Gerald Coetzee
-
టీమిండియాతో టీ20 సిరీస్.. దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. స్టార్ పేసర్లు రీ ఎంట్రీ
త్వరలో టీమిండియాతో జరుగబోయే నాలుగు మ్యాచ్‌ల టీ20 కోసం దక్షిణాఫ్రికా జట్టును ఇవాళ (అక్టోబర్ 31) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా ఎయిడెన్ మార్క్రమ్ ఎంపికయ్యాడు. గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న మార్కో జన్సెన్, గెరాల్డ్ కొయెట్జీ ఈ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సిరీస్ కోసం లుంగి ఎంగిడిని పరిగణలోకి తీసుకోలేదు. ఎంగిడిని త్వరలో శ్రీలంకతో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం రిజర్వ్‌గా ఉంచారు. సౌతాఫ్రికా యూఏఈలో ఆడిన వైట్‌బాల్ సిరీస్‌లకు దూరంగా ఉన్న హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, కేశవ్ మహారాజ్ 16 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు ఎంపికయ్యారు. ఈ సిరీస్‌లో కగిసో రబాడ ఆడటం లేదు. సెలెక్టర్లు అతనికి విశ్రాంతినిచ్చారు. ఆల్‌రౌండర్ మిహ్లాలీ మ్పోంగ్వానా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక కాగా.. అన్క్యాప్డ్ ఆల్‌రౌండర్ అండీల్ సైమ్‌లేన్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లో నకాబా పీటర్ మరో స్పిన్ ఆప్షన్‌గా ఉన్నాడు. జాతీయ కాంట్రాక్ట్ దక్కని తబ్రేజ్ షంషిని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఎయిడెన్ మార్క్రమ్, కేశవ్ మహారాజ్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్ నవంబర్ 4న మిగతా జట్టు సభ్యులతో కలుస్తారు.టీమిండియాతో టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రూగర్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలీ మ్పోంగ్వానా, నకాబా పీటర్, ర్యాన్ రికెల్టన్, అండీల్ సైమ్‌లేన్, లూథో సిపామ్లా, రిస్టన్ స్టబ్స్భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, రమన్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్, సంజూ శాంసన్, జితేశ్ శర్మ, రవి బిష్ణోయ్, విజయ్‌కుమార్ వైశాఖ్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, యశ్ దయాల్, ఆవేశ్ ఖాన్షెడ్యూల్..తొలి టీ20- నవంబర్ 8- డర్బన్రెండో టీ20- నవంబర్ 10- గ్వెబెర్హామూడో టీ20- నవంబర్ 13- సెంచూరియన్నాలుగో టీ20- నవంబర్ 15- జొహనెస్బర్గ్చదవండి: IND vs NZ 3rd Test: బుమ్రాకు విశ్రాంతి..? -
సౌతాఫ్రికాకు బిగ్ షాక్
వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు సౌతాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ గెరాల్డ్ కొయెట్జీ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మేజర్ లీగ్ క్రికెట్ సందర్భంగా కొయెట్జీ గాయపడ్డాడు. కొయెట్జీ స్థానాన్ని 29 ఏళ్ల నార్త్ వెస్ట్ డ్రాగన్స్ ఫాస్ట్ బౌలర్ మైగెల్ ప్రిటోరియస్ భర్తీ చేయనున్నాడు.కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌లు ఆగస్ట్ 7 నుంచి ప్రారంభమవుతాయి. ఆగస్ట్ 7-11 మధ్యలో తొలి టెస్ట్ (ట్రినిడాడ్), ఆగస్ట్ 15-19 మధ్యలో రెండో టెస్ట్ (పోర్ట్ ఆఫ్ స్పెయిన్), ఆగస్ట్ 23, 24, 27 తేదీల్లో టీ20 జరుగనున్నాయి. మూడు టీ20లకు ట్రినిడాడ్‌లోని తరౌబా వేదిక కానుంది.ఇదిలా ఉంటే, ప్రస్తుతం వెస్టిండీస్ ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. అక్కడ ఆ జట్టు మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే ఇంగ్లండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఈ జట్టు టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత ఖాళీగా ఉంది. విండీస్ పర్యటనతో ఆ జట్టు సీజన్‌ను ప్రారంభించనుంది. వెస్టిండీస్‌లోనే జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో సౌతాఫ్రికా భారత్ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది.సౌతాఫ్రికా-వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో భాగంగా జరుగనుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్ చేతిలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న వెస్టిండీస్ చిట్టచివరి స్థానంలో ఉంది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో 25 శాతం విజయాలు సాధించిన సౌతాఫ్రికా ఏడో స్థానంలో నిలిచింది. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టు..టెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, మాథ్యూ బ్రీట్జ్కీ, నండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, డేన్ ప్యాటర్సన్, డేన్ పీడ్ట్, మైగెల్ ప్రిటోరియస్, కగిసో రబడా, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రిన్ -
'హార్దిక్ ఒక అద్బుతమైన కెప్టెన్.. అందరి కంటే డిఫరెంట్'
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించింది.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై 9వ స్ధానంలో కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీపై పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. ముంబై కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్ధానంలో బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా..తన మార్క్ చూపించడంలో విఫలమయ్యాడు. కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా హార్దిక్ నిరాశపరుస్తున్నాడు. అదే విధంగా ముంబై డ్రెస్సింగ్ రూమ్ రెండు గ్రూపులుగా విడిపోయినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఉద్దేశించి ముంబై యువ పేసర్ గెరాల్డ్ కోయెట్జీ కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా అద్భుతమైన కెప్టెన్ అంటూ కోయెట్జీ పొగడ్తలతో ముంచెత్తాడు."హార్దిక్ పాండ్యా నిజంగా సూపర్ కెప్టెన్. అతడికి అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. ప్రతీ కెప్టెన్‌కు ఒక స్టైల్ ఉంటుంది. ఏ కెప్టెన్ కూడా ఒకేలా ఉండడు. హార్దిక్ జట్టులో ప్రతీఒక్క ఆటగాడికి సపోర్ట్‌గా ఉంటాడు. ఫీల్డ్‌లో సరైన ప్రణాళికలలు రచించడంలో హార్దిక్ దిట్ట.నా వరకు అయితే అతడొక అసాధారణమైన కెప్టెన్. ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో ఎటువంటి విభేదాలు లేవు. అందరం కలిసే ఉన్నాం. మిగిలిన మ్యాచ్‌ల్లో విజయం సాధించి టోర్నీ ఘనంగా ముగించేందుకు ప్రయత్నిస్తామని" ఓ ఇంటర్వ్యూలో కోయెట్జీ పేర్కొన్నాడు. -
ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైన బంతిని సంధించిన ముంబై పేస్ గన్
ముంబై ఇండియన్స్ పేస్ గన్ గెరాల్డ్ కొయెట్జీ 2024 ఐపీఎల్ సీజన్లో అత్యంత వేగవంతమైన బంతిని సంధించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న (ఏప్రిల్ 1) జరిగిన మ్యాచ్‌లో కొయెట్జీ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. రియాన్ పరాగ్ ఎదుర్కొన్న మ్యాచ్ చివరి బంతిని కొయెట్జీ రికార్డు స్థాయిలో 157.4 కిమీ వేగంతో బౌల్ చేశాడు. ఈ సీజన్లో ఇదే అత్యంత వేగవంతమైన బంతిగా రికార్డైంది. సరిగ్గా రెండు రోజుల ముందు లక్నో పేసర్ మయాంక్ యాదవ్ ఈ సీజన్ ఫాస్టెస్ట్ డెలివరీని సంధించాడు. పంజాబ్‌తో జరిగిన తన డెబ్యూ మ్యాచ్‌లోనే మయాంక్ రికార్డు స్థాయిలో 155.8 కిమీ వేగంతో బంతిని వేశాడు. తాజాగా కొయెట్జీ మయాంక్ వేగాన్ని అధిగమించి ఈ సీజన్ ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ బంతి ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైన బంతిగానూ రికార్డుల్లోకెక్కింది. కొయెట్జీ సంధించిన ఈ సీజన్ వేగవంతమైన బంతిని రియాన్ పరాగ్ బౌండరీకి తరలించి మ్యాచ్‌ను గెలిపించడం కొసమెరుపు. కాగా, ముంబై ఇండియన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో రాజస్థాన్‌కు ఇది వరుసగా మూడో విజయం కాగా.. ముంబైకు హ్యాట్రిక్ పరాజయం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై చెత్త ప్రదర్శనను కనబర్చి నిర్ణీత ఓవర్లలో కేవలం 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై ఇన్నింగ్స్‌లో రోహిత్ సహా ముగ్గురు (నమన్ ధీర్, డెవాల్డ్ బ్రెవిస్) గోల్డెన్ డకౌట్లయ్యారు. తిలక్ వర్మ (32), హార్దిక్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ముంబై ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. బౌల్ట్ (4-0-22-3), చహల్ (4-0-11-3), బర్గర్ (4-0-32-2), ఆవేశ్ ఖాన్ (4-0-30-1) అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబైని వణికించారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్.. 15.3 ఓవర్లలో ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. రియాన్ పరాగ్ (54 నాటౌట్) మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడి రాజస్థాన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. యశస్వి (10), బట్లర్ (13) మరోసారి నిరాశపరిచారు. సంజూ శాంసన్ 12, అశ్విన్ 16 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ 3 వికెట్లు పడగొట్టగా.. మఫాక తన మొట్టమొదటి ఐపీఎల్ వికెట్ దక్కించుకున్నాడు. -
IPL 2024: అరంగేట్రంలో అదరగొట్టేందుకు!.. అందరి కళ్లు అతడిపైనే..
సత్తా ఉన్న ప్రతిభావంతులకు తారా జువ్వలా దూసుకుపోయేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సరైన వేదిక. స్వదేశీ ఆటగాళ్లయినా... విదేశీ ఆటగాళ్లయినా ఒక్కసారి ఐపీఎల్లో ఆడి మెరిపిస్తే కావాల్సినంత గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు. నిలకడైన ఆటతీరుతో కెరీర్‌ను గాడిలో పెట్టుకోవడానికి.... ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఐపీఎల్ దోహదం చేస్తోంది. ఇప్పటికే ఎంతో మంది క్రికెటర్లు ఐపీఎల్లో అదరగొట్టి తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. రాబోయే ఐపీఎల్ 17వ సీజన్లో అరంగేట్రంలోనే తమ విధ్వంసకర ఆటతీరుతో, ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. –సాక్షి క్రీడా విభాగం గెలుపు గుర్రం... రచిన్ రవీంద్ర (చెన్నై) అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఒక్కసారిగా తెరపైకి వచ్చాడు ఈ న్యూజిలాండ్ క్రికెటర్. ఫార్మాట్ ఏదైనా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అనతికాలంలోనే జట్టు ముఖ్య సభ్యుడిగా ఎదిగాడు. గత ఏడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో రచిన్ 10 మ్యాచ్‌లు ఆడి 578 పరుగులు సాధించి న్యూజిలాండ్ టాప్ స్కోరర్‌గా నిలవడంతోపాటు టాప్–4లో చోటు సంపాదించాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టి20లో కేవలం 35 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో చెలరేగి 68 పరుగులు చేశాడు. తొలిసారి ఐపీఎల్ ఆడబోతున్న రచిన్ తన మెరుపులతో మెరిపించి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ నిలబెట్టుకునేందుకు తనవంతు పాత్ర పోషిస్తే మాత్రం భవిష్యత్ లో టాప్ స్టార్‌గా ఎదగడం ఖాయం. సిక్సర్ల వీరుడు... సమీర్ రిజ్వీ (చెన్నై) ఐపీఎల్లో ఐదుసార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో ఆటగాళ్లను ఎంచుకునే సమయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. కానీ గత మినీ వేలంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల సమీర్ రిజ్వీ కోసం చెన్నై పట్టుబట్టింది. ఇంకా భారత జట్టుకు ఆడని సమీర్ రిజ్వీని చెన్నై ఏకంగా రూ. 8 కోట్ల 40 లక్షలు వెచ్చించింది. ముస్తాక్ అలీ దేశవాళీ టి20 టోర్నీలో భాగంగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో రిజ్వీ యూపీని గెలిపించినంత పనిచేశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లు సాయికిశోర్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తిలపై విరుచుకుపడిన రిజ్వీ ఆ మ్యాచ్‌లో 46 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో అజేయంగా 75 పరుగులు చేశాడు. యూపీ టి20 లీగ్‌లో కాన్పూర్ సూపర్‌స్టార్స్ జట్టు తరఫున అత్యధిక సిక్స్‌లు బాది వెలుగులోకి వచ్చిన రిజ్వీ కల్నల్ సీకే నాయుడు అండర్–23 టోర్నీలో ఏకంగా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఆడుతున్న తొలి ఐపీఎల్లో తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేసేందుకు రిజ్వీ రెడీ అవుతున్నాడు. వేగం.. వైవిధ్యం.. గెరాల్డ్ కొయెట్జీ (ముంబై) గతంలో రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ గెరాల్డ్ కొయెట్జీని ప్రత్యామ్నాయ ప్లేయర్‌గా తీసుకున్నా మ్యాచ్ ఆడించలేదు. వేగంతోపాటు వైవిధ్యభరిత బౌలింగ్‌తో కొయెట్జీ గత వన్డే వరల్డ్‌కప్‌లో ఏకంగా 20 వికెట్లు పడగొట్టి టాప్–5లో నిలిచాడు. ఈ ప్రదర్శన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని ఆకట్టుకుంది. 23 ఏళ్ల కొయెట్జీని ముంబై రూ. 5 కోట్లకు సొంతం చేసుకుంది. ఈసారి ఐపీఎల్లో బుమ్రా తర్వాత ముంబై తరఫున రెండో ప్రధాన బౌలర్‌గా కొయెట్జీని చూడవచ్చు. ఆల్‌రౌండర్... అజ్మతుల్లా (గుజరాత్) 2022లో కొత్త జట్టుగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో తొలి ప్రయత్నంలోనే ఐపీఎల్ చాంపియన్‌గా అవతరించింది. గత ఏడాది రన్నరప్‌గా నిలిచింది. అయితే ఈ ఏడాది పాండ్యా గుజరాత్ ను వీడి ముంబై ఇండియన్స్‌కు వెళ్లిపోయాడు. దాంతో పాండ్యా తరహాలో టైటాన్స్‌కు ఆల్‌రౌండర్ కొరత ఏర్పడింది. ఈ లోటును కొంతలో కొంత అఫ్గానిస్తాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ భర్తీ చేస్తాడని చెప్పవచ్చు. రూ. 50 లక్షలకు అజ్మతుల్లాను టైటాన్స్ కొనుగోలు చేసింది. గత ఏడాది వన్డే వరల్డ్‌కప్‌లో అజ్మతుల్లా 353 పరుగులు చేయడంతోపాటు ఏడు వికెట్లు పడగొట్టాడు. లెఫ్టార్మ్ పేసర్... జాన్సన్ (గుజరాత్) మడమ గాయంతో గుజరాత్ టైటాన్స్ ప్రధాన బౌలర్ మొహమ్మద్ షమీ ఈ ఐపీఎల్ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. దాంతో టైటాన్స్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనపడింది. అయితే ఆ్రస్టేలియాకు చెందిన లెఫ్టార్మ్ పేసర్ స్పెన్సర్ జాన్సన్ రూపంలో టైటాన్స్‌కు మరో మంచి బౌలర్ దొరికాడనే చెప్పాలి. 28 ఏళ్ల జాన్సన్ గత రెండేళ్లలో ఎంతో రాటుదేలాడు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే టి20 లీగ్‌లలో పాల్గొన్నాడు. మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ ఏకంగా రూ. 10 కోట్లు వెచ్చించి జాన్సన్‌ను తీసుకుంది. లక్కీ చాన్స్... షామర్ జోసెఫ్ (లక్నో) ఆ్రస్టేలియాతో ఈ ఏడాది జనవరిలో జరిగిన టెస్టులో షామర్ జోసెఫ్ ఏడు వికెట్లు తీసి వెస్టిండీస్‌ను గెలిపించాడు. ఈ ప్రదర్శనతో షామర్ అంతర్జాతీయస్థాయిలో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. గత ఏడాది మినీ వేలంలో షామర్ను ఎవరూ తీసుకోలేదు. అయితే ఇంగ్లండ్‌కు చెందిన పేస్ బౌలర్ మార్క్ వుడ్ గాయంతో తప్పుకోవడంతో అతని స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ షామర్ జోసెఫ్‌ను రూ. 3 కోట్లకు తీసుకుంది. -
టీమిండియాతో రెండో టెస్టు.. సౌతాఫ్రికాకు మరో ఊహించని షాక్
టీమిండియాతో రెండో టెస్టుకు ముందు దక్షిణాఫ్రికాకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ టెంబా బావుమా సేవలను ప్రోటీస్ కోల్పోగా.. ఇప్పుడు యువ సంచలనం గెరాల్డ్ కోయిట్జీ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఎక్స్(ట్విటర్) వేదికగా వెల్లడించింది. కోయిట్జీ ప్రస్తుతం కటి వాపుతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కేప్‌టౌన్ వేదికగా భారత్‌తో జరిగే రెండు టెస్టుకు దూరమయ్యాడని సౌతాఫ్రికా క్రికెట్ ఎక్స్(ట్విటర్)లో పేర్కొంది. కాగా కోయిట్జీ తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. అంతకుముందు జరిగిన టీ20 సిరీస్, వన్డే వరల్డ్‌కప్‌లోనూ కోయిట్జీ అదరగొట్టాడు. తనదైన రోజు ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించే సత్తా ఈ యువ పేసర్‌కు ఉంది. రెండో టెస్టుకు అతడి స్ధానంలో వియాన్ ముల్డర్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక జనవరి 3 నుంచి కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. కాగా సెంచూరియన్ వేదికగ జరిగిన తొలి టెస్టులో భారత్‌పై ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ప్రోటీస్ విజయం సాధించింది. చదవండి: IND Vs SA 2nd Test: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్!? -
IPL 2024: స్టార్క్, కమిన్స్‌లకు భారీ ధర.. శార్దూల్ ఠాకూర్‌కు జాక్‌పాట్..!
ఐపీఎల్ 2024 వేలం రేపు (డిసెంబర్ 19) దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ వేలం రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుంది. ఈ వేలానికి ముందు ఇవాళ (డిసెంబర్ 18) అదే వేదికపై మాక్ ఆక్షన్ (డమ్మీ వేలం) జరిగింది. ఈ వేలంలో పలువురు స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కోసం ఆర్సీబీ చిన్న సైజ్ యుద్దమే చేసింది. ఆ జట్టు ప్రతినిధి మైక్ హెస్సన్ స్టార్క్‌ను 18.5 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నాడు. మాక్ వేలంలో ఇదే అత్యధిక ధర. స్టార్క్ తర్వాత సౌతాఫ్రికా యంగ్ గన్ గెరాల్డ్ కొయెట్జీ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. చివరికి కొయెట్జీని గుజరాత్ టైటాన్స్ 18 కోట్లకు దక్కించుకుంది. వీరిద్దరి తర్వాత ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. అంతిమంగా కమిన్స్‌ను 17.5 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఈ మాక్ ఆక్షన్‌లో ఎవరూ ఊహించని ధరకు లార్డ్ శార్దూల్ ఠాకూర్ అమ్ముడుపోయాడు. శార్దూల్‌ను పంజాబ్ కింగ్స్ 14 కోట్లకు దక్కించుకుంది. లంక పేసర్ దిల్షన్ మధుషంక, లంక స్పిన్నర్ వనిందు హసరంగ, ఆసీస్ స్టార్ బ్యాటర్, వరల్డ్‌కప్ హీరో ట్రవిస్ హెడ్ల కోసం కూడా ఫ్రాంచైజీలు తెగ పోటీపడ్డాయి. మధుషంకను కేకేఆర్ (10.5 కోట్లు), హ్యారీ బ్రూక్‌ను గుజరాత్ టైటాన్స్ ( 9.5 కోట్లు), హసరంగను (8.5 కోట్లు), ట్రవిస్ హెడ్లను (7 కోట్లు) సీఎస్కే దక్కించుకున్నాయి. మిచెల్ స్టార్క్- 18.5 కోట్లు (ఆర్సీబీ) గెరాల్డ్ కొయెట్జీ-18 కోట్లు (గుజరాత్ టైటాన్స్) పాట్ కమిన్స్- 17.5 కోట్లు (సన్‌రైజర్స్ హైదరాబాద్) శార్దూల్ ఠాకూర్-14 కోట్లు (పంజాబ్ కింగ్స్) దిల్షన్ మధుషంక-10.5 కోట్లు (కేకేఆర్) హ్యారీ బ్రూక్- 9.5 కోట్లు (గుజరాత్ టైటాన్స్) వనిందు హసరంగ-8.5 కోట్లు (సీఎస్కే) ట్రవిస్ హెడ్- 7 కోట్లు (సీఎస్కే) కాగా, మాక్ వేలంలో లభించిన ధర డమ్మీ ధర అయినప్పటికీ.. పై పేర్కొన్న ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడటం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. రేపు జరుగబోయే అధికారిక వేలంలో ఈ ఆటగాళ్లపై కనక వర్షం కురువడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరితో పాటు వరల్డ్‌కప్ హీరో, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర కోసం కూడా ఫ్రాంచైజీలు ఎగబడవచ్చు. ఐపీఎల్ 2024 వేలం తేదీ: డిసెంబర్ 19, 2023 సమయం: మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం (భారతకాలమానం ప్రకారం) వేదిక: దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనా ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ (టీవీ) డిజిటల్: జియో సినిమా మొత్తం స్లాట్లు: 77 వేలంలో పాల్గొంటున్న మొత్తం ఆటగాళ్లు: 333 భారతీయ ఆటగాళ్లు: 214 విదేశీ ఆటగాళ్లు: 119 -
Gerald Coetzee Wedding : ప్రేయసిని మనువాడిన స్పీడ్ గన్ (ఫొటోలు)
-
ప్రేయసిని పెళ్లాడిన సఫారీ పేస్ గన్
సౌతాఫ్రికా యంగ్ పేస్ గన్ గెరాల్డ్ కొయెట్జీ తన చిరకాల ప్రేయసిని పెళ్లాడాడు. వివాహానికి సంబంధించిన పలు ఫోటోలను కొయెట్జీ తన సోషల్‌మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశాడు. కొయెట్జీ భాగస్వామి ఎవరన్న విషయమై పూర్తి సమాచారం లేనప్పటికీ.. గతంలో ఈ ఇద్దరూ చాలా సందర్భాల్లో కలిసి కనిపించారు. కొయెట్జీ పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. కాగా, భారత్ వేదికగా ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో గెరాల్డ్ కొయెట్జీ అద్భుతంగా రాణించాడు. 23 ఏళ్ల ఈ పేస్ గన్ అన్రిచ్ నోర్జే గాయపడటంతో జట్టులోకి వచ్చి సంచలన ప్రదర్శనలు నమోదు చేశాడు. మెగా టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన కొయెట్జీ.. 19.80 సగటున 20 వికెట్లు పడగొట్టి, టోర్నీ లీడింగ్ వికెట్‌టేకర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. తన స్వల్ప కెరీర్లో 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన కొయెట్జీ.. 43 వికెట్లు పడగొట్టాడు. కొయెట్జీ.. త్వరలో స్వదేశంలో భారత్‌తో జరిగే టీ20, టెస్ట్ సిరీస్‌లకు కూడా ఎంపికయ్యాడు. వరల్డ్‌కప్ సంచలన ప్రదర్శనల నేపథ్యంలో కొయెట్జీకి ఐపీఎల్ 2024 వేలంలో భారీ ధర దక్కే అవకాశం ఉంది. ఇతని కోసం ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ పోటీ పడే అవకాశం ఉందని టీమిండియా వెటరన్ స్పిన్నర్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్‌ను పోలిన బౌలింగ్ శైలి కొయెట్జీని ప్రత్యేకంగా నిలబెడుతుందని యాశ్ అన్నాడు. ఇదిలా ఉంటే, డిసెంబర్ 10 నుంచి భారత్ దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో 2 టెస్ట్‌లు, 3 టీ20లు, 3 వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్ కోసం ఇరు జట్లు ఇదివరకే జట్లను కూడా ప్రకటించాయి. సిరీస్‌లో భాగంగా తొలి టీ0 డర్బన్ వేదికగా డిసెంబర్ 10న జరుగనుంది.