ఈ ఏడాది డిసెంబర్ 19న జరిగే ఐపీఎల్ 2024 వేలంలో వరల్డ్‌కప్-2023 హీరోలకు ఫుల్ డిమాండ్ ఉంటున్నది కాదనలేని సత్యం. దుబాయ్ వేదికగా జరిగే ఈ మెగా ఆక్షన్‌లో న్యూజిలాండ్‌కు చెందిన రచిన్ రవీంద్ర, ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రవిస్ హెడ్‌ల కోసం ఫ్రాంచైజీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది.
భారత్ వేదికగా కొద్ది రోజుల క్రితం జరిగిన వరల్డ్‌కప్‌లో రచిన్ బ్యాట్‌తో చెలరేగిపోయిన విషయం తెలిసిందే. భారత్ మూలాలున్న రచిన్ తన పెద్దల సొంతగడ్డపై పరుగుల వరద పారించాడు. ఈ టోర్నీలో రచిన్ 10 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 2 అర్ధసెంచరీల సాయంతో 578 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌ల జాబితాలో విరాట్, రోహిత్, డికాక్ తర్వాతి స్థానంలో నిలిచాడు.
ట్రవిస్ హెడ్ విషయానికొస్తే.. ఈ ఆసీస్ బ్యాటర్ ప్రపంచకప్‌లోకి లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా టోర్నీని ఘనంగా ముగించాడు. భారత్‌తో జరిగిన ఫైనల్లో చిరస్మరణీయ శతకం (137) సాధించిన హెడ్ తన జట్టును ఆరోసారి జగజ్జేతగా నిలిపాడు. ఈ ఒక్క ప్రదర్శనతో హెడ్ ఐపీఎల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేరిపోయాడు.
రచిన్, హెడ్ ఇద్దరు బ్యాట్‌తో పాటు బంతితోనూ మాయ చేయగల సమర్దులు కావడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు వీరి కోసం ఎగబడే అవకాశం ఉంది. వీరిద్దరితో పాటు వరల్డ్‌కప్ బౌలింగ్ హీరోలు దిల్షన్ మధుషంక (శ్రీలంక), గెరాల్డ్ కొయెట్జీ (సౌతాఫ్రికా) కోసం కూడా ఫ్రాంచైజీలు పోటీపడవచ్చు.
ప్రస్తుతం ఆయా ఫ్రాంచైజీల వద్ద మిగులు బడ్జెట్ ప్రకారం చూస్తే.. రచిన్, మధుషంక కోసం ఆర్సీబీ.. హెడ్ కోసం ఢిల్లీ.. కొయెట్జీ కోసం సీఎస్‌కే పోటీపడవచ్చని తెలుస్తుంది. ఈ ఫ్రాంచైజీలు వదిలించుకున్న ఆటగాళ్ల జాబితా చూసినా వారికి ఈ రోల్స్‌లో ఆటగాళ్ల అవసరం ఉంది. మిగులు బడ్జెట్ గుజరాత్ వద్ద అధికంగా (38.15 కోట్లు) ఉండగా, ఎక్కువ మంది ఆటగాళ్లను తీసుకునే వెసులుబాటు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు (12 మందిని) ఉంది. పైన పేర్కొన్న ఆటగాళ్ల కోసం పోటీపడే ఫ్రాంచైజీల్లో ఢిల్లీ వద్ద 28.95 కోట్లు, సీఎస్‌కే వద్ద 31.4 కోట్లు, ఆర్సీబీ వద్ద 23.25 కోట్ల పర్స్ వ్యాల్యూ మిగిలి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment