లంక ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ చివరి దశకు చేరింది. ఇవాళ (జులై 18) జరిగిన తొలి క్వాలిఫయర్‌లో గాలే మార్వెల్స్.. జాఫ్నా కింగ్స్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జాఫ్నా కింగ్స్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేయగా.. మార్వెల్స్ మరో 11 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది.
నిప్పులు చెరిగిన ప్రిటోరియస్
తొలుత బౌలింగ్ చేసిన మార్వెల్స్.. డ్వేన్ ప్రిటోరియస్ నిప్పులు చెరగడంతో (4-0-23-4) జాఫ్నాను 177 పరుగులకు పరిమితం చేయగలిగింది. ఉడాన 2, ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ తీశారు. జాఫ్నా ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ 46, రిలీ రొస్సో 40, అవిష్క ఫెర్నాండో 52 పరుగులు చేశారు.
చెలరేగిన సీఫర్ట్, లియనగే
178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మార్వెల్స్.. టిమ్ సీఫర్ట్ (41 బంతుల్లో 62 నాటౌట్; 9 ఫోర్లు, సిక్స్), జనిత్ లియనగే (36 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. మార్వెల్స్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ హేల్స్ (21 బంతుల్లో 36; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. జాఫ్నా బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్‌జాయ్, ఫేబియన్ అలెన్, తబ్రేజ్ షంషి తలో వికెట్ పడగొట్టారు.
జాఫ్నాకు మరో అవకాశం
ఈ మ్యాచ్‌లో ఓడినా జాఫ్నా ఫైనల్‌కు చేరాలంటే మరో అవకాశం ఉంది. ఇవాళ రాత్రి జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్‌లో (కొలొంబో స్ట్రయికర్స్ వర్సెస్ క్యాండీ ఫాల్కన్స్) గెలిచే జట్టుతో జాఫ్నా క్వాలిఫయర్-2లో తలపడుతుంది. ఈ మ్యాచ్ జులై 20న జరుగుతుంది. క్వాలిఫయర్-2లో గెలిచే జట్టు జులై 21న జరిగే అంతిమ సమరంలో గాలే మార్వెల్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment