జొహన్నెస్‌బర్గ్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ పాకిస్తాన్ గడ్డపై తన కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (5/17) నమోదు చేయడం విశేషం. 2021లో పాక్ పర్యటనలో భాగంగా రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడింది ప్రొటిస్. టెస్టులో సిరీస్ పాక్ 2-0తో క్లీన్‌స్వీప్ చేయగా.. మొదటి టీ20లోనూ ప్రొటిస్‌ను దురదృష్టం వెక్కిరించింది.
నేనున్నానని..
మూడు పరుగుల తేడాతో పర్యాటక సౌతాఫ్రికా ఓటమి పాలైంది. ఈ క్రమంలో లాహోర్ వేదికగా జరిగిన రెండో టీ20లో ప్రిటోరియస్ విశ్వరూపం ప్రదర్శించాడు. 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు కూల్చాడు.
అరుదైన ఘనత
పాక్ ఇన్నింగ్స్‌లో కీలక వికెట్లు తీసి ప్రొటిస్‌ను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టి20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన దక్షిణాఫ్రికా బౌలర్‌గా ప్రిటోరియస్ ఘనత వహించాడు.
అయితే, ఆ తర్వాతి మ్యాచ్‌లో పాక్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. కాగా సోమవారం రిటైర్మెంట్ ప్రకటించిన ప్రిటోయిరస్.. తన నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని 33 ఏళ్ల ప్రిటోరియస్ స్పష్టం చేశాడు. 2016లో దక్షిణాఫ్రికా తరఫున అరంగేట్రం చేసిన ప్రిటోరియస్ 3 టెస్టులు, 27 వన్డేలు, 33 టి20 మ్యాచ్‌లు ఆడాడు.
ఏయే లీగ్‌లలో ఆడుతున్నాడంటే..
టెస్టుల్లో 7 వికెట్లు తీసి 83 పరుగులు చేసిన అతను... వన్డేల్లో 35 వికెట్లు పడగొట్టి 192 పరుగులు... టి20ల్లో 35 వికెట్లు నేలకూల్చి 261 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ప్రిటోరియస్ ఇక నుంచి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టి20 లీగ్‌లపై, ఇతర పొట్టి ఫార్మాట్‌లపై దృష్టి కేంద్రీకరిస్తానని తెలిపాడు. ప్రస్తుతం ప్రిటోరియస్ ఐపీఎల్ (చెన్నై సూపర్‌కింగ్స్), ద హండ్రెడ్ (వెల్ష్ ఫైర్), కరీబియన్ ప్రీమియర్ లీగ్, ఎస్‌ఏ20 (డర్బన్ సూపర్ జెయింట్స్) లీగ్‌లలో భాగంగా ఉన్నాడు.
చదవండి: Ind Vs SL: సూర్య, ఉమ్రాన్‌కు నో ఛాన్స్!.. ఇంత వరకు ఇక్కడ ఒకే ఒక వన్డే.. ఫలితం?
Rohit Sharma: నేను అంతర్జాతీయ టి20లకు గుడ్‌బై చెప్పలేదు.. అయితే ఐపీఎల్ తర్వాత!
Comments
Please login to add a commentAdd a comment