Guyana Amazon Warriors
-
దంచికొట్టిన రోస్టన్, జోన్స్.. కింగ్స్‌దే సీపీఎల్ టైటిల్
కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)-2024 చాంపియన్‌గా సెయింట్ లూసియా కింగ్స్ జట్టు అవతరించింది. గయానా అమెజాన్ వారియర్స్‌తో జరిగిన ఫైనల్లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. లూసియా కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ రోస్టన్ ఛేజ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.ఆకట్టుకోలేకపోయిన బ్యాటర్లుగయానా వేదికగా.. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున సెయింట్ లూసియా కింగ్స్- గయానా అమెజాన్ వారియర్స్ మధ్య సీపీఎల్ టైటిల్ పోరు జరిగింది. టాస్ గెలిచిన కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది.దెబ్బ కొట్టిన నూర్ అహ్మద్వారియర్స్ బ్యాటర్లలో టెయిలెండర్ ప్రిటోరియస్ 25 పరుగులతో టాప్ స్కోర్‌గా నిలవడం గమనార్హం. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ షాయీ హోప్ 22 పరుగులు సాధించాడు. ఇక కింగ్స్ బౌలర్లలో స్పిన్నర్ నూర్ అహ్మద్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 19 పరుగులే ఇచ్చి.. మూడు వికెట్లు కూల్చాడు.ఓపెనర్ మొయిన్ అలీ(14), హిట్టర్ షిమ్రన్ హెట్మెయిర్(11) రూపంలో కీలక వికెట్లు తీసి.. వారియర్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బకొట్టాడు. కింగ్స్ జట్టులోని మిగిలిన బౌలర్లలో ఖారీ పియరీ, మాథ్యూ ఫోర్డ్, అల్జారీ జోసెఫ్, రోస్టన్ ఛేజ్, డేవిడ్ వీస్ ఒక్కో వికెట్ పడగొట్టారు.దంచికొట్టిన రోస్టన్, జోన్స్ఇక వారియర్స్ విధించిన నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ లూసియా కింఘ్స్ 18.1 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. టాపార్డర్ విఫలమైనా మిడిలార్డర్ దంచికొట్టడంతో విజయం సాధ్యమైంది. ఓపెనర్లలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(21) ఫర్వాలేదనిపించగా.. జాన్సన్ చార్ల్స్(7) నిరాశపరిచాడు. వన్‌డౌన్ బ్యాటర్ టిమ్ సిఫార్ట్ 10 బంతులు ఎదుర్కొని మూడు పరుగులే చేశాడు.ఇలాంటి దశలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రోస్టన్ ఛేజ్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 39 పరుగులతో దుమ్ములేపాడు. ఐదో స్థానంలో వచ్చిన ఆరోన్ జోన్స్ 31 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది 48 రన్స్ చేశాడు. ఇద్దరూ కలిసి అజేయంగా నిలిచి.. లూసియా కింగ్స్‌ను విజయతీరాలకు చేర్చారు. PC: SLK Xవిజేతల జాబితా ఇదేకాగా సీపీఎల్‌లో లూసియా కింగ్స్‌కు ఇదే మొట్టమొదటి టైటిల్. ఇక 2013లో వెస్టిండీస్ వేదికగా మొదలైన ఈ టీ20 టోర్నీలో జమైకా తలైవాస్ అరంగేట్ర విజేతగా నిలిచింది. తర్వాత వరుసగా బార్బడోస్ ట్రిడెంట్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో రెడ్‌స్టీల్, జమైకా తలైవాస్, ట్రింబాగో నైట్ రైడర్స్, ట్రింబాగో నైట్ రైడర్స్, బార్బడోస్ ట్రిడెంట్స్, ట్రింబాగో నైట్ రైడర్స్, సెయింట కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్, జమైకా తలైవాస్, గయానా అమెజాన్ వారియర్స్.. తాజాగా సెయింట్ లూసియా కింగ్స్ ట్రోఫీలు కైవసం చేసుకున్నాయి.చదవండి: నేను అలా బౌలింగ్ చేయడానికి కారణం వారే: మయాంక్ యాదవ్ The wait is over 🙌 The Saint Lucia Kings are CPL Champions 🇱🇨🏆#CPL24 #CPLFinals #SLKvGAW #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/nqVbnilsAH— CPL T20 (@CPL) October 7, 2024 -
సూపర్ ఓవర్లో నైట్‌రైడర్స్ విజయం
మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో గయానా అమెజాన్ వారియర్స్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఇరు జట్లు 128 పరుగులకు పరిమితం కాగా.. మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన అమెజాన్ వారియర్స్ ఆరు బంతుల్లో 2 వికెట్లు కోల్పోయి ఐదు పరుగులకు మాత్రమే పరిమితమైంది. ఫలితంగా నైట్‌రైడర్స్ విజయబావుటా ఎగురవేసింది.వివరాల్లోకి వెళితే.. మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్-4లో ఇవాళ గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. డియెండ్రా డొట్టిన్ (53) అర్దసెంచరీతో రాణించగా.. హర్షిత మాధవి (18), శిఖా పాండే (25), నైట్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. వారియర్స్ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, ఎరిన్ బర్న్స్, రామ్హరాక్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. క్లో టైరాన్ ఓ వికెట్ దక్కించుకుంది.129 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వారియర్స్.. ఆది నుంచి నిదానంగా ఆడి విజయం సాధించలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి నైట్‌రైడర్స్ చేసినన్ని పరుగులే చేసింది. ఎరిన్ బర్న్స్ (61) అర్ద సెంచరీతో రాణించగా.. షెమెయిన్ క్యాంప్‌బెల్ (25), లారెన్ హిల్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో జైదా జేమ్స్, గ్లాస్గో, సమారా రామ్‌నాథ్ తలో వికెట్ పడగొట్టారు. -
కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్స్‌గా గయానా.. ఫైనల్లో పొలార్డ్ టీమ్ చిత్తు
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2023 ఛాంపియన్స్‌గా ఇమ్రాన్ తహీర్ సారథ్యంలోని గయానా అమెజాన్ వారియర్స్ నిలిచింది. సోమవారం గయానా వేదికగా జరిగిన ఫైనల్లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తుచేసిన అమెజాన్ వారియర్స్.. తొలిసారి సీపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్.. గయనా బౌలర్ల ధాటికి 94 పరుగులకే కుప్పకూలింది. గయనా బౌలర్లలో ప్రోటీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ 4 వికెట్లతో నైట్ రైడర్స్‌ను దెబ్బతీయగా.. మోతీ, తహీర్ తలా రెండు వికెట్లు సాధించారు. నైట్‌రైడర్స్ బ్యాటర్లలో కార్టీ(38) మినహా మిగితందరూ దారుణంగా విఫలమయయ్యారు. 100 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గయానా.. కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గయానా బ్యాటర్లలో ఓపెనర్ అయాబ్(52),హోప్(32) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఇక ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా డ్వైన్ ప్రిటోరియస్ నిలవగా.. షాయ్ హోప్‌కు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు వరించింది. చదవండి: KL Rahul: నేను అస్సలు ఊహించలేదు.. అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది -
CPL 2022: సెంచరీతో విండీస్ హిట్టర్ విధ్వంసం.. ఫైనల్లో జమైకా తలైవాస్
కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2022)లో జమైకా తలైవాస్ ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం రాత్రి గయానా అమెజాన్ వారియర్స్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో జమైకా తలైవాస్ 37 పరుగులతో విజయాన్ని అందుకుంది. విండీస్ హార్డ్ హిట్టర్ షమ్రా బ్రూక్స్ కీలక సమయంలో సెంచరీతో మెరిసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన జమైకా తలైవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీస్కోరు చేసింది. షమ్రా బ్రూక్స్(52 బంతుల్లో 109 నాటౌట్, 7 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. రోవ్‌మెన్ పావెల్ 23 బంతుల్లో 37 పరుగులు చేయగా.. చివర్లో ఇమాద్ వసీమ్ 15 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. గయానా వారియర్స్ బౌలర్లలో రొమెరియో షెపర్డ్ రెండు వికెట్లు తీయగా.. తాహిర్, ఓడియన్ స్మిత్‌లు చెరొక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 189 పరుగులు మాత్రమే చేసింది. కీమో పాల్ 56 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. షెయ్ హోప్ 31 పరుగులు, ఓడెన్ స్మిత్ 24 పరుగులు చేశారు. జమైకా తలైవాస్ బౌలర్లలో ఇమాద్ వసీమ్, క్రిస్ గ్రీన్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ ఆమిర్, ఫాబియెన్ అలెన్, రోవ్‌మెన్ పావెలు తలా ఒక వికెట్ తీశారు. -
తొలి సారి కెప్టెన్‌గా షిమ్రాన్ హెట్‌మైర్.. ఏ జట్టుకంటే..?
సీపీఎల్-2022 సీజన్‌కు గానూ గయానా అమెజాన్ వారియర్స్ కెప్టెన్‌గా విండీస్ పవర్ హిట్టర్ షిమ్రాన్ హెట్‌మైర్ ఎంపికయ్యాడు. నికోలస్ పూరన్ స్థానంలో గయానా సారథిగా హెట్‌మైర్ నియమితుడయ్యాడు . ఈ ఏడాది సీజన్లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున నికోలస్ పూరన్ ఆడనుండడంతో గయానా మేనేజేమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. హెట్‌మైర్ 2016లో కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో అగేంట్రం చేసినప్పటి నుంచి అమెజాన్ వారియర్స్ జట్టలోనే కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు పూరన్, షోయబ్ మాలిక్, క్రిస్ గ్రీన్ కెప్టెన్సీలో గయానాకు ప్రాతినిధ్యం వహించాడు. "2013 సీజన్ తర్వాత మా తొలి కెప్టెన్‌గా షిమ్రాన్ హెట్‌మైర్ నియమితుడైనందుకు మేము సంతోషిస్తున్నాము. గత కొన్ని సీజన్ల నుంచి హెట్‌మైర్ మా జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. అతడు నాయకత్వం వహించడానికి ఇదే సరైన సమయం" అని అమెజాన్ వారియర్స్ చైర్మన్ బాబీ రామ్‌రూప్ పేర్కొన్నారు. ఇక సీపీఎల్‌లో ఇప్పటివరకు 47 మ్యాచ్‌లు ఆడిన హెట్‌మైర్ 1149 పరుగులు సాధించాడు. కాగా కరీబీయన్ ప్రీమియర్ లీగ్ ఆగస్టు 31 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో జమైకా తల్లావాస్, సెయింట్ కిట్స్ జట్లు తలపడనున్నాయి. చదవండి: ENG vs SA: పాపం ప్రోటీస్ కెప్టెన్.. దురదృష్టం వెంటాడితే ఇలాగే ఉంటుంది! -
Chris Gayle: గేల్ బ్యాటింగ్.. బ్యాట్ రెండు ముక్కలు; వీడియో వైరల్
జమైకా: యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ బ్యాట్ రెండు ముక్కలవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీపీఎల్ 2021లో భాగంగా గయానా అమెజాన్ వారియర్స్, సెంట్ కిట్స్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. సెంట్ కిట్స్ ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 4వ ఓవర్‌ను ఒడియన్ స్మిత్ వేశాడు. ఓవర్ రెండో బంతిని స్మిత్ లెగ్‌స్టంప్ దిశగా వేశాడు. గేల్ దానిని ఆఫ్‌సైడ్ ఆడుదామని భావించాడు. అయితే బంతి బ్యాట్‌కు బలంగా తగలడంతో రెండు ముక్కలైంది. బ్యాట్ కింద పడిపోగా.. హ్యాండిల్ మాత్రం గేల్ చేతిలో ఉండిపోయింది. ఆ తర్వాత గేల్ పడిపోయిన బ్యాట్‌ను పరిశీలించి కొత్త బ్యాట్ తెప్పించుకొని ఇన్నింగ్స్ కొనసాగించాడు. చదవండి: Chris Gayle: గేల్ సిక్స్ కొడితే మాములుగా ఉంటుందా.. చదవండి: SL Vs SA: డికాక్ మెరుపులు.. 10 వికెట్లతో విజయం; దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్ ఇక సెమీస్‌లో సెంట్ కిట్స్ గయానాపై గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది. గయానా గయానా విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని సెంట్ కిట్స్ మూడు వికెట్లు మాత్రమే కోల్పయి 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ లూయిస్ (39 బంతుల్లో 77 నాటౌట్, 3 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ 9 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. హెట్‌మైర్ (45, 20 బంతులు; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. చదవండి: Evin Lewis CPL 2021: లూయిస్ సిక్సర్ల విధ్వంసం.. దర్జాగా ఫైనల్‌కు Batting malFUNction for @henrygayle #GAWvSKNP #CPL21 #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/kuPgIs7DuY — CPL T20 (@CPL) September 14, 2021 -
CPL 2021: లూయిస్ సిక్సర్ల విధ్వంసం.. దర్జాగా ఫైనల్‌కు
జమైకా: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2021)లో ఎవిన్ లూయిస్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ చివరి వరకు నాటౌట్‌గా నిలిచిన లూయిస్ ఒంటిచేత్తో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. గయానా అమెజాన్ వారియర్స్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియెట్స్ ఘన విజయాన్ని సాధించి దర్జాగా ఫైనల్లో అడుగుపెట్టింది. చదవండి: Lasit Malinga: నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు; ఇక ఎవరికి సాధ్యం గయానా విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని సెంట్ కిట్స్ మూడు వికెట్లు మాత్రమే కోల్పయి 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ లూయిస్ (39 బంతుల్లో 77 నాటౌట్, 3 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసానికి తోడూ క్రిస్ గేల్ (27 బంతుల్లో 42, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ బ్రేవో 31 బంతుల్లో 34,3 ఫోర్లు, 1 సిక్సర్) తోడవ్వడంతో సునాయాసంగా విజయం సాధించింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ 9 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. హెట్‌మైర్ (45, 20 బంతులు; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించగా.. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ 27, చంద్రపాల్ 27 పరుగులు చేశారు. Evin Lewis: 11 సిక్సర్లతో లూయిస్ విధ్వంసం.. సెంచరీతో గెలిపించాడు Yet again Evin Lewis produces a batting masterclass and earns the @Dream11 MVP from semi final two. #CPL21 #GAWvSKNP #CricketPlayedLouder #Dream11 pic.twitter.com/qoKzrsz9fi — CPL T20 (@CPL) September 14, 2021 -
సిక్సర్లతో శివమెత్తిన పూరన్.. ఫ్లే ఆఫ్‌కు మరింత చేరువగా
జమైకా: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2021)లో నికోలస్ పూరన్ మరోసారి సిక్సర్ల వర్షం కురిపించాడు. (39 బంతుల్లో 75 పరుగులు నాటౌట్, 4 ఫోర్లు, 7 సిక్సర్లతో) రెచ్చిపోయిన పూరన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో గయానా అమెజాన్ వారియర్స్‌కు కీలక విజయాన్ని అందించాడు. జమైకా తలైవాస్‌తో జరిగిన మ్యాచ్‌లో గయానా విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలవడంతో పాటు ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఇక జమైకా తలైవాస్ వరుస ఓటములతో మరింత అట్టడుగుకు చేరింది. లీగ్‌లో నిలవాలంటే జమైకా అన్ని మ్యాచ్‌లు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదవండి: Viral Video: రనౌట్ అవకాశం; ఊహించని ట్విస్ట్.. ఫీల్డర్ల పరుగులు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్, చంద్రపాల్, హెట్‌మైర్, షోయబ్ మాలిక్‌లు మంచి ఆరంభాలే ఇచ్చినప్పటికీ పెద్ద స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. అయితే ఫామ్‌లో ఉన్న పూరన్ మాత్రం తన విధ్వంసాన్ని కొనసాగించాడు. కొడితే ఫోర్ లేదంటే సిక్స్ అన్న తరహాలో పూరన్ ఇన్నింగ్స్ సాగింది. 18వ ఓవర్ వరకు సాదాసీదాగా ఉన్న వారియర్స్ స్కోరు పూరన్ ధాటికి చివరి రెండు ఓవర్లలో 30 పరుగులతో 160కి పైగా పరుగులు చేసింది. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జమైకా తైలవాస్ 19.1 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటై 46 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. కిర్క్ మెకెంజీ 28 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గయానా బౌలర్లలో ఓడియన్ స్మిత్ 3 వికెట్లు తీశాడు. చదవండి: CPL 2021: వసీమ్, రసెల్ ఆల్‌రౌండ్ మెరుపులు.. సెమీస్ ఆశలు సజీవం MASSIVE!!! Nicholas Pooran goes LARGE with the @OmegaXL hit from match 26, #CPL21 #JTvGAW #CricketPlayedLouder #OmegaXL pic.twitter.com/7fRnfIRBEA — CPL T20 (@CPL) September 11, 2021 -
చంద్రపాల్ సునామీ శతకం.. గయానా ఘన విజయం
సెయింట్ కిట్స్: కరీబియన్ ప్రిమియర్ లీగ్ 2021లో భాగంగా బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ చంద్రపాల్ హేమరాజ్(56 బంతుల్లో 105 నాటౌట్; 14 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి నిర్ధేశించిన లక్ష్యాన్ని ఒంటిచేత్తో ఛేదించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బార్బడోస్ రాయల్స్.. నిర్ణీత ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. గయానా వారియర్స్ బౌలర్లు ఇమ్రాన్ తాహిర్(3/34), రోమారియో షెపర్డ్(2/33), మోటీ(1/15), ఓడియన్ స్మిత్(1/22) దెబ్బకు బార్బడోస్ జట్టు పేకమేడలా కూలింది. An amazing performance by Chandrapaul Hemraj sees the Warriors star receive our @Dream11 MVP for match 16. #CPL21 #GAWvBR #Dream11 @CricketPlayedLouder pic.twitter.com/STQ2xb6N0r— CPL T20 (@CPL) September 4, 2021 ఈ ఇన్నింగ్స్‌లో బార్బడోస్ ఆటగాళ్లు ముగ్గురు రనౌట్ కాగా, వికెట్‌కీపర్ అజామ్ ఖాన్(28) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 131 పరుగుల ఛేదనలో హేమరాజ్ ఒక్కడే అజేయమైన 105 పరుగులు సాధించడంతో గయానా జట్టు 14.2 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా ప్రత్యర్ధిపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గయానా మరో ఓపెనర్ బ్రెండన్ కింగ్(17 బంతుల్లో 19; 2 ఫోర్లు) వికెట్ బార్బడోస్ బౌలర్ యంగ్‌కు దక్కింది. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్(13 బంతుల్లో 8 నాటౌట్; ఫోర్)తో కలసి హేమరాజ్ గయానాను విజయతీరాలకు తీర్చాడు. Take a bow Chandrapaul Hemraj what a performance 👏👏👏 #CPL21 #GAWvBR #CricketPlayedLouder pic.twitter.com/FA9xjmN7GU— CPL T20 (@CPL) September 4, 2021 చదవండి: వైరలవుతున్న రోహిత్ ఐదేళ్ల కిందటి ట్వీట్.. ‘చెప్పాడంటే చేస్తాడంతే’ -
షెఫర్డ్ అద్భుత స్పెల్.. సూపర్ ఓవర్లో థ్రిల్లింగ్ విక్టరీ
సెంట్ కిట్స్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2021)లో బుధవారం గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. లీగ్‌లో తొలిసారి సూపర్ ఓవర్‌కు దారి తీసిన ఈ మ్యాచ్‌లో గయానా వారియర్స్ విజయాన్ని అందుకుంది. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. కొలిన్ మున్రో 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఉడాన 21, నరైన్ 21 పరుగులు చేశారు. రొమారియె షెఫర్డ్ , మహ్మద్ హఫీజ్‌లు చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులే చేసింది. హెట్‌మైర్ , నికోలస్ పూరన్‌లు 27 పరుగులు చేశారు. చదవండి: పొట్టి క్రికెట్లో అరుదైన మైలురాయిని దాటేసిన విండీస్ యోధుడు మ్యాచ్‌లో ఫలితం రాకపోవడంతో అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా వారియర్స్ 2 వికెట్లు కోల్పోయి 6 పరుగులు మాత్రమే చేసింది. ఇక ట్రిన్‌బాగో సులువుగా గెలుస్తుందని అంతా భావించారు. కానీ ఇక్కడే షెఫర్డ్ తన బౌలింగ్ మ్యాజిక్‌ను చూపించాడు. షెఫర్డ్ వేసిన తొలి బంతికే పొలార్డ్ ఔట్ కావడంతో విజయానికి ఐదు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సి ఉంది. రెండో బంతికి సింగిల్ రాగా.. మూడు బంతికి పరుగు రాలేదు. ఇక నాలుగో బంతికి రెండు పరుగులు రాగా.. చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు కావాలి. ఐదో బంతికి పరుగు రాకపోవడం.. ఆరో బంతికి సింగిల్ రావడంతో ట్రిన్‌బాగో నాలుగు పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. ఈ విజయంతో గయానా వారియర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా.. మ్యాచ్‌లో ఓడినప్పటికీ ట్రిన్‌బాగో మూడో స్థానంలోనే కొనసాగుతుంది. చదవండి: వైడ్ ఇవ్వలేదన్న కోపంలో పోలార్డ్ ఏం చేశాడో చూడండి.. -
నేటి నుంచి ధనాధన్ క్రికెట్ లీగ్ ప్రారంభం.. భారత్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం
సెయింట్ కిట్స్: ఐపీఎల్ తరువాత ఆ స్థాయిలో ప్రేక్షకాదరణ కలిగిన కరీబియన్ ప్రిమియర్ లీగ్-2021 నేటి నుంచి ప్రారంభంకానుంది. ఐపీఎల్‌ను తలపించేలా భారీ షాట్లతో అలరించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధ్వంసకర యోధులు సిద్ధంగా ఉన్నారు. విండీస్ విధ్వంసకర వీరులు క్రిస్ గేల్, కీరన్ పోలార్డ్, ఆండ్రీ రసెల్, డ్వేన్ బ్రావో సహా వివిధ దేశాలకు చెందిన చాలా మంది స్టార్ క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడనున్నారు. దీంతో ఐపీఎల్‌కు ముందే ధనాధన్ బ్యాటింగ్ విన్యాసాలు క్రికెట్ అభిమానులకు కనువిందు చేయనున్నాయి. లీగ్‌లో భాగంగా తొలి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. సెయింట్ కిట్స్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్(నికోలస్ పూరన్ జట్టు), ట్రింబాగో నైట్ రైడర్స్(పోలార్డ్ జట్టు) తలపడనున్నాయి. ఇదిలా ఉంటే, సీపీఎల్-2021లో భాగంగా జరిగే మ్యాచ్‌లన్నింటినీ స్టార్ స్పోర్ట్స్, ఫ్యాన్ కోడ్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. భారత సహా మరో 100 దేశాల్లో ఈ మ్యాచ్‌లు లైవ్ టెలికాస్ట్ కానున్నాయి. అలాగే సామాజిక మాధ్యమాలైన ట్విటర్, ఫేస్బుక్, యుట్యూబ్ ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారాలు చేయనున్నట్లు కరీబియన్ ప్రీమియర్ లీగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పీట్ రస్సెల్స్ తెలిపారు. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో విండీస్ క్రికెట్ బోర్డు కొన్ని అంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. స్టేడియాల్లోకి 50 శాతం మంది అభిమానులకు మాత్రమే అనుమితిస్తున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 15న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఈ లీగ్ ముగియనుండగా, సరిగ్గా నాలుగు రోజుల తర్వాత(సెప్టెంబర్19) యూఏఈ వేదికగా ఐపీఎల్-2021 మలి దశ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. చదవండి: ఇంగ్లండ్ అభిమానుల ఓవరాక్షన్.. సిరాజ్‌పై బంతితో దాడి -
చిన్నప్పుడు ఏమైనా స్ప్రింగులు మింగాడా
జమైకా : టీ20 క్రికెట్ అంటేనే ధనాధన్ ఆటలా ఉంటుంది.. బ్యాట్స్‌మన్ వీర బాదుడు, ఫీల్డింగ్ నైపుణ్యాలు, బౌలర్లు బంతితో చేసే మేజిక్‌లు కళ్ల ముందు కదులుతాయి. అటువంటి టీ20 క్రికెట్లో వికెట్ దొరకడమే కష్టం.. ఆరంభం నుంచి బాదుడే పనిగా పెట్టుకునే బ్యాట్స్మెన్లకు బౌలర్లు చుక్కులు చూపించడం కొంచెం కష్టమే. అందుకేనేమో టీ20 ఆటలో బౌలర్‌కు వికెట్ లభించగానే పెద్ద పండగలా చేసుకుంటారు. ఇంకొందరు మాత్రం మరికాస్త ముందుకెళ్లి తమదైన శైలిలో సెలబ్రేషన్ నిర్వహించుకుంటారు. సీపీఎల్ 2020 లీగ్ సందర్భంగా గురువారం గయానా వారియర్స్, బార్బడోస్ ట్రైడెంట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ను ఉదాహరణగా చెప్పొచ్చు. గయానా వారియర్స్ బౌలర్ కెవిన్ సింక్లెయిర్ కీలక ఆటగాడిని ఔట్ చేసా అన్న ఆనందంలో దొమ్మరిగడ్డలు వేస్తూ తన సరదాను తీర్చుకున్నాడు. సాధారణంగా సోమర్‌సాల్ట్స్(దొమ్మరిగడ్డలు) కాళ్లతో వేస్తుంటారు. కానీ సింక్లెయిర్ ఒకసారి మాత్రమే కాళ్లను ఉపయోగించి మిగతా రెండుసార్లు గాలిలోనే పల్టీలు కొట్టాడు. ఇది చూసిన మిగతా ఆటగాళ్ల సింక్లెయిర్ చిన్నప్పుడు ఎమైనా స్రింగులు మింగాడా అనే సందేహం కలిగింది. ప్రస్తుతం సింక్లెయిర్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(చదవండి : ‘సచిన్‌ను మర్చిపోతారన్నాడు’) బార్బడోస్ బ్యాటింగ్ చేస్తున్న 16 వ ఓవర్లో సింక్లెయిర్ ఈ విన్యాసం చేశాడు. లీగ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న మిచెల్ సాంట్నర్.. తన బౌలింగ్‌లో వికెట్‌గా వెనుదిరగడంతోనే ఇలా చేసినట్లు సింక్లెయిర్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బార్బడోస్ జట్టు 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 89 పరుగులే చేసింది. 90 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గయానా అమెజాన్ వారియర్స్ 15 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఈ విజయంతో లీగ్‌లో రెండోస్థానానికి చేరుకున్న గయానా వారియర్స్ సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేసిన డిపెండింగ్ చాంపియన్ బార్బడోస్ ట్రైడెంట్స్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచి లీగ్ నుంచి నిష్క్రమించింది. Double?? Treble?? Definitely Double Trouble in the Bubble!! What a celebration! #CPL20 #CricketPLayedLouder pic.twitter.com/3N2oKNAzRy — CPL T20 (@CPL) September 3, 2020 -
ఆసిఫ్.. ఇంత కోపం పనికిరాదు
-
'నువ్వు ఔట్ అయ్యావు.. క్రీజు వదిలివెళ్లు'
జమైకా : కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో(సీపీఎల్ 2020) బుధవారం జమైకా తలైవాస్, గుయానా అమెజాన్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో జమైకా జట్టు తరపున బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ క్రికెటర్ ఆసిఫ్ అలీ 3 పరుగులకే ఔటయ్యాడు. కరీబియన్ లీగ్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్న ఆసిఫ్ అలీ.. ఈ మ్యాచ్‌లోనూ బారీషాట్ ఆడబోయి డీప్ మిడ్-వికెట్ రీజియన్‌లో క్రిస్ గ్రీన్ అద్భుత డ్రైవ్‌తో క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే అప్పటికే పరుగు కోసం సగం క్రీజులోకి పరిగెత్తుకొచ్చిన ఆసిఫ్ అలీని ఉద్ధేశించి ఆసిఫ్..'నువ్వు ఔట్ అయ్యావు.. క్రీజు వదిలి వెళ్లు..' అంటూ కీమో పాల్ సైగ చేశాడు. అప్పటికే ఔట్ అయ్యాననే కోపంలో ఉన్న ఆసిఫ్ కీమో పాల్ వైపు బ్యాట్ ఎత్తాడు. అయితే ఆసిఫ్ బ్యాట్ నుంచి తృటిలో తప్పించుకున్న కీమో.. ఊహించని పరిణామానికి ఒక్కసారిగా షాకయ్యాడు. అయితే కీమో పాల్ కోపంతో ఆసిఫ్ వైపు తిరిగినా అప్పటికే అతను వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్‌లో జమైకా జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఆసిఫ్ అలీకి చేసిన పనికి మాత్రం క్రమశిక్షణ చర్యల కింద జరిమానాతో విధించే అవకాశం ఉంది. చదవండి : కోహ్లి, రోహిత్‌ల ఆధిపత్యం మ్యాచ్‌లోనూ మాస్క్.. కీమో పాల్ వీడియో వైరల్ -
సీపీల్ టైటిల్ గెలిచిన క్రిస్ గేల్ టీమ్
సెయింట్ కిట్స్: క్రిస్ గేల్ నాయకత్వంలోని జమైకా తల్వాస్ టీమ్.. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)-2016 విజేతగా నిలిచింది. శనివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గయానా అమెజాన్ వారియర్స్ ను 9 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ దక్కించుకుంది. కెప్టెన్ క్రిస్ తనదైన శైలిలో ఆడి జట్టుకు సునాయాస విజయాన్ని అందించాడు. 94 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని జమైకా టీమ్ 43 బంతులు మిగిలివుండగానే ఛేదించింది. 12.5 ఓవర్లలో వికెట్ నష్టపోయి 95 పరుగులు చేసింది. గేల్ 27 బంతుల్లో 6 సిక్సర్లు, 3 ఫోర్లతో 54 పరుగులు చేసి అవుటయ్యాడు. వాల్టన్(25), సంగక్కర(12) నాటౌట్ గా నిలిచారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన జమైకా 16.1 ఓవరల్లో 93 పరుగులకు ఆలౌటైంది. జమైకా బౌలర్లలో ఇమాద్ వసీం 3, షకీబ్ అల్ హసన్ 2, విలియమ్స్ 2 వికెట్లు పడగొట్టారు. రసెల్, థామస్ చెరో వికెట్ తీశారు. ఇమాద్ వసీం 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు. రసెల్ కు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' దక్కింది. జమైకా తల్వాస్.. సీపీఎల్ దక్కించుకోవడం ఇది రెండోసారి.