టెస్ట్ క్రికెట్‌లో వరుస ఫలితాల పరంపరకు బ్రేక్ పడింది. సౌతాఫ్రికా, వెస్టిండీస్ మధ్య నిన్న ముగిసిన మ్యాచ్ డ్రా కావడంతో టెస్ట్‌ల్లో వరుస ఫలితాలకు ఎండ్ కార్డ్ పడింది. గతేడాది జులైలో చివరిగా ఓ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మళ్లీ ఇన్నాళ్లకు మరో మ్యాచ్ డ్రా అయ్యింది. ఈ మధ్యలో 28 టెస్ట్ మ్యాచ్‌ల్లో ఫలితాలు తేలాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో వరుసగా ఇన్ని మ్యాచ్‌ల్లో ఫలితం తేలడం ఇదే మొదటిసారి. డ్రాకు డ్రాకు మధ్య అత్యధిక ఫలితాల రికార్డు గతంలో 23గా ఉండింది. మే, 2022- డిసెంబర్, 2022 మధ్యలో 23 మ్యాచ్‌ల్లో ఫలితాలు తేలాయి. దీనికి ముందు పలు సందర్భాల్లో డ్రాకు డ్రాకు మధ్యలో 20కిపైగా మ్యాచ్‌ల్లో ఫలితాలు తేలాయి.
ఇదిలా ఉంటే, వెస్టిండీస్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ పిచ్, వాతావరణం కారణంగా డ్రాగా ముగిసింది. చివరి రోజు 298 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ మ్యాచ్ ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అలిక్ అథనాజ్ (92) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి విండీస్‌ను ఓటమి బారి నుంచి తప్పించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 357 పరుగులు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 173 పరుగులు చేసింది. అనంతరం విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 233, రెండో ఇన్నింగ్స్‌లో 201 పరుగులు చేసింది. చివరి రోజు విండీస్ బ్యాటర్లు సంయమనంతో బ్యాటింగ్ చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment