టీమిండియా క్రికెటర్లు ఎట్టకేలకు బార్బడోస్‌ను వీడారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భారత బృందాన్ని న్యూఢిల్లీకి చేర్చేందుకు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం బార్బడోస్‌కు వచ్చింది. ఇవాళ (జులై 3) మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో విమానం టేకాఫ్ అయినట్లు తెలుస్తుంది. రేపు ఉదయం 9 గంటల లోపు భారత క్రికెటర్లు ఢిల్లీలో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. టీమిండియా రాక కోసం భారత్‌లో అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు.
T20I WORLD CUP TROPHY IS COMING BACK TO INDIA AFTER 17 LONG YEARS...!!!! 🇮🇳
- The Heroes will reach tomorrow. [Nikhil Naz] pic.twitter.com/3pk57TL7Oy— Johns. (@CricCrazyJohns) July 3, 2024
కాగా, "బెరిల్" హరికేన్ (గాలివాన) కారణంగా టీమిండియా క్రికెటర్లు ఫైనల్ మ్యాచ్‌కు వేదిక అయిన బార్బడోస్‌లో గత మూడు రోజులుగా ఇరుక్కుపోయారు. హరికేన్ తీవ్రరూపం దాల్చడంతో బార్బడోస్ ఎయిర్‌పోర్ట్‌ను మూసి వేశారు. బార్బడోస్ నగరంలో కర్ఫ్యూ అమల్లో ఉండింది. భారత క్రికెటర్లు గత మూడు రోజులుగా హోటల్ రూమ్‌లకే పరిమితమయ్యారు.
ఇదిలా ఉంటే, యూఎస్‌ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2024ను టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 17 ఏళ్ల తర్వాత భారత్ పొట్టి ప్రపంచకప్‌తో స్వదేశానికి రానుంది. వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్ స్వదేశానికి తిరిగి రాగేనే తొలుత ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉంది. అనంతరం భారత ఆటగాళ్లు ముంబై నగర వీధుల్లో ఓపెన్ టాప్ బస్‌లో ఊరేగింపుగా వెళ్తారని సమాచారం. గతంలో టీమిండియా వరల్డ్‌కప్ గెలిచినప్పుడు ఇలాగే చేశారు.
Comments
Please login to add a commentAdd a comment