చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తెగదింపులు.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ పోస్ట్‌ వైరల్‌ | Dwaine Pretorius parts ways with CSK ahead of IPL 2024 auction | Sakshi
Sakshi News home page

IPL 2024 auction: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తెగదింపులు.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ పోస్ట్‌ వైరల్‌

Published Sun, Nov 26 2023 1:41 PM | Last Updated on Sun, Nov 26 2023 2:13 PM

Dwaine Pretorius parts ways with CSK ahead of IPL 2024 auction - Sakshi

Image Source : BCCI/IPL

ఐపీఎల్‌-2024 సీజన్‌ వేలానికి ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌, దక్షిణాఫ్రికా ఆటగాడు డ్వేన్‌ ప్రిటోరియస్‌ను సీఎస్‌కే వేలంలోకి విడిచిపెట్టింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రిటోరియస్ దృవీకరించాడు. కాగా గత రెండు సీజన్లలో సీఎస్‌కేకు ప్రిటోరియస్‌ ప్రాతినిథ్యం వహించాడు.

ఐపీఎల్‌-2022 మెగా వేలంలో సీఎస్‌కే ఫ్రాంచైజీ అతనిని 50 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. అతడు సీఎస్‌కే తరపున 7 మ్యాచ్‌లు ఆడి  44 పరుగులు చేసి ఆరు వికెట్లు పడగొట్టాడు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌తో గడిపిన ప్రతిక్షణం ఓ అద్భుతం. సీఎస్‌కే నుంచి చాలా నేర్చుకున్నాను. జట్టులో నాకు మద్దతుగా నిలిచిన సీఎస్‌కే మేనేజ్‌మెంట్, కోచ్‌లు, ఆటగాళ్లందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అభిమానులకు కూడా స్పెషల్‌ థ్యాంక్స్‌.

ఐపీఎల్‌-2024 సీజన్‌లో కూడా సీఎస్‌కే మరింత అద్భుతంగా రాణించాలని అశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ సీఎస్‌కే అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రిటోరియస్‌ రాసుకొచ్చాడు. కాగా ఐపీఎల్‌-2024 సీజన్‌కు ఆయా ప్రాంఛైజీలు తమ ఆటగాళ్ల రిటేన్షన్‌ జాబితాను బీసీసీఐకి సమర్పించడానికి గడువు నేటితో ముగియనుంది.
చదవండి: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా: ఏబీ డివిలియర్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement