జమైకా: యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ బ్యాట్ రెండు ముక్కలవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీపీఎల్ 2021లో భాగంగా గయానా అమెజాన్ వారియర్స్, సెంట్ కిట్స్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. సెంట్ కిట్స్ ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 4వ ఓవర్‌ను ఒడియన్ స్మిత్ వేశాడు. ఓవర్ రెండో బంతిని స్మిత్ లెగ్‌స్టంప్ దిశగా వేశాడు. గేల్ దానిని ఆఫ్‌సైడ్ ఆడుదామని భావించాడు. అయితే బంతి బ్యాట్‌కు బలంగా తగలడంతో రెండు ముక్కలైంది. బ్యాట్ కింద పడిపోగా.. హ్యాండిల్ మాత్రం గేల్ చేతిలో ఉండిపోయింది. ఆ తర్వాత గేల్ పడిపోయిన బ్యాట్‌ను పరిశీలించి కొత్త బ్యాట్ తెప్పించుకొని ఇన్నింగ్స్ కొనసాగించాడు.
చదవండి: Chris Gayle: గేల్ సిక్స్ కొడితే మాములుగా ఉంటుందా..
చదవండి: SL Vs SA: డికాక్ మెరుపులు.. 10 వికెట్లతో విజయం; దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్
ఇక సెమీస్‌లో సెంట్ కిట్స్ గయానాపై గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది. గయానా గయానా విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని సెంట్ కిట్స్ మూడు వికెట్లు మాత్రమే కోల్పయి 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ లూయిస్ (39 బంతుల్లో 77 నాటౌట్, 3 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ 9 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. హెట్‌మైర్ (45, 20 బంతులు; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు.
చదవండి: Evin Lewis CPL 2021: లూయిస్ సిక్సర్ల విధ్వంసం.. దర్జాగా ఫైనల్‌కు
Batting malFUNction for @henrygayle #GAWvSKNP #CPL21 #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/kuPgIs7DuY
— CPL T20 (@CPL) September 14, 2021
Comments
Please login to add a commentAdd a comment