రెచ్చిపోయిన పేసర్లు.. వరుసగా రెండో మ్యాచ్‌లో విండీస్‌ విజయం.. సిరీస్‌ కైవసం | West Indies Beat South Africa By 30 Runs In Second T20I | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన పేసర్లు.. వరుసగా రెండో మ్యాచ్‌లో విండీస్‌ విజయం.. సిరీస్‌ కైవసం

Published Mon, Aug 26 2024 6:49 AM | Last Updated on Mon, Aug 26 2024 8:49 AM

West Indies Beat South Africa By 30 Runs In Second T20I

టరౌబా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్‌ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌.. షాయ్‌ హోప్‌ (41), రోవ్‌మన్‌ పావెల్‌ (35), షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (29), అలిక్‌ అథనాజ్‌ (28) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా.. విండీస్‌ పేసర్లు రొమారియో షెపర్డ్‌ (4-0-15-3), షమార్‌ జోసఫ్‌ (4-0-31-3), అకీల్‌ హొసేన్‌ (4-0-25-2), మాథ్యూ ఫోర్డ్‌ (2.4-0-25-1) ధాటికి 19.4 ఓవర్లలో 149 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో రీజా హెండ్రిక్స్‌ (44), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (28), ఎయిడెన్‌ మార్క్రమ్‌ (19), ర్యాన్‌ రికెల్టన్‌ (20), రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. 

ఈ గెలుపుతో వెస్టిండీస్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం​ చేసుకుంది. పూరన్‌ మెరుపులతో విండీస్‌ తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. నామమాత్రపు మూడో టీ20 ఆగస్ట్‌ 27న ఇదే వేదికగా జరుగనుంది. కాగా, టీ20 సిరీస్‌కు ముందు వెస్టిండీస్‌, సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ జరగగా.. ఈ సిరీస్‌ను సౌతాఫ్రికా 1-0 తేడాతో కైవసం చేసుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement