Dwaine Pretorius
-
సత్తా చాటిన ప్రిటోరియస్.. బోణీ కొట్టిన అమెజాన్ వారియర్స్
గాయానా వేదికగా గ్లోబల్ సూపర్ లీగ్ ఇవాల్టి నుంచి (భారతకాలమానం ప్రకారం) ప్రారంభమైంది. లీగ్‌లో భాగంగా ఇవాళ (నవంబర్ 27) లహోర్ ఖలందర్స్, గయానా అమెజాన్ వారియర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్‌పై.. అమెజాన్ వారియర్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్ 19.2 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. టామ్ ఏబెల్ (48) టాప్ స్కోరర్‌గా నిలువగా.. వికెట్‌కీపర్ రొసింగ్టన్ (25), లూక్ వెల్స్ (11) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. అమెజాన్ వారియర్స్ బౌలర్లలో ప్రిటోరియస్ 4 వికెట్లు పడగొట్టగా.. తంజిమ్ హసన్ సకిబ్, హసన్ ఖాన్ తలో 2 వికెట్లు, ఇమ్రాన్ తాహిర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.126 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అమెజాన్ వారియర్స్.. షాయ్ హోప్ (45 నాటౌట్), కీమో పాల్ (27 నాటౌట్) రాణించడంతో 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. వారియర్స్ ఇన్నింగ్స్‌లో మొయిన్ అలీ 17, మార్క్ దయాల్ 1, షిమ్రోన్ హెట్‌మైర్ 14, రోస్టన్ ఛేస్ 15 పరుగులు చేశారు. ఖలందర్స్ బౌలర్లలో సల్మాన్ మిర్జా, ఆసిఫ్ అఫ్రిది తలో 2 వికెట్లు పడగొట్టారు. -
నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన సఫారీ క్రికెటర్
కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, గయానా అమెజాన్ వారియర్స్ జట్లు తలపడ్డాయి. అయితే ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఈ మ్యాచ్‌లో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్‌పై 3 వికెట్ల తేడాతో అమెజాన్ థ్రిల్లింగ్ విజయం సాధించింది. ఈ విజయంలో గయానాకు ప్రాతినిథ్యం వహిస్తున్న సఫారీ ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ కీలక పాత్ర పోషించాడు. చివరి బంతికి సిక్స్ కొట్టి మరి ప్రిటోరియస్ తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. చివరి ఓవర్లో గయనా విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ఆంటిగ్వా కెప్టెన్ క్రిస్ గ్రీన్ చివరి ఓవర్ వేసే బాధ్యతను స్టార్ పేసర్ మహ్మద్ అమీర్‌కు అప్పగించాడు. తొలి బంతిని ప్రిటోరియస్ పరుగులేమీ చేయలేకపోయాడు. దీంతో గయానా డౌగట్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. సరిగ్గా ఇదే సమయంలో ప్రిటోరియస్ అద్బుతం చేశాడు. తర్వాత నాలుగు బంతులకు మూడు ఫోర్లు కొట్టి మ్యాచ్ ను తమవైపు మలుపు తిప్పాడు. చివరి బంతికి విజయానికి నాలుగు పరుగులు కావాల్సిన దశలో కవర్స్ మీదుగా సిక్సర్ కొట్టి సంచలన విజయాన్ని తన జట్టుకు అందించాడు. ప్రిటోరియస్ 10 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 20 పరుగులు చేశాడు. అతడి మెరుపు ఇన్నింగ్స్ ఫలితంగా గయానా 169 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గయనా ఇన్నింగ్స్‌లో షాయ్ హోప్(41), షెఫార్డ్(32) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఆంటిగ్వా బ్యాటర్లలో ఫఖార్ జమాన్(40), ఇమాద్ వసీం(40) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు. DWAINE PRETORIUS WHAT HAVE YOU DONE 🔥pic.twitter.com/PIIuExsRtj— Durban's Super Giants (@DurbansSG) August 31, 2024 -
నిప్పులు చెరిగిన ప్రిటోరియస్.. ఫైనల్లో మార్వెల్స్
లంక ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ చివరి దశకు చేరింది. ఇవాళ (జులై 18) జరిగిన తొలి క్వాలిఫయర్‌లో గాలే మార్వెల్స్.. జాఫ్నా కింగ్స్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జాఫ్నా కింగ్స్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేయగా.. మార్వెల్స్ మరో 11 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది.నిప్పులు చెరిగిన ప్రిటోరియస్తొలుత బౌలింగ్ చేసిన మార్వెల్స్.. డ్వేన్ ప్రిటోరియస్ నిప్పులు చెరగడంతో (4-0-23-4) జాఫ్నాను 177 పరుగులకు పరిమితం చేయగలిగింది. ఉడాన 2, ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ తీశారు. జాఫ్నా ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ 46, రిలీ రొస్సో 40, అవిష్క ఫెర్నాండో 52 పరుగులు చేశారు.చెలరేగిన సీఫర్ట్, లియనగే178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మార్వెల్స్.. టిమ్ సీఫర్ట్ (41 బంతుల్లో 62 నాటౌట్; 9 ఫోర్లు, సిక్స్), జనిత్ లియనగే (36 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. మార్వెల్స్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ హేల్స్ (21 బంతుల్లో 36; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. జాఫ్నా బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్, ఫేబియన్ అలెన్, తబ్రేజ్ షంషి తలో వికెట్ పడగొట్టారు.జాఫ్నాకు మరో అవకాశంఈ మ్యాచ్‌లో ఓడినా జాఫ్నా ఫైనల్‌కు చేరాలంటే మరో అవకాశం ఉంది. ఇవాళ రాత్రి జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్‌లో (కొలొంబో స్ట్రయికర్స్ వర్సెస్ క్యాండీ ఫాల్కన్స్) గెలిచే జట్టుతో జాఫ్నా క్వాలిఫయర్-2లో తలపడుతుంది. ఈ మ్యాచ్ జులై 20న జరుగుతుంది. క్వాలిఫయర్-2లో గెలిచే జట్టు జులై 21న జరిగే అంతిమ సమరంలో గాలే మార్వెల్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. -
చెన్నై సూపర్ కింగ్స్‌తో తెగదింపులు.. స్టార్ ఆల్‌రౌండర్ పోస్ట్ వైరల్
ఐపీఎల్-2024 సీజన్ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, దక్షిణాఫ్రికా ఆటగాడు డ్వేన్ ప్రిటోరియస్‌ను సీఎస్కే వేలంలోకి విడిచిపెట్టింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రిటోరియస్ దృవీకరించాడు. కాగా గత రెండు సీజన్లలో సీఎస్కేకు ప్రిటోరియస్ ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్-2022 మెగా వేలంలో సీఎస్కే ఫ్రాంచైజీ అతనిని 50 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. అతడు సీఎస్కే తరపున 7 మ్యాచ్‌లు ఆడి 44 పరుగులు చేసి ఆరు వికెట్లు పడగొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో గడిపిన ప్రతిక్షణం ఓ అద్భుతం. సీఎస్కే నుంచి చాలా నేర్చుకున్నాను. జట్టులో నాకు మద్దతుగా నిలిచిన సీఎస్కే మేనేజ్మెంట్, కోచ్‌లు, ఆటగాళ్లందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అభిమానులకు కూడా స్పెషల్ థ్యాంక్స్. ఐపీఎల్-2024 సీజన్లో కూడా సీఎస్కే మరింత అద్భుతంగా రాణించాలని అశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ సీఎస్కే అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రిటోరియస్ రాసుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2024 సీజన్‌కు ఆయా ప్రాంఛైజీలు తమ ఆటగాళ్ల రిటేన్షన్ జాబితాను బీసీసీఐకి సమర్పించడానికి గడువు నేటితో ముగియనుంది. చదవండి: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా: ఏబీ డివిలియర్స్ View this post on Instagram A post shared by DWAINE PRETORIUS (@dwainep_29) -
వామ్మో ఇదేం షాట్.. దెబ్బకు కిటికీ పగిలిపోయింది! వీడియో వైరల్
CPL 2023 - Guyana Amazon Warriors vs Jamaica Tallawahs: జమైకా తల్లావాస్ ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్ అద్భుత షాట్‌తో అలరించాడు. గయానా అమెజాన్ వారియర్స్‌తో మ్యాచ్‌లో మాసివ్ సిక్సర్‌తో మెరిశాడు. అతడు కొట్టిన భారీ సిక్స్ దెబ్బకు గయానా స్టేడియం వద్ద గల కిటికీ అద్దం పగిలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కరేబియన్ ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా బుధవారం జమైకా తల్లావాస్, గయానా అమెజాన్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ రెండు సిక్సర్లు హైలైట్ గయానాలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న వారియర్స్.. జమైకాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో కెప్టెన్, ఓపెనర్ బ్రాండన్ కింగ్ అర్ధ శతకం(52)తో మెరవగా.. ఫాబియన్ అలెన్ 21 పరుగులతో రెండో టాప్ స్కోరర్(నాటౌట్)గా నిలిచాడు. 14 బంతులు ఎదుర్కొన్న ఈ విండీస్ ఆల్‌రౌండర్ ప్రిటోరియస్, ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో రెండు అదిరిపోయే సిక్సర్లు బాదడం హైలైట్‌గా నిలిచింది. డ్వేన్ ప్రిటోరియస్ బౌలింగ్‌లో 18వ ఓవర్ ఆఖరి బంతికి కిటికీని పగలగొట్టిన అలెన్.. తదుపరి ఓవర్లో తాహిర్ వేసిన బంతిని 103 మీటర్ల సిక్సర్‌గా మలిచాడు. ఓపెనర్ సంచలన ఇన్నింగ్స్ కింగ్, అలెన్ మినహా మిగతా వాళ్లు విఫలం చెందిన క్రమంలో.. నిర్ణీత 20 ఓవర్లలో జమైకా జట్టు 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. అయితే, లక్ష్య ఛేదనకు దిగిన వారియర్స్‌కు సయీమ్ అయూబ్ 53 బంతుల్లో 85 పరుగులతో దంచికొట్టాడు. మరో ఓపెనర్ మాథ్యూ నందు 37 పరుగులతో రాణించడంతో 18.3 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసి విజయం సాధించింది. సయీమ్ అయూబ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. Fabian Allen SMASHES a window with an enormous six for the @BetBarteronline Magic Moment 💥#CPL23 #GAWvJT #CricketPlayedLouder #BiggestPartyInSport #BetBarter pic.twitter.com/aNDkImZH72 — CPL T20 (@CPL) September 14, 2023 -
దంచికొట్టిన రొమారియో షెపర్డ్.. ప్రిటోరియస్ ఆల్‌రౌండ్ షో
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా సెయింట్ కిట్స్ నెవిస్ అండ్ పేట్రియాట్స్‌తో నిన్న (సెప్టెంబర్ 2) జరిగిన మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ 98 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా.. సైమ్ అయూబ్ (13 బంతుల్లో 21; 3 ఫోర్లు, సిక్స్), షిమ్రోన్ హెట్‌మైర్ (22 బంతుల్లో 36; ఫోర్, 3 సిక్సర్లు), కీమో పాల్ (31 బంతుల్లో 41 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), ప్రిటోరియస్ (20 బంతుల్లో 27; 2 ఫోర్లు, సిక్స్), రొమారియో షెపర్డ్ (7 బంతుల్లో 26 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. పేట్రియాట్స్ బౌలర్లలో ఒషేన్ థామస్ 3 వికెట్లు పడగొట్టగా.. కోర్బిన్ బోష్, జార్జ్ లిండే, డొమినిక్ డ్రేక్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పేట్రియాట్స్.. ప్రిటోరియస్ (3-0-17-3), గుడకేశ్ మోటీ (4-0-15-2), రొమారియో షెపర్డ్ (1/19), జూనియర్ సింక్లెయిర్ (1/10), సైమ్ అయూబ్ (1/2) ధాటికి 17.1 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. పేట్రియాట్స్ ఇన్నింగ్స్‌లో అందరూ దారుణంగా విఫలమయ్యారు. కోర్బిన్ బోష్ (27), జార్జ్ లిండే (13), ఆండ్రీ ఫ్లెచర్ (11), యాన్నిక్ కారియా (13) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతావారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ ఓటమితో ప్రస్తుత ఎడిషన్‌లో పేట్రియాట్స్ పరాజయాల సంఖ్య 5కు చేరింది. ఆ జట్టు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లోనూ గెలువలేదు. 2 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. -
పాక్ గడ్డపై ప్రిటోరియస్ రికార్డు! నాటి మ్యాచ్‌లో ఏకంగా..
జొహన్నెస్‌బర్గ్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ పాకిస్తాన్ గడ్డపై తన కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (5/17) నమోదు చేయడం విశేషం. 2021లో పాక్ పర్యటనలో భాగంగా రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడింది ప్రొటిస్. టెస్టులో సిరీస్ పాక్ 2-0తో క్లీన్‌స్వీప్ చేయగా.. మొదటి టీ20లోనూ ప్రొటిస్‌ను దురదృష్టం వెక్కిరించింది. నేనున్నానని.. మూడు పరుగుల తేడాతో పర్యాటక సౌతాఫ్రికా ఓటమి పాలైంది. ఈ క్రమంలో లాహోర్ వేదికగా జరిగిన రెండో టీ20లో ప్రిటోరియస్ విశ్వరూపం ప్రదర్శించాడు. 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు కూల్చాడు. అరుదైన ఘనత పాక్ ఇన్నింగ్స్‌లో కీలక వికెట్లు తీసి ప్రొటిస్‌ను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టి20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన దక్షిణాఫ్రికా బౌలర్‌గా ప్రిటోరియస్ ఘనత వహించాడు. అయితే, ఆ తర్వాతి మ్యాచ్‌లో పాక్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. కాగా సోమవారం రిటైర్మెంట్ ప్రకటించిన ప్రిటోయిరస్.. తన నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని 33 ఏళ్ల ప్రిటోరియస్ స్పష్టం చేశాడు. 2016లో దక్షిణాఫ్రికా తరఫున అరంగేట్రం చేసిన ప్రిటోరియస్ 3 టెస్టులు, 27 వన్డేలు, 33 టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఏయే లీగ్‌లలో ఆడుతున్నాడంటే.. టెస్టుల్లో 7 వికెట్లు తీసి 83 పరుగులు చేసిన అతను... వన్డేల్లో 35 వికెట్లు పడగొట్టి 192 పరుగులు... టి20ల్లో 35 వికెట్లు నేలకూల్చి 261 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ప్రిటోరియస్ ఇక నుంచి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టి20 లీగ్‌లపై, ఇతర పొట్టి ఫార్మాట్లపై దృష్టి కేంద్రీకరిస్తానని తెలిపాడు. ప్రస్తుతం ప్రిటోరియస్ ఐపీఎల్ (చెన్నై సూపర్‌కింగ్స్), ద హండ్రెడ్ (వెల్ష్ ఫైర్), కరీబియన్ ప్రీమియర్ లీగ్, ఎస్ఏ20 (డర్బన్ సూపర్ జెయింట్స్) లీగ్‌లలో భాగంగా ఉన్నాడు. చదవండి: Ind Vs SL: సూర్య, ఉమ్రాన్‌కు నో ఛాన్స్!.. ఇంత వరకు ఇక్కడ ఒకే ఒక వన్డే.. ఫలితం? Rohit Sharma: నేను అంతర్జాతీయ టి20లకు గుడ్‌బై చెప్పలేదు.. అయితే ఐపీఎల్ తర్వాత! -
సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ సంచలన నిర్ణయం.. ఆటకు గుడ్ బై! ఇకపై..
South Africa All Rounder Dwaine Pretorius: సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు.. తక్షణమే తన నిర్ణయం అమల్లోకి వస్తుందని సోమవారం ప్రకటించాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు సైతం ధ్రువీకరించింది. ఈ మేరకు.. ‘‘క్రికెట్ కెరీర్‌కు సంబంధించి గత కొన్ని రోజుల క్రితమే నేను అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నాను. అంతర్జాతీయ స్థాయిలో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నా. ప్రొటిస్‌కు ఆడాలనే ఆశయంతో వచ్చిన వాడిని. ఇక్కడిదాకా ఎలా రాగలిగానో నాకే తెలియదు. అయితే, దేవుడిచ్చిన ప్రతిభాపాటవాలు, ఆట పట్ల నిబద్ధత చూపగల లక్షణం నేను విజయవంతమయ్యేలా చేశాయి. ఇక ముందు కూడా నా భవిష్యత్తు ఆయనే నిర్ణయిస్తాడు’’ అంటూ తన రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా ప్రిటోరియస్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. టీ20ల కోసమే.. ‘‘మున్ముందు టీ20, ఇతర పొట్టి ఫార్మాట్లపై దృష్టి సారిస్తాను. ఎలాంటి బంధనాలు లేని ఆటగాడిగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే నాకు నచ్చినట్లుగా నేను ఆడగలిగే స్వేచ్ఛ లభించింది. ఈ నిర్ణయం ద్వారా ఇటు ఆటతో పాటు కుటుంబానికి కూడా తగినంత సమయం కేటాయించగలుగుతాను. నా ప్రయాణంలో ఇంతవరకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఫాఫ్ డు ప్లెసిస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. నన్ను మళ్లీ జట్టులోకి రప్పించి.. నన్ను నేను మరింత మెరుగైన ఆటగాడిగా మలచుకోవడంలో నాకు సహాయపడినందుకు ఫాఫ్‌నకు థాంక్యూ’’ అని ప్రిటోరియస్ తన నిర్ణయం వెనుక గల కారణాలు వెల్లడించాడు. కాగా 33 ఏళ్ల డ్వేన్ ప్రిటోరియస్ ఐపీఎల్-2023లో చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఆరేళ్ల కాలంలోనే.. 2016లో ఐర్లాండ్‌తో వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ప్రిటోరియస్.. ప్రొటిస్ తరఫున 30 టీ20, 27 వన్డేలు, మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. రెండు వరల్డ్‌కప్ టోర్నీల్లో సౌతాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించాడు. గతేడాది ఇంగ్లండ్‌తో ఆడిన వన్డే అతడి కెరీర్లో చివరిది. చదవండి: Suryakumar Yadav: సూర్య కెరీర్‌పై గంభీర్ ట్వీట్! నీకు అతడు మాత్రమే కనిపిస్తున్నాడా? ఫ్యాన్స్ ఫైర్ Virat Kohli: అదొక జబ్బు! దాని నుంచి బయటపడాలని కోరుకుంటున్నా.. కోహ్లి పోస్ట్ వైరల్ -
మరింత పటిష్టంగా సౌతాఫ్రికా పేస్ అటాక్.. జట్టులోకి సన్‌రైజర్స్ బౌలర్
టీ20 వరల్డ్‌కప్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బలమైన జట్టుతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. సన్‌రైజర్స్ పేసర్ చేరికతో మరింత పటిష్టంగా మారింది. ముందుగా ప్రకటించిన జట్టులోని సభ్యుడు, స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ గాయం కారణంగా మెగా టోర్నీ మొత్తానికి దూరం కావడంతో అతని స్థానంలో మరో ఆల్‌రౌండర్ మార్కో జన్సెన్ జట్టులోకి వచ్చాడు. వరల్డ్‌కప్ జట్టులో రిజర్వ్ ఆటగాడిగా ఉన్న జన్సెన్ స్థానాన్ని లిజాడ్ విలియమ్స్ భర్తీ చేయనున్నాడు. ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్ సూపర్ 12 దశలో భారత్‌తో పాటు గ్రూప్-2లో పోటీపడుతున్న దక్షిణాఫ్రికా అక్టోబర్ 24న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ప్రత్యర్ధి ఎవరనేది గ్రూప్ దశలో ఫలితాలపై ఆధారపడి ఉంది. అనంతరం సఫారీ టీమ్ అక్టోబర్ 27న బంగ్లాదేశ్‌తో, 30న టీమిండియాతో, నవంబర్ 3న పాకిస్తాన్‌తో, నవంబర్ 6న గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లకు ముందు దక్షిణాఫ్రికా రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 17న న్యూజిలాండ్‌తో, అక్టోబర్ 19న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. సౌతాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), ఎయిడెన్ మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, హెచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, రీజా హెండ్రిక్స్, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబడా, లుంగి ఎంగిడి, రిలీ రోసౌ, మార్కో జన్సెన్, వేన్ పార్నెల్, తబ్రేజ్ షంషి, కేశవ్ మహారాజ్ రిజర్వ్ ప్లేయర్స్: లిజాడ్ విలియమ్స్, జోర్న్ ఫోర్టూన్, ఆండిల్ ఫెలుక్వాయో