
కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, గయానా అమెజాన్ వారియర్స్ జట్లు తలపడ్డాయి. అయితే ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఈ మ్యాచ్‌లో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్‌పై 3 వికెట్ల తేడాతో అమెజాన్ థ్రిల్లింగ్ విజయం సాధించింది.
ఈ విజయంలో గయానాకు ప్రాతినిథ్యం వహిస్తున్న సఫారీ ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ కీలక పాత్ర పోషించాడు. చివరి బంతికి సిక్స్ కొట్టి మరి ప్రిటోరియస్ తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. చివరి ఓవర్‌లో గయనా విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి.
ఈ క్రమంలో ఆంటిగ్వా కెప్టెన్ క్రిస్ గ్రీన్ చివరి ఓవర్ వేసే బాధ్యతను స్టార్ పేసర్ మహ్మద్ అమీర్‌కు అప్పగించాడు. తొలి బంతిని ప్రిటోరియస్ పరుగులేమీ చేయలేకపోయాడు. దీంతో గయానా డౌగట్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. సరిగ్గా ఇదే సమయంలో ప్రిటోరియస్ అద్బుతం చేశాడు.
తర్వాత నాలుగు బంతులకు మూడు ఫోర్లు కొట్టి మ్యాచ్ ను తమవైపు మలుపు తిప్పాడు. చివరి బంతికి విజయానికి నాలుగు పరుగులు కావాల్సిన దశలో కవర్స్ మీదుగా సిక్సర్ కొట్టి సంచలన విజయాన్ని తన జట్టుకు అందించాడు. ప్రిటోరియస్ 10 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 20 పరుగులు చేశాడు.
అతడి మెరుపు ఇన్నింగ్స్ ఫలితంగా గయానా 169 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గయనా ఇన్నింగ్స్‌లో షాయ్ హోప్(41), షెఫార్డ్(32) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఆంటిగ్వా బ్యాటర్లలో ఫఖార్ జమాన్(40), ఇమాద్ వసీం(40) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు.
DWAINE PRETORIUS WHAT HAVE YOU DONE 🔥pic.twitter.com/PIIuExsRtj
— Durban's Super Giants (@DurbansSG) August 31, 2024