Kevin Sinclair Literally Flipping Out After Getting Chris Gayle Wicket, Video Viral - Sakshi
Sakshi News home page

CPL 2021: వికెట్‌ తీశానన్న ఆనందం.. బౌలర్‌ వింత ప్రవర్తన

Published Wed, Sep 15 2021 12:32 PM | Last Updated on Wed, Sep 15 2021 4:35 PM

Kevin Sinclair Literally Flipping Out After Getting Chris Gayle Wicket Viral - Sakshi

Kevin Sinclair Flipout CPL 2021: విండీస్‌ ఆటగాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ మజా ఇంకో లెవల్లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్రేవో, గేల్‌, కాట్రెల్‌ లాంటి ఆటగాళ్లు తన హావభావాలతో ఫ్యాన్స్‌ను ఎన్నోసార్లు మెప్పించారు. తాజాగా సీపీఎల్‌ 2021లో భాగంగా కెవిన్‌ సింక్లెయిర్‌ చేసిన పని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వికెట్‌ తీశానన్న ఆనందంలో సింక్లెయిర్‌ మైదానంలోనే గెంతులు వేశాడు. గయానా అమెజాన్‌ వారియర్స్‌, సెంట్‌ కిట్స్‌ మధ్య సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది.  

చదవండి: Chris Gayle: గేల్‌ బ్యాటింగ్‌.. బ్యాట్‌ రెండు ముక్కలు; వీడియో వైరల్‌

అప్పటికే గేల్‌, లూయిస్‌లు సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తున్నారు. ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌లో సింక్లెయిర్‌ వేసిన రెండో బంతిని గేల్‌ లాంగాన్‌ దిశగా భారీ షాట్‌ కొట్టాడు. అయితే బౌండరీ లైన్‌ వద్ద ఉన్న హెట్‌మైర్‌ ఏ మాత్రం తడబడకుండా క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో సింక్లెయిర్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గేల్‌ వికెట్‌ తీశానన్న ఆనందంలో ఫ్లిప్స్‌(గెంతులు)తో రెచ్చిపోయాడు. ఈ వీడియోనూ సీపీఎల్‌ టి20 తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. చివర్లో హెట్‌మైర్‌, పూరన్‌లు వచ్చి సింక్లెయిర్‌ను ప్రోత్సహించడం హైలెట్‌గా నిలిచింది. 

ఇక ఇదే మ్యాచ్‌లో గేల్‌ 42 పరుగులు చేయడం ద్వారా సీపీఎల్‌లో 2500 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో గయానా అమెజాన్‌ వారియర్స్‌పై విజయం సాధించిన సెంట్‌ కిట్స్‌ ఫైనల్లో అడుగుపెట్టింది.

చదవండి: వరల్డ్‌కప్‌ ఉంది.. ప్రతీ విషయాన్ని భూతద్దంలో చూడడం ఆపండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement