పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో లాహోర్ ఖలందర్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఈ లీగ్‌లో భాగంగా ఆదివారం పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో లాహోర్ 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. లాహోర్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. 212 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లాహోర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు మాత్రమే చేసింది.
లాహోర్ స్టార్ బ్యాటర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. భారీ లక్ష్య ఛేదనలో డస్సెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ధి జట్టు బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ క్రమంలో కేవలం 50 బంతుల్లోనే తన తొలి పీఎస్‌ఎల్ సెంచరీని ఈ సఫారీ స్టార్ బ్యాటర్ అందుకున్నాడు.
ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 52 బంతులు ఎదుర్కొన్న డస్సెన్ 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఏదేమైనప్పటికీ డస్సెన్ విధ్వంసకర సెంచరీ వృథా అయిపోయింది. లహోర్ బ్యాటర్లలో డస్సెన్ మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. పెషావర్ బ్యాటర్లలో ఓపెనర్ సైమ్ అయూబ్(55 బంతుల్లో 88, 8 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు బాబర్ ఆజం(48), పావెల్(46) పరుగులతో రాణించారు.
2024 PSL's first centurion 💯🥇
— Sport360° (@Sport360) February 25, 2024
Take a bow, Rassie van der Dussen 🤩🔥pic.twitter.com/6RIybWt2Ay
Comments
Please login to add a commentAdd a comment