వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టును ఇవాళ (ఆగస్ట్ 14) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎయిడెన్ మార్క్రమ్ ఎంపికయ్యాడు. అన్‌క్యాప్డ్ ప్లేయర్, ఫాస్ట్ బౌలింగ్ సంచలనం క్వేనా మపాకా ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌కు సీనియర్లు రబాడ, నోర్జే, డికాక్, క్లాసెన్‌లను పరిగణలోకి తీసుకోలేదు దక్షిణాఫ్రికా సెలెక్టర్లు. వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా వీరికి విశ్రాంతి కల్పించినట్లు తెలుస్తుంది.
మపాకాతో పాటు మరో అన్‌క్యాప్డ్ ప్లేయర్ జేసన్ స్మిత్‌ను ఎంపిక చేశారు సెలెక్టర్లు. స్మిత్ ఇటీవల ముగిసిన సీఎస్‌ఏ టీ20 ఛాలెంజ్ టోర్నీలో 41.57 సగటున 291 పరుగులు చేశాడు. స్మిత్ పేస్ బౌలింగ్ కూడా చేయగలడు. మపాకా విషయానికొస్తే.. ఈ ఫాస్ట్ బౌలింగ్ సంచలనం ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో విశేషంగా రాణించాడు.
ఆ టోర్నీలో అతను 21 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఈ ప్రదర్శన కారణంగా మాపాకా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఎంపికయ్యాడు. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్ చేతిలో ఓటమి తర్వాత దక్షిణాఫ్రికా ఆడనున్న మొట్టమొదటి టీ20 సిరీస్ ఇదే.
వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు..
ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఓట్నీల్ బార్ట్‌మన్, నండ్రే బర్గర్, డొనోవన్ ఫెరియెరా, జోర్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, ప్యాట్రిక్ క్రూగర్, క్వేనా మపాకా, వియాన్ ముల్దర్, లుంగి ఎంగిడి, ర్యాన్ రికెల్టన్, జేసన్ స్మిత్, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్‌డర్ డస్సెన్, లిజాడ్ విలియమ్స్
Comments
Please login to add a commentAdd a comment