ఐదో స్థానానికి ఎగబాకిన సౌతాఫ్రికా | South Africa Climbs To Fifth Position In Latest ICC World Test Championship Points Table | Sakshi
Sakshi News home page

ఐదో స్థానానికి ఎగబాకిన సౌతాఫ్రికా

Published Sun, Aug 18 2024 3:28 PM | Last Updated on Sun, Aug 18 2024 5:35 PM

South Africa Climbs To Fifth Position In Latest ICC World Test Championship Points Table

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా జట్టు ఐదో స్థానానికి ఎగబాకింది. వెస్టిండీస్‌తో తాజాగా ముగిసిన రెండో టెస్ట్‌లో విజయం సాధించడం ద్వారా సౌతాఫ్రికా తమ విజయాల శాతాన్ని మెరుగుపర్చుకుంది. ఈ సీజన్‌లో (2023-25) సౌతాఫ్రికా ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో భారత్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, శ్రీలంక రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. సౌతాఫ్రికా చేతిలో తాజా ఓటమితో వెస్టిండీస్‌ చివరి స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోగా.. పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌ ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి.

సౌతాఫ్రికా, విండీస్‌ టెస్ట్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగులకు ఆలౌట్‌ కాగా.. వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులకు కుప్పకూలింది. అనంతరం సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేయగా.. విండీస్‌ 222 పరుగులకే చాపచుట్టేసి పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో సౌతాఫ్రికా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో గెలుచుకుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌ డ్రాగా ముగిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement