మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో గయానా అమెజాన్ వారియర్స్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఇరు జట్లు 128 పరుగులకు పరిమితం కాగా.. మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన అమెజాన్ వారియర్స్ ఆరు బంతుల్లో 2 వికెట్లు కోల్పోయి ఐదు పరుగులకు మాత్రమే పరిమితమైంది. ఫలితంగా నైట్‌రైడర్స్ విజయబావుటా ఎగురవేసింది.
వివరాల్లోకి వెళితే.. మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్-4లో ఇవాళ గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. డియెండ్రా డొట్టిన్ (53) అర్దసెంచరీతో రాణించగా.. హర్షిత మాధవి (18), శిఖా పాండే (25), నైట్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. వారియర్స్ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, ఎరిన్ బర్న్స్, రామ్హరాక్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. క్లో టైరాన్ ఓ వికెట్ దక్కించుకుంది.
129 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వారియర్స్.. ఆది నుంచి నిదానంగా ఆడి విజయం సాధించలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి నైట్‌రైడర్స్ చేసినన్ని పరుగులే చేసింది. ఎరిన్ బర్న్స్ (61) అర్ద సెంచరీతో రాణించగా.. షెమెయిన్ క్యాంప్‌బెల్ (25), లారెన్ హిల్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో జైదా జేమ్స్, గ్లాస్గో, సమారా రామ్‌నాథ్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment