వెస్టిండీస్, సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టిక ఇలా ఉంది. ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంతో పాయింట్ల పట్టికలో పెద్దగా మార్పులేమీ జరగలేదు. వెస్టిండీస్ తొమ్మిదో స్థానంలో.. సౌతాఫ్రికా ఏడో స్థానంలో కొనసాగుతున్నాయి. తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించిన భారత్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Here’s the updated World Test Championship (WTC) points table following the draw in the first Test between the West Indies and South Africa in Port of Spain. pic.twitter.com/tpVGXbhAZd
— CricTracker (@Cricketracker) August 12, 2024
ఇదిలా ఉంటే, వెస్టిండీస్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ పిచ్, వాతావరణం కారణంగా డ్రాగా ముగిసింది. చివరి రోజు 298 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ మ్యాచ్ ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అలిక్ అథనాజ్ (92) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి విండీస్‌ను ఓటమి బారి నుంచి తప్పించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 357 పరుగులు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 173 పరుగులు చేసింది. అనంతరం విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 233, రెండో ఇన్నింగ్స్‌లో 201 పరుగులు చేసింది. చివరి రోజు విండీస్ బ్యాటర్లు సంయమనంతో బ్యాటింగ్ చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment