వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు సౌతాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ గెరాల్డ్ కొయెట్జీ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మేజర్ లీగ్ క్రికెట్ సందర్భంగా కొయెట్జీ గాయపడ్డాడు. కొయెట్జీ స్థానాన్ని 29 ఏళ్ల నార్త్ వెస్ట్ డ్రాగన్స్ ఫాస్ట్ బౌలర్ మైగెల్ ప్రిటోరియస్ భర్తీ చేయనున్నాడు.
కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌లు ఆగస్ట్ 7 నుంచి ప్రారంభమవుతాయి. ఆగస్ట్ 7-11 మధ్యలో తొలి టెస్ట్ (ట్రినిడాడ్), ఆగస్ట్ 15-19 మధ్యలో రెండో టెస్ట్ (పోర్ట్ ఆఫ్ స్పెయిన్), ఆగస్ట్ 23, 24, 27 తేదీల్లో టీ20 జరుగనున్నాయి. మూడు టీ20లకు ట్రినిడాడ్‌లోని తరౌబా వేదిక కానుంది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం వెస్టిండీస్ ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. అక్కడ ఆ జట్టు మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే ఇంగ్లండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఈ జట్టు టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత ఖాళీగా ఉంది. విండీస్ పర్యటనతో ఆ జట్టు సీజన్‌ను ప్రారంభించనుంది. వెస్టిండీస్‌లోనే జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో సౌతాఫ్రికా భారత్ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది.
సౌతాఫ్రికా-వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో భాగంగా జరుగనుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్ చేతిలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న వెస్టిండీస్ చిట్టచివరి స్థానంలో ఉంది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో 25 శాతం విజయాలు సాధించిన సౌతాఫ్రికా ఏడో స్థానంలో నిలిచింది.
వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టు..
టెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్‌హామ్, మాథ్యూ బ్రీట్జ్కీ, నండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, డేన్ ప్యాటర్సన్, డేన్ పీడ్ట్, మైగెల్ ప్రిటోరియస్, కగిసో రబడా, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రిన్
Comments
Please login to add a commentAdd a comment