Trinbago Knight Riders
-
కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌గా బార్బడోస్ రాయల్స్
మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ ఛాంపియన్‌గా బార్బడోస్ రాయల్స్ నిలిచింది. నిన్న (ఆగస్ట్ 29) జరిగిన ఫైనల్లో రాయల్స్ ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి వరుసగా రెండో ఏడాది టైటిల్ సొంతం చేసుకుంది. నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. జెనీలియా గ్లాస్గో (24), శిఖా పాండే (28), కైసియా నైట్ (17 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఆలియా అలెన్ 4 వికెట్లు తీసి నైట్‌రైడర్స్‌ను భారీ దెబ్బకొట్టింది. హేలీ మాథ్యూస్ 2, చినెల్ హెన్రీ ఓ వికెట్ పడగొట్టారు.94 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. చమారీ ఆటపట్టు (39 నాటౌట్) రాణించడంతో 15 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. హేలీ మాథ్యూస్ (13), క్యియాన జోసఫ్(14), లారా హ్యారిస్ (15) రెండంకెల స్కోర్లు చేశారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో సమారా రామ్‌నాథ్ 2, అనిసా మొహమ్మద్, జెస్ జొనాస్సెన్, శిఖా పాండే తలో వికెట్ పడగొట్టారు. నాలుగు వికెట్లు పడగొట్టి నైట్‌రైడర్స్‌ను దెబ్బకొట్టిన ఆలియా అలెన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కగా.. టోర్నీ ఆధ్యాంతం రాణించిన హేలీ మాథ్యూస్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. -
సూపర్ ఓవర్లో నైట్‌రైడర్స్ విజయం
మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో గయానా అమెజాన్ వారియర్స్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఇరు జట్లు 128 పరుగులకు పరిమితం కాగా.. మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన అమెజాన్ వారియర్స్ ఆరు బంతుల్లో 2 వికెట్లు కోల్పోయి ఐదు పరుగులకు మాత్రమే పరిమితమైంది. ఫలితంగా నైట్‌రైడర్స్ విజయబావుటా ఎగురవేసింది.వివరాల్లోకి వెళితే.. మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్-4లో ఇవాళ గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. డియెండ్రా డొట్టిన్ (53) అర్దసెంచరీతో రాణించగా.. హర్షిత మాధవి (18), శిఖా పాండే (25), నైట్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. వారియర్స్ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, ఎరిన్ బర్న్స్, రామ్హరాక్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. క్లో టైరాన్ ఓ వికెట్ దక్కించుకుంది.129 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వారియర్స్.. ఆది నుంచి నిదానంగా ఆడి విజయం సాధించలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి నైట్‌రైడర్స్ చేసినన్ని పరుగులే చేసింది. ఎరిన్ బర్న్స్ (61) అర్ద సెంచరీతో రాణించగా.. షెమెయిన్ క్యాంప్‌బెల్ (25), లారెన్ హిల్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో జైదా జేమ్స్, గ్లాస్గో, సమారా రామ్‌నాథ్ తలో వికెట్ పడగొట్టారు. -
10 బంతులు.. ఆరు సిక్సర్లు!
సెయింట్ కిట్స్: ట్వంటీ 20 క్రికెట్ లో విధ్వంసకర ఆట తీరు ఎలా ఉండాలో మరోసారి రుచి చూపించారు న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్, వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ బ్రేవోలు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టీ 20లో భాగంగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న వీరిద్దరూ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. డారెన్ బ్రేవో 10 బంతుల్లో ఆరు సిక్సర్లతో చెలరేగి ఆడగా, మెకల్లమ్ 14 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో దూకుడుగా ఆడాడు. బ్రేవో అజేయంగా 38 పరుగులు, మెకల్లమ్ 40 నాటౌట్ లు విశేషంగా రాణించి జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించారు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాట్రియాట్స్ 13 ఓవర్లలో మూడు వికెట్లకు 162 పరుగులు చేసింది. ఓపెనర్ క్రిస్ గేల్(93;47 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. అయితే ఆపై ట్రింబాగో నైట్ రైడర్స్ ఆటగాళ్లు మెకల్లమ్, బ్రేవో దాటికి స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరి జోరుకు 5.2 ఓవర్లలో (డక్ వర్త్ లూయిస్) రెండు వికెట్లు కోల్పోయిన నైట్ రైడర్స్ 88 పరుగులు చేసి విజయం సాధించింది. ప్రధానంగా చివరి 13 బంతుల్లో మెకల్లమ్, బ్రేవోలు ఇద్దరూ కలిపి ఎనిమిది సిక్సర్లు సాధించడంతో నైట్ రైడర్స్ ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది.