త్వరలో టీమిండియాతో జరుగబోయే నాలుగు మ్యాచ్‌ల టీ20 కోసం దక్షిణాఫ్రికా జట్టును ఇవాళ (అక్టోబర్ 31) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా ఎయిడెన్ మార్క్రమ్ ఎంపికయ్యాడు. గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న మార్కో జన్సెన్, గెరాల్డ్ కొయెట్జీ ఈ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సిరీస్ కోసం లుంగి ఎంగిడిని పరిగణలోకి తీసుకోలేదు. ఎంగిడిని త్వరలో శ్రీలంకతో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం రిజర్వ్‌గా ఉంచారు.
సౌతాఫ్రికా యూఏఈలో ఆడిన వైట్‌బాల్ సిరీస్‌లకు దూరంగా ఉన్న హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, కేశవ్ మహారాజ్ 16 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు ఎంపికయ్యారు. ఈ సిరీస్‌లో కగిసో రబాడ ఆడటం లేదు. సెలెక్టర్లు అతనికి విశ్రాంతినిచ్చారు. ఆల్‌రౌండర్ మిహ్లాలీ మ్పోంగ్వానా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక కాగా.. అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్ అండీల్ సైమ్‌లేన్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఈ సిరీస్‌లో నకాబా పీటర్ మరో స్పిన్ ఆప్షన్‌గా ఉన్నాడు. జాతీయ కాంట్రాక్ట్ దక్కని తబ్రేజ్ షంషిని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఎయిడెన్ మార్క్రమ్, కేశవ్ మహారాజ్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్ నవంబర్ 4న మిగతా జట్టు సభ్యులతో కలుస్తారు.
టీమిండియాతో టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రూగర్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలీ మ్పోంగ్వానా, నకాబా పీటర్, ర్యాన్ రికెల్టన్, అండీల్ సైమ్‌లేన్, లూథో సిపామ్లా, రిస్టన్ స్టబ్స్
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, రమన్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్, సంజూ శాంసన్, జితేశ్ శర్మ, రవి బిష్ణోయ్, విజయ్‌కుమార్ వైశాఖ్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, యశ్ దయాల్, ఆవేశ్ ఖాన్
షెడ్యూల్..
తొలి టీ20- నవంబర్ 8- డర్బన్
రెండో టీ20- నవంబర్ 10- గ్వెబెర్హా
మూడో టీ20- నవంబర్ 13- సెంచూరియన్
నాలుగో టీ20- నవంబర్ 15- జొహనెస్‌బర్గ్
Comments
Please login to add a commentAdd a comment