![Temba Bavuma, Gerald Coetzee also ruled out of the IND vs SA 2nd Test - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/30/southa.jpg.webp?itok=8DfmgVJV)
టీమిండియాతో రెండో టెస్టుకు ముందు దక్షిణాఫ్రికాకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ టెంబా బావుమా సేవలను ప్రోటీస్ కోల్పోగా.. ఇప్పుడు యువ సంచలనం గెరాల్డ్ కోయిట్జీ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఎక్స్(ట్విటర్) వేదికగా వెల్లడించింది. కోయిట్జీ ప్రస్తుతం కటి వాపుతో బాధపడుతున్నాడు.
ఈ క్రమంలో కేప్‌టౌన్ వేదికగా భారత్‌తో జరిగే రెండు టెస్టుకు దూరమయ్యాడని సౌతాఫ్రికా క్రికెట్ ఎక్స్(ట్విటర్)లో పేర్కొంది. కాగా కోయిట్జీ తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. అంతకుముందు జరిగిన టీ20 సిరీస్, వన్డే వరల్డ్‌కప్‌లోనూ కోయిట్జీ అదరగొట్టాడు.
తనదైన రోజు ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించే సత్తా ఈ యువ పేసర్‌కు ఉంది. రెండో టెస్టుకు అతడి స్ధానంలో వియాన్ ముల్డర్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక జనవరి 3 నుంచి కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. కాగా సెంచూరియన్ వేదికగ జరిగిన తొలి టెస్టులో భారత్‌పై ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ప్రోటీస్ విజయం సాధించింది.
చదవండి: IND Vs SA 2nd Test: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్!?
Comments
Please login to add a commentAdd a comment