సౌతాఫ్రికా టెస్ట్ జట్టు కెప్టెన్ టెంబా బవుమా అరుదైన క్లబ్‌లో చేరాడు. టెస్ట్‌ల్లో 3000 పరుగుల మార్కు తాకిన 17వ సౌతాఫ్రికా ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బవుమా ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 86 పరుగులు చేసిన బవుమా 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద 3000 పరుగుల మార్కును క్రాస్ చేశాడు.
కెరీర్‌లో 57 టెస్ట్‌లు ఆడిన బవుమా 2 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీల సాయంతో 3083 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు జాక్ కల్లిస్ పేరిట ఉంది. కల్లిస్ 165 మ్యాచ్‌ల్లో 13206 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత సచిన్ టెండూల్కర్‌కు దక్కుతుంది. సచిన్ సుదీర్ఘ ఫార్మాట్‌లో 15921 పరుగులు చేశాడు. సచిన్ తర్వాతి స్థానంలో పాంటింగ్ (13378) ఉన్నాడు.
కాగా, ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న సౌతాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. వర్షం కారణంగా తొలి రోజు ఆట దాదాపుగా తుడిచిపెట్టుకుపోగా.. రెండో రోజు సజావుగా సాగింది.
సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో బవుమా, ఓపెనర్ టోనీ డి జోర్జీ (78) అర్ద సెంచరీలతో రాణించగా.. ఎయిడెన్ మార్క్రమ్ 9, ట్రిస్టన్ స్టబ్స్ 20, డేవిడ్ బెడింగ్హమ్ 29, ర్యాన్ రికెల్టన్ 19, కైల్ వెర్రిన్ 39, కేశవ్ మహారాజ్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. వియాన్ ముల్దర్ (37), రబాడ (12) బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. విండీస్ బౌలర్లలో జోమెల్ వార్రికన్ 3, కీమర్ రోచ్, జేడన్ సీల్స్ తలో 2, జేసన్ హోల్డర్ ఓ వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment