సత్తా చాటిన ప్రిటోరియస్‌.. బోణీ కొట్టిన అమెజాన్‌ వారియర్స్‌ | Global Super League: Guyana Amazon Warriors Beat Lahore Qalandars By 6 Wickets | Sakshi
Sakshi News home page

సత్తా చాటిన ప్రిటోరియస్‌.. బోణీ కొట్టిన అమెజాన్‌ వారియర్స్‌

Published Wed, Nov 27 2024 9:50 AM | Last Updated on Wed, Nov 27 2024 9:50 AM

Global Super League: Guyana Amazon Warriors Beat Lahore Qalandars By 6 Wickets

గాయానా వేదికగా గ్లోబల్‌ సూపర్‌ లీగ్‌ ఇవాల్టి నుంచి (భారతకాలమానం ప్రకారం) ప్రారంభమైంది. లీగ్‌లో భాగంగా ఇవాళ (నవంబర్‌ 27) లహోర్‌ ఖలందర్స్‌, గయానా అమెజాన్‌ వారియర్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో లాహోర్‌ ఖలందర్స్‌పై.. అమెజాన్‌ వారియర్స్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఖలందర్స్‌ 19.2 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. టామ్‌ ఏబెల్‌ (48) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. వికెట్‌కీపర్‌ రొసింగ్టన్‌ (25), లూక్‌ వెల్స్‌ (11) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. అమెజాన్‌ వారియర్స్‌ బౌలర్లలో ప్రిటోరియస్‌ 4 వికెట్లు పడగొట్టగా.. తంజిమ్‌ హసన్‌ సకిబ్‌, హసన్‌ ఖాన్‌ తలో 2 వికెట్లు, ఇమ్రాన్‌ తాహిర్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు.

126 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అమెజాన్‌ వారియర్స్‌.. షాయ్‌ హోప్‌ (45 నాటౌట్‌), కీమో పాల్‌ (27 నాటౌట్‌) రాణించడంతో 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. వారియర్స్‌ ఇన్నింగ్స్‌లో మొయిన్‌ అలీ 17, మార్క్‌ దయాల్‌ 1, షిమ్రోన్‌ హెట్‌మైర్‌ 14, రోస్టన్‌ ఛేస్‌ 15 పరుగులు చేశారు. ఖలందర్స్‌ బౌలర్లలో సల్మాన్‌ మిర్జా, ఆసిఫ్‌ అఫ్రిది తలో 2 వికెట్లు పడగొట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement