![South Africa Pacer Gerald Coetzee Ties The Knot With Longtime Girlfriend - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/5/South-Africa-Pacer-Gerald-Coetzee.jpg.webp?itok=j3Tl2t0O)
సౌతాఫ్రికా యంగ్ పేస్ గన్ గెరాల్డ్ కొయెట్జీ తన చిరకాల ప్రేయసిని పెళ్లాడాడు. వివాహానికి సంబంధించిన పలు ఫోటోలను కొయెట్జీ తన సోషల్‌మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేశాడు. కొయెట్జీ భాగస్వామి ఎవరన్న విషయమై పూర్తి సమాచారం లేనప్పటికీ.. గతంలో ఈ ఇద్దరూ చాలా సందర్భాల్లో కలిసి కనిపించారు. కొయెట్జీ పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.
కాగా, భారత్ వేదికగా ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో గెరాల్డ్ కొయెట్జీ అద్భుతంగా రాణించాడు. 23 ఏళ్ల ఈ పేస్ గన్ అన్రిచ్ నోర్జే గాయపడటంతో జట్టులోకి వచ్చి సంచలన ప్రదర్శనలు నమోదు చేశాడు. మెగా టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన కొయెట్జీ.. 19.80 సగటున 20 వికెట్లు పడగొట్టి, టోర్నీ లీడింగ్ వికెట్‌టేకర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.
తన స్వల్ప కెరీర్‌లో 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన కొయెట్జీ.. 43 వికెట్లు పడగొట్టాడు. కొయెట్జీ.. త్వరలో స్వదేశంలో భారత్‌తో జరిగే టీ20, టెస్ట్ సిరీస్‌లకు కూడా ఎంపికయ్యాడు. వరల్డ్‌కప్ సంచలన ప్రదర్శనల నేపథ్యంలో కొయెట్జీకి ఐపీఎల్ 2024 వేలంలో భారీ ధర దక్కే అవకాశం ఉంది. ఇతని కోసం ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ పోటీ పడే అవకాశం ఉందని టీమిండియా వెటరన్ స్పిన్నర్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్‌ను పోలిన బౌలింగ్ శైలి కొయెట్జీని ప్రత్యేకంగా నిలబెడుతుందని యాశ్ అన్నాడు.
ఇదిలా ఉంటే, డిసెంబర్ 10 నుంచి భారత్ దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో 2 టెస్ట్లు, 3 టీ20లు, 3 వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్ కోసం ఇరు జట్లు ఇదివరకే జట్లను కూడా ప్రకటించాయి. సిరీస్‌లో భాగంగా తొలి టీ0 డర్బన్ వేదికగా డిసెంబర్ 10న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment