Lahore Qalandars
-
సౌతాఫ్రికా ఆటగాడి విధ్వంసకర సెంచరీ.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో!
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో లాహోర్ ఖలందర్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఈ లీగ్‌లో భాగంగా ఆదివారం పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో లాహోర్ 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. లాహోర్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. 212 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లాహోర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు మాత్రమే చేసింది. లాహోర్ స్టార్ బ్యాటర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. భారీ లక్ష్య ఛేదనలో డస్సెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ధి జట్టు బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ క్రమంలో కేవలం 50 బంతుల్లోనే తన తొలి పీఎస్ఎల్ సెంచరీని ఈ సఫారీ స్టార్ బ్యాటర్ అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 52 బంతులు ఎదుర్కొన్న డస్సెన్ 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఏదేమైనప్పటికీ డస్సెన్ విధ్వంసకర సెంచరీ వృథా అయిపోయింది. లహోర్ బ్యాటర్లలో డస్సెన్ మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. పెషావర్ బ్యాటర్లలో ఓపెనర్ సైమ్ అయూబ్(55 బంతుల్లో 88, 8 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు బాబర్ ఆజం(48), పావెల్(46) పరుగులతో రాణించారు. 2024 PSL's first centurion 💯🥇 Take a bow, Rassie van der Dussen 🤩🔥pic.twitter.com/6RIybWt2Ay — Sport360° (@Sport360) February 25, 2024 -
పొలార్డ్ విధ్వంసం.. ఆఖరి బంతికి గెలుపు! షాక్‌లో షాహీన్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 సీజన్లో కరాచీ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ లీగ్‌లో భాగంగా శనివారం లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 2 వికెట్ల తేడాతో కరాచీ విజయం సాధించింది. చివరి బంతికి మీర్ హంజా సింగిల్ తీసి కరాచీని గెలిపించాడు. అయితే 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కరాచీ ఆటగాడు, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కిరాన్ పొలార్డ్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదుకు దాడికి దిగాడు. మరో ఎండ్‌లో ఉన్న షోయబ్ మాలిక్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో కిరాన్ కేవలం 33 బంతుల్లోనే 5 సిక్స్‌లు, ఒక ఫోరుతో 58 పరుగులు చేశాడు. అయితే కరాచీ ఇన్నింగ్స్ 16 ఓవర్లో షాహీన్ అఫ్రిది.. అద్భుత బంతితో పొలార్డ్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మాలిక్ కూడా ఔట్ కావడంతో ఒక్కసారిగా మ్యాచ్ లాహోర్ వైపు మలుపు తిరిగింది. ఆఖరి ఓవర్లో కరాచీ విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది.. ఆఫ్ స్పిన్నర్ ఆషాన్ బట్టికి అప్పగించాడు. ఇదే షాహీన్ చేసిన తప్పిదం. చివరి ఓవర్లో తొలి బంతినే హసన్ అలీ సిక్సర్‌గా మలిచాడు. దీంతో కరాచీ విజయసమీకరణం 5 బంతుల్లో 5 పరుగులగా మారిపోయింది. ఆ తర్వాత ఐదో బంతికి హసన్ అలీ ఔటైనప్పటికీ.. క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాటర్ మీర్ సింగిల్ తీసి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఇది చూసిన అఫ్రిది తలను పట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లహోర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. లహోర్ ఓన సాహిబ్జాదా ఫర్హాన్(72) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కరాచీ బౌలర్లలో మీర్ హంజా, షంసీ, హసన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు. -
దేశం క్లిష్ట పరిస్థితుల్లో.. వాళ్లకు ప్లాట్లు, ఖరీదైన ఫోన్లు?
పాకిస్తాన్ దేశం ఇప్పుడిప్పుడే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతోంది. ఇప్పటికి అక్కడ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే అక్కడి పాకిస్తాన్ ఆటగాళ్లకు మాత్రం ప్లాట్లు, ఖరీదైన ఐఫోన్లను గిఫ్ట్‌లుగా అందజేశారు. ఇప్పుడు ఈ వార్త పాక్‌లో సంచలనం రేపింది. విషయంలోకి వెళితే.. ఇటీవలే ముగిసిన పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) తొమ్మిదో సీజన్ విజేతగా లాహోర్ ఖలండర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో షాహిన్ అఫ్రిది సేన విజయం సాధించి వరుసగా రెండోసారి పీఎస్ఎల్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. దీంతో సదరు ఫ్రాంఛైజీ ఓనర్ లాహోర్ ఖలండర్స్ సీవోవో సమీన్ రాణా ఆటగాళ్లకు అదిరిపోయే గిఫ్ట్ లు ఇచ్చింది. ప్లేయర్స్ అందరికీ ప్లాట్లు, ఐఫోన్లు ఇచ్చారు. ఈ ఫ్రాంఛైజీ ఓనర్ ఖలందర్స్ సిటీ అనే ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేపట్టింది. దీంతో తమ ప్లేయర్స్ కు అందులోనే ప్లాట్లు ఇచ్చింది. ఈ ప్లాట్లు, ఐఫోన్లు అందుకున్న వాళ్లలో స్టార్ ప్లేయర్స్ షాహీన్ షా అఫ్రిది, ఫఖర్ జమాన్, జమాన్ ఖాన్, ఆఫ్ఘనిస్థాన్ ప్లేయర్ రషీద్ ఖాన్ ఉన్నారు. ఒక్కొక్క ప్లేయర్ కు 5445 చదరపు అడుగుల ప్లాట్లు ఇచ్చారు. వీటి విలువ పాకిస్థాన్ కరెన్సీలో 92. 5 లక్షలు కాగా.. ఇండియన్ కరెన్సీలో రూ.27 లక్షలు. ఈ లీగ్ మొత్తం ఆడే అవకాశం రాకుండా బెంచ్ కే పరిమితమైన ప్లేయర్స్ కు కూడా ఈ ప్లాట్లు ఇచ్చారు. పీఎస్‌లో ఫైనల్లో బ్యాట్‌తోనూ, బంతితోను మెరిసి ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి అదనంగా గిఫ్ట్‌లు అందించడం విశేషం. ఫైనల్లో మొదట బ్యాటింగ్‌లో 44 రన్స్.. ఆ తర్వాత బౌలింగ్ లో రాణించిన షాహిన్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. లాహోర్ టీమ్ లీగ్ గెలిచినందుకు ఒక ప్లాట్ అందుకున్న షాహీన్.. కెప్టెన్ గా వ్యవహరించినందుకు మరో రెండు ప్లాట్స్ అదనంగా అందుకోవడం విశేషం. ఇది చూసిన క్రికెట్ అభిమానులు.. ''దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పాక్ ఆటగాళ్లకు లభించిన గిఫ్ట్‌లను డబ్బుల రూపంలో దేశానికి అందిస్తే బాగుండేది'' అంటూ కామెంట్ చేశారు. Great Gesture from Lahore Qalandars - Appreciation for ALL "This is why we call it a FAMILY"#PSL08 #qalandarhum #SabSitarayHumaray #QalandarsCity pic.twitter.com/X4z2wxi7Tj — Lahore Qalandars (@lahoreqalandars) March 22, 2023 చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు సీనియర్ క్రికెటర్ గుడ్‌బై అభిమానులను పిచ్చోళ్లను చేశారు