ రూమ్‌కే పరిమితమయ్యారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా కూడా భారత బృందంతో పాటే ఉన్నారు. Virat Kohli showing Hurricanes to Anushka Sharma on video call at Barbados. ❤️pic.twitter.com/PzZY3RmMMb— Tanuj Singh (@ImTanujSingh) July 2, 2024ప్రకృతి శాంతిస్తే టీమిండియా గురువారం ఉదయానికంతా భారత్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది. భారత బృందం రిటర్న్ జర్నీ ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడింది. గాలివాన మధ్యమధ్యలో కాస్త ఎడతెరిపినిస్తూ మళ్లీ తీవ్రరూపం దాలుస్తుంది.బార్బడోస్‌లో భారత బృందం బస చేస్తున్న హోటల్లో నీరు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతున్నట్లు సమాచారం. బార్బడోస్ నగరంలో కర్ఫ్యూ అమల్లో ఉంది. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి.. తన భార్య అనుష్క శర్మకు హరికేన్ తీవ్రతను ఫోన్లో చూపించాడు. మూడు రోజులైనా హరికేన్ తీవ్రత తగ్గకపోవడంతో భారత్‌లో ఉన్న క్రికెటర్ల ఆప్తులు ఆందోళన చెందుతున్నారు. టీమిండియా రాక కోసం స్వదేశంలో అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. వరల్డ్‌కప్ విన్నింగ్ హీరోలకు ఘన స్వాగతం పలకాలని యావత్ భారత దేశం ఎదురుచూస్తుంది. కాగా, టీమిండియా 14 ఏళ్ల అనంతరం టీ20 వరల్డ్‌కప్‌ను తిరిగి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. బార్బడోస్‌లో జరిగిన ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, నాలుగోసారి (1983, 2007, 2011, 2024) జగజ్జేతగా నిలిచింది. -
భీకర హరికేన్ ధాటికి అతలాకుతలమైన కరేబియన్ కంట్రీ బార్బడోస్ (ఫొటోలు)
-
బార్బడోస్ నుంచి ప్రత్యేక విమానంలో టీమిండియా రాక
Update: బార్బడోస్‌లో హరికేన్ ప్రభావం తగ్గడంతో టీమిండియా ఎట్టకేలకు స్వదేశానికి బయల్దేరనుంది. భారతకాలమానం ఇవాళ సాయత్రం 6 గంటలకు భారత బృందం ప్రత్యేక విమానంలో బార్బడోస్ నుంచి టేకాఫ్ కానుంది. టీమిండియా రేపు రాత్రి 7.45 గంటల ప్రాంతంలో ఢిల్లీలో ల్యాండ్ కానుంది.టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌కు వేదిక అయిన బార్బడోస్‌లో గాలివాన (హరికేన్) బీభత్సం ఇంకా కొనసాగుతుంది. హరికేన్ తీవ్రత కారణంగా విమానాశ్రయం మూసివేయడంతో భారత క్రికెట్ జట్టు బార్బడోస్‌లోనే ఇరుక్కుపోయింది. బార్బడోస్‌లో భారత బృందం పరిస్థితి దయనీయంగా ఉందని తెలుస్తుంది. మన వాళ్లు బస చేస్తున్న హోటల్లో నీరు, విద్యుత్ సరఫరా బంద్ అయినట్లు సమాచారం. బార్బడోస్ నగరంలో కర్ఫ్యూ అమల్లో ఉన్నట్లు తెలుస్తుంది. భారత ఆటగాళ్లంతా హోటల్‌కే పరిమితమయ్యారని సమాచారం.ప్రకృతి శాంతిస్తే టీమిండియా ఇవాళ (జులై 2) మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో స్వదేశానికి బయల్దేరవచ్చు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా కూడా భారత బృందంతో పాటే ఉన్నారు. మరోవైపు టీమిండియా రాక కోసం స్వదేశంలో అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. వరల్డ్‌కప్ విన్నింగ్ హీరోలకు ఘన స్వాగతం పలకాలని యావత్ భారత దేశం ఎదురుచూస్తుంది. కాగా, టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో టీమిండియా.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి, రెండో సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. -
T20 World Cup 2024: బార్బడోస్‌లో ఇరుక్కుపోయిన టీమిండియా
టీ20 వరల్డ్‌కప్ 2024 విజయానంతరం భారత క్రికెట్ బృందం బార్బడోస్‌లోనే (ఫైనల్ మ్యాచ్‌కు వేదిక) ఇరుక్కుపోయింది. అట్లాంటిక్‌లో ఉద్భవించిన 'బెరిల్' హరికేన్ కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో టీమిండియా బార్బడోస్‌లోనే ఉండిపోయింది. హరికేన్ ప్రభావం తగ్గి విమాన సర్వీసులు పునరుద్ధరించబడితే రేపటి కల్లా టీమిండియా ఢిల్లీలో ల్యాండ్ అవుతుంది. బార్బడోస్‌లో భారత బృందం హిల్టన్‌లో బస చేస్తుంది. షెడ్యూల్ ప్రకారం టీమిండియా ఇవాళ (జులై 1) ఉదయం 11 గంటలకంతా భారత్‌లో ల్యాండ్ కావల్సి ఉండింది. భారత రూట్ మ్యాప్ బార్బడోస్ నుంచి న్యూయార్క్‌కు.. న్యూయార్క్ నుంచి దుబాయ్‌కు.. అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకునేలా ఉండింది. అయితే బెరిల్ హరికేన్ టీమిండియా రిటర్న్ ప్లాన్లు దెబ్బతీసింది.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి రెండోసారి జగజ్జేతగా నిలిచిన టీమిండియా రాక కోసం స్వదేశంలో అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. భారత ఆటగాళ్లు ఢిల్లీలో ల్యాండ్ కాగానే ఘన స్వాగతం పలకాలని ప్లాన్లు చేసుకున్నారు. భారత ప్రభుత్వం సైతం వరల్డ్‌కప్ హీరోలను ఘనంగా స్వాగతం పలకాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంది. భారత్‌లోకి ఎంటర్ కాగానే టీమిండియా హీరోలను ఊరేగింపుగా తీసుకెళ్లాలని ప్లాన్లు చేసుకుంది. ఈ తంతు అనంతరం భారత క్రికెట్ బృందం ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉంది. ప్రధాని నివాసంలో టీమిండియాకు సన్మాన కార్యక్రమం ఉండనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు బీసీసీఐ నిన్న వరల్డ్‌కప్ గెలిచిన భారత బృందానికి రూ. 125 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. ఈ స్థాయి భారీ మొత్తాన్ని క్రికెట్ చరిత్రలో ఏ జట్టు అందుకుని ఉండకపోవచ్చు. బీసీసీఐ తమ హీరోల గౌరవార్దం ఈ భారీ నగదు నజరానాను ప్రకటించింది. -
కొత్తగా చేయాల్సిందేమీ లేదు.. థాంక్యూ: ద్రవిడ్ కౌంటర్
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. బ్యాటర్‌గా తన ఆట తీరును గుర్తుచేస్తూ.. టీమిండియాను కించపరచాలని చూసిన జర్నలిస్టుకు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 లీగ్ మ్యాచ్‌లను అమెరికాలో ఆడిన టీమిండియా.. సూపర్-8 కోసం వెస్టిండీస్‌కు చేరుకుంది. ఇందులో భాగంగా గురువారం తొలి మ్యాచ్ ఆడనుంది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది.ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను తన ప్రశ్నలతో ఇరుకున పెట్టాలని ఓ జర్నలిస్టు ప్రయత్నించాడు. ఆటగాడిగా ఇదే వేదికపై ద్రవిడ్‌కు, టీమిండియాకు గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేశాడు.‘‘రాహుల్.. మీరు ఇక్కడ మ్యాచ్‌లు ఆడారు కదా. కానీ 97 టెస్టులో మీకంటూ గొప్ప జ్ఞాపకాలు ఏమీ లేవు’’ అని సదరు జర్నలిస్టు ద్రవిడ్‌తో అన్నాడు.ఇందుకు బదులిస్తూ.. ‘‘గీజ్.. ఈ ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు! ఇక్కడ నాకు కొన్ని మధుర జ్ఞాపకాలు కూడా ఉన్నాయి’’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు.అయితే, అంతటితో సంతృప్తి చెందని రిపోర్టర్.. ‘‘నేనూ అదే అంటున్నా. ఇక్కడ మీకున్న కాస్తో కూస్తో మంచి జ్ఞాపకాలను గొప్ప జ్ఞాపకాలుగా మార్చుకుంటారా?’’ అని ప్రశ్నించాడు.దీంతో సహనం కోల్పోయిన ద్రవిడ్.. ‘‘అన్నీ తెలిసిన వ్యక్తి కదా మీరు.. నేను ఇక్కడ కొత్తగా చేయాల్సిందేమీ లేదయ్యా. గతాన్ని మరిచి ముందుకు సాగడంలో నేను ముందుంటాను. వెనక్కి తిరిగి చూసుకుని.. పదే పదే గతాన్ని తవ్వుకోవడం నాకు అలవాటు లేదు.ప్రస్తుతం నేను ఏం చేస్తున్నాను, నా విధి ఏమిటన్న అంశాలపైనే దృష్టి పెడతాను. 97లో ఏం జరిగింది? ఆ తర్వాతి సంవత్సరంలో ఏం జరిగింది? అంటూ కూర్చోను.ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా ఇలాంటి ప్రశ్నలు రావచ్చు. మంచైనా.. చెడైనా.. రెండింటినీ సమంగా స్వీకరిస్తాను. ఆటగాడిగా ఉన్ననాటి విషయాల గురించి ఆలోచించే సమయమే లేదు. భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తా. ఈ మ్యాచ్ ఎలా గెలవాలన్న విషయం మీద మాత్రమే ఫోకస్ చేస్తా’’ అంటూ ద్రవిడ్ కౌంటర్ ఇచ్చాడు.కాగా 1997లో బార్బడోస్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో రాహుల్ ద్రవిడ్ రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 78, 2 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 38 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. నాటి విషయాన్ని గుర్తు చేస్తూ.. సదరు రిపోర్టర్ ద్రవిడ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయగా.. ఇలా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం... కోచ్‌గా జట్టును సరైన దిశలో నడపడం మాత్రమే తన తక్షణ కర్తవ్యమని సమాధానమిచ్చాడు. కాగా ఈ మెగా టోర్నీ తర్వాత ద్రవిడ్ హెడ్ కోచ్‌గా వైదొలగనున్న విషయం తెలిసిందే. అతడిస్థానంలో గౌతం గంభీర్ ఈ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.చదవండి: T20 WC 2024: అఫ్గాన్‌తో అంత ఈజీ కాదు.. కోహ్లి ఫామ్‌లోకి వస్తాడా? -
విమానం గాల్లో ఉండగా గందరగోళం.. 11 మంది ప్రయాణికులకు గాయాలు
కరేబియన్ ద్వీపంలోని బార్బడోస్ నుంచి మాంచెస్టర్‌కు వెళుతున్న విమానం గాల్లో ఉండగా ఊహించని గందరగోళాన్ని ఎదుర్కొంది. విచిత్ర వాతావరణ పరిస్థితులతో విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనయ్యింది. బెర్ముడాలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో 11 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. విమానాన్ని అత్యవసర మళ్లింపు చేయడంతో ప్రయాణికులు క్రిస్మస్ పండగ రోజును, బాక్సింగ్ డేనాడు బెర్ముడాలో గడపాల్సి వచ్చింది. డిసెంబర్ 24న మలెత్ ఏరో ఫ్లైట్ 225 మంది ప్రయాణికులతో బార్బడోస్ నుంచి ఒక గంట ఆలస్యంగా బయలుదేరింది. ఇది ఉదయం 6 గంటలలోపు మాంచెస్టర్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే బయలుదేరిన రెండు గంటల తర్వాత ఎయిర్‌బస్ విమానం 38,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు, తీవ్రమైన గందరగోళాన్ని ఎదుర్కొంది. దీంతో పైలెట్లు విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ కోసం దగ్గర్లోని బెర్మాడాకు మళ్లీంచారు. అక్కడ విమానం ల్యాండ్ అవుతుండగా 11 మంది ప్రయాణికులకు స్పల్ప గాయాలయ్యాయి. వీరికి బర్ముడాలో చికిత్స అందించారు. అయితే సిబ్బందికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. -
Heart Attack: బార్బడోస్‌లో గుండెపోటుతో ఖమ్మం విద్యార్థి మృతి
ఖమ్మం క్రైం: కరేబియన్ దీవుల్లోని బార్బడోస్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న ఖమ్మం విద్యార్థి గుండెపోటుతో మృతిచెందిన విషాద ఘటన ఇది. ఖమ్మం ట్రాఫిక్ ఎస్సై రవికుమార్ కుటుంబ సభ్యులతో కలసి ఖమ్మం రూరల్ మండలం పెదతండాలో నివసిస్తున్నారు. ఆయన పెద్ద కుమారుడైన హేమంత్ శివరామకృష్ణ (20) బార్బడోస్‌లో ఎంబీబీయస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో కలసి మంగళవారం బీచ్‌కు వెళ్లిన అతను... ఈత కొట్టివచ్చిన కాసేపటికే గుండెపోటుతో కుప్పకూలాడు. సహచరులు అతన్ని ఆస్పత్రికి తరలించేలోగానే మృతిచెందాడు. శివరామకృష్ణ మృతదేహన్ని స్వస్థలానికి పంపించేందుకు అక్కడి భారతీయులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
CWG 2022: బార్బడోస్పై ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా
కామన్వెల్త్ గేమ్స్ 2022లో టీమిండియా మహిళల జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. గేమ్స్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా వుమెన్స్ జూలు విదిల్చారు. బుధవారం బార్బడోస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మహిళలు 100 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా మహిళలు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్(46 బంతుల్లో 56 నాటౌట్, 6 ఫోర్లు, ఒక సిక్స్) టాప్ స్కోరర్ కాగా.. షఫాలీ వర్మ(26 బంతుల్లో 43, 7 ఫోర్లు, 1 సిక్సర్), చివర్లో దీప్తి శర్మ(28 బంతుల్లో 34, 2 ఫోర్లు, 1 సిక్సర్) దుమ్మురేపడంతో భారత్ మహిళల జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బార్బడోస్ మహిళల జట్టు భారత్ బౌలర్ల ఒత్తిడిని తట్టుకోలేక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 62 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది. కోషోనా నైట్ 16 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మిగతావారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. టీమిండియా వుమెన్స్ బౌలర్లలో రేణుకా సింగ్ 4 వికెట్లు తీయగా.. మేఘనా సింగ్, స్నేహ్ రాణా, రాదా యాదవ్, హర్మన్‌ప్రీత్ కౌర్‌లు తలా ఒక వికెట్ తీశారు. ఇక న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య విజేతతో టీమిండియా మహిళల జట్టు సెమీస్‌లో తలపడనుంది. సెమీస్‌లో గెలిస్తే మాత్రం టీమిండియా మహిళల జట్టుకు పతకం ఖాయమైనట్లే. A fantastic victory for #TeamIndia. They win by 100 runs and advance into the semi-finals at the #CWG2022 👏👏 Scorecard - https://t.co/upMpWogmIP #INDvBAR #B2022 pic.twitter.com/uH6u7psVmG — BCCI Women (@BCCIWomen) August 3, 2022 -
బార్బడోస్‌తో భారత్ కీలక పోరు.. ఓడితే ఇంటికే!తుది జట్లు!
కామన్వెల్త్ గేమ్స్-2022లో బుధవారం బార్బడోస్ మహిళల జట్టుతో కీలక పోరులో అమీతుమీ తెల్చుకోవడానికి భారత్ సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో ఇప్పటి వరకు 2 మ్యాచ్‌లు ఆడిన భారత్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో ఓటమి పాలైన భారత్.. రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించి తిరిగి గాడిలో పడింది. గ్రూపు-ఎలో నాలుగు పాయింట్లతో తొలి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఇక ఇప్పటి వరకు చెరో విజయం సాధించిన భారత్, బార్బడోస్ రెండు పాయింట్లు తమ ఖాతాలో వేసుకున్నాయి. అయితే బార్బడోస్ కంటే భారత్(+1.165)కు మెరుగైన రన్‌రేట్ ఉండటంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇక మూడో స్థానంలో బార్బడోస్ ఉండగా.. అఖరి స్థానంలో పాకిస్తాన్ ఉంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన పాకిస్తాన్ పోటీ నుంచి నిష్క్రమించింది. ఇక సెమీస్‌లో అడుగు పెట్టాలంటే బార్బడోస్పై హర్మన్ ప్రీత్ సేన ఖచ్చితంగా విజయం సాధించాలి. ఒక వేళ ఓడితే భారత్ ఇంటిముఖం పట్టక తప్పదు. ఇక కీలకపోరులో తలపడనున్న భారత్, బార్బడోస్ జట్ల బలా బలాలపై ఓ లుక్కేద్దాం. భారత జట్టు బ్యాటింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఆనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు అద్భుతంగా రాణించనప్పటికీ.. బౌలర్లు అఖరిలో చేతులెత్తేశారు. అనంతరం పాక్‌పై మాత్రం టీమిండియా మహిళలు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టారు. తొలుత బౌలింగ్‌లో పాక్‌ను కేవలం 99 పరుగులకే కుప్పకూల్చిన భారత మహిళలు.. అనంతరం బ్యాటింగ్‌లో కూడా ఇరగదీశారు. ఓపెనర్ స్మృతి మంధాన 63 పరుగులతో ఆజేయంగా నిలిచి భారత్‌కు విజయ తీరాలకు చేర్చింది. ఇక స్మృతి మంధానతో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, షఫాలీ వర్మలు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండడం భారత్‌కు సానుకూలాంశం. ఇక బౌలింగ్ పరంగా భారత్ కాస్త తడబడుతోంది. ఆసీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పేసర్ రేణుక సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టి అద్భుతమైన ఆరంభం ఇచ్చినప్పటికీ.. మిగితా బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. అయితే రెండో మ్యాచ్‌లో పాక్‌పై మాత్రం బౌలర్లు విజృంభించారు. ఇక మరోసారి భారత బౌలర్లు చెలరేగితే బార్బడోస్‌కు మాత్రం ఓటమి తప్పదు. ఇక బార్బడోస్ విషయానికి వస్తే.. తొలి మ్యాచ్‌లో పాక్‌పై అద్భుతమైన విజయం సాధించిన బార్బడోస్, రెండో మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో భంగపాటు పడింది. అయితే బార్బడోస్‌ను మాత్రం తక్కువగా అంచనా వేయలేం. జట్టులో కెప్టెన్ హేలీ మాథ్యూస్, ఓపెనర్ డాటిన్ వంటి అద్భుతమైన క్రికెటర్లు ఉన్నారు. బౌలింగ్‌లో కూడా షకేరా సెల్మాన్, షామిలియా కన్నెల్ వంటి సీనియర్ బౌలర్లు ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. తుది జట్లు (అంచనా) బార్బడోస్ మహిళల జట్టు: డియాండ్రా డాటిన్, హేలీ మాథ్యూస్ (కెప్టెన్), కైసియా నైట్ (వికెట్ కీపర్), కైషోనా నైట్, ఆలియా అలీన్, త్రిషన్ హోల్డర్, అలీసా స్కాంటిల్‌బరీ, షకేరా సెల్మాన్, షామిలియా కన్నెల్, కైలా ఇలియట్, షానికా బ్రూస్ భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), సబ్బినేని మేఘన, దీప్తి శర్మ, రాధా యాదవ్, స్నేహ రాణా, పూజా వస్త్రాకర్, రేణుకా సింగ్ చదవండి: తొమ్మిదేళ్ల తర్వాత కుటుంబాన్ని కలిసిన ‘ముంబై’ యువ స్పిన్నర్! తల్లితో దిగిన ఫొటో షేర్ చేస్తూ ఎమోషనల్! -
రిపబ్లిక్‌గా అవతరించిన బార్బడోస్
శాన్‌జువాన్(పోర్టోరికో): కరేబియన్ ద్వీప దేశం బార్బడోస్ గణతంత్ర దేశం(రిపబ్లిక్)గా అవతరించింది. వలస పాలన తాలుకూ ఆనవాళ్లను చెరిపేసుకునే క్రమంలో మొట్టమొదటిసారిగా రిపబ్లిక్‌గా ప్రకటించుకుంది. దీంతో, దేశాధినేత హోదా నుంచి బ్రిటిష్ రాణి ఎలిజెబెత్–2ని తొలగించింది. దాదాపు 300 ఏళ్ల బ్రిటిష్ పాలన తర్వాత 1966లో బార్బడోస్‌కు స్వాతంత్య్రం వచ్చింది. రిపబ్లిక్‌గా ప్రకటించుకునే దిశగా బార్బడోస్ రెండు దశాబ్దాలుగా ప్రయత్నిస్తోంది. గత నెలలో దేశానికి మొట్టమొదటి అధ్యక్షుడిని పార్లమెంట్ మూడింట రెండొంతుల మెజారిటీతో ఎన్నుకుంది. బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొంది 55 ఏళ్లవుతున్న సందర్భంగా బార్బడోస్ గవర్నర్ జనరల్ సాండ్రా మాసన్(72) మంగళవారం దేశాధినేతగా బాధ్యతలు స్వీకరించారు. పాలనా విషయాల్లో ఆమె ప్రధానమంత్రి మియా మోట్లేకు సహకరిస్తారు. దేశ రాజధాని బ్రిడ్జిటౌన్లో సోమవారం అట్టహాసంగా ప్రారంభమైన ఉత్సవాలకు ప్రిన్స్ చార్లెస్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దేశమంతటా పండగ వాతావరణం నెలకొంది. 100 మందికి పైగా కళాకారులతో తీరప్రాంత రాజధాని నగరం బ్రిడ్జిటౌన్లో అంగరంగ వైభవంగా సంగీత కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. ఎలిజెబెత్–2ను రాణిగా గుర్తించకున్నా కామన్వెల్త్ కూటమిలో బార్బడోస్ కొనసాగనుంది. లండన్‌లోని ప్రీవీ కౌన్సిల్ బదులు ఇకపై ట్రినిడాడ్ కేంద్రంగా పనిచేసే కరీబియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌ను అత్యున్నత న్యాయస్థానంగా పరిగణించనుంది. మూడు లక్షల జనాభా కలిగిన ఈ దేశ ప్రధాన ఆదాయవనరు పర్యాటక రంగం. సుమారు 3 లక్షల జనాభా ఉన్న బార్బడోస్‌లో అత్యధికులు బ్రిటిష్ పాలకులు చెరకు తోటల్లో పనిచేసేందుకు బానిసలుగా తీసుకువచ్చిన ఆఫ్రికా సంతతి వారే. కరీబియన్ దీవుల్లో భాగమైన గుయానా, డొమినికా, ట్రినిడాడ్ అండ్ టొబాగో 1970లలోనే రిపబ్లిక్‌లుగా మారినా బార్బడోస్ మాత్రం ఆ హోదా తాజాగా పొందింది. -
చంద్రపాల్ సునామీ శతకం.. గయానా ఘన విజయం
సెయింట్ కిట్స్: కరీబియన్ ప్రిమియర్ లీగ్ 2021లో భాగంగా బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ చంద్రపాల్ హేమరాజ్(56 బంతుల్లో 105 నాటౌట్; 14 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి నిర్ధేశించిన లక్ష్యాన్ని ఒంటిచేత్తో ఛేదించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బార్బడోస్ రాయల్స్.. నిర్ణీత ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. గయానా వారియర్స్ బౌలర్లు ఇమ్రాన్ తాహిర్(3/34), రోమారియో షెపర్డ్(2/33), మోటీ(1/15), ఓడియన్ స్మిత్(1/22) దెబ్బకు బార్బడోస్ జట్టు పేకమేడలా కూలింది. An amazing performance by Chandrapaul Hemraj sees the Warriors star receive our @Dream11 MVP for match 16. #CPL21 #GAWvBR #Dream11 @CricketPlayedLouder pic.twitter.com/STQ2xb6N0r— CPL T20 (@CPL) September 4, 2021 ఈ ఇన్నింగ్స్‌లో బార్బడోస్ ఆటగాళ్లు ముగ్గురు రనౌట్ కాగా, వికెట్‌కీపర్ అజామ్ ఖాన్(28) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 131 పరుగుల ఛేదనలో హేమరాజ్ ఒక్కడే అజేయమైన 105 పరుగులు సాధించడంతో గయానా జట్టు 14.2 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా ప్రత్యర్ధిపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గయానా మరో ఓపెనర్ బ్రెండన్ కింగ్(17 బంతుల్లో 19; 2 ఫోర్లు) వికెట్ బార్బడోస్ బౌలర్ యంగ్‌కు దక్కింది. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్(13 బంతుల్లో 8 నాటౌట్; ఫోర్)తో కలసి హేమరాజ్ గయానాను విజయతీరాలకు తీర్చాడు. Take a bow Chandrapaul Hemraj what a performance 👏👏👏 #CPL21 #GAWvBR #CricketPlayedLouder pic.twitter.com/FA9xjmN7GU— CPL T20 (@CPL) September 4, 2021 చదవండి: వైరలవుతున్న రోహిత్ ఐదేళ్ల కిందటి ట్వీట్.. ‘చెప్పాడంటే చేస్తాడంతే’ -
WI Vs AUS: రెచ్చిపోయిన స్టార్క్.. ఆసీస్ ఘన విజయం
బార్బడోస్: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 133 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించి మూడు వన్డేల సిరీస్‌లో1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి.. 252 పరుగులు చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో తడబడ్డ విండీస్ 26.2 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో ఆసీస్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఐదు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపులో కీలక పాత్ర పోషించిన మిచెల్ స్టార్క్ ‘‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’’గా నిలిచాడు. తద్వారా ఒక వన్డేలో ఐదు వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి చేరుకున్నాడు. హాజిల్‌వుడ్ 3 వికెట్లతో రాణించాడు. విండీస్ ఆటగాళ్లలో కెప్టెన్ కీరన్ పొలార్డ్(56 పరుగులు) మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. కాగా, అలెక్స్ క్యారీకి ఆసీస్ కెప్టెన్‌గా ఇది తొలి విజయం. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ... ‘‘అవును.. ఇదెంతో ప్రత్యేకం. సారథిగా తొలి గెలుపు. ముగ్గురు ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశారు. పిచ్ మరీ అంత అనుకూలంగా కూడా ఏమీ లేదు. కానీ, ఆష్టన్ టర్నర్ అద్భుతం చేశాడు. వేస్ అగర్ సైతం తన డెబ్యూను మరింత స్పెషల్‌గా మార్చుకున్నాడు’’ అని హర్షం వ్యక్తం చేశాడు. ఇక ఆసీస్ ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆతిథ్య జట్టు కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్‌లో పర్యాటక జట్టు ముందంజలో నిలిచింది. స్కోర్లు: ఆస్ట్రేలియా- 252/9 (49) వెస్టిండీస్- 123 (26.2) Starc kicked off the innings with a very sharp caught and bowled #WIvAUS pic.twitter.com/gxL3NFL9Qa — cricket.com.au (@cricketcomau) July 20, 2021 Josh Hazlewood is getting very, very good at taking return catches! #WIvAUS pic.twitter.com/WQNmFuie1r — cricket.com.au (@cricketcomau) July 21, 2021 -
‘అక్షరా’లా పంజాబ్‌దే...
బార్బడోస్పై నాలుగు వికెట్ల విజయం మొహాలీ: పంజాబ్ లక్ష్యం 175 పరుగులు.... చివరి 12 బంతుల్లో 25 పరుగులు చేయాలి. రాంపాల్ బౌలింగ్‌కు దిగాడు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పెద్దగా అనుభవం లేని అక్షర్ పటేల్ (9 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) పూనకం వచ్చినట్లు రెచ్చిపోయాడు. మూడు బౌండరీలు, ఓ సిక్సర్‌తో కేవలం ఐదు బంతుల్లోనే 19 పరుగులు చేసి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. దీంతో సీఎల్టీ20లో శనివారం జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 4 వికెట్ల తేడాతో బార్బడోస్ ట్రైడెంట్సపై విజయం సాధించింది. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన బార్బడోస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. రైఫర్ (42 బంతుల్లో 60 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), మునవీరా (26 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలతో చెలరేగారు. అవానా 3, పెరీరా 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. మిల్లర్ (34 బంతుల్లో 46 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. సెహ్వాగ్ (25 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్), మనన్ వోహ్రా (19 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. చివర్లో మిల్లర్, అక్షర్ కలిసి 19 బంతుల్లో అజేయంగా 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు విజయాన్ని అందించారు. రాంపాల్, మెండిస్ చెరో రెండు వికెట్లు తీశారు. మిల్లర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు: బార్బడోస్ ట్రైడెంట్స్ ఇన్నింగ్స్: మునవీరా (సి) వోహ్రా (బి) అవానా 50; పెర్కిన్స్ ఎల్బీడబ్ల్యు (బి) అవానా 10; రైఫర్ నాటౌట్ 60; కార్టర్ (సి) మిల్లర్ (బి) అనురీత్ 20; ఫ్రాంక్లిన్ (సి) అవానా (బి) పెరీరా 10; చిగుంబురా (సి) అనురీత్ (బి) పెరీరా 3; హోల్డర్ (సి) మిల్లర్ (బి) అవానా 12; నర్స్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1-54; 2-61; 3-106; 4-124; 5-131; 6-159. బౌలింగ్: అనురీత్ సింగ్ 4-0-32-1; అవానా 4-0-46-3; అక్షర్ పటేల్ 4-0-42-0; మాక్స్వెల్ 3-0-22-0; సెహ్వాగ్ 1-0-10-0; కరణ్వీర్ 1-0-6-0; పెరీరా 3-0-15-2 కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ ఎల్బీడబ్ల్యు (బి) మెండిస్ 31; వోహ్రా (సి) కార్టర్ (బి) రాంపాల్ 27; సాహా (సి) మునవీరా (బి) ఫ్రాంక్లిన్ 14; మాక్స్వెల్ (సి) నర్స్ (బి) రాంపాల్ 16; మిల్లర్ నాటౌట్ 46; బెయిలీ (సి) ఫ్రాంక్లిన్ (బి) మెండిస్ 7; తిసారా పెరీరా (సి) కార్టర్ (బి) నర్స్ 0; అక్షర్ పటేల్ నాటౌట్ 23; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1-41; 2-76; 3-95; 4-103; 5-127; 6-131 బౌలింగ్: హోల్డర్ 3.4-0-38-0; రాంపాల్ 4-0-50-2; ఎమ్రిట్ 2-0-17-0; ఫ్రాంక్లిన్ 2-0-17-1; జీవన్ మెండిస్ 4-0-18-2; నర్స్ 4-0-32-1.