వామ్మో ఇదేం షాట్‌.. దెబ్బకు కిటికీ పగిలిపోయింది! వీడియో వైరల్‌ | CPL 2023: Fabian Allen Smashes Window With Monstrous Straight 6 | Sakshi
Sakshi News home page

CPL 2023: వామ్మో ఇదేం షాట్‌.. సిక్సర్‌ దెబ్బకు కిటికీ పగిలిపోయింది! వీడియో వైరల్‌

Published Thu, Sep 14 2023 1:25 PM | Last Updated on Thu, Sep 14 2023 1:33 PM

CPL 2023: Fabian Allen Smashes Window With Monstrous Straight 6 - Sakshi

సిక్సర్‌ దెబ్బకు పగిలిన కిటికీ అద్దం (PC: CPL)

CPL 2023 - Guyana Amazon Warriors vs Jamaica Tallawahs: జమైకా తల్లావాస్‌ ఆల్‌రౌండర్‌ ఫాబియన్‌ అలెన్‌ అద్భుత షాట్‌తో అలరించాడు. గయానా అమెజాన్‌ వారియర్స్‌తో మ్యాచ్‌లో మాసివ్‌ సిక్సర్‌తో మెరిశాడు. అతడు కొట్టిన భారీ సిక్స్‌ దెబ్బకు గయానా స్టేడియం వద్ద గల కిటికీ అద్దం పగిలిపోయింది. 

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2023లో భాగంగా బుధవారం జమైకా తల్లావాస్‌, గయానా అమెజాన్‌ వారియర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది.

ఆ రెండు సిక్సర్లు హైలైట్‌
గయానాలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న వారియర్స్‌.. జమైకాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో కెప్టెన్‌, ఓపెనర్‌ బ్రాండన్ కింగ్‌ అర్ధ శతకం(52)తో మెరవగా.. ఫాబియన్‌ అలెన్‌ 21 పరుగులతో రెండో టాప్‌ స్కోరర్‌(నాటౌట్‌)గా నిలిచాడు.

14 బంతులు ఎదుర్కొన్న ఈ విండీస్‌ ఆల్‌రౌండర్‌ ప్రిటోరియస్‌, ఇమ్రాన్‌ తాహిర్‌ బౌలింగ్‌లో రెండు అదిరిపోయే సిక్సర్లు బాదడం హైలైట్‌గా నిలిచింది. డ్వేన్‌ ప్రిటోరియస్‌ బౌలింగ్‌లో 18వ ఓవర్‌ ఆఖరి బంతికి కిటికీని పగలగొట్టిన అలెన్‌.. తదుపరి ఓవర్లో తాహిర్‌ వేసిన బంతిని 103 మీటర్ల సిక్సర్‌గా మలిచాడు.

ఓపెనర్‌ సంచలన ఇన్నింగ్స్‌
కింగ్‌, అలెన్‌ మినహా మిగతా వాళ్లు విఫలం చెందిన క్రమంలో.. నిర్ణీత 20 ఓవర్లలో జమైకా జట్టు 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. అయితే, లక్ష్య ఛేదనకు దిగిన వారియర్స్‌కు సయీమ్‌ అయూబ్‌ 53 బంతుల్లో 85 పరుగులతో దంచికొట్టాడు. మరో ఓపెనర్‌ మాథ్యూ నందు 37 పరుగులతో రాణించడంతో 18.3 ఓవర్లలోనే టార్గెట్‌ పూర్తి చేసి విజయం సాధించింది. సయీమ్‌ అయూబ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement