టీ20 వరల్డ్‌కప్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బలమైన జట్టుతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. సన్‌రైజర్స్ పేసర్ చేరికతో మరింత పటిష్టంగా మారింది. ముందుగా ప్రకటించిన జట్టులోని సభ్యుడు, స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ గాయం కారణంగా మెగా టోర్నీ మొత్తానికి దూరం కావడంతో అతని స్థానంలో మరో ఆల్‌రౌండర్ మార్కో జన్సెన్ జట్టులోకి వచ్చాడు. వరల్డ్‌కప్ జట్టులో రిజర్వ్ ఆటగాడిగా ఉన్న జన్సెన్ స్థానాన్ని లిజాడ్ విలియమ్స్ భర్తీ చేయనున్నాడు.
ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్ సూపర్ 12 దశలో భారత్‌తో పాటు గ్రూప్-2లో పోటీపడుతున్న దక్షిణాఫ్రికా అక్టోబర్ 24న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ప్రత్యర్ధి ఎవరనేది గ్రూప్ దశలో ఫలితాలపై ఆధారపడి ఉంది. అనంతరం సఫారీ టీమ్ అక్టోబర్ 27న బంగ్లాదేశ్‌తో, 30న టీమిండియాతో, నవంబర్ 3న పాకిస్తాన్‌తో, నవంబర్ 6న గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లకు ముందు దక్షిణాఫ్రికా రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 17న న్యూజిలాండ్‌తో, అక్టోబర్ 19న బంగ్లాదేశ్‌తో ఆడనుంది.
సౌతాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), ఎయిడెన్ మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, హెచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, రీజా హెండ్రిక్స్, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబడా, లుంగి ఎంగిడి, రిలీ రోసౌ, మార్కో జన్సెన్, వేన్ పార్నెల్, తబ్రేజ్ షంషి, కేశవ్ మహారాజ్
రిజర్వ్ ప్లేయర్స్: లిజాడ్ విలియమ్స్, జోర్న్ ఫోర్టూన్, ఆండిల్ ఫెలుక్వాయో
Comments
Please login to add a commentAdd a comment