మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ ఛాంపియన్‌గా బార్బడోస్ రాయల్స్ నిలిచింది. నిన్న (ఆగస్ట్ 29) జరిగిన ఫైనల్లో రాయల్స్ ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి వరుసగా రెండో ఏడాది టైటిల్ సొంతం చేసుకుంది. నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. జెనీలియా గ్లాస్గో (24), శిఖా పాండే (28), కైసియా నైట్ (17 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఆలియా అలెన్ 4 వికెట్లు తీసి నైట్‌రైడర్స్‌ను భారీ దెబ్బకొట్టింది. హేలీ మాథ్యూస్ 2, చినెల్ హెన్రీ ఓ వికెట్ పడగొట్టారు.
94 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. చమారీ ఆటపట్టు (39 నాటౌట్) రాణించడంతో 15 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. హేలీ మాథ్యూస్ (13), క్యియాన జోసఫ్(14), లారా హ్యారిస్ (15) రెండంకెల స్కోర్లు చేశారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో సమారా రామ్‌నాథ్ 2, అనిసా మొహమ్మద్, జెస్ జొనాస్సెన్, శిఖా పాండే తలో వికెట్ పడగొట్టారు. నాలుగు వికెట్లు పడగొట్టి నైట్‌రైడర్స్‌ను దెబ్బకొట్టిన ఆలియా అలెన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కగా.. టోర్నీ ఆధ్యాంతం రాణించిన హేలీ మాథ్యూస్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment